రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై ప్రమాదం | accident in rail cum road bridge at Rajahmundry | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీ..వంతెన పైనుంచి పడ్డ లారీ

Published Tue, Oct 25 2016 10:36 AM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై ప్రమాదం

రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై ప్రమాదం

రాజమహేంద్రవరం : నగరంలోని రోడ్డు కమ్ వంతెనపై మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఓ లారీ మరొక ఇసుక లారీని ఢీకొని వంతెనపై నుంచి రైల్వే ట్రాక్‌పై తిరగబడింది. ఈ ప్రమాదంలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఈ ఘటనతో విజయవాడ- విశాఖ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం మేర్పడింది. వివరాల్లోకి వెళితే...రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం వెళుతున్న ఓ లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. అనంతరం రెయిలింగ్‌ ఢీకొని వంతెనపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడింది.

ఈ ప్రమాదంతో రైల్వే విద్యుత్ లైన్లు ధ్వంసం కావడంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాక్పై పడిపోయిన రైలును తొలగించి, విద్యుత్ పునరుద్దరణకు యత్నిస్తున్నారు. అలాగే గాయపడిన లారీ డ్రైవర్, క్లీనర్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ రాజకుమారి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement