సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, ఐదేళ్ల లోపు చంటిపిల్లలు, వారి తల్లిదండ్రులకు టీటీడీ ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 13, 27వ తేదీల్లో వృద్ధులు (65 ఏళ్లు పైబడిన వారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు 1,000, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు 1,000 టోకెన్లను అధికారులు జారీ చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఐదేళ్ల లోపు చంటిపిల్లలు, వారి తల్లిదండ్రులకు ఈ నెల 14, 28వ తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సుపథం మార్గం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment