VIP break darshan
-
TTD: తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనంలో మార్పులు..
సాక్షి, తిరుమల: నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో విఐపీ బ్రేక్ దర్శన సమయం మారింది. ఉదయం 8 గంటలకు దర్శనం ప్రారంభమైంది. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా రాత్రిపూట వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు టీటీడీ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. ముందురోజు రాత్రి నుండి వేచిఉండే భక్తులకు ఉదయం నుండి శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. వసతిపై వత్తిడి తగ్గుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు తిరుపతి కౌంటర్ ప్రారంభమైంది. మాధవం అతిథి గృహంలో శ్రీవాణి భక్తులకు వసతి కల్పించనున్నారు. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం పాలకమండలి భేటీ అనంతరం ఆ నిర్ణయాలను ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం స్వర్ణమయం చేయాలని, అందుకు భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారంతో తాపడం చేయించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 23వ తేదీన బాలాలయం పనులు ప్రారంభం అవుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలాగే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపైన కూడా పాలకమండలి చర్చించింది. జనవరి 2, 2023 నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం మొదలుకానుంది. 11వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. అలాగే రెండో ఘాట్రోడ్లో రక్షణ గోడల నిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. తిరుమల బాలాజీ నగర్లో మౌలిక వసతులకు రూ.3.70 కోట్లు, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్దికి రూ.3.75 కోట్లు మంజూరు చేసినట్లు టీడీపీ వెల్లడించింది. టీటీడీ ఆస్పత్రుల్లో ఔషధాలు, సర్జికల్ పరికరాల కొనుగోలుకు రూ.2.86 కోట్లు వెచ్చించనున్నట్లు టీటీడీ పాలకమండలి తెలిపింది. చదవండి: ఏపీలో పింఛన్ల పండగ.. తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీ -
TTD: శ్రీవారి బ్రేక్ దర్శన సమయం మార్పు!
తిరుమల: డిసెంబర్ 1వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శన సమయం మారనుంది. రాత్రిపూట వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలకమండలి. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లున్న భక్తులను ప్రస్తుతం ఉదయం 6 గంటలకు దర్శనానికి అనుమతిస్తున్న టీటీడీ.. గురువారం(డిసెంబర్ 1) నుంచి ఉదయం 8 గంటలకు అనుమతించనుంది. ప్రొటోకాల్, శ్రీవాణి ట్రస్టు టికెట్ల భక్తులను ముందుగా అనుమతిస్తారు. స్వామికి రెండోగంట నివేదన తరువాత 10.30 గంటల నుంచి జనరల్ బ్రేక్ దర్శనం టికెట్లున్న భక్తులను, తరువాత టీటీడీ ఉద్యోగుల కుటుంబసభ్యులను దర్శనానికి అనుమతించనున్నారు. దీంతో సామాన్య భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉండే సమయం తగ్గనుంది. నెలరోజులు ఈ విధానాన్ని పరిశీలించి ఇలాగే కొనసాగించాలా, లేక పాత పద్ధతినే అమలుచేయాలా అని టీటీడీ నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు బుధవారం అన్నమయ్య పాలక మండలిలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలకమండలి భేటీ అయ్యింది. రేపటి నుంచి వీఐపీ దర్శన సమయంలో మార్పుతో పాటు ఆనంద నిలయం స్వర్ణమయం అంశంపై పాలకమండలి చర్చిస్తోంది. అంతేకాదు.. వసతి సమస్య నివారణ పైనా చర్చించినట్లు తెలుస్తోంది. 2014 నుంచి సాయంత్రం వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు శ్రీవారి ఆలయంలో 1994కి పూర్వం వీఐపీ బ్రేక్ దర్శనాలు లేవు. అప్పటివరకు భక్తులందరినీ స్వామి దర్శనానికి కులశేఖరపడి వరకు అనుమతిస్తుండడంతో వీఐపీలు ఏ సమయంలో వచ్చినా దర్శనానికి అనుమతించేవారు. ఆ తరువాత సిఫార్సు లేఖల విధానం మొదలైంది. సాయంత్రం నైవేద్య సమర్పణ తరువాత వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించేవారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు కోరుకునే భక్తుల సంఖ్య పెరగడంతో టీటీడీ ఉదయం కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభించింది. ఈ కారణంగా సామాన్య భక్తులకు దర్శన సమయం తగ్గిపోయిందంటూ టీటీడిపై విమర్శలు రావడంతో 2012లో గురువారం మినహా మిగిలిన రోజుల్లో సాయంత్రం వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దుచేసింది. 