
సాక్షి, తిరుమల: బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన సేవలందించిన టీటీడీ, వివిధ శాఖల సిబ్బందిని అభినందించారు. రద్దీ ఎక్కువగా ఉన్నా.. భక్తులు సమయనం పాటించి స్వామివారి దర్శనం చేసుకున్నారన్నారు. గత ఏడాది 5.8 లక్షల మంది దర్శనం చేసుకోగా, ఈ ఏడాది 7.7 లక్షల మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారని ఈవో వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే లక్షా 5 వేల మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారని తెలిపారు.
ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో 3.23 లక్షల మంది స్వామివారికి తలనీలాలు సమర్పించగా.. గత ఏడాది 2.17 లక్షల మంది తలనీలాలు సమర్పించారని వెల్లడించారు. ఆర్టీసీ ద్వారా 4.24 లక్షల మంది తిరుమలకు చేరుకున్నారని చెప్పారు. ఈ ఏడాది భక్తులకు 34 లక్షల లడ్డూలు అందించగా.. గత ఏడాది 24 లక్షల లడ్డూలు అందించామన్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో 18 రాష్ట్రాల నుండి 357 కళా బృందాలు పాల్గొన్నాయన్నారు. వచ్చే ఏడాది 25 రాష్ట్రాల నుండి ఉన్నత స్థాయి కళాకారులు రప్పిస్తామని ఈవో తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.20 కోట్ల 50 లక్షల 85 వేల హుండీ ఆదాయం వచ్చిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment