Devotees Tirumala
-
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచి్చన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
తిరుమలలో టీడీపీ కార్యకర్త ఓవరాక్షన్.. భక్తుల ఆగ్రహం
సాక్షి, తిరుమల: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ అయ్యాక టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. చంద్రబాబు జైలులో ఉండటంతో ఎల్లో బ్యాచ్‌కు మైండ్ బ్లాంక్ అయిపోయి తాము ఏం చేస్తామో అనేది తెలియక.. పిచ్చి వేషాలు వేస్తున్నారు. తాజాగా టీడీపీ కార్యకర్తలు తిరుమలలో టీడీపీ జెండాతో ఓవరాక్షన్ చేశారు. వివరాల ప్రకారం.. పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రంలో టీడీపీ కార్యకర్తలు ఒకరు బరితెగించాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద టీడీపీ కార్యకర్తలు టీడీపీ జెండాలు ప్రదర్శించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో ఎల్లో బ్యాచ్ అపవిత్ర కార్యక్రమాలకు దిగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పార్టీ జెండాను ప్రదర్శించడంపై సీరియస్ అవుతున్నారు. ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక, చంద్రబాబు అరెస్ట్‌ను ఎల్లో బ్యాచ్ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో, కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు పిచ్చెక్కిపోయి ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ టీడీపీ జెండాలను ప్రదర్శిస్తున్నారు. ఇది కూడా చదవండి: తిరుమలలో నేడు ధ్వజారోహణం.. సీఎం జగన్ పట్టువస్త్రాల సమర్పణ -
తిరుమల ఆలయంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లిన భక్తుడు
-
మరో నకిలీ టీడీడీ వెబ్‌సైట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
-
శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కాస్త పెరిగింది. శ్రీవారిని మంగళవారం అర్ధరాత్రి వరకు 67,681 మంది దర్శించుకున్నారు. 31,738 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.54 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్ లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. -
చురుగ్గా శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
తిరుమల: వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుమలలో ఉత్సవ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధానంగా వాహన సేవల ఊరేగింపు ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు. ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో భక్తులు వేచి ఉండేందుకు వీలుగా గ్యాలరీలు, బారికేడ్ల నిర్మాణం సాగుతోంది. గరుడ సేవలో సుమారు 3 లక్షల మంది భక్తులు మాడ వీధుల్లో వేచి ఉండేందుకు వీలుగా గ్యాలరీలు, బారికేడ్లు నిర్మిస్తున్నారు. తూర్పుమాడ వీధిలో కొంతభాగం, దక్షిణ, ఉత్తరమాడ వీధుల్లో పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంతోపాటు మంటపాలకు వెల్లవేసే పనులు కూడా సాగుతున్నాయి. పురవీధుల్లో ఊరేగించే వాహనాలకు మరమ్మతులు పూర్తి చేశారు. వాహనాలు హారతులు అందుకునే ప్రాంతాల్లో చలువ పందిళ్లు నిర్మిం చారు. ఇప్పటికే శ్రీవారి పుష్కరిణి నీటిని తొల గించారు. ఈ నెలాఖరుకు పుష్కరిణిని భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. విద్యుత్ దీపాలతో దేవతా ప్రతిమలు రూపొందించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఏర్పాట్లన్నీ ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి. తిరుమలలో కుండపోత వర్షం తిరుమలలో సోమవారం కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆలయ పరిసరాల్లో వాన నీరు నిలిచింది. తిరుమల రెండు ఘాట్‌రోడ్లలోని జలపాతాల్లో నీటి ప్రవాహం కనిపించింది. తిరుమల సమీపంలోని రెండో మలుపు వద్ద భారీ కొండచరియ విరిగిపడింది. చివరి నాలుగు మలుపుల్లోనూ కొండచరియలు కూలేలా ఉన్నాయి. వీటిపై టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనాల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా రోడ్డుపై పడిన బండరాళ్లను ఎప్పటికప్పుడు తొలగించే పని చేపట్టారు.