వెంకన్న భక్తులపై దూసుకెళ్లిన లారీ | Lorry rams into devotees, two killed, 4 injured | Sakshi
Sakshi News home page

వెంకన్న భక్తులపై దూసుకెళ్లిన లారీ

Published Tue, Aug 5 2014 8:12 AM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM

Lorry rams into devotees, two killed, 4 injured

(నగరి సాక్షి ఛానల్ రిపోర్టర్  సుమంత్ కథనం ప్రకారం)

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో  మంగళవారం లారీ  బీభత్సం సృష్టించింది.  తిరుమలకు కాలి నడకన కొండకు వెళుతున్న గోవిందమాల భక్తులపై లారీ అదుపు తప్పి దూసుకు వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు చెన్నై వాసులుగా గుర్తించారు. ఈ సంఘటన చిత్తూరు నారాయణవనం మండలం పాలమంగళం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. లారీ డ్రైవర్ నిద్ర మత్తులో వాహనాన్ని నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement