
ట్రాక్ పైకి ఏనుగులు, రైళ్లు నిలిపివేత
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో మరోసారి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. శుక్రవారం అర్థరాత్రి కుప్పం మండలం మిట్టపల్లి పరిసర ప్రాంతాల్లో పంట పొలాలపై ఏనుగులు దాడి చేశాయి. పంటను ధ్వంసం చేశాయి. కాగా ఏనుగుల గుంపు సమీపంలోని రైల్వే ట్రాక్పైకి రావటంతో గమనించిన రైల్వే సిబ్బంది ఈ సమాచారాన్ని అధికారులకు అందించారు.
దాంతో రైల్వే అధికారులు గంటసేపు చెన్నై-బెంగళూరు మధ్య నడిచే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో నడిచే రైళ్లు సమారు గంటసేపు ఆలస్యంగా నడుస్తున్నాయి. గత పదిహేను రోజులుగా ఏనుగుల గుంపు సంచారంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.