Anil kumar singhal
-
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పరిశీలించిన ఈవో
-
ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అత్యంత కీలకం: గవర్నర్ నజీర్
సాక్షి, విజయవాడ: దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక, ఏపీలో కూడా యోగా డే వేడుకలు కొనసాగుతున్నాయి. కాగా, రాజ్‌భవన్‌లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజ్‌భవన్‌లో అధికారులతో కలిసి గవర్నర్ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు స్పెషల్ సీఎస్ అనిల్ కుమార్ సింఘల్ యోగాసనాలు వేశారు. అనంతరం, గవర్నర్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అత్యంత కీలకం. యోగా ప్రక్రియ ద్వారా మానసిన ప్రశాంతత చేకూరుతుంది. యోగా ద్వారా ఒత్తిడిని అధిగమించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా అంతర్గత శక్తి, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యోగాతో అన్ని వయసుల వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఇది కూడా చదవండి: మాతో పొత్తా?.. పద్ధతిగా ఉండదు! చంద్రబాబుపై సోమువీర్రాజు ఘాటు వ్యాఖ్యలు -
గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: సీనియర్ ఐఎఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. 1993 బ్యాచ్‌కు సింఘాల్ ఇప్పటి వరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. రాజ్ భవన్లో మాననీయ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను సింఘాల్ మర్యాద పూర్వకంగా కలిసారు. వీరిరివురు కొద్దిసేవు సమావేశం అయ్యారు. సింఘాల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలకమైన శాఖలలో బాధ్యతలు నిర్వర్తించి మంచి అధికారిగా తనదైన ముద్ర వేసారు. కేంద్రంలో అత్యంత కీలకమైన డిఓపిటి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్‌గా పనిచేసారు. కీలకమైన కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలు అందించి రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకున్నారు. టీడీడీ ఈవోగా పలు సంస్కరణలకు బీజం వేశారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, మెదక్ కలెక్టర్ గా, చిత్తూరు, గుంటూరు సంయిక్త కలెక్టర్‌గా ఆయా జిల్లాలలో తనదైన ముద్ర వేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఉట్నూరు, కేఆర్ పురంలలో, సబ్ కలెక్టర్‌గా గద్వాల్ లో ప్రజలకు ఇతోధిక సేవలందించారు. సర్వీసు తొలి రోజుల్లో నెల్లూరు, అనంతపురం ఉప కలెక్టర్‌గా వ్యవహరించారు. -
గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్‌కుమార్ సింఘాల్
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న రాంప్రకాష్ సిసోడియాను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్ట్ చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. -
టోకెన్ ఉంటేనే వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల: టోకెన్లు ఉన్న వారికే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం లభిస్తుందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. తిరుమలలో సోమవారం వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పరిశీలన అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందన్నారు. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా రూ.300 ఎస్ఈడీ టికెట్లు 2 లక్షలు కేటాయించినట్టు తెలిపారు. తిరుపతిలో అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ ఎదురుగా విష్ణునివాసం, రైల్వేస్టేషన్ వెనుక 2, 3 సత్రాలు, ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్ హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్ హైస్కూల్, ఎమ్మార్‌పల్లి జెడ్పీ హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో టోకెన్లు ఇస్తామన్నారు. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్ట్ చేయాలని సూచించారు. భక్తులు టీటీడీ వెబ్సైట్, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకుని తమ తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టోకెన్లపై కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి మాత్రమే రావాలని కోరారు. తిరుమలలో వసతి సౌకర్యం తక్కువగా ఉన్నందున దర్శన టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే ముందు వచ్చిన వారికే ముందు అన్న ప్రాతిపదికపై వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. శ్రీవారి దర్శనానికి 30 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. దర్శన టోకెన్లు లేని భక్తులకు 30 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కాగా, తిరుమల శ్రీవారిని సోమవారం అపోలో చైర్మన్ ప్రతాప్ సిరెడ్డి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కలవంతర్సింగ్, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్మనోహర్ నారాయణమిశ్రా, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నాగార్జున, జస్టిస్ సోమయాజులు, కరెంట్ గవర్నర్ ఫర్ వెస్ట్ న్యూ బ్రిటన్ ప్రొవియన్స్ శశిధరన్ ముత్తువెల్, తెలంగాణ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దర్శించుకున్నారు. -
ఆ 3 ముఖ్యం.. 27 రోజులు ప్రచారం
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక అమలు చేస్తోంది. వ్యాధిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. తప్పనిసరిగా మాస్క్ ధరించడం (నో మాస్క్.. నో ఎంట్రీ), భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం.. ఈ మూడు కరోనా వైరస్ నియంత్రణకు కీలకమని విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 27 రోజులపాటు నిర్వహించనున్న ఈ ప్రచార కార్యక్రమాలు గురువారం (ఈనెల 5న) రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు, షార్ట్ ఫిల్మ్‌లతో చేపట్టిన ఈ ప్రచారంలో ఏరోజు ఎక్కడ ఏకార్యక్రమాలు నిర్వహించాలన్నదానిపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణ కోవిడ్‌ను నియంత్రించేందుకు నిఘా, పరీక్షలను బలోపేతం చేసిన ప్రభుత్వం కాంటాక్ట్ ట్రేసింగ్, చికిత్స, కోవిడ్ టీకా కార్యక్రమాలను విస్తృతం చేసింది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో కోవిడ్–19 నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ఈ ప్రచారం చేపట్టింది. ఈనెల 31న ముగిసే ఈ ప్రచార కార్యక్రమాలను కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించాలని ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా కేంద్రస్థాయిలో టీచింగ్ ఆస్పత్రుల వారు, జిల్లా ఆస్పత్రుల స్థాయిలో జిల్లా వైద్యాధికారులు, మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల స్థాయిలో మునిసిపల్ కమిషనర్లు, సంబంధిత పోలీసు, వైద్య అధికారులు, డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, డీఎస్పీలు, మండల స్థాయిలో ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, పీహెచ్సీ వైద్యులు ఈ అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించింది. ప్రతిరోజు నిర్వహించిన కార్యక్రమాలపై కలెక్టర్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌కు నివేదిక సమర్పించాలని పేర్కొంది. ఈ ప్రచార కార్యక్రమాలను కచ్చితంగా నిర్వహించేలాగ అన్ని శాఖల ప్రత్యేక సీఎస్‌లు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారంటే.. గ్రామస్థాయి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని రకాల విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్యసంస్థలు, రవాణా వాహనాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, హోటళ్లు, సినిమాహాళ్లు, క్రీడాసముదాయాలు, విహారస్థలాలు, వివాహాలు వంటి కార్యక్రమాల్లో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహిస్తారు. అందరూ మాస్క్ ధరించేలా, భౌతికదూరం పాటించేలా, తరచూ చేతులు కడుక్కునేలా అవగాహన కల్పిస్తారు. 21 నుంచి దుర్గగుడిలో పవిత్రోత్సవాలు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిలో ఈ నెల 21వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలలో తొలి రోజు తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అనంతరం నిత్య అలంకరణ, పవిత్రమాలధారణ జరుగుతుంది. పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 9 గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మండపారాధన, అగ్నిప్రతిష్టాపన జరుగుతాయి. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మూలమంత్ర హవనం, వేద పారాయణ, హారతి, మంత్ర పుష్పం జరుగుతాయి. 23న ఉదయం 8 గంటల నుంచి మూలమంత్ర హవనం, శాంతి పౌష్టిక హోమాలు, కూష్మాండబలి అనంతరం మహా పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అన్ని ఆర్జిత సేవలు రద్దు: మూడు రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాల నేపథ్యంలో అలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను దేవస్థాన అధికారులు రద్దు చేశారు. ప్రత్యక్ష పూజలతో పాటు పరోక్ష పూజలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రావణ మాసం రెండో శుక్రవారం 20న దుర్గమ్మ వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేయనుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. -
కోవిడ్‌పై పోరులో మంచిపేరు వచ్చిందనే.. తప్పుడు రాతలు
అమరావతి: కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రానికి మంచిపేరు వస్తోందని, దీన్ని తట్టుకోలేక తప్పుడు రాతలు రాస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించడానికి చేస్తున్న ప్రయత్నంగా ఆయన పేర్కొన్నారు. కోవిడ్‌పై సమీక్ష సందర్భంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన కథనాలను అధికారులు ఆయన దృష్టికి తీసుకురాగా... ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కథనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ అధికారులు సీఎంకు చెప్పారు. సమీక్ష సందర్భంగా... ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు మరణించారంటూ ‘ఈనాడు’ రాసిన కథనాన్ని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పంపిన నివేదికను వివరిస్తూ... విషమ పరిస్థితుల్లో ఉన్న పి.దొరబాబు అనే వ్యక్తిని మే 25న ఆశ్రమ్ ఆస్పత్రిలో చేర్చారని, ఆ వ్యక్తికి డయాబెటిస్ సహా ఇతర దీర్ఘకాలిక సమస్యలున్నాయని, 25 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి జూన్ 26న మరణించారని చెప్పారు. మిగిలిన ఇద్దరూ కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయారని తెలియజేశారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ... ‘‘అయినా ఇపుడు రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ చాలా విరివిగా ఉంది. మన అవసరాలకన్నా ఉత్పత్తి ఎక్కువ ఉన్నపుడు కొరత ఎలా వస్తుంది? మనసులో కుళ్లుకుతంత్రాలు ఉంటేనే ఇలాంటి వార్తలు రాస్తారు. కోవిడ్ పీక్‌లో ఉన్నప్పుడు ఇలాంటి అబద్దాలు రాసి ఉంటే కనీసం నమ్మైనా నమ్ముతారు కానీ ఇపుడు కోవిడ్ తగ్గి 70 శాతానికిపైగా ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్ బెడ్లు అందుబాటులో ఉన్నా ఇలాంటి వార్తలు రాస్తున్నారంటే ఏమనుకోవాలి? వీళ్లకసలు మానవత్వం ఉందా?’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రానికి మంచిపేరు వస్తోందని, దీన్ని తట్టుకోలేకే తప్పుడు రాతలు రాస్తున్నారని చెప్పారాయన. ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించడానికి చేస్తున్న ప్రయత్నంగా ఆయన పేర్కొన్నారు. కోవిడ్ పీక్ స్థాయిలో ఉన్నపుడు 750 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను వినియోగించామని, ప్రస్తుతం అది 180 టన్నులకు తగ్గిందని అధికారులు చెప్పగా... ఇలాంటి పరిస్థితిలో ఆక్సిజన్ లేకే ముగ్గురు చనిపోయారని నిస్సిగ్గుగా వార్తలు రాశారంటూ సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి వార్తల ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారని ఆయన ప్రశ్నించారు. కోవిడ్‌పై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి ఆళ్ల నాని, అధికారులు ఎలా రాయగలుగుతున్నారసలు? కోవిడ్ తీవ్రతను చులకన చేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడినట్లుగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాన్ని అధికారులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోవిడ్‌పై సమీక్షా సమావేశంలో అందరు అధికారుల ఎదుట కరోనా తీవ్రతను చులకన చేసి మాట్లాడినట్లుగా, అర్థరాత్రి జీసస్‌తో సంభాషించినట్లుగా ఉద్దేశపూర్వకంగా రాసిందన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కూడా గత ఏడాది ప్రారంభంలో ఇలాగే చులకనగా మాట్లాడారు. కరోనా వైరస్‌లేదు.. ఏమీ లేదు. నేను రాత్రి జీసస్‌తో మాట్లాడాను. అసలు వైరస్‌లేదు.. భయపడవద్దు అని జీసస్ చెప్పారు. అని జగన్‌రెడ్డి అనడంతో అధికారులు అవాక్కయ్యారు’’ అంటూ ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయనకు చూపించారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ... అసలు ఎవరైనా ఇలాంటి రాతలు ఎలా రాయగలుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఇలాంటి రాతలు ద్వారా ముఖ్యమంత్రి పదవికి విలువ తగ్గించి, దాన్ని అథమస్థాయిలోకి తీసుకెళ్తున్నారు. చేతిలో ఒక పత్రిక, ఒక టీవీ ఉందని ఇలాంటి రాతలు రాయటమేనా? కోవిడ్ నివారణా చర్యలపై ఇంత సీరియస్‌గా సమీక్షలు చేస్తుంటే.. వాటిని అపహాస్యం చేసేలా ఇలాంటి రాతలు రాయడం అత్యంత దురదృష్టకరం. ఇంతమంది అధికారులకు టైంపాస్‌కాక రివ్యూలకు హాజరవుతున్నారా? కరోనా మీద ప్రభుత్వం సీరియస్‌గా లేకపోతే వారానికి రెండు రోజుల పాటు సమీక్షలు చేస్తుందా? ఈ వార్తలు రాసేవారికి కనీసం ఎక్కడోచోటైనా విలువలుండాలి కదా? మీకు ఏది రాయాలనిపిస్తే అలా రాసేస్తారా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రానికి వచ్చిన మంచిపేరు తనకు మాత్రమే కాదని... అందరు అధికారులు, సిబ్బందికి కూడా అని, అంతా కలిసికట్టుగా పనిచేశారని సీఎం వ్యాఖ్యనించారు. ధ్యాసపెట్టి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం కనకే మంచిపేరు వస్తోందన్నారు. రాష్ట్రస్థాయి నుంచి మొదలుపెడితే... గ్రామస్థాయిలో ఉన్న ఆశా కార్యకర్త, ఏఎన్ఎం, వాలంటీర్లు, కలెక్టర్లు, జిల్లా, మండల అధికారులు, వైద్య సిబ్బంది ఇలా ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో వ్యవహరించడంవల్ల ఇది సాధ్యమైందన్నారు. ఈ రెండు పత్రికల కథనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు సీఎంకు చెప్పారు. -
రాష్ట్రంలో ఆక్సిజన్ సప్లై పూర్తి అందుబాటులో ఉంది: సింఘాల్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఆక్సిజన్ సప్లై పూర్తిగా అందుబాటులో ఉందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కొందరు ఆక్సిజన్‌పై తప్పుడు రిపోర్టులు ఇచ్చి ప్రజలు, అధికారుల మనో ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ అలాంటి వారిపై చర్యలు తీసుకుంటారని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 322 ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు ట్రీట్మెంట్ జరుగుతోంది. 75 శాతానికి పైగా బెడ్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయి. కరోనా పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గత 24 గంటల్లో 71,758 శాంపిల్స్ టెస్ట్ చేస్తే 2,224 మందికి పాజిటివ్ వచ్చింది. 31 మంది కోవిడ్ కారణంగా చనిపోయారు ’’అని తెలిపారు. -
ఏపీలో యాక్టీవ్ కేసులు లక్షలోపుకు చేరాయి: అనిల్ కుమార్
సాక్షి,అమరావతి: ఆందధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గాయి.. యాక్టీవ్ కేసుల సంఖ్య లక్ష లోపునకు చేరింది. ప్రస్తుతం ఏపీలో 96,100 యాక్టీవ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేట్ 8.09 శాతంగా ఉంది అని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో 202 ఆస్పత్రులకు కరోనా చికిత్స నుంచి డీ-నోటిఫై చేశాం. గతంలో కరోనా ఆస్పత్రుల సంఖ్య 625గా ఉంటే.. ఇప్పుడవి 423కి తగ్గాయి. విదేశాల్లో చదివే విద్యార్ధులకు, ఐదేళ్ల లోపు తల్లులకు సుమారుగా 1.29 లక్షల మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ వేశాం. 45 ఏళ్ల పైబడిన వారిలో 53 శాతం వ్యాక్సినేషన్ వేశాం’’ అని అనిల్ కుమార్ తెలిపారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం 1307 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటి వల్ల ఇప్పటి వరకు 138 మంది చనిపోయారు. బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గించి చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గించి చూపితే కేంద్రం ఇచ్చే యాంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్లు తగ్గుతాయి. బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గించి చూపితే నష్టమే.. ఆ పని ప్రభుత్వం చేయదు. కేంద్రం నుంచి అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ రెండు రోజుల్లో పూర్తి చేసేస్తున్నాం. పది లక్షల కరోనా డోసులు ఇస్తోంటే ప్రత్యేక కార్యాచరణ అవసరం’’ అన్నారు అనిల్ కుమార్ సింఘాల్. చదవండి: టెస్టులు, వ్యాక్సిన్‌లో ఏపీ సరికొత్త రికార్డు -
AP: నేటి నుంచి 12వ విడత ఫీవర్ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి 12వ విడత ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. బాధితులను గుర్తించి సత్వరమే చికిత్స అందించేందుకు ప్రతి మూడు రోజులకు ఒకసారి ఫీవర్ సర్వే చేస్తున్నామని, 19 వేల మంది ఏఎన్ఎంలు, 40 వేల మంది ఆశా కార్యకర్తలు సర్వేలో పాల్గొంటున్నారని చెప్పారు. బుధవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ చేపట్టిన 11 విడతల జ్వర బాధితుల గుర్తింపు సర్వేలో 2,72,240 మందిని గుర్తించి శాంపిళ్లు పరీక్షించగా 33,262 మంది కరోనా పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. రాష్ట్రంలో 2 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయని, జాతీయ సగటు కంటే ఎక్కువగా ఏపీలో టెస్టులు నిర్వహించామన్నారు. మిలియన్ జనాభాకు ఏపీలో 3.75 లక్షల పరీక్షలు చేయగా, దేశవ్యాప్తంగా 2.67 లక్షల టెస్టులు చేశారన్నారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. 1,09,69,000 డోసుల పంపిణీ.. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,09,69,000 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని సింఘాల్ తెలిపారు. ఒక డోసు తీసుకున్నవారు 58 లక్షల మంది ఉండగా 25,87,000 మంది రెండు డోసులు పూర్తైన వారు ఉన్నట్లు చెప్పారు. పలు కంపెనీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసిన వ్యాక్సిన్లలో ఇంకా 16,54,000 డోసులు రావాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ కోటా కింద జూన్ నెల వరకూ 51,40,000 డోసులు రావాల్సి ఉందన్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో 104 కాల్ సెంటర్‌కు ఫోన్ కాల్స్ కూడా తగ్గుతున్నాయని తెలిపారు. 104 కాల్ సెంటర్ ద్వారా సేవలు అందించడానికి పలువురు వైద్యులు ముందుకొస్తున్నారన్నారు. ఇప్పటి వరకూ 5,012 మంది వైద్యులు పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోగా వారిలో స్పెషలిస్టులు 951 మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం రోజువారీ 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించగా గత 24 గంటల్లో 497 మెట్రిక్ టన్నులను డ్రా చేసుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,955 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా 114 మంది మృతి చెందారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,301 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పొసకొనజోల్ ఇంజక్షన్లు, మాత్రలు సరిపడా అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయన్నారు. చదవండి: నేడు ఢిల్లీకి సీఎం జగన్ -
టెస్టులు, వ్యాక్సిన్‌లో ఏపీ సరికొత్త రికార్డు
సాక్షి, అమరావతి: మహమ్మారి వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో నియంత్రణలోకి వస్తోంది. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలు కఠినంగా అమలవుతున్నాయి. ఈ కరోనా కట్టడిలో.. వ్యాక్సిన్ పంపిణీలో ఏపీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కరోనా పరీక్షలు ఇప్పటివరకు 2 కోట్ల మందికిపైగా చేసినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఏపీలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయని చెప్పారు. అమరావతిలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏకే సింఘాల్ మీడియాతో మాట్లాడారు. మే 16వ తేదీన పాజిటివిటీ రేటు 25.56% ఉండగా ప్రస్తుతం 9.37%గా ఉందని, రెట్టింపు స్థాయిలో పాజిటివ్ రేటు తగ్గిందని వివరించారు. ఇప్పటివరకు 1.09 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించారు. జులై 10వ తేదీ నాటికి ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ పూర్తి చేస్తామని ఏకే సింఘాల్ ప్రకటించారు. చదవండి: ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సిన్ -
‘ఏపీలోనే కాదు.. యూపీలో కూడా బిడ్లు దాఖలు కాలేదు’
సాక్షి,అమరావతి: వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నా బిడ్లు దాఖలు చేయలేదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఏపీలో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. నిబంధనల ప్రకారం బిడ్ల దాఖలుకు మరో 2 వారాల గడువిస్తామని చెప్పారు. అయితే గడువిచ్చినా బిడ్లు దాఖలవుతాయన్న నమ్మకం లేదన్నారు. ఏపీలోనే కాదు యూపీలో కూడా బిడ్లు దాఖలు కాలేదని వెల్లడించారు. కాగా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సీఎంలందరికీ సీఎం జగన్ లేఖలు తెలిపారు. చదవండి: ‘ఈ రోజు రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని రోజు’ -
14 మెడికల్ కాలేజీలు.. దేశంలోనే ప్రథమం: సింఘాల్
సాక్షి, విజయవాడ: ఒకే సారి 14 మెడికల్ కాలేజీలకు శంఖుస్థాపన చేయడం దేశంలో ఇదే ప్రథమం అని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూని జూన్ 10 వరకు పొడిగించాం. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు సడలింపులు యధావిధిగా ఉంటాయి’’ అన్నారు. ‘‘రాష్ట్రంలో కోవిడ్ కేసులు బాగా తగ్గాయి. గడిచిన 24 గంటలలో 83, 461 శాంపిల్స్ పరీక్షించాం. 7,943 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 98 మంది కోవిడ్ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐసీయూ బెడ్స్- 1,461, ఆక్సిజన్ బెడ్స్ 6,323 అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లో 15,106 వేలమంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల్లో రెమిడెసివర్ ఇంజక్షన్లు 1,75,000 డోసులు జిల్లాలలో అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ఆక్సిజన్ 591 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగించాం. గతంతో పోలిస్తే ఆక్సిజన్ వినియోగం కూడా బాగా తగ్గింది. 104 కాల్ సెంటర్ కి వచ్చే కాల్స్ సంఖ్య తగ్గింది’’ అన్నారు. ‘‘రాష్డ్రంలో ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్ కేసులు1179 నమోదవ్వగా.. ఇందులో 14 మంది ఇప్పటివరకు మృతి చెందారు. 97 మంది ట్రీట్ మెంట్ పొంది కోలుకున్నారు. ఇక బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో 1139 మందికి కోవిడ్ వచ్చిన వారు ఉన్నారు. మరో 40 మందికి కరోనా రాకుండానే బ్లాక్ ఫంగస్ వచ్చింది. బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ఉపయోగించిన వారు 370 అయితే ఆక్సిజన్ ఉపయోగించని వారు- 809 కాగా.. 687 మంది స్టెరాయిడ్స్ ఉపయోగిస్తే, 492 మంది స్డెరాయిడ్స్ ఉపయోగించలేదు. ఇక బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో 743 మంది డయాబెటిస్ పేషేంట్స్ ఉన్నారు. బ్లాక్ ఫంగస్‌కి అవసరమైన మందులు కేంద్రం కేటాయిస్తోంది’’ అని తెలిపారు. ‘‘ప్రైవేట్ ఆసుపత్రులలో 14,924 మంది కోవిడ్ బాధితులుంటే ...ఇందులో 8,902 మంది ఆరోగ్యశ్రీ లో చికిత్స పొందుతున్నారు. అన్ని ఆసుపత్రులలో 78 శాతం ఆరోగ్యశ్రీలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 88 శాతం, విజయనగరంలో 81 శాతం ఆరోగ్యశ్రీలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే కేసులు తగ్గుతున్నాయి’’ అని సింఘాల్ తెలిపారు. ఇక్కడ చదవండి: 14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చదవండి: చిన్న పిల్లల్లో కోవిడ్ చికిత్స విధానానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ -
ఏపీలో కొత్తగా 7,943 కరోనా కేసులు
-
రాష్ట్రంలో కరోనా పీక్ స్టేజ్‌కు వెళ్లి తగ్గింది: అనిల్ కుమార్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కర్వ్ 25.56 శాతం మేర పీక్ స్టేజీకి వెళ్లి.. ప్రస్తుతం 17 శాతానికి తగ్గింది.. యాక్టీవ్ కేసులు 2.11 లక్షలకు వెళ్లి.. ప్రస్తుతం 1.74 లక్షలకు దిగాయి అని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అన్ని జిల్లాల్లో కరోనా కేసులు తగ్గాయి.. మేం చేస్తోన్న వారపు సమీక్షలో కూడా తగ్గుదల కన్పిస్తోంది అన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు అవసరమైన ఇంజక్షన్లను కేంద్రమే కేటాయిస్తోంది. కేంద్రం నుంచి 7,725 యాంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్లు వచ్చాయి. పొసాకొనోజోల్ ఇంజక్షన్లు 1,250 వచ్చాయి.. మరో 50 వేల ఇంజక్షన్లు ఆర్డర్ ఇచ్చాం. పొసాకొనోజోల్ టాబ్లెట్స్ వచ్చిన మేరకు జిల్లాలకు కేటాయిస్తున్నాం’’ అన్నారు. ‘‘గత ఐదు రోజులుగా ఆక్సిజన్ వినియోగం గణనీయంగా తగ్గింది. గతంలో పీక్ స్టేజీలో 640 టన్నుల ఆక్సిజన్ వినియోగించాం. ప్రస్తుతం ఆక్సిజన్ వినియోగం 510 టన్నులకు తగ్గింది. ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాల్సిందే. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే సబ్సిడీ ఇస్తాం.. విద్యుత్ రాయితీలు అందిస్తాం’’ అని అనిల్ కుమార్ తెలిపారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 66 ఆస్పత్రులపై విజిలెన్స్ విభాగం నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వీటిల్లో ఇప్పటికే చాలా ఆస్పత్రులకు పెనాల్టీ విధించాం. అలాగే వైద్యారోగ్య శాఖలో నమోదైన కేసులు వేరేగా ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స తీసుకుని చనిపోయినా సరే అనాథలైన పిల్లలకు రూ. 10 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తాం. వ్యాక్సినేషన్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయి’’ అని అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు. చదవండి: జిల్లాలకు 3 వేల బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు -
చిన్న పిల్లల్లో కోవిడ్ చికిత్స విధానానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 12 ఏళ్లలోపు చిన్న పిల్లలకు కోవిడ్–19 సోకితే అనుసరించాల్సిన చికిత్సా విధానం, నియంత్రించడం కోసం ఒక స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది సభ్యులతో ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్ చైర్మన్‌గా ఏపీఎండీసీ చైర్మన్ డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి వ్యవహరించనుండగా, సభ్య కన్వీనర్‌గా ఏపీహెచ్ఎస్ఎస్పీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ ఐఏఎస్ వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా డాక్టర్లు ఎం.రాఘవేంద్రరావు, సాయిలక్ష్మి, అరుణ్‌బాబు, సర్దారా సుల్తానా, చంద్రశేఖర్‌రె డ్డి, రఘువంశి చిత్ర ఉన్నారు. చిన్న పిల్లల్లో కోవిడ్ లక్షణాలున్నప్పుడు వైద్య విధానాలు, ఇందుకు వైద్య సిబ్బంది, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ వంటి ప్రోటోకాల్స్‌ను టాస్క్ ఫోర్స్ రూపొందిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల గుర్తింపునకు కమిటీ ప్రైవేటు ఆస్పత్రుల గుర్తింపు, నిబంధనల పర్యవేక్షణ కోసం కమిటీని ఏర్పాటు చేసూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి ఎక్స్అఫిషియో చైర్మ న్గా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ప్రత్యేక ప్రధానకార్యదర్శి/ ముఖ్యకార్యదర్శి/ కార్యదర్శి ఉంటారు. ఆరోగ్య శాఖ కమిషనర్ సభ్య కార్యదర్శిగా ఉండే ఈ కమిటిలో న్యాయ, స్త్రీ శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమ శాఖలకు చెందిన డిప్యూటీ కార్యదర్శులతో పాటు వివిధ వైద్య సంఘాలు, సంక్షేమ సంఘాలకు చెందిన 10 మంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు. -
ఆరోగ్యశ్రీలో ఉచితం.. మిగిలిన వారికి ప్రభుత్వ ధరలే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలో వైద్యం అందించాల్సిన పేషెంట్ల నుంచి డబ్బు వసూలు చేస్తే ఆయా ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ హెచ్చరించారు. ఇటీవలే వివిధ వైద్య వర్గాలు, ఆస్పత్రుల యాజమాన్యాలను సంప్రదించి చికిత్సకు రేట్లు పెంచామని, వీటిని కూడా కాదని పేషెంట్ల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు డబ్బు వసూలు చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. దీనిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీ బిల్డింగ్‌లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే పలు ఆస్పత్రులకు జరిమానా విధించామన్నారు. రోజూ నోడల్ అధికారులు ప్రైవేటు ఆస్పత్రులను పర్యవేక్షిస్తారని తెలిపారు. పలువురు నిపుణులు, వైద్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత చిన్నపిల్లల్లో కేసులు వస్తే ఎలాంటి వసతులు కల్పించాలన్న దానిపై కమిటీ వేశామన్నారు. వెంటిలేటర్లు, ప్రత్యేక వార్డులు, మరికొన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని, దీన్నిబట్టి అన్ని ఆస్పత్రుల్లో ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో లాక్డౌన్ సరిగా అమలు కానందునే పల్లెల్లో కేసులు పెరుగుతున్నాయని రాయడం అవగాహన రాహిత్యమన్నారు. పట్టణాల్లో 1.46 కోట్ల జనాభా, పల్లెల్లో 3.49 కోట్ల జనాభా ఉందని చెప్పారు. తాజాగా వచ్చిన కేసులను బట్టి చూస్తే లక్ష జనాభాకు పల్లెల్లో 248, పట్టణాల్లో 383 కేసులు వచ్చాయన్నారు. మే 16 నుంచి 22 వరకు వారం రోజుల గణాంకాల్లో ఈ మేరకు తేలిందన్నారు. ఆ వారంలో 1,42,707 కేసులు నమోదయ్యాయని, వాటిలో పట్టణాల్లో 56,058, గ్రామాల్లో 86,649 కేసులు ఉన్నాయని వివరించారు. కేసుల్ని జనాభా ప్రాతిపదికన లెక్కించాలని, అది అవగాహన లేక కొన్ని పత్రికల్లో పల్లెల్లో ఎక్కువగా కేసులు వస్తున్నట్టు రాశారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఎక్కువమంది నియామకం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వైద్యశాఖలో 1,448 మందిని ఎక్కువగా నియమించినట్లు చెప్పారు. గత ఏడాది 17,315 మందిని నియమించగా, ఈ ఏడాది 18,763 మందిని నియమించినట్టు తెలిపారు. ఇందులో మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్సులు అందరూ ఉన్నారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 23.81 లక్షల మందికి రెండు డోసులు, 36.49 లక్షల మందికి ఒక డోసు టీకా వేసినట్లు చెప్పారు. 1.41 లక్షల కోవాగ్జిన్, 13.88 లక్షల కోవిషీల్డ్ స్టాకు ఉందన్నారు. కోవాగ్జిన్ సెకండ్ డోసు వారికి, కోవిషీల్డ్ మొదటి డోసు వారికి వాడతామన్నారు. సోమవారం నాటికి ఆనందయ్య మందుపై స్పష్టత ఆనందయ్య మందు నమూనాలు హైదరాబాద్ ల్యాబొరేటరీకి, సెంట్రల్ ఆయుర్వేదిక్ ల్యాబొరేటరీకి వెళ్లాయని చెప్పారు. సోమవారం నాటికి దీనిపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ మందుల్లో వాడిన దినుసుల మిక్సింగ్ ఎలా ఉంది, మందు వాడితే నష్టం ఉందా, ఫలితాలు ఏమేరకు కనిపించాయి అన్నదానిపై మందు వాడిన వారినుంచి సమాచారం కూడా సేకరిస్తున్నారని, దీనిపై స్పష్టత రాగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఒకేరోజు రికార్డు స్థాయిలో 812 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రంలో సెకండ్‌వేవ్‌లో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఒకేరోజు 812 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తీసుకొచ్చామన్నారు. కేంద్రం మనకు 590 మెట్రిక్ టన్నులే కేటాయించినా అడ్‌హక్ ప్రాతిపదికన ఎక్కువ తీసుకొస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వారం రోజులుగా చూస్తే కేసులు తగ్గుతున్నాయని, ఐసీయూ, ఆక్సిజన్ పడకల లభ్యత చూస్తే ఇది అర్థమవుతుందని చెప్పారు. తాజాగా 3,552 ఆక్సిజన్ పడకలు, 812 ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. రోజురోజుకు అడ్మిషన్లు తగ్గుతున్నాయని, డిశ్చార్జిలు పెరుగుతున్నాయని తెలిపారు. చదవండి: కేంద్రం ఇవ్వట్లేదు.. మేమే కొంటున్నాం యాస్ బలహీనం: తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు వర్షాలే -
