భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది.
తిరుమల : భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది. వరుస సెలవులతో పాటు, వారాంతంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా టీటీడీ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగుతున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈనెల 13 నుంచి టీటీడీ ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారు. అయితే ఈ సమ్మె నుంచి భక్తులకు మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగులు నిర్ణయించారు.