సాక్షి, తిరుమల: తిరుమలకు సంబంధించి నేటి సమాచారం ఇలా ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి 15 కంపార్ట్‌మెంట్స్‌లో భక్తులు వేచి ఉన్నారు. ఇక, సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 5 గంటలు పడుతోంది. ఇక, నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 56,225లుగా ఉండగా.. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 19,588. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం 3.95 కోట్లుగా ఉంది.
మరోవైపు.. నేడు ఏప్రిల్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇక తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను కూడా విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలో ఏప్రిల్ నెల గదుల కోటాను ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 27వ తేదీన శ్రీవారి సేవ సాధారణ, నవనీత, పరాకామణి సేవ కోటాను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు యధా ప్రకారం విడుదల చేస్తారు. కాగా, https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment