special darshan
-
హాట్ కేకుల్లా శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయాలు
సాక్షి, తిరుమల: హాట్ కేకుల్లా శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయాలు జరిగాయి. సెప్టెంబర్ నెల దర్శన టిక్కెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. గంట 25 నిముషాల వ్యవధిలోనే ఆర్జిత సేవా టిక్కెట్లను భక్తులు పొందారు. 2 నిముషాల 30 సెంకడ్ల వ్యవధిలోనే అంగప్రదక్షణ టికెట్ల విక్రయాలు జరిగాయి.10 నిముషాల 11 సెకండ్ల వ్యవధిలోనే వయో వృద్దులు, వికలాంగుల దర్శన టిక్కెట్లు పొందారు. 2 గంటల 6 నిముషాల వ్యవధిలోనే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు భక్తులు పొందారు. గంటా 40 నిముషాల వ్యవధిలోనే వసతి గదులు కోటాను భక్తులు పొందారుకాగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 16 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు 71,824 మంది స్వామివారిని దర్శించుకోగా, 28,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.01 కోట్లు సమర్పించారు. -
ఫిబ్రవరి కోటా టికెట్లు విడుదల చేసిన టీటీడీ
Srivari Special Darshan Quota Tickets: శ్రీవారి ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్లను ఫిబ్రవరి నెలకు సంబంధించి టీటీడీ శుక్రవారం ఉదయం ఆన్లైన్లో విడుదల చేసింది. రోజుకి 12 వేల చొప్పున టోకెన్లను విడుదల చేసింది. ఫిబ్రవరి నెలకు స్లాటర్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పీఆర్వో విభాగం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులంతా టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్లలో మాత్రమే బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. చదవండి: (కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి వేతనాలు.. ఏపీ ఆర్థికశాఖ ఉత్తర్వులు) -
తిరుమల భక్తులకు శుభవార్త: టికెట్ల కోటా పెంపు
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పెంచింది. కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో మార్చి నుంచి దర్శనాల సంఖ్య గణనీయంగా తగ్గించిన విషయం తెలిసిందే. నాలుగు నెలల పాటు 5 వేల టికెట్లు మాత్రమే టికెట్లు కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే ఉచిత దర్శనాలు పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో బుధవారం (జూలై 28) నుంచి రోజుకు 3 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 30 వరకు రోజు మూడు వేలు టికెట్లు పెంచడంతో దాదాపు లక్షా పది వేల టికెట్లు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే బుధవారం ఉదయం 11 గంటలకు అన్లైన్లో విడుదల కావాల్సిన ఈ టికెట్లు సాంకేతిక కారణాలతో ఆగిపోయాయి. సాఫ్ట్‌వేర్‌లో సమస్య తలెత్తడంతో దర్శన టికెట్లు అందుబాటులోకి రాలేదు. టీటీడీ అధికారులు సమస్యను పరిష్కరించారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. -
శ్రీవారి దర్శనానికి ఇక ఇక్కట్లు తొలగినట్లే...
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, ఐదేళ్ల లోపు చంటిపిల్లలు, వారి తల్లిదండ్రులకు టీటీడీ ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 13, 27వ తేదీల్లో వృద్ధులు (65 ఏళ్లు పైబడిన వారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు 1,000, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు 1,000 టోకెన్లను అధికారులు జారీ చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఐదేళ్ల లోపు చంటిపిల్లలు, వారి తల్లిదండ్రులకు ఈ నెల 14, 28వ తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సుపథం మార్గం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది. -
శ్రీవారి దర్శనం: వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక టోకెన్లు
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం 65 ఏళ్లకుపైబడిన వృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ నాలుగు వేల టోకెన్లను జారీ చేసింది. శ్రీవారి దర్శనం కోసం మంగళవారం ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెట్లు, మధ్యాహ్నం 2 గంటలకు రెండువేల టోకెన్లు, మూడు గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు ఇవ్వనుంది. రద్దీరోజుల్లో తిరుమలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా.. ఈ అవకాశాన్ని కల్పించినట్టు టీటీడీ తెలిపింది. బుధవారం ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని, ఇందుకోసం నాలుగు వేల టోకెన్లు ఇస్తామని టీటీడీ వెల్లడించింది. తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ప్రిన్స్‌పాల్ సెక్రటరీ శైలేంద్ర జోషి, ట్యాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, కర్నాటక డీజీపీ నీలమణిరాజు, తమిళనాడు డీజీపీ రాజేంద్రన్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. -
వయోవృద్ధులకు 4 రోజులు ప్రత్యేక దర్శనం
తిరుమల: వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు ఈ నెలలో నాలుగు రోజులు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 10, 24 తేదీల్లో వయో వృద్ధులు, దివ్యాంగులు, 11, 25 తేదీల్లో చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఉదయం 10 గంటల స్లాట్‌కు 1000 టికెట్లు, మధ్యాహ్నం 2 గంటల స్లాట్‌కు 2000 టికెట్లు, 3 గంటల స్లాట్‌కు 1000 టికెట్లు జారీ చేయనున్నారు. గుర్తింపు పత్రం తప్పనిసరి.. ప్రత్యేక దర్శనానికి వచ్చేవారు టోకెన్లు తీసుకునేటప్పుడు ఆధార్ లేదా ఓటర్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. రాయితీపై 20 రూపాయలకు 2లడ్డూలు, 70 రూపాయలకు 4 లడ్డూలు తీసుకోవచ్చు. వెయిటింగ్ హాల్ నుంచి ప్రత్యేక క్యూ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. నడవలేని వారిని శ్రీవారి సహాయకులతో పంపుతారు. 5 సంవత్సరాల లోపు వయసున్న పిల్లల తల్లిదండ్రులను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సుప«థం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. -
20 నిమిషాల్లోనే శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం
శ్రీకాళహస్తి: మహాశివరాత్రి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీకాళహస్తి దేవస్థానం ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఏర్పాటుచేస్తోంది. రూ.500 టికెట్టుతో కేవలం 20 నిమిషాల్లో స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించింది. శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక దర్శనం టోకెన్లు పొందాలంటే ఏదైనా గుర్తింపు కార్డును జతచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒకరోజు ముందు కొనుగోలు చేసే భక్తులకు రూ.250 రాయితీ ప్రకటించారు. సాధారణ భక్తులకు తిరుమల తరహాలో మహాలఘు దర్శనం అమలు చేస్తామన్నారు. మహాశివరాత్రికి ఆలయాన్ని తోరణాలు, విద్యుత్ లైట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
తిరుమలలో ప్రత్యేక దర్శనం నిలిపివేత
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో ప్రత్యేక దర్శనం నిలిపివేశారు. శ్రీవారి సర్వ దర్శనానికి భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. కాలి నడక భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఇంకా కిలోమీటరు మేర భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవారి ఆలయంలో మహాలఘు దర్శనాన్ని ప్రవేశపెట్టారు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 56 లక్షల రూపాయలు.