తిరుమల: ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో ఈనెల 8 నుంచి శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశా మని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి, జేఈఓ బసంత్‌కుమార్‌తో కలిసి చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలిపిన ముఖ్యాంశాలు..
► 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రయోగాత్మక దర్శనం. వారికి 6 నుంచి 8 వరకు టైం స్లాట్ బుకింగ్ టోకెన్లు జారీ.
► 10న తిరుమల స్థానికులకు, 11 నుంచి దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు అనుమతి.
► రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు 8న ఆన్‌లైన్‌లో ఒక నెల కోటా విడుదల. ప్రతి రోజూ 3 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు.
► తిరుపతిలోని కౌంటర్ల ద్వారా 3 వేల సర్వదర్శనం టికెట్లు. ఒకరోజు ముందుగా కేటాయింపు
► వీఐపీలకు ఒక గంట మాత్రమే బ్రేక్ దర్శనం. సిఫార్సు లేఖలకు అనుమతి లేదు.
► 10 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్ల పైబడిన వారికి అనుమతి లేదు.
► శ్రీవారి మెట్టు మార్గం మూసివేత. అలిపిరి ఘాట్ రోడ్‌లలోనే అనుమతి
► కోవిడ్ నియంత్రణ జాగ్రత్తలు పాటించేలా ఏర్పాట్లు
► కల్యాణ మండపాల్లో వివాహాలకు ముందుగా అనుమతి పొందాలి.
► ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నదానం.
► అలిపిరి టోల్‌గేట్ వద్ద థర్మల్ స్క్రీనింగ్, వెహికల్ స్కానింగ్, హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు. భక్తుల నుంచి డిక్లరేషన్.
► ప్రతి రెండు గంటలకు గదుల శానిటైజేషన్
8 నుంచి శ్రీవారి పునర్దర్శనం
Published Sat, Jun 6 2020 3:15 AM | Last Updated on Sat, Jun 6 2020 8:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment