హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైల్వే ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఈరోజు ఉదయం రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే మల్లేశం(40) సైకిల్‌పై వెళ్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు డోర్ అకస్మాత్తుగా తెరవడంతో మల్లేశం కింద పడ్డాడు.
అదే సమయంలో అటుగా వస్తున్న ఓ లారీ కిందపడ్డ మల్లేశంపై దూసుకు వెళ్లింది. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి దుర్మరణం
Published Fri, May 8 2015 10:41 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
Advertisement
Advertisement