45 ఏళ్లు దాటిన వారికే వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలుత 45 ఏళ్లు నిండిన వారికి కోవిడ్ టీకాలు వేయడం పూర్తయ్యాకే 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారికి ఇస్తామని, ఇది ప్రభుత్వ నిర్ణయమని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయని చెప్పారు. నేటి నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 3 రోజుల పాటు వేయనున్నామన్నారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పరిధిలో కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఉంటే ఇష్టారాజ్యంగా ఎక్కువ రేట్లు వసూలు చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సీఎం కేంద్రానికి లేఖ రాశారన్నారు. కొన్ని గ్రూపులు అంటే రైల్వే, ఆర్టీసీ, పోర్ట్‌లు, బ్యాంకులు, సివిల్ సప్లై, పాత్రికేయులు వంటి విభాగాల్లో ఉన్న వారికి వ్యాక్సిన్ వేయాలని చెప్పామన్నారు. సింఘాల్ ఇంకా ఏమన్నారంటే.. ► తుపాన్ ప్రభావం కారణంగా ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది ఎదురవ్వకుండా అప్రమత్తంగా ఉన్నాం. రూర్కెలా, జామ్‌నగర్ వంటి చోట్ల నుంచి 70 మెట్రిక్ టన్నుల చొప్పున సేకరించాం. ► మూడు రోజులుగా టెస్టులు తగ్గించకున్నా కేసులు రోజుకు వెయ్యి లెక్కన తగ్గుతూ వస్తున్నాయి. పడకల లభ్యత పెరిగింది. 104కు వచ్చే కాల్స్ తగ్గాయి. ఇవన్నీ చూస్తే కరోనా కాస్త నెమ్మదిస్తున్నట్టు తెలుస్తోంది. బ్లాక్ ఫంగస్ కేసుల కోసం వెయ్యి ఇంజక్షన్లు వచ్చాయి. మరిన్ని వస్తున్నాయి. ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ► కృష్ణపట్నం మందుపై ఆయుష్ విభాగం నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆ మందులో హానికారక దినుసులేవీ లేవని చెప్పారు. ప్రతి ఊళ్లో సంప్రదాయ మందులు వాడుతుంటారు. వాటికి అనుమతులు అవసరం లేదు. అయితే ఈ మందును ఆయుర్వేద మందుగా గుర్తించాలంటే పరిశీలించాల్సి ఉంటుంది. ► రాష్ట్రంలో ఇప్పటి వరకు 78,78,604 మందికి వ్యాక్సిన్ వేశాం. 1.55 లక్షల డోసులు కోవాగ్జిన్, 11.58 లక్షల డోసులు కోవిషీల్డ్‌ను జిల్లాలకు పంపించాం. 23.38 లక్షల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయింది. జూన్ 15 వరకు మన దగ్గర ఉన్నది, కేంద్రం ఇచ్చేది అంతా కలిపితే 28.56 లక్షల డోసులు అవుతుంది. -
రాష్ట్రంలో పాజిటివ్ రేట్ తగ్గింది: అనిల్ కుమార్ సింఘాల్
-
‘కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై నివేదిక రావాల్సి ఉంది’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రుల్లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలో రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 23,685.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 18,094 రెమిడెసివిర్స్ అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే అన్ని జిల్లాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 918 ఐసీయూ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో కొత్తగా 18,767 కరోనా కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,109 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా, రాబోయే మూడురోజులు ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు సింఘాల్ తెలిపారు. అలాగే కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్‌కు అవసరమైన మందులను జిల్లాలకు సరఫరా చేస్తున్నామన్నారు. కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై నివేదిక రావాల్సి ఉందని పేర్కొన్నారు. -
డీఆర్డీవో మందుల కొనుగోలు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 చికిత్స కోసం డీఆర్డీవో అభివృద్ధి చేసిన మందులు కొనుగోలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా శనివారం జరిగే కొనుగోలు కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన వెల్లడించారు. మంగళగిరిలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అవసరాల నిమిత్తం మే నెలలో 13,41,700 కోవిషీల్డ్ డోసులను, 3,43,930 కోవాగ్జిన్ డోసులను సొంతంగా కొనుగోలు చేశామని తెలిపారు. మే నెలలో 16.85 లక్షల డోసులు, జూన్ నెలకు సంబంధించి 14.86 డోసులు కలిపి మొత్తం 31.71 లక్షల డోసులు కొనుగోలు చేశామని వివరించారు. ఆయుర్వేద మందు ఫలితాలపై శాస్త్రీయ అధ్యయనం కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయతపై పూర్తి వివరాలు అందజేయాలని రాష్ట్రస్థాయి అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని సింఘాల్ చెప్పారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు కృష్ణపట్నం వెళ్లి అక్కడి వారితో మాట్లాడటమే కాకుండా ఆయుర్వేద మందును హైదరాబాద్‌లోని ల్యాబ్‌లో పరీక్షలు కూడా చేయించారన్నారు. ఇందులో నష్టం కలిగించే వివరాలు తెలియరాలేదన్నారు. ప్రజలు నమ్ముతున్నా.. సైంటిఫిక్‌గా రుజువు కావాల్సి ఉందన్నారు. ఆయుష్ కమిషనర్, కొందరు సాంకేతిక అధికారులు ప్రస్తుతం కృష్ణపట్నంలోనే ఉన్నారని, మందును వినియోగించిన కరోనా బాధితులతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఆయుర్వేద మందు తయారీ విధానాన్ని రాష్ట్ర అధికారులకు శనివారం స్థానిక తయారీదారులు వివరిస్తారన్నారు. విజయవాడలో ఉన్న ఆయుర్వేద విభాగం ప్రాంతీయ అధికారులు కొందరు సోమవారం కృష్ణపట్నం వెళ్లి శాస్త్రీయ పద్ధతిలో పరిశోధన జరుపుతారని చెప్పారు. ఆ తరువాతే దీని ఫలితాలపై అవగాహన వస్తుందన్నారు. 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగం రాష్ట్రవ్యాప్తంగా 6,408 ఐసీయూ బెడ్లు ఉండగా.. 5,889 కరోనా బాధితులతో నిండాయని తెలిపారు. ఆక్సిజన్ బెట్లు 23,876 బెడ్లు ఉండగా.. 22,492 బెడ్లు రోగులతో నిండాయన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో 18 వేల మంది చికిత్స పొందుతున్నారన్నారు. రోజువారీ కేటాయింపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గడచిన 24 గంటల్లో 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగించుకున్నట్టు తెలిపారు. గడచిన 24 గంటల్లో ప్రభుత్వాస్పత్రుల్లో 24,352, ప్రైవేట్ ఆస్పత్రులకు 16,713 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు సరఫరా చేశామన్నారు. 10 రోజుల క్రితం వరకు కాల్ సెంటర్‌కు 18 వేల ఫోన్ కాల్స్ వరకూ వచ్చేవని, ఇపుడా సంఖ్య తగ్గుముఖం పట్టిందని తెలిపారు. గడచిన 24 గంటల్లో 10,919 ఫోన్ కాల్స్ రాగా.. అందులో 3,508 కాల్స్ వివిధ సమాచారాలకు సంబంధించి ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ కింద 77 శాతం మందికి ఉచిత వైద్యం కోవిడ్ నియంత్రణకు చేపడుతున్న కార్యక్రమాల వివరాలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్షా నిర్వహించారని సింఘాల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్పత్రుల్లో 38,763 మంది చికిత్స పొందుతుండగా, వారిలో 28,189 మంది (77 శాతం) ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం పొందుతున్నారన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 23,03,655 మందికి రెండు వ్యాక్సిన్ డోసులు ఇచ్చామని, 30,48,265 మందికి ఒక డోసు ఇచ్చామని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి 1,33,532 మందికి కోవాగ్జిన్ రెండో డోసు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేంద్రం నుంచి మే 15 నుంచి జూన్ 15 వరకూ 11,18,000 డోసులు రావాల్సి ఉందన్నారు. -
అనాథ పిల్లల పేరున రూ.10 లక్షల డిపాజిట్: సింఘాల్
సాక్షి, అమరావతి: కరోనా బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు బుధవారం ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరుపై ప్రభుత్వం రూ.10 లక్షల డిపాజిట్ చేయనుందని తెలిపారు. ఆ మొత్తంపై వచ్చే వడ్డీని ప్రతినెలా లబ్దిదారులకు అందించేలా కార్యాచరణ రూపొందించినట్లు సింఘాల్ తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో 21,493 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆక్సిజన్ రోజువారి గరిష్ట వినియోగం 650 మెట్రిక్ టన్నులు కాగా అందుబాటులో 635 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు చెప్పారు. ఆక్సిజన్ రవాణా కోసం 78 ట్యాంకర్లు, 14 చిన్న ట్యాంకర్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. 4+2 ఐఎస్ఓ ట్యాంకర్లు కలిగిన 2 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇందులో ప్రతి ట్యాంకర్‌కు 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సామర్థ్యం ఉంటుందని తెలిపారు. ఏపీలో కొత్తగా 23,160 కరోనా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 1,01,330 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 23,160 మందికి పాజిటివ్‌గా నిర్థారణ కాగా 106 మరణాలు సంభవించాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 24,819 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 12,79,110 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 2,09,736 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,82,41,637మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో కరోనా బారినపడి మరణించినవారి వివరాలు.. చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున.. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున.. అనంతపురం, గుంటూరు, విశాఖ, ప.గో.జిల్లాల్లో 8 మంది చొప్పున.. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున.. నెల్లూరు జిల్లాలో ఐదుగురు.. వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు.. శ్రీకాకుళం- 1466, విజయనగరం- 965, విశాఖ- 2368 కేసులు, తూ.గో- 2923, ప.గో- 1762, కృష్ణా- 1048, గుంటూరు- 1291 కేసులు, ప్రకాశం- 785, నెల్లూరు- 1251, చిత్తూరు- 2630 కేసులు, అనంతపురం- 2804, కర్నూలు- 991, వైఎస్ఆర్ జిల్లా- 1036 కేసులు నమోదయ్యాయి. చదవండి: ఏపీలో కొత్త మెడికల్ ఆక్సిజన్ పాలసీ -
సీఎం జగన్ విజ్ఞప్తి మేరకు 19న రాష్ట్రానికి ఆక్సిఎక్స్ప్రెస్ట్రైన్: ఎ.కె.సింఘాల్
-
అవాస్తవాలు నమ్మొద్దు: ఎ.కె.సింఘాల్
సాక్షి, అమరావతి: కరోనా కేసులపై ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని.. రూమర్స్‌ను నమ్మొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కర్ఫ్యూ టైమింగ్సులో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 85 శాతం ఫీవర్ సర్వే పూర్తి అయ్యిందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐసీయూ బెడ్స్ 744, ఆక్సిజన్ బెడ్లు 551 అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఏపీలో ఎక్కడా బెడ్స్ కొరత లేదన్నారు. ఫీవర్ సర్వేలో 90 వేల మంది కరోనా అనుమానితులను గుర్తించామన్నారు. కరోనా ట్రీట్మెంట్ ప్రొటోకాల్‌లో ప్లాస్మా థెరపీని పెట్టలేదని.. ప్లాస్మా థెరపీని ప్రోత్సహించవద్దని జిల్లా అధికారులకు సూచిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘రెమిడిసివిర్ ఇంజెక్షన్లు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. బ్లాక్ ఫంగస్ చికిత్సకు కావాల్సిన మెడిసిన్ కొరత ఉంది. అవసరమైన మేరకు తెప్పిస్తున్నాం. త్వరలోనే సమస్యను అధిగమిస్తామని’’ ఎ.కె.సింఘాల్ పేర్కొన్నారు. చదవండి: రఘురామకృష్ణరాజు వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం: సజ్జల ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మొహం చాటేసిన చంద్రబాబు -
కరోనా కేసులపై ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు: ఎ.కె.సింఘాల్
-
ఏపీలో ఇప్పటివరకు 1,80,49,054 మందికి కరోనా పరీక్షలు
-
ఏపీలో ప్రస్తుతం 2,10,436 యాక్టివ్ కేసులు
-
రెండు రోజుల్లో అదనంగా 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి రెండు రోజుల్లో అదనంగా 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందని వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇది కేంద్ర ప్రభుత్వం రోజు వారీ కేటాయిస్తున్న 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌కు అదనమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయాలను అన్వేషించి ఆక్సిజన్ నిల్వలను పెంచేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నుంచి 2 ట్యాంకుల్లో 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందన్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి కృష్ణపట్నం పోర్టులకు ఆ ట్యాంకర్లు చేరుకోనున్నాయన్నారు. జామ్ నగర్ నుంచి మరో 110 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రైలు మార్గంలో ఆదివారం నాటికి గుంటూరుకు రానుందని తెలిపారు. జమ్షెడ్పూర్ నుంచి మరో 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందన్నారు. రెండు రోజుల్లో మొత్తం 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి రానుందని ఆయన తెలిపారు. కేంద్రం ఇచ్చే ఆక్సిజన్‌తో పాటు అదనంగా రానున్న ఆక్సిజన్‌ను రాష్ట్రంలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లో నిల్వ చేయడం ద్వారా అత్యవసర సేవలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఇవే కాకుండా మరో రెండు మూడు ట్యాంకర్లు దుర్గాపూర్ నుంచి రానున్నాయన్నారు. దీనివల్ల రాయలసీమ జిల్లాలకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. అదనపు ఆక్సిజన్‌ను ప్రతి జిల్లాలో 10 నుంచి 20 టన్నుల వరకు నిల్వ చేస్తామని, రోజు వారీ వచ్చే ఆక్సిజన్‌లో ఎక్కడైనా జాప్యం జరిగితే ఈ నిల్వలను వినియోగిస్తామని స్పష్టం చేశారు. 24 గంటల్లో 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ► గడిచిన 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందింది. చెన్నై ప్లాంట్‌లో ఇబ్బందులు రావడంతో ఐదారు రోజుల పాటు ఏపీకి రావాల్సిన ఆక్సిజన్ సరఫరా నిలిచిపోనుందని నిన్న (గురువారం) అర్ధరాత్రి సమాచారమిచ్చారు. ► వెంటనే అధికారులు కేంద్రంతో మాట్లాడారు. ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక అధికారులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సమస్యను పరిష్కరించారు. పెరుగుతున్న డిశ్చార్జిలు ► రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జిల సంఖ్య పెరుగుతుండటం శుభపరిణామం. దేశ వ్యాప్తంగా చూస్తే రాష్ట్రంలో మరణాల శాతం తక్కువగా ఉంది. ► రాష్ట్రంలో 6,453 ఐసీయూ బెడ్లలో 6,006 మంది రోగులు ఉన్నారు. 447 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 23,204 ఆక్సిజన్ బెడ్లలో 22,029 మంది బాధితులు ఉన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 16,597 మంది చికిత్స పొందుతున్నారు. ► గడిచిన 24 గంటల్లో ఇదివరకెన్నడూ లేని విధంగా ప్రైవేట్ ఆస్పత్రులకు పెద్ద మొత్తంలో 18,410 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను సరఫరా చేశాం. ప్రభుత్వాసుపత్రుల్లో 19,349 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. గత 24 గంటల్లో 104 కాల్ సెంటర్‌కు 13,868 ఫోన్లు వచ్చాయి. ఇందులో వివిధ సమాచారాల నిమిత్తం 5,444, అడ్మిషన్లకు 3,018, కరోనా టెస్టులకు 2,914, టెస్ట్ రిజల్ట్ కోసం 1,886 ఫోన్ కాల్స్ వచ్చాయి. ► రాష్ట్రంలో వ్యాక్సిన్ సెకండ్ డోస్‌ల పంపిణీ ఎలాంటి రద్దీ లేకుండా సాఫీగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కొవాగి్జన్ వ్యాక్సిన్ల గురించి ఎదురు చూడకుండా, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను సెకండ్ డోస్ గడువు ముగియక ముందే వేస్తున్నామన్నారు. నేటి నుంచి జ్వరాలపై ఇంటింటి సర్వే ► కరోనాను కట్టడి చేయడంలో భాగంగా శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇంటింటికీ వెళ్లి జ్వర పీడితులను గుర్తించే సర్వే ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్ర అధికారులు, జిల్లా వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఇంటింటి సర్వేపై దిశా నిర్ధేశం చేశారు. ► జర్వ పీడితులను గుర్తించి అక్కడికక్కడే మందులు, కరోనా కిట్లు అందజేయనున్నారు. దీనివల్ల కరోనాను కట్టడి చేయడమే కాక, ఆస్పత్రులపై ఒత్తడి కూడా తగ్గనుంది. -
అన్ని జిల్లాల్లో వ్యాక్సిన్ సెకండ్ డోస్ కొనసాగుతోంది: సింఘాల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వ్యాక్సిన్ సెకండ్ డోస్ కొనసాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్లలో 16,597 మందికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. జాంనగర్ నుంచి గుంటూరుకు 110 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందని, జంషెడ్పూర్ ద్వారా 4 ట్యాంకర్లలో 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానున్నట్లు తెలిపారు. 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అదనంగా రాబోతుందన్నారు. జిల్లాల వారీగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో ఫీవర్ కిట్లు అందిస్తామని, బెడ్స్ దొరకని పరిస్థితిలో కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించాలని సూచించినట్లు తెలిపారు. చదవండి: ఏపీలో కొత్తగా 22,018 కరోనా కేసులు, 96 మరణాలు -
ఏపీలో కొత్తగా 22,018 కరోనా కేసులు, 96 మరణాలు
-
ఏపీలో ఇప్పటివరకు 1,77,02,133 మందికి కరోనా పరీక్షలు
-
ఏపీలో ప్రస్తుతం 1,97,370 యాక్టివ్ కేసులు: అనిల్ కుమార్ సింఘాల్
-
విదేశీ వ్యాక్సిన్ల కొనుగోలుకైనా సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలను కోవిడ్ నుంచి విముక్తి కల్పించేందుకు విదేశాల్లో ఎక్కడైనా వ్యాక్సిన్ లభిస్తే కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకోసం గ్లోబల్ టెండర్లకు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. వ్యాక్సిన్ లభ్యత ఉంటే ఇప్పటికిప్పుడు రూ. 1,600 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర సర్కారు సన్నద్ధంగా ఉందన్నారు. సోమవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. వ్యాక్సిన్ లభ్యత మొత్తం కేంద్రం చేతుల్లోనే ఉందని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ కూడా దాఖలు చేసిందని తెలిపారు. అందుకే కేంద్రం నుంచి అనుమతులన్నీ తీసుకుని బయట దేశాల నుంచి వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని కూడా చూస్తున్నామన్నారు. వ్యాక్సిన్ దొరికితే నెలలోగా అందరికీ వేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. దీంతో పాటు కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను ఇంకోచోట ఎక్కడైనా వేరే యూనిట్లలో ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉన్న వ్యాక్సిన్‌ను ముందుగా రెండో డోసు వారికి, ఆ తర్వాత 45 ఏళ్లు దాటిన వారికి మొదటి డోసు వేసేలా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. వ్యాక్సిన్‌పై ఉన్న వాస్తవాలను వివరిస్తూ తాము చేస్తున్న విజ్ఞప్తిని ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. నేటి నుంచి కోవిడ్ సేవల్లో ఎంబీబీఎస్ విద్యార్థులు రాష్ట్రంలో సోమవారం నాటికి 648 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సలు అందిస్తున్నామని సింఘాల్ తెలిపారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 47,444 పడకలు అందుబాటులో ఉంటే అందులో ప్రస్తుతం 24,645 పడకల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స పొందుతున్నారన్నారు. దీనిపై ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని కలెక్టర్లకు సూచించామని చెప్పారు. కోవిడ్‌కు ఇంత భారీ స్థాయిలో ఉచితంగా చికిత్స చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్, పీజీ, బీఎస్సీ నర్సింగ్, హౌస్ సర్జన్స్, ఎంఎస్సీ నర్సింగ్ విద్యారి్థనులను కోవిడ్ సేవలకు వినియోగించుకోవాలని నిర్ణయించామని, మంగళవారం నుంచి ఈ ప్రక్రియ అమలు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదని, సోమవారం నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24,273 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న 6,508 మందికి సలహాలు గడిచిన 24 గంటల్లో 104 కాల్‌సెంటర్‌కు 16,663 కాల్స్ వచ్చాయని సింఘాల్ తెలిపారు. ఈ కాల్సెంటర్లో టెలీకన్సల్టెన్సీ సేవలు అందించడానికి 3,496 మంది వైద్యులు రిజిస్టర్ చేసుకున్నారని, ఇందులో 600 మంది స్పెషలిస్టులూ ఉన్నారని పేర్కొన్నారు. వీరు సోమవారం హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్న 6,508 మందితో మాట్లాడి వైద్యపరమైన సూచనలు ఇచ్చారన్నారు. కోవిడ్ కోసం ఇప్పటికే 17వేల మందిని పైగా నియమించామని, మరింత మంది నియామకం త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్దాస్పత్రుల దగ్గరలో ప్రైవేటు భవనాలు, లేదా జర్మన్ హ్యాంగర్స్ టెక్నాలజీతో కూడిన ఏర్పాట్లు చేసి తక్షణమే కనీసం 50 బెడ్లైనా ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, వైద్యం కోసం ఆస్పత్రి ఆవరణంలో ఎవరూ కనిపించకూడదని కలెక్టర్లకు సూచించామని తెలిపారు. మంగళవారం జరిగే స్పందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కలెక్టర్లతో కోవిడ్‌పై వివరాలు తెలుసుకుంటారని, బుధవారం కోవిడ్ నియంత్రణకు నియమించిన మంత్రుల కమిటీ సమావేశం జరుగుతుందని సింఘాల్ చెప్పారు. -
‘వ్యాక్సిన్ల కొరత.. డబ్బులిచ్చి కొందామన్న లభించడం లేదు’
సాక్షి, అమరావతి: ఆరోగ్య శ్రీ ద్వారా కోవిడ్ బాధితులకు వైద్యం అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో సెకండ్ డోస్ వారికి మాత్రమే టీకాలు వేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం నుంచి స్టాక్ వచ్చిన వెంటనే అందరికీ వ్యాక్సిన్లు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కోటా ప్రకారం రాష్ట్రాలకు కేంద్రమే వ్యాక్సిన్లు సరఫరా చేస్తోందన్నారు. డబ్బులిచ్చి కొందామన్న లభించని పరిస్థితి నెలకొందని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమిడెసివిర్ అందుబాటులో ఉందని, ప్రైవేటు ఆస్పత్రులకు కూడా రెమిడెసివిర్ సరఫరా చేస్తున్నాని పేర్కొన్నారు. కోవిడ్ కాల్ సెంటర్ ద్వారా బాధితులకు అండగా నిలుస్తున్నామన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ.. వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. చదవండి: బాబు, లోకేష్ అసలు వ్యాక్సిన్ వేయించుకున్నారా..? -
వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో సెకండ్ డోస్వారికి మాత్రమే టీకాలు
-
సరఫరా పెరిగితే 18 ఏళ్లు దాటిన వారికీ వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అనుకున్న రీతిలో ఉత్పత్తి లేనందున జాప్యం జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. కేంద్రం ఇచ్చేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు నిర్ణయించిందన్నారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు అనుమతి పొందిన ఆస్పత్రులన్నింటిలో ఆరోగ్యశ్రీ పడకలపై కలెక్టర్లు కసరత్తు చేస్తున్నారని చెప్పారు. సోమవారం సాయంత్రానికి ఎన్ని పడకలు వస్తాయి.. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం ఎంత మందికి చేయొచ్చు అన్నది తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా గణనీయంగా పెంచామని తెలిపారు. 330 మెట్రిక్ టన్నుల నుంచి 561 టన్నుల వరకు పెంచామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించిందన్నారు. రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ ఎక్కడా కొరత లేదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24,861 ఇంజక్షన్లు ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకూ 104 కాల్ సెంటర్‌కు 2 లక్షలకు పైగా కాల్స్ వచ్చాయన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ కేవలం రెండో డోసు వారికి మాత్రమే వేయాలని కలెక్టర్లను ఆదేశించామని, ఆ తర్వాత డోసుల రాకను బట్టి అందరికీ వేస్తామన్నారు. మనకు రానున్న డోసులను 45 ఏళ్లు పైబడిన వారికి ఇస్తామని, రెండ్రోజుల్లో కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి అందిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. కోవిడ్ డ్యూటీ చేసిన వారికి వెయిటేజీ రాష్ట్రంలో కోవిడ్ డ్యూటీలు చేసిన వారికి శాశ్వత నియామకాల్లో వెయిటేజీ ఇచ్చినట్టు తెలిపారు. 6 మాసాలు డ్యూటీ చేసిన వారికి 5 మార్కులు, ఏడాది చేస్తే 10 మార్కులు, ఏడాదిన్నర చేస్తే 15 మార్కులు ఇచ్చామన్నారు. కష్టకాలంలో పని చేసిన వీళ్లందరికీ నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. -
రూ.310 కోట్లతో ఆక్సిజన్ వ్యవస్థ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ సరఫరా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఆక్సిజన్ వ్యవస్థ మౌలిక వసతుల కోసం రూ.309.87 కోట్లు కేటాయిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.180.19 కోట్లతో 49 చోట్ల ఆక్సిజన్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ 49 చోట్ల సివిల్, ఎలక్ట్రికల్ పనుల కోసం రూ.25.80 కోట్లు కేటాయించారు. ఆక్సిజన్ సరఫరా కోసం రూ.46.08 కోట్లతో 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేయనున్నారు. అదనంగా 10,000 ఆక్సిజన్ పైప్లైన్ల నిర్మాణం కోసం రూ.50 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను ప్రత్యేకంగా ఒక కాంట్రాక్టరుకు అప్పగిస్తారు. ఈ సంస్థ ఆరు నెలల పాటు ఈ యూనిట్ నిర్వహణ, మరమ్మతులను చూడాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి జిల్లాకు నెలకు రూ.10 లక్షల చొప్పున ఆరు నెలలకు రూ.60 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ఈ విధంగా మొత్తం ఆరు నెలలకుగాను ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు రూ.7.80 కోట్లు వ్యయం అవుతుంది. ఆక్సిజన్ యూనిట్లు ఏర్పాటు చేసే బాధ్యతను ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అప్పగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. పర్యవేక్షణ ఇన్చార్జ్గా స్పెషల్ సీఎస్ కరికాల ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ ఇన్చార్జ్గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ దిగుమతిని ఆయన పర్యవేక్షిస్తారు. లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాపై దృష్టి సారించనున్నారు. -
ఆస్పత్రిల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నాం
-
ఏ రాష్ట్రానికి లేనంతగా ఏపీలో వాలంటీర్ వ్యవస్థ
-
'వ్యాక్సినేషన్ విషయంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం'
సాక్షి, విజయవాడ: దేశ వ్యాప్తంగా జనవరి 16న వ్యాక్సినేషన్ పక్రియను కేంద్రం ప్రారంభించిందని.. వ్యాక్సినేషన్ విషయంలో మనం ఆదర్శంగా నిలిచామని ఏపీ వైద్యారోగ్య ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ''ఏపీలో ఒక్కరోజే 6 లక్షల 29 వేల వ్యాక్సినేషన్లు వేసి మిగిలిన రాష్ట్రాలు కంటే ఆదర్శంగా నిలిచాం. మన వ్యాక్సినేషన్ కెపాసిటీ ప్రధానికి వివరించాము. వారంలో నాలుగు రోజులు 25 లక్షలు వ్యాక్సినేషన్ వేసే విధంగా, నెలకు కోటి వ్యాక్సిన్ కావాలని సీఎం కేంద్రానికి లేఖ రాశారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్, డాక్టర్లు, 45 ఏళ్ళు పైబడిన 73,49,960 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 53,58,712 మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తవ్వగా... 17,96,691 మందికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేశాం. రాష్ట్రంలో మరో 35 లక్షలు మందికి పైగా సెకండ్ డోస్ ఇవ్వాలి'' అని తెలిపారు. చదవండి: కరోనా వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య శ్రీ పథకం సంజీవనీ -
472 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ట్రాన్స్‌ఫోర్ట్ చేశాం
-
రాష్ట్రంలో రెమిడేసివిర్ కొరత లేదు: అనిల్ కుమార్ సింఘాల్
-
మే 15న రాష్ట్రానికి 9 లక్షల టీకా డోసులు: సింఘాల్
సాక్షి, మంగళగిరి: ఏపీలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 20,034 నిర్ధారణ కాగా, 82 (.41 %) మరణాలు సంభవించాయి. తాజాగా ఏపీలో పాజిటివ్ రేటు 17.3 శాతంగా ఉంది. 24 గంటల్లో 1,17,784 పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలో 533 ఐసీయూ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. కోవిడ్ రిపోర్ట్ మంగళవారం విడుదల చేశారు. 21,857 ఆక్సిజన్ బెడ్స్ ఉంటే 20,017 నిండిపోయాయని తెలిపారు. 104 కాల్ సెంటర్‌కు 16,856 కాల్స్ వచ్చాయని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 9 లక్షలు వ్యాక్సిన్ డోసులు ఈనెల 15వ తేదీలోపు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. వ్యాక్సినేషన్లో మీడియా, బ్యాంక్ సిబ్బందికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. రెమిడెసివర్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో 14,030 రెమిడెసివర్ డోసులు ఇచ్చామని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 21,898 డోసెస్ అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే 12 వేలు రెమిడెసివర్ డోసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 446 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశామని, 3 ట్యాంకర్లు ఈరోజు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. కోవిడ్ తీరుపై రేపు మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం జరగనుందని అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆయా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, కోవిడ్ కేసులు , పేషేంట్స్‌ను కోవిడ్ కేర్ సెంటర్స్ తరలింపుపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: వ్యాక్సిన్‌పై ప్రధానికి లేఖ రాయనున్న సీఎం జగన్ -
కరోనా కట్టడి కోసం ఎల్లుండి నుండి 144 సెక్షన్ అమలు
-
ఒడిశా నుండి ఏపీకి విమానాల్లో ఆక్సిజన్ రప్పిస్తున్నాం
-
Anil Kumar Singhal: మేలో 13 లక్షలకు పైగా డోసులు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకు మే నెలకు సంబంధించి 13 లక్షలకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు. వాటిలో 9,91,700 కోవిషీల్డ్, 3,43,930 కోవాగ్జిన్ వ్యాక్సిన్ డోసులు ఉంటాయన్నారు. వీటిని ఏపీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, దీనికోసం ఆ రెండు కంపెనీలతో మాట్లాడుతున్నామని, త్వరలోనే కొనుగోలు చేస్తామని చెప్పారాయన. ధరల విషయం ఆ కంపెనీలతో ఇంకా చర్చించలేదన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సింఘాల్ మాట్లాడారు. గత 24 గంటల్లో 86,494 కోవిడ్ శాంపిళ్లు టెస్టు చేయగా, 17,354 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 64 మరణాలు సంభవించాయని చెప్పారు. నేటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,63,90,360 టెస్టులు చేయగా, 11,01, 690 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలియజేశారు. ‘‘మొత్తంగా పాజిటివిటీ రేటే 6.72 శాతంగా ఉంది. రోజు వారీగా చూస్తే గత 24 గంటల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో 15,291 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను అందుబాటులో ఉన్నాయి. వాటిలో వివిధ కంపెనీలకు చెందిన 9,646 ఇంజక్షన్లను ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కొనుగోలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం 5,645 ఇంజక్షన్లను ఇచ్చింది. గురువారం (29.4.2021) నాటికి ప్రభుత్వాసుపత్రుల్లో 29 వేల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అందివ్వగా, శుక్రవారం 30,559 ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాం. నిజానికి లక్షణాలున్న వారంతా తొలుత ఆసుపత్రుల్లో చేరిపోయారు. ఎక్కువ లక్షణాలున్న వారికే ఇప్పుడు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. తక్కువ లక్షణాలున్నవారిని కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించి సేవలందిస్తున్నాం’’ అని వివరించారు. 45 ఏళ్లు పైడిన వారికే వ్యాక్సిన్‌లో ప్రాధాన్యం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వ్యాక్సిన్‌ను 45 ఏళ్ల పైబడిన వారికి వినియోగిస్తున్నామని సింఘాల్ తెలిపారు. ‘‘రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారు 1.48 కోట్ల మంది, 18 – 45 ఏళ్ల వారు 2.04 కోట్ల మంది ఉన్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పూర్తవ్వాలంటే 3 కోట్ల డోసులు కావాలి. ఇప్పటికి రాష్ట్రానికి 55 లక్షల డోసులు రాగా వాటిని 45 ఏళ్లు దాటినవారికి ఇచ్చాం. వారికి ఇంకా 2.5 కోట్ల డోసులు కావాలి. కాబట్టి వారికి ఇచ్చాకే ఇతర వయసు వారికిస్తే బాగుంటుందన్నది ముఖ్యమంత్రి జగన్ ఆలోచన. ఎందుకంటే వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న 70 ఏళ్ల వృద్ధులకు... 