ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతోంది. ఈరోజు (జనవరి 29) మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాలో రెండవ అమృత స్నానం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం భక్తులు ముందుగానే సంగమస్థలికి చేరుకుంటున్నారు.
మహా కుంభమేళా పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు భారతీయ రైల్వే విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్‌రాజ్ స్టేషన్ నుండి 190 ప్రత్యేక రైళ్లు, 110 సాధారణ రైళ్లు, 60 మెమూ రైళ్లు సహా 360 రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ మీడియాకు తెలిపారు.
కుంభమేళాకు భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల ప్రయాణ అవసరాలను తీర్చడంపై భారత రైల్వేశాఖ దృష్టిసారించిందన్నారు. మౌని అమావాస్య నాడు పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చే భక్తుల రద్దీని తట్టుకునేందుకు ప్రతి నాలుగు నిమిషాలకు ఒక రైలును నడుపుతున్నామని తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. ప్రతి స్టేషన్‌లో తాగునీరు, ఫుడ్ కోర్టులు, టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు.
అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రథమ చికిత్స బూత్‌లు, వైద్య పరిశీలన గదులను ఏర్పాటు చేశామని, ప్రయాగ్‌రాజ్ జంక్షన్, ప్రయాగ్‌రాజ్ ఛోకిలలో యాత్రి సువిధ కేంద్రాల్లో వీల్‌చైర్లు, లగేజ్ ట్రాలీలు మందులు మొదలైనవి అందిస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: కుంభమేళా రైలుపై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు
Comments
Please login to add a commentAdd a comment