సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో 5 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఆదివారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతి ఇచ్చింది. అలిపిరి నుంచి దర్శన టోకెన్లు లేకపోయినా తిరుమలకు అనుమతి ఇచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లలోకి రెండేళ్ల తర్వాత భక్తులను టీటీడీ అనుమతించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
చదవండి: జగనన్న మాటే.. వాసన్న బాట
Comments
Please login to add a commentAdd a comment