తిరుమల : గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు తిరుమల శ్రీవారికి నిర్వహించే అభిషేకం ఇతర సేవల కారణాల వల్ల సంవత్సరం పొడవునా ప్రతి శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే టీటీడీ అధికారులు పరిమితం చేశారు. ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. అలాగే గతంలో నిర్ణయించిన మేరకు వేసవి రద్దీ దృష్ట్యా ఏప్రిల్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు శని, ఆదివారాల్లో కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రమే పరిమితం చేశారు. వీఐపీ లు, భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 30 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment