
సాక్షి, తాడేపల్లి/తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి కూతురు వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం వద్ద ప్రజల నుంచి వినతులకు కూడా సీఎం జగన్ స్వీకరించనున్నారు.
సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే..
సాయంత్రం ఐదు గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు
సాయంత్రం 5.15 గంటల వరకు విమానాశ్రయం వద్ద ప్రజలు నుంచి వినతులు స్వీకరణ
సాయంత్రం 5.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి తాజ్ హోటల్‌కు చేరుకుంటారు.
సాయంత్రం 5.30-5.45 గంటల వరకు శ్రీసిటీ ఎండి రవి సన్నా రెడ్డి కూతురు వివాహ రిసెప్షన్‌లో వధూవరులను ఆశీర్వదించనున్న సీఎం జగన్
అనంతరం 5.45 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం
సాయంత్రం ఆరు గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.