lorry rams
-
రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై ప్రమాదం
రాజమహేంద్రవరం : నగరంలోని రోడ్డు కమ్ వంతెనపై మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఓ లారీ మరొక ఇసుక లారీని ఢీకొని వంతెనపై నుంచి రైల్వే ట్రాక్‌పై తిరగబడింది. ఈ ప్రమాదంలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఈ ఘటనతో విజయవాడ- విశాఖ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం మేర్పడింది. వివరాల్లోకి వెళితే...రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం వెళుతున్న ఓ లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. అనంతరం రెయిలింగ్ ఢీకొని వంతెనపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ ప్రమాదంతో రైల్వే విద్యుత్ లైన్లు ధ్వంసం కావడంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాక్‌పై పడిపోయిన రైలును తొలగించి, విద్యుత్ పునరుద్దరణకు యత్నిస్తున్నారు. అలాగే గాయపడిన లారీ డ్రైవర్, క్లీనర్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ రాజకుమారి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. -
రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై ప్రమాదం
-
రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి దుర్మరణం
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైల్వే ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఈరోజు ఉదయం రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే మల్లేశం(40) సైకిల్‌పై వెళ్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు డోర్ అకస్మాత్తుగా తెరవడంతో మల్లేశం కింద పడ్డాడు. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ లారీ కిందపడ్డ మల్లేశంపై దూసుకు వెళ్లింది. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
వెంకన్న భక్తులపై దూసుకెళ్లిన లారీ
(నగరి సాక్షి ఛానల్ రిపోర్టర్ సుమంత్ కథనం ప్రకారం) చిత్తూరు: చిత్తూరు జిల్లాలో మంగళవారం లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలి నడకన కొండకు వెళుతున్న గోవిందమాల భక్తులపై లారీ అదుపు తప్పి దూసుకు వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు చెన్నై వాసులుగా గుర్తించారు. ఈ సంఘటన చిత్తూరు నారాయణవనం మండలం పాలమంగళం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. లారీ డ్రైవర్ నిద్ర మత్తులో వాహనాన్ని నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.