
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్ నిబంధనల సడలింపులతో భక్తులకు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
► ఈ నెల 8వ తేదీ నుంచి స్వామివారి దర్శనానికి సంబంధించి టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది, పాలక మండలి సభ్యులతో మూడు రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించనున్నాం. దీని ద్వారా ఒక్క రోజులో ఎంతమంది భక్తులకు దర్శనం కల్పించగలమనే అంచనా వేస్తాం.
► క్యూలైన్‌లలో భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశాం.
► ఆన్‌లైన్ బుకింగ్‌తోనే సర్వదర్శనం లేదా టికెట్ దర్శనానికి అనుమతి.
► ఆన్‌లైన్ బుకింగ్‌పై అవగాహనకు అలిపిరి గేట్ దగ్గర రిజిస్ట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. అక్కడే టెస్టులు చేసి దర్శనానికి అనుమతిస్తాం.
► కోనేటి స్నానానికి అనుమతి లేదు. ప్రత్యేకంగా ట్యాప్‌లు ఏర్పాటు చేశాం.
Comments
Please login to add a commentAdd a comment