
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గంలో మరోసారి చిరుత కదలికలు కలకలం సృష్టించాయి. తిరుమలలో శ్రీవారి ఆలయానికి వెళ్లే భక్తులకు చిరుత కదలికలు ఆందోళన రేకెత్తించాయి. చిరుత కదలికల్ని గుర్తించిన భక్తులు.. టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దాంతో కాలినడకన వెళ్లే భక్తులు,.. గుంపులుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది టీటీడీ. వాటర్ హౌస్ వద్ద భక్తులను నిలిపి గుంపులుగా పంపుతున్నారు సెక్యూరిటీ సిబ్బంది. మరొకవైపు ప్రత్యేక కెమెరా టాప్స్‌ను టీటీడీ ఫారెస్ట్‌అధికారులు ఏర్పాటు చేశారు.