![YS Jagan expresses shock over deaths of devotees in Tirupati stampede](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/8/jagan_0.jpg.webp?itok=SaoYVdNT)
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచి్చన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_45.png)
Comments
Please login to add a commentAdd a comment