2014 నుంచి సాయంత్రం వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దుచేసింది. ప్రస్తుతం ఉదయం పూట వీఐపీ బ్రేక్ దర్శనాలు మాత్రమే అమలవుతున్నాయి. ముందుగా ప్రొటోకాల్ పరిధిలోని వారిని, తరువాత శ్రీవాణి ట్రస్ట్‌కి విరాళాలు ఇచ్చినవారిని, అనంతరం సిఫార్సు లేఖలపై టికెట్లున్న భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ బ్రేక్ దర్శనాలకే మూడు నుంచి నాలుగుగంటలు పడుతుండడంతో సర్వదర్శన భక్తులు దర్శనం కోసం వేచి చూసే సమయం పెరుగుతోంది. సర్వదర్శనం క్యూ లైను ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతోంది. ముందురోజు అర్ధరాత్రి 12 గంటలకు నిలిపేసిన సర్వదర్శన క్యూ లైన్ తరువాత రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుండడంతో భక్తుల నిరీక్షణ సమయం పెరుగుతూ వస్తోంది. ఆ సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ దర్శన విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. వేకువజామున ఆలయం తెరిచి శ్రీవారికి కైంకర్యాలు, నివేదనలను పూర్తిచేసిన అనంతరం సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించి, తరువాత వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లున్నవారిని దర్శనానికి అనుమతిస్తే, సామాన్య భక్తులు దర్శనానికి వేచి ఉండే సమయం తగ్గుతుందని టీటీడీ భావిస్తోంది. దీనికితోడు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లున్న భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని స్వామిని దర్శించుకునే వెసులుబాటు లభిస్తుందని, దీంతో వసతి గదుల కేటాయింపు విషయంలో ఒత్తిడి తగ్గుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. నెలరోజులు పరిశీలించి ఈ విధానం అమలుపై నిర్ణయం తీసుకోనుంది. -
వీఐపీ బ్రేక్ దర్శన సమయం మార్పు
తిరుమల: తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాలను ఈవో ఏవీ ధర్మారెడ్డి భక్తులకు వివరించారు. ఈ నెల 20 నుంచి 28 వరకు జరగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా 24న గజవాహనం, 25న గరుడ వాహనం, 27న రథోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శ్రీవారి దర్శనార్థం కంపార్ట్మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్పు చేసి నెల పాటు ప్రయోగాత్మకంగా అమలుచేస్తామని, భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 7న కర్నూలు జిల్లా యాగంటి, 14న విశాఖపట్నం, 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయం తలుపులు మూసి వేస్తారు. ఈ కారణంగా బ్రేక్ దర్శనంతో పాటు శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం తదితర ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ నెల 9న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒంగోలు శివారులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా గల మైదానంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్టు ఈవో ఏవీ ధర్మారెడ్డి వివరించారు. -
Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు
తిరుమల : తిరుమలలో రెండేళ్ల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలను మాడ వీధుల్లో నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతంలో రెండు బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి బ్రహ్మోత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉంది. దీంతో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆర్జిత సేవలు, రూ.300 దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్ట్ దాతలు, ఇతర ట్రస్ట్‌ల దాతలకు దర్శన టికెట్లను రద్దు చేసింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. గదులకు సంబంధించి 50 శాతం ఆన్లైన్లో భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. మిగిలిన గదులను ఆఫ్‌లైన్‌లో తిరుమలలోని వివిధ కౌంటర్ల ద్వారా భక్తులకు కేటాయిస్తారు. అక్టోబర్ ఒకటో తేదీన గరుడసేవ కారణంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రస్ట్‌ల దాతలకు, కాటేజీ దాతలకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో గదుల కేటాయింపును నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి దర్శనానికి 4 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రెండు కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 71,158 మంది స్వామిని దర్శించుకోగా.. 27,968 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.3.73 కోట్లు సమర్పించుకున్నారు. దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. మరోవైపు సోమవారం శ్రీవారిని సినీనటుడు బెల్లంకొండ శ్రీనివాస్, సినీనటి మాళవిక నాయర్, హాస్య నటుడు బ్రహ్మానందం, నేషనల్ చెస్ చాంపియన్ గూకేష్ దర్శించుకున్నారు. (క్లిక్: అహ్మదాబాద్‌లో శ్రీవారి ఆలయానికి భూమి) -
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఐదు రోజులపాటు నిలిపివేశారు. సాధారణ భక్తులకే ప్రాధాన్యత కల్పించారు. మంగళవారం ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో తిరుపతిలో టికెట్లు జారీ కేంద్రాల వద్ద తోపులాట జరిగింది. పోలీసులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పరిస్థితులను చక్కదిద్దారు. టికెట్లు లేకుండానే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించారు. భక్తులు నేరుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌కు వెళ్లి దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. భక్తుల రద్దీ తీవ్రంగా పెరగడంతో బుధవారం నుంచి ఆదివారం వరకు పూర్తిగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. తద్వారా మరో 10 నుంచి 20 వేల మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు దర్శనం టికెట్లు లేకపోయినా స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ పీఆర్వో విభాగం తెలిపింది. తిరుమలకు పూర్వ వైభవం కరోనా కనుమరుగు కావడంతో తిరుమలకు పూర్వ వైభవం వచ్చింది. గతంలో సాధారణ రోజుల్లో 60 నుంచి 80 వేలు, విశేష దినాల్లో లక్ష మంది దర్శనానికి వచ్చేవారు. కరోనా కారణంగా రెండేళ్ల క్రితం మార్చిలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. కరోనా కొంత తగ్గడంతో 83 రోజుల అనంతరం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించింది. క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతోంది. ప్రస్తుతం సామాన్య భక్తులను అనుమతిస్తోంది. నిత్యం 30 నుంచి 40 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద శ్రీవారి దర్శన టిక్కెట్ల కోసం క్యూలైన్లలో కిక్కిరిసిన భక్తులు భక్తుల తోపులాట.. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత భక్తుల రద్దీ పెరగడంతో టోకెన్ల కోసం వేచి ఉన్న భక్తులకు మూడు రోజుల అనంతరం దర్శనం స్లాట్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆది, సోమ వారాల్లో రెండు రోజులపాటు సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేశారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి చేరుకున్న భక్తులు అలిపిరి వద్దనున్న భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ స్వామి వారి సత్రాల వద్ద సర్వదర్శనం టోకెన్ల కోసం కొద్ది గంటలుగా బారులు తీరారు. మంగళవారం మరింత మంది భక్తులు రావడంతో తోపులాట జరిగింది. పలువురు భక్తులు, చిన్నపిల్లలు కింద పడిపోయారు. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. ముగ్గురు భక్తులు గాయపడ్డారు. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు టికెట్ల జారీని నిలిపివేశారు. టికెట్లు లేకుండా తిరుమలకు అనుమతిస్తామని మైకుల్లో ప్రకటించారు. దీంతో భక్తులు అక్కడ నుంచి అలిపిరి చేరుకుని తిరుమలకు వెళ్లారు. రెండు రోజుల విరామం తర్వాత గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ దగ్గర టికెట్లు జారీ చేశారని, ఈ కారణంగానే భక్తుల రద్దీ పెరిగిందని విజిలెన్స్, పోలీసు అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి క్యూలైన్లో వేచిఉన్న భక్తులు టికెట్లు లేకున్నా అనుమతి టికెట్ల జారీ కేంద్రాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. తొక్కిసలాట జరగకుండా అధికారులు నివారించారు. టికెట్లు లేకుండానే తిరుమలకు అనుమతించారు. భక్తుల కష్టాలను ఎప్పటికప్పుడు గుర్తించి టీటీడీ చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయం. – వెంకటలక్ష్మి, విజయనగరం సామాన్య భక్తులకు ప్రాధాన్యత తిరుమలకు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు విపరీతంగా వస్తున్నారు. రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ ఐదు రోజుల పాటు బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం చాలా గొప్ప విషయం. – సునీతాదేవి, విజయవాడ అన్నప్రసాదాలు పంపిణీ చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్న ప్రసాదాలు కూడా వితరణ చేయడం చాలా సంతోషం. ఎప్పటికప్పుడు మంచినీరు, అన్నప్రసాదాలు అందిస్తూ భక్తులకు ఎలాంటి లోటు లేకుండా చేశారు. – మీరా, మహారాష్ట్ర భక్తురాలు మార్చి గణాంకాలు ఇలా ఉన్నాయి తిరుమల శ్రీవారిని గత మార్చి నెలలో మొత్తం 19,72,741 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,10,133 మందికి అన్న ప్రసాదాలు అందించారు. 9,54,856 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. 1,49,408 మందికి గదులు అద్దెకు ఇచ్చారు. -
భక్తుల రద్దీతో టీటీడీ కీలక నిర్ణయం
-
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. టీటీడీ కీలక నిర్ణయం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో 5 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఆదివారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతి ఇచ్చింది. అలిపిరి నుంచి దర్శన టోకెన్లు లేకపోయినా తిరుమలకు అనుమతి ఇచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలోకి రెండేళ్ల తర్వాత భక్తులను టీటీడీ అనుమతించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. చదవండి: జగనన్న మాటే.. వాసన్న బాట -
తిరుమల: టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల: వీఐపీ బ్రేక్ దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఇప్పటికే శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. వీఐపీల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకే కేటాయించాలని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. (చదవండి: కడప నుంచి అయిదు నగరాలకు ఇండిగో సేవలు) -
పర్వదినాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం
సాక్షి, తిరుమల: తిరుమలలో సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 1న, అలాగే వైకుంఠ పర్వదినాల సందర్భంగా జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుందని, ఆ రోజుల్లో దర్శనాల నిమిత్తం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది. చదవండి: (ఏం మాట్లాడుతున్నారు.. బీజేపీ నేతలకు సిగ్గుందా?) జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా విచ్చేసే భక్తులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంతృప్తికరమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపడుతోంది. ఈ పర్వదినాల నేపథ్యంలో జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. దీంతోపాటు ఆయా రోజుల్లో అమలయ్యే విధానాలపై భక్తులకు టీటీడీ పలు సూచనలు చేసింది. చదవండి: ('ఈ నగరానికి ఏమైంది...?. ఎవరూ నోరు మెదపరేం’) -
నవంబర్ 4న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: శ్రీవారి ఆలయంలో నవంబర్ 4న దీపావళి ఆస్థానం నిర్వహించనున్న సందర్భంగా ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. నవంబర్ 3న వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని భక్తులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
ప్రతి శుక్రవారం వీఐపీ దర్శనాలకు ‘బ్రేక్’
తిరుమల : గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు తిరుమల శ్రీవారికి నిర్వహించే అభిషేకం ఇతర సేవల కారణాల వల్ల సంవత్సరం పొడవునా ప్రతి శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే టీటీడీ అధికారులు పరిమితం చేశారు. ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. అలాగే గతంలో నిర్ణయించిన మేరకు వేసవి రద్దీ దృష్ట్యా ఏప్రిల్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు శని, ఆదివారాల్లో కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రమే పరిమితం చేశారు. వీఐపీ లు, భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. -
తిరుమలలో నేడు, రేపు బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో 12వ తేదీ మంగళవారం రథసప్తమి పర్వదినం సందర్భంగా సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని 11, 12వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. అదేవిధంగా, 12వ తేదీ చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులు, దివ్యాంగులకు, దాతలకు సుపథం మార్గంలో కల్పించే ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. రథసప్తమి రోజు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. అలాగే, 12వ తేదీ అంగప్రదక్షిణ టోకెన్లను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది. -
శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు: టీటీడీ
సాక్షి, తిరుమల : వేసవిలో భక్తుల రద్దీ దృష్ట్యా శుక్రవారం నుంచి జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దాతల నుంచి సిఫారసు లేఖలు వచ్చినా స్వీకరించమని పేర్కొంది. -
తిరుమలలో రేపు వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు
తిరుమల : భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది. వరుస సెలవులతో పాటు, వారాంతంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా టీటీడీ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగుతున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈనెల 13 నుంచి టీటీడీ ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారు. అయితే ఈ సమ్మె నుంచి భక్తులకు మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగులు నిర్ణయించారు.