18 ఏళ్ల పిల్లలతో పోలిస్తే కోవిడ్ ముప్పు ఎక్కువ. వారికి సోకితే పిల్లల మాదిరి తేలిగ్గా కోలుకోలేరు. ఆ ఉద్దేశంతోనే కదా ప్రధానమంత్రి మొదట పెద్దలకు టీకా ఇవ్వాలని నిర్దేశించారు. మరి వారికి పూర్తికాకుండా చిన్నవారికి ఇస్తే ఆ ఉద్దేశం నెరవేరదు కదా అన్నదే ముఖ్యమంత్రి ఆలోచన. అందుకే ఈ అంశాలన్నిటినీ వివరిస్తూ ఆయన ప్రధానమంత్రికి లేఖ కూడా రాయబోతున్నారు’’ అని సింఘాల్ వివరించారు. ఈ నేపథ్యంలో మే 1 నుంచి కూడా 45 ఏళ్లు దాటినవారికే ప్రాధాన్యమిస్తామని, వారికి పూర్తయ్యేదాకా 18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి రాష్ట్రంలో టీకా ఇవ్వబోవటం లేదని తెలియజేశారు. 104 కాల్ సెంటర్ కు పెరిగిన తాకిడి... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 104 కాల్ సెంటర్ ను బలోపేతం చేశామని, సిబ్బందని నియమించామని సింఘాల్ తెలిపారు. దీంతో శుక్రవారం 104కు ఏకంగా 15వేల కాల్స్ వచ్చాయన్నారు. గతంలో రోజుకు 7 వేలు కాల్స్ వచ్చేవని చెప్పారు. వాటిలో 3,698 టెస్టుల కోసం, 3,183 ఆసుపత్రులు, కొవిడ్ కేర్ సెంటర్లలో ఉన్న బంధుల సమాచారం కోసం వచ్చాయన్నారు. 2,672 కొవిడ్ టెస్టు రిజల్ట్ కోసం రాగా, 936 వాక్సినేషన్ నిమిత్తం వచ్చాయని తెలిపారు. టెలీ కాల్ సెంటర్ కు 2,612 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. హోం ఐసోలేషన్ పేషంట్లకు కూడా టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా ఆరోగ్య సేవలు, సలహాలు సూచనలు అందిస్తున్నామన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితుల కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఐఏఎస్ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించామన్నారు. వారికి కిట్లు అందాయా..? మందులు అందుతున్నాయా...? ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోడానికి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పరామర్శిస్తున్నారా..? అనేవిషయాన్ని సదరు అధికారి పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. సొంతంగా ఆక్సిజన్ ట్యాంకర్ల కొనుగోలు... కరోనా బాధితులకు తక్షణమే ఆక్సిజన్‌ను అందజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ట్యాంకర్లను కొనుగోలు చేయనున్నట్లు సింఘాల్ చెప్పారు. గడిచిన 24 గంటల్లో 437 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేశామన్నారు. రోజు వారీగా కేంద్రం రాష్ట్రానికి 470 టన్నులను కేటాయించిందన్నారు. వీటిని పెంచాలని కోరుతున్నామన్నారు. పెట్రోలియం కంపెనీలకు చెందిన ట్యాంకర్లను లిక్విడ్ ఆక్సిజన్ రవాణాకు వాడుకోవాలని కేంద్ర ప్రభుత్వ కమిటీ చెప్పిందన్నారు. దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాలకు 9 ట్యాంకర్లు కేంద్ర కమిటీ కేటాయించగా, వాటిలో 2 ట్యాంకర్లను ఆంధ్రాకు అందజేయనుందని, త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఇక కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కొవిడ్ కేర్ సెంటర్లను బలోపేతం చేశామని ఆయన వెల్లడించారు. చిత్తూరులో 6 కొవిడ్ కేర్ సెంటర్లు ప్రారంభించగా, అందులో 2,636 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. గుంటూరులో 1,376 మంది, కర్నూలులో 1,313 మంది కొవిడ్ కేర్ సెంటర్లలో ఉన్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 7,749 మంది కొవిడ్ కేర్ సెంటర్లలో ఉన్నారన్నారు. వచ్చే రెండు రోజుల్లో ఈ సంఖ్య 15 వేల మందికి చేరుకోచ్చునని అంచనా వేస్తున్నామన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో రోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతోందన్నారు. -
గతంలో కంటే ఎక్కువ ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చాం
-
ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌తో ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు
-
రికవరీలో ఏపీ బెస్ట్
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తృతంగా వ్యాపిస్తోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య (రికవరీ రేటు) చాలా రాష్ట్రాల్లో భారీగా పడిపోయింది. జాతీయ సగటు రికవరీ రేటు 84కు పడిపోయింది. అయితే చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రికవరీ రేటు బాగున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో రికవరీ రేటు గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 92.53 శాతంగా ఉంది. క్షేత్రస్థాయిలో భారీగా వ్యాక్సిన్ వేయడం, ఫీవర్ సర్వే చేసి బాధితులను గుర్తించడం, ఆస్పత్రుల పునరుద్ధరణ, హోం ఐసొలేషన్ కిట్ల పంపిణీ వంటి వాటి కారణంగా కరోనా బాధితులు త్వరగానే కోలుకుంటున్నారు. దీన్నిబట్టి కొంతమేరకు జాగ్రత్తలు తీసుకుంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని, ప్రజలు కొద్ది రోజులు జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారి బారి నుంచి బయట పడవచ్చునని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. -
తప్పుడు కథనాలు రాస్తే పరువు నష్టం దావా తప్పదు: అనిల్ కుమార్ సింఘాల్
-
అసత్య కథనాలతో ఆందోళన సృష్టించొద్దు
సాక్షి, అమరావతి: కోవిడ్‌పై అసత్య కథనాలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించవద్దని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ సూచించారు. గురువారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. రెండు పత్రికల్లో గుంటూరు జిల్లాలో కోవిడ్ వల్ల చనిపోయినట్లుగా రాశారని, వాస్తవాలు తెలుసుకోకుండా కథనాలు రాయడం దురదృష్టకరమన్నారు. దీన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. అసత్య కథనాలు రాసిన పత్రికలపై రాష్ట్ర ప్రభుత్వం పరువు నష్టం దావా వేస్తుందని, త్వరలో నోటీసులు పంపనున్నట్లు ప్రకటించారు. గుంటూరు జిల్లాలో మృతి చెందిన 92 మందిలో 43 మందికి కరోనా రిపోర్టు నెగిటివ్ గా వచ్చిందని వారిని కూడా కోవిడ్ మృతులుగా ఎలా రాస్తారని ఆ రెండు పత్రికలను ప్రశ్నించారు. పాజిటివ్ కేసులు గానీ, మృతులను కానీ దాయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని, దీనికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్లలో వివరాలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రతి మరణాన్ని సమీక్షిస్తున్నామని, ఎక్కడా దీనిపై దాయాల్సిన పనిలేదని, వీడియో కాన్ఫరెన్స్‌లో రోజూ వీటిపై కలెక్టర్లతో మాట్లాడుతూనే ఉన్నామని చెప్పారు. ఎక్కడైనా లోపాలు జరిగితే సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌కు కొరత లేదని చెప్పారు. ఆక్సిజన్ పైప్‌లైన్‌తో కూడుకున్నవి 26,000 పడకలు అందుబాటులో ఉండగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నది 2 వేల మంది మాత్రమేనని తెలిపారు. రోజుకు 347 కిలోలీటర్ల ఆక్సిజన్ అవసరం ఉండగా 500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉందని వివరించారు. చదవండి: హత్యా..ఆత్మహత్యా?: బాలిక అనుమానాస్పద మృతి భక్తి ముసుగులో మహిళలను లోబర్చుకుని... -
వ్యాక్సిన్‌కు అర్హులు 3.48 కోట్ల మంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు 3.48 కోట్ల మంది అర్హులుగా తేలారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన వారికి మే 1వ తేదీ నుంచి టీకా వేయవచ్చని అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఏ వయసు వారు ఎంతమంది ఉన్నారో లెక్కించింది. వ్యాక్సిన్ వేసేందుకు 3,48,24,227 మంది అర్హులు ఉన్నట్టు తేలింది. వీరిలో 18 నుంచి 45 ఏళ్ల లోపు వారే 2,04,70,364 మంది ఉన్నట్టు నిర్ధారించారు. ఇప్పటివరకు 46,14,577 మంది టీకా వేయించుకున్నారు. వీరిలో 40,15,948 మంది తొలిడోసు వేయించుకోగా, 5,98,629 మంది రెండో డోసు కూడా వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో 60 ఏళ్లు దాటిన వారు 16,43,124 మంది ఉన్నారు. 18 ఏళ్లు దాటిన వారికి మే 1 నుంచి వ్యాక్సిన్ వేయాల్సి ఉండటంతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీలతో మాట్లాడారు. కంపెనీలతో పూర్తిగా చర్చలు జరిపాక ఎన్ని దశల్లో వ్యాక్సిన్ రాష్ట్రానికి వస్తుందో చెబుతామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌సింఘాల్ తెలిపారు. -
రెమ్‌డెసివర్ ధర రూ.2,500
సాక్షి, అమరావతి: కోవిడ్ నివారణకు వినియోగించే రెమ్‌డెసివర్ ఇంజెక్షన్ గరిష్ట ధరను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ బ్రాండులు అందిస్తున్న 100ఎంజీ రెమ్‌డెసివర్ గరిష్ట ధరని రూ.2,500గా నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో ఉన్న ఆస్పత్రులతో పాటు నెట్ వర్క్ పరిధిలో లేని ఆస్పత్రులు కూడా కోవిడ్ పేషెంట్ల నుంచి ఈ ఇంజెక్షన్ ధరను రూ.2,500 మించి వసూలు చేయకూడదని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. -
కోవిడ్ పాజిటివిటీ 0.25 శాతం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.25 శాతంగా నమోదైంది. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు సగటున రోజుకు 69 కేసులు నమోదైనట్టు వెల్లడైంది. ఓవైపు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకల్లో కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ వస్తోందన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం కేసుల సంఖ్య స్థిరంగానే కొనసాగుతోంది. 2020 జూలై, ఆగస్ట్ మాసాల్లో ఒక దశలో రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడా సంఖ్య 70 లోపే నమోదవుతుండటం గమనార్హం. గతంతో పోలిస్తే నమూనాల నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా కాస్త తగ్గింది. కరోనా కేసులు ఉధృతంగా ఉన్న సమయంలో ఒక దశలో రోజుకు 70 వేలకు పైగా టెస్టులు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడా సంఖ్య సగటున రోజుకు 27 వేలుగా నమోదైంది. గతంతో పోల్చితే మృతుల సంఖ్య భారీగా నియంత్రణలోకి వచ్చినట్టు తేలింది. గతంతో పోల్చితే... ► డిసెంబర్లో 112 మంది మృతి చెందగా, జనవరిలో 46 మంది మృతి చెందారు. అదే ఫిబ్రవరిలో కేవలం 15 మంది మాత్రమే చనిపోయారు. ఫిబ్రవరి మాసంలో 7 జిల్లాల్లో ఒక్క మృతి కూడా చోటు చేసుకోలేదు. ► జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు 8,14,606 టెస్టులు చేస్తే 2,074 కేసులు నమోదయ్యాయి. సగటున రోజుకు 69 కేసులు నమోదైనట్టు లెక్క. ► ఇదే డిసెంబర్లో సగటున రోజుకు 462 కేసులు, జనవరిలో 176 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరిలో అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 0.65 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 0.04 శాతం నమోదైంది. ► మొత్తం మీద పాజిటివిటీ రేటు 6.37 శాతంగా ఉంది. రికవరీలో 99.11 శాతంతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. అప్రమత్తంగానే ఉన్నాం ప్రభుత్వ పరంగా అప్రమత్తంగా ఉన్నాం. కేసులు పెరిగినా ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు ప్రత్యేక పడకలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు కూడా కేసులు తగ్గాయని మాస్కులు లేకుండా తిరగకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. జాగ్రత్తగా ఉండటం మంచిది. – అనిల్ కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ -
ఏలూరు ఘటన: తుది నివేదికలో ఏముంది?
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏలూరు ఘటన జరిగిన వెంటనే స్థానిక ల్యాబ్‌లలో నీటి నమూనాలు పరిశీలించగా అందులో ఏం బయట పడలేదని ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఢిల్లీ, మంగళగిరిలోని ఏయిమ్స్, సీసీఎంబీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, విరాలజీ ల్యాబ్ పూణే, డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థల సహకారాన్ని తీసుకుని నమూనాలు పరీక్ష చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మంగళవారం జిల్లాలో మాట్లాడుతూ.. ఏలూరు ఘటనపై తుది నివేదికలు అన్ని చూస్తే సీసీఎంబీ ఇచ్చిన నివేదికలో ఈ వ్యాధికి ఎలాంటి బ్యాక్టీరియా లేదా వైరస్ కారణం కాదని తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. నివేదికలో ఆర్గానో పాస్పోరస్ కాంపౌండ్ ఉన్నట్లు తేలిందని, ఒక హెర్బిసైడ్ కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని తేలిందన్నారు. లెడ్, నికేల్ లాంటి బార లోహాలు ఉన్నట్టు కూడా రక్తం, యూరిన్ నమునాల్లో తేలిందని తెలిపారు. అయితే వీటివల్ల ఇలాంటి వ్యాధి రాదని తేల్చారని పేర్కొన్నారు. చదవండి: మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ బోర్డుకు ఉత్తర్వులు ఆర్గానో క్లోరినో లాంటి రసాయనాలు వల్ల ఈ తరహా వ్యాధి వచ్చే అవకాశం ఉందని, కానీ తీసిన నమునాల్లో ఆ రసాయనం ఆనవాళ్లు కనిపించలేదన్నారు. అతి తక్కువ స్థాయిలో ఈ రసాయనం నమునాల్లో తీసే సమయానికే దాని జీవిత కాలం ముగిసిపోతే అది బయటపడే అవకాశం లేదని ల్యాబ్‌లన్నీ అభిప్రాయం వ్యక్తం చేశాయన్నారు. భార లోహాల వల్ల దీర్ఘ కాలిక దుష్పరిణామాలు ఉండే అవకాశం ఉందని జాతీయ పరిశోధనా సంస్థలు చెప్పాయన్నారు. దీనిపై దీర్ఘకాలికంగా దృష్టి పెట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఏలూరు, పరిసర ప్రాంతాల నీటి వ్యవస్థలు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని ఆహార పదార్థాలు, గాలి నాణ్యత, వినియోగిస్తున్న ఎరువులు, రసాయనాలపై, పారిశ్రామిక వ్యర్ధాలపై అధ్యయనం చేయాల్సి ఉందని అనిల్ కుమార్ పేర్కొన్నారు. దీనికోసం కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలతో ఒప్పందం చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని ఇండో సల్ఫేన్ లాంటి నిషేధిత రసాయనాల వినియోగం ఏమైనా జరుగుతుందా అనే అంశంపై కూడా పరిశోధన చేయాల్సి ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో కూరగాయలు, బియ్యం, పాలు లాంటి వినియోగ వస్తువులపై దీర్ఘకాల దృష్టి పెడతామని తెలిపారు. సాగుకు వినియోగిస్తున్న నీటిని కూడా పరిశోధించాల్సి ఉందని, ఈ ఘటనలు జరిగినప్పుడు మన వద్ద ల్యాబ్‌లు కూడా లేవని అన్నారు. విశాఖ, గుంటూరు, తిరుపతిలలో అన్ని రకాల పరీక్షలు చేసేందుకు ల్యాబ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వచ్చే ఆరు నెలల పాటు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందన్న ఆయన జలవనరుల శాఖకు నుంచి కూడా నివేదిక కోరినట్లు పేర్కొన్నారు. ఏలూరు కాలువలో కలిసే నీటి వ్యర్ధాలు కార్ వాష్, బ్యాటరీల వ్యర్ధాల వల్ల వచ్చే అవకాశం పై పరిశీలన చేయాలని కోరినట్లు తెలిపారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్గానిక్ ఫార్మింగ్ పై కూడా దృష్టి పెడతామని పేర్కొన్నారు. -
పల్స్ పోలియో కార్యక్రమంలో సీఎం జగన్
-
సమన్వయంతో కోవిడ్ టీకా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు త్వరలో చేపట్టనున్న టీకాల ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సూచించారు. తొలి విడతలో కోటి మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కోవిడ్ టీకాలకు సంబంధించి బుధవారం సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తొలివిడతలో ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ కేర్ సిబ్బందితో పాటు ఐసీడీఎస్ వర్కర్లతో కలిపి 3.70 లక్షల హెల్త్‌కేర్ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించనున్నట్లు వివరించారు. పోలీసులు, ఆర్మ్డ్ ఫోర్సు, హోంగార్డులు, జైళ్ల సిబ్బంది, విపత్తు నిర్వహణ సంస్థ వలంటీర్లు, సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్, మున్సిపల్ వర్కర్లు, రెవెన్యూ సిబ్బంది తదితర 9 లక్షల మందికి టీకా అందిస్తామన్నారు. 50 ఏళ్లు దాటి షుగర్, బీపీ, క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారికి తొలివిడత కోవిడ్ టీకాల్లో ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు. టాస్‌్కఫోర్స్ కమిటీలు వారానికి ఒకసారి సమావేశమై సమీక్షిస్తాయని చెప్పారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఫిర్యాదులు, సలహాల కోసం ఏర్పాటైన కంట్రోల్ రూమ్‌లు 24 గంటలు పని చేస్తాయన్నారు. 1,677 కోల్డ్ చైన్ పాయింట్లు వ్యాక్సిన్ నిల్వ, సరఫరా, కోల్డ్ చైన్ల నిర్వహణ, ఐస్ బాక్సులు, ప్రీజర్లు తదితర అంశాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎస్ సమీక్షించారు. తొలి విడత వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,677 కోల్డ్ చైన్ పాయింట్లు (వ్యాక్సిన్ స్టోరేజి పాయింట్లు) సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కె.భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. టీకా రవాణా కోసం 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉషో్ట్ణగ్రత ఉండేలా 19 ఇన్సులేటెడ్ వ్యాక్సిన్ వ్యాన్లను సిద్ధం చేశామని, మరో 26 సిద్ధమవుతున్నాయని తెలిపారు. 17,032 మంది వ్యాక్సినేటర్లు (ఎఎన్ఎం), 7,459 ఆరోగ్య ఉప కేంద్రాలను సిద్ధంగా ఉంచామని వివరించారు. పది కోట్ల డోసులకు సరిపడే కోల్డుచైన్ నిర్వహణకు స్థలం ఉందని చెప్పారు. -
ఈ జిల్లాలకు కూడా ఆరోగ్యశ్రీ నూతన చికిత్స విధానం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకంలోకి నూతనంగా చేర్చిన 887 చికిత్సా విధానాలను మిగతా జిల్లాలకు కూడా వర్తింప చేస్తూ వైద్య అరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు కూడా చికిత్సా విధానం వర్తింప చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం అరోగ్య శ్రీ కింద ఉన్న 2200 వైద్య చికిత్సలకు అదనంగా మరో 223 చికిత్సలను కూడా చేరుస్తున్నట్లు ఆయన తెలిపారు. 2020 నవంబర్ 10వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను ఈ వైద్య విధానాలను అమలు చేయాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. ఇక ఈ పథకం కింద జారీ చేసిన ఈ వైద్య చికిత్సా విధానాలతో పాటు నూతనంగా అమలు చేసిన ప్రోటోకాల్స్‌ను దుర్వినియోగం చేయకుండా చూడాల్సిందిగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓను ప్రభుత్వం అదేశించింది. -
రెండేళ్లలో 10,000 మంది నర్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెండు సంవత్సరాల్లో 10 వేల మంది నర్సులను నియమించేందుకు కసరత్తు మొదలైంది. ప్రాథమిక ఆరోగ్యం పరిపుష్టం చేయడంలో భాగంగా సర్కారు ఈ ప్రక్రియను చేపట్టింది. కుగ్రామంలోని ప్రజలకు కూడా ప్రాథమిక వైద్యం అందించాలని, దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఆరోగ్య సిబ్బందిని నియమించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవస్థను రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ (హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు)ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలన్నింటినీ వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్గా ఉన్నతీకరిస్తున్నారు. మొత్తం 10,030 హెల్త్ కినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 8,615 క్లినిక్స్‌కు కొత్తగా భవన నిర్మాణాలు చేపడుతుండగా, మిగతా వాటికి బిల్డింగ్లు ఉన్నాయి. ► మొత్తం 10,030 హెల్త్ క్లినిక్స్‌లో బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులను నియమిస్తున్నారు. ► ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కొత్తగా చేపడుతున్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌కు జాతీయ హెల్త్ మిషన్ నిధులిస్తోంది. ► ప్రతి కేంద్రంలోనూ ఒక బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థి ఉండాలి. ఇప్పటికే 4,060 మంది నర్సుల నియామకానికి కేంద్రం అనుమతించింది. మిగతా 6 వేల నియామకాలకు త్వరలోనే అనుమతివ్వనుంది. ► ఎంపికైన నర్సులకు ఆరు మాసాలు ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ) నిపుణులు శిక్షణ ఇస్తారు. ► శిక్షణ సమయంలో నర్సులకు స్టైఫండ్‌తో పాటు అకామిడేషన్, భోజన వసతి కల్పిస్తారు. ► కొత్త నిర్మాణాల కోసం రూ.1,745 కోట్లు వ్యయం చేస్తున్నారు. భారతదేశంలో ఎక్కువ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్‌లోనే. ప్రతి హెల్త్‌కినిక్‌కూ పీహెచ్‌సీతో అనుసంధానం చేస్తారు. హెల్త్ క్లినిక్‌లలో 12 రకాల సేవలు ► గర్భిణులకు, చిన్నారులకు ప్రత్యేక సేవలు ► నవజాత శిశువులు టీకాలు ► చిన్నారులు, యుక్త వయసు వారికి వైద్య సేవలు ► కుటుంబ నియంత్రణకు సంబంధించి ప్రత్యేక సేవలు ► సాంక్రమిక వ్యాధులకు గురికాకుండా పటిష్ట చర్యలు ► సాంక్రమిక వ్యాధుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ► మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి రాకుండా చర్యలు తీసుకోవడం ► కన్ను, చెవి సమస్యలను ముందే పరిష్కరించేలా చర్యలు ► సాధారణ ఆరోగ్య సంబంధిత సేవలు ► వృద్ధుల ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు ► అత్యవసర సేవల్లో భాగంగా వైద్యం ► చిన్న చిన్న మానసిక సమస్యలకు ప్రాథమిక దశలోనే స్క్రీనింగ్ ముమ్మరంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం ప్రస్తుతం 8,604 భవన నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ విభాగం ఈ పనులను చేపట్టింది. 5,010 భవనాలు ఎర్త్ వర్క్ దశలో ఉన్నాయి. మరో 1,519 బేస్మెంట్ లెవెల్‌కు వచ్చాయి. వీలైనంత త్వరలో అన్నింటినీ పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం. యథావిధిగా నర్సుల నియామకం చేపడతాం. – అనిల్ కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ -
ఏపీ: స్కూళ్లు, కళాశాలలకు ప్రత్యేక మార్గదర్శకాలు
సాక్షి,అమరావతి: కరోనా రాష్ట్రంలో తగ్గుముఖం పడుతోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే విద్యా సంవత్సరాన్ని చాలా నష్టపోయిన నేపథ్యంలో స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు హెడ్మాస్టర్లు, టీచర్లనూ అప్రమత్తం చేశామని వెల్లడించారు. తల్లిదండ్రులు అనుమతిస్తేనే పిల్లలు స్కూళ్లకు రావాలన్నారు. కొద్ది రోజులపాటు మధ్యాహ్నం వరకే స్కూళ్లు ఉంటాయన్నారు. చదవండి: మొదటి నెల రోజులు హాఫ్ డే స్కూళ్లు ఆ తర్వాత పరిస్థితిని బట్టి పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నామని, కోవిడ్ నేపథ్యంలో రెండ్రోజుల్లో ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్న ఇళ్ల నుంచి పిల్లలు స్కూళ్లకు వస్తుంటే ఆ ఇళ్లనూ రోజూ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పర్యవేక్షించాలన్నారు. స్కూళ్లు తెరిచాక 15 రోజుల పాటు నిశితంగా పరిశీలిస్తామని వెల్లడించారు. దీన్ని బట్టి కోవిడ్ నియంత్రణపై భవిష్యత్ ప్రణాళిక ఉంటుందన్నారు. జిల్లా స్థాయిలో స్కూళ్లల్లో పరిస్థితులపై కలెక్టర్లతో టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశామని వివరించారు. కోవిడ్ టెస్టులను మరింతగా పెంచుతామన్నారు. చదవండి: రైతుబజార్లలో రూ.40కే కిలో ఉల్లి -
కరోనాపై స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్ష
సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆర్అండ్బీ భవన మీటింగ్ హాలులో నిర్వహించిన ఈ సమావేశంలో వైద్యారోగ్య ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కొవిడ్ తాజా పరిస్థితిని ఆయనకు జవహర్‌రెడ్డి వివరించారు. కరోనా కట్టడికి చేపట్టిన కార్యక్రమాలను ఏకే సింఘాల్ తెలుసుకున్నారు. సమావేశంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండ విజయరామరాజు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఇవో డాక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. -
శారదా పీఠాధిపతులను కలిసిన టీటీడీ ప్రతినిధులు
సాక్షి, తిరుపతి: రిషికేశ్‌లో విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలను ఆదివారం టీటీడీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా స్వామీజీలకు శ్రీవారి శేష వస్త్రంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో ధర్మారెడ్డికి స్వామీజీ ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా స్వామీజీలు చేపట్టిన చాతుర్మాస్య దీక్ష వివరాలను టీటీడీ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు ధార్మిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. (చదవండి: కాగ్ ద్వారా టీటీడీ ఆడిటింగ్..!) తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక అంశాలను కాగ్ పరిధిