turumala
-
శ్రీవారి మెట్టుమార్గంలో చిరుత కదలికలు
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గంలో మరోసారి చిరుత కదలికలు కలకలం సృష్టించాయి. తిరుమలలో శ్రీవారి ఆలయానికి వెళ్లే భక్తులకు చిరుత కదలికలు ఆందోళన రేకెత్తించాయి. చిరుత కదలికల్ని గుర్తించిన భక్తులు.. టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో కాలినడకన వెళ్లే భక్తులు,.. గుంపులుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది టీటీడీ. వాటర్ హౌస్ వద్ద భక్తులను నిలిపి గుంపులుగా పంపుతున్నారు సెక్యూరిటీ సిబ్బంది. మరొకవైపు ప్రత్యేక కెమెరా టాప్స్‌ను టీటీడీ ఫారెస్ట్‌అధికారులు ఏర్పాటు చేశారు. -
గో సంరక్షణతో దేశం సుభిక్షం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తిరుపతి/హైదరాబాద్: గో సంరక్షణతో దేశం సుభిక్షంగా ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గోవుకు పురాణాల్లో విశిష్ట స్థానం ఉందని.. గోవును పూజించి రక్షిస్తే అనేక మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఆయన తెలంగాణాలో గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణలో భాగంగా టీటీడీ గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి టీటీడీకి దేశవాళీ ఆవులను దానంగా ఇవ్వాలని ఆయన కోరారు. హిందూ ధర్మం లో గోమాతకు తల్లి స్థానం ఇచ్చారనీ అందుకే గోవును గోమాత అంటామన్నారు. (చదవండి: ‘గోవును పూజిస్తే తల్లిని పూజించినట్టే’) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదంతో గోసంరక్షణ కార్యక్రమం నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 7 వతేదీ విజయవాడ కనక దుర్గ ఆలయంలో కార్యక్రమం ప్రారంభించామన్నారు. రెండవ విడతగా గురువారం తెలంగాణలో కార్యక్రమం ప్రారంభించామన్నారు. రాబోయే రోజుల్లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు తయారవుతున్నాయని ఆయన చెప్పారు. హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్వీ గోసంరక్షణశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.(చదవండి: తిరుమల: శాస్త్రోక్తంగా బాలాలయ సంప్రోక్షణ) ఈ కార్యక్రమం అమలు కోసం ఎస్వీ గోసంరక్షణశాల ద్వారా దేశవాళీ ఆవుల దానాన్ని స్వీకరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. మఠాలు, పీఠాలు, వంశపారంపర్య పర్యవేక్షణ ఆలయాలు, దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, వేద పాఠశాలలకు ఈ కార్యక్రమం ద్వారా టీటీడీ గోవుతో పాటు దూడను అందజేస్తుందన్నారు. గోదానం పొందిన ఆలయాలు, పీఠాలు, వేద పాఠశాలలు గోవుల సంరక్షణ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఎస్వీ గో సంరక్షణశాల అనుమతితో భక్తులు ఈ కార్యక్రమానికి గోవులను దానం చేయాల్సి ఉంటుందని’’ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు గోవింద హరి, శివ కుమార్, డివి పాటిల్, స్థానిక సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు. -
ట్రయల్ రన్ తర్వాత స్థానికులకు దర్శనం
-
11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం
సాక్షి, తిరుమల: లాక్డౌన్ నిబంధనల సడలింపులతో భక్తులకు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో శుక్రవారం శ్రీవారి ఆలయంలో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. క్యూలైన్ కదలికను గుర్తించేందుకు గంటకు ఎంత మందిని దర్శనానికి పంపగలుగుతామనే అంశంపై పరిశీలించారు. వందమంది టీటీడీ ఉద్యోగులతో ట్రయల్ రన్ నిర్వహించగా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ పరిశీలించారు. (టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం) వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 8,9,10 తేదీల్లో టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో శ్రీవారి దర్శనాలు ట్రయన్ రన్ నిర్వహిస్తామని వెల్లడించారు. పరిమిత సంఖ్యలో మాత్రమే దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు. రోజుకు 7 వేల మందికి దర్శనం కల్పించడానికి అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం నిబంధనలను భక్తులు తప్పకుండా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని కోరారు. టీటీడీ చర్యలకు భక్తులు సహకరించాలన్నారు. తిరుమలలో ప్రధానంగా నాలుగు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, కల్యాణకట్టలో తలనీలాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని తెలిపారు. అన్న ప్రసాద కేంద్రం వద్ద చేతులు శుభ్రపరుచుకునే ప్రాంతంలో భక్తులు జాగ్రత్త వహించాలన్నారు. కొన్ని రోజుల పాటు తీర్థం చఠారి రద్దు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. వైవీ సుబ్బారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ► ఈనెల 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులకు దర్శనం ► ఈనెల 10న తిరుపతి స్థానికులకు దర్శనానికి అనుమతి ► ఈనెల 11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం ► పరిమిత సంఖ్యలో మాత్రమే దర్శనాలు ఉంటాయి ► ప్రతిరోజూ 7 వేల మందికి మాత్రమే దర్శనం ► ఆన్లైన్లో 3వేల మంది భక్తులకు అనుమతి ► ఉదయం 6:30 నుంచి 7:30 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం ► ఉ.6.30 నుంచి రాత్రి 7.30 గంటలలోపు దర్శనానికి అనుమతి ► ఉ.6 నుంచి సాయంత్రం 4 గంటల లోపు మాత్రమే కాలినడక భక్తులకు అనుమతి ► అలిపిరి నుంచి మాత్రమే కాలినడక భక్తులకు అనుమతి ► శ్రీవారిమెట్టు మార్గం నుంచి ప్రస్తుతానికి అనుమతి లేదు ► నేరుగా వచ్చే భక్తులకు అలిపిరి వద్ద టికెట్ కౌంటర్ ► అలిపిరి, తిరుమలలో టెస్టింగ్ ల్యాబ్స్ ► 10 ఏళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు అనుమతి లేదు ► పుష్కరిణిలో భక్తులకు అనుమతి లేదు ► మాస్క్‌లు, శానిటైజర్లు తప్పనిసరిగా ఉపయోగించాలి ► దేశవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లలో భక్తులు దర్శనాలకు రావద్దు -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం
సాక్షి, తిరుమల: బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన సేవలందించిన టీటీడీ, వివిధ శాఖల సిబ్బందిని అభినందించారు. రద్దీ ఎక్కువగా ఉన్నా.. భక్తులు సమయనం పాటించి స్వామివారి దర్శనం చేసుకున్నారన్నారు. గత ఏడాది 5.8 లక్షల మంది దర్శనం చేసుకోగా, ఈ ఏడాది 7.7 లక్షల మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారని ఈవో వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే లక్షా 5 వేల మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో 3.23 లక్షల మంది స్వామివారికి తలనీలాలు సమర్పించగా.. గత ఏడాది 2.17 లక్షల మంది తలనీలాలు సమర్పించారని వెల్లడించారు. ఆర్టీసీ ద్వారా 4.24 లక్షల మంది తిరుమలకు చేరుకున్నారని చెప్పారు. ఈ ఏడాది భక్తులకు 34 లక్షల లడ్డూలు అందించగా.. గత ఏడాది 24 లక్షల లడ్డూలు అందించామన్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో 18 రాష్ట్రాల నుండి 357 కళా బృందాలు పాల్గొన్నాయన్నారు. వచ్చే ఏడాది 25 రాష్ట్రాల నుండి ఉన్నత స్థాయి కళాకారులు రప్పిస్తామని ఈవో తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.20 కోట్ల 50 లక్షల 85 వేల హుండీ ఆదాయం వచ్చిందని తెలిపారు. -
శ్రీవారి దర్శనానికి ఇక ఇక్కట్లు తొలగినట్లే...
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, ఐదేళ్ల లోపు చంటిపిల్లలు, వారి తల్లిదండ్రులకు టీటీడీ ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 13, 27వ తేదీల్లో వృద్ధులు (65 ఏళ్లు పైబడిన వారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు 1,000, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు 1,000 టోకెన్లను అధికారులు జారీ చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఐదేళ్ల లోపు చంటిపిల్లలు, వారి తల్లిదండ్రులకు ఈ నెల 14, 28వ తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సుపథం మార్గం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది. -
ప్రతి శుక్రవారం వీఐపీ దర్శనాలకు ‘బ్రేక్’
తిరుమల : గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు తిరుమల శ్రీవారికి నిర్వహించే అభిషేకం ఇతర సేవల కారణాల వల్ల సంవత్సరం పొడవునా ప్రతి శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే టీటీడీ అధికారులు పరిమితం చేశారు. ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. అలాగే గతంలో నిర్ణయించిన మేరకు వేసవి రద్దీ దృష్ట్యా ఏప్రిల్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు శని, ఆదివారాల్లో కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రమే పరిమితం చేశారు. వీఐపీ లు, భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. -
రథసప్తమి వేడుకల్లో అపశ్రుతి
-
రథసప్తమి వేడుకల్లో అపశ్రుతి
తిరుమల: శ్రీవారి సన్నిధిలో జరుగుతున్న రథ సప్తమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం స్వామి వారికి చక్రస్నానం సందర్భంగా కోనేటి వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కొందరు కోనేటిలో పడిపోయారు. వారిలో ఒక మహిళ నీటిలో ఊపిరాడక చనిపోయింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తుల స్నానాలు ఆపివేయించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: వేసవి సెలవులతో శుక్రవారం తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఈ సీజన్లో ఇంత స్థాయిలో భక్తులు రావటం ఇదే మొదటిసారి. ఏపీ, తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడటం, వారపు సెలవులు కావటంతో స్వామి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. సాయంత్రానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లూ భక్తులతో నిండిపోగా... బయట కిలోమీటరు మేర క్యూలో జనం నిరీక్షించారు. వీరికి 15 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. ఇక 14 కంపార్ట్మెంట్లలోని కాలిబాట భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. రద్దీ కారణంగా గదులు ఖాళీలేవు. కల్యాణకట్టల్లోనూ తలనీలాలు సమర్పించేందుకు నాలుగు గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చింది. అంగప్రదక్షిణం క్యూలో భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాగా, రద్దీ నేపథ్యంలో భక్తులకు సాధ్యమైనంత వేగంగా దర్శనం కల్పించే ఏర్పాట్లు చేశారు. -
తిరుమలకు క్యూ కట్టిన వీఐపీలు
తిరుమల : తిరుమలకు శనివారం వీఐపీలు క్యూ కట్టారు. సినీనటుడు అర్జున్, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం రాంనారాయణరెడ్డి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య తదితరులు విడివిడిగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండలంలో తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం ఆనం రాంనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీపై పిల్లిమొగ్గలేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనసు ఇవ్వాలని వెంకన్నను వేడుకున్నట్లు చెప్పారు. -
తిరుమలలో నేడు పుష్పయాగం, ఆర్జిత సేవలు రద్దు
తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. స్వామి దర్శనానికి భక్తులు ఆరు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి ఆరు గంటలు, నడక దారిన వెళ్లే భక్తులకు నాలుగు సమయం పడుతుంది. కాగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో పది కంపార్ట్మెంట్లు నిండాయి. కాగా నేడు స్వామివారికి పుష్పయాగం కారణంగా ఆర్జిత సేవలన్నిటీనీ టీటీడీ రద్దు చేసింది. స్వామివారికి గురువారం ప్రత్యేక సేవ- తిరుప్పావై. -
వెంకన్న భక్తులపై దూసుకెళ్లిన లారీ
(నగరి సాక్షి ఛానల్ రిపోర్టర్ సుమంత్ కథనం ప్రకారం) చిత్తూరు: చిత్తూరు జిల్లాలో మంగళవారం లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలి నడకన కొండకు వెళుతున్న గోవిందమాల భక్తులపై లారీ అదుపు తప్పి దూసుకు వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు చెన్నై వాసులుగా గుర్తించారు. ఈ సంఘటన చిత్తూరు నారాయణవనం మండలం పాలమంగళం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. లారీ డ్రైవర్ నిద్ర మత్తులో వాహనాన్ని నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. -
శ్రీవారి భక్తురాలు మృతి
-
వెంకన్న దర్శనానికి వచ్చి భక్తురాలు మృతి
తిరుమల : తిరుమలలో వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు మృతి చెందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్ నెంబర్ 16లోని మరుగుదొడ్ల దగ్గర వృద్ధురాలు పడి ఉండటాన్ని గమనించిన విజిలెన్స్ అధికారులు ఆమెను హుటాహుటిన అశ్వని ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే వృద్ధురాలు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆమె మరణించిందని చెప్పారు. అయితే మృతికి కారణాలు ఏంటన్న విషయం మాత్రం ఇంకా నిర్ధారించలేదు. పోస్టుమార్టం చేస్తే గానీ కారణాలు తెలియవని అంటున్నారు. మృతురాలు తమిళనాడులోని ఆర్కాట్ జిల్లాకు చెందిన దేవికగా పోలీసులు గుర్తించారు. ఆమె అక్కడ పూలు అమ్ముకుని జీవిస్తుంటుందని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .