సాక్షి, తిరుమల: లాక్‌డౌన్ నిబంధనల సడలింపులతో భక్తులకు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో శుక్రవారం శ్రీవారి ఆలయంలో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. క్యూలైన్ కదలికను గుర్తించేందుకు గంటకు ఎంత మందిని దర్శనానికి పంపగలుగుతామనే అంశంపై పరిశీలించారు. వందమంది టీటీడీ ఉద్యోగులతో ట్రయల్ రన్ నిర్వహించగా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ పరిశీలించారు. (టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం)
వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 8,9,10 తేదీల్లో టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో శ్రీవారి దర్శనాలు ట్రయన్ రన్ నిర్వహిస్తామని వెల్లడించారు. పరిమిత సంఖ్యలో మాత్రమే దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు. రోజుకు 7 వేల మందికి దర్శనం కల్పించడానికి అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం నిబంధనలను భక్తులు తప్పకుండా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని కోరారు. టీటీడీ చర్యలకు భక్తులు సహకరించాలన్నారు. తిరుమలలో ప్రధానంగా నాలుగు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, కల్యాణకట్టలో తలనీలాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని తెలిపారు. అన్న ప్రసాద కేంద్రం వద్ద చేతులు శుభ్రపరుచుకునే ప్రాంతంలో భక్తులు జాగ్రత్త వహించాలన్నారు. కొన్ని రోజుల పాటు తీర్థం చఠారి రద్దు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
వైవీ సుబ్బారెడ్డి ఇంకా ఏమన్నారంటే..
► ఈనెల 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులకు దర్శనం
► ఈనెల 10న తిరుపతి స్థానికులకు దర్శనానికి అనుమతి
► ఈనెల 11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం
► పరిమిత సంఖ్యలో మాత్రమే దర్శనాలు ఉంటాయి
► ప్రతిరోజూ 7 వేల మందికి మాత్రమే దర్శనం
► ఆన్‌లైన్‌లో 3వేల మంది భక్తులకు అనుమతి
► ఉదయం 6:30 నుంచి 7:30 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం
► ఉ.6.30 నుంచి రాత్రి 7.30 గంటలలోపు దర్శనానికి అనుమతి
► ఉ.6 నుంచి సాయంత్రం 4 గంటల లోపు మాత్రమే కాలినడక భక్తులకు అనుమతి
► అలిపిరి నుంచి మాత్రమే కాలినడక భక్తులకు అనుమతి
► శ్రీవారిమెట్టు మార్గం నుంచి ప్రస్తుతానికి అనుమతి లేదు
► నేరుగా వచ్చే భక్తులకు అలిపిరి వద్ద టికెట్ కౌంటర్
► అలిపిరి, తిరుమలలో టెస్టింగ్ ల్యాబ్స్
► 10 ఏళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు అనుమతి లేదు
► పుష్కరిణిలో భక్తులకు అనుమతి లేదు
► మాస్క్‌లు, శానిటైజర్లు తప్పనిసరిగా ఉపయోగించాలి
► దేశవ్యాప్తంగా కంటైన్‌మెంట్ జోన్లలో భక్తులు దర్శనాలకు రావద్దు
Comments
Please login to add a commentAdd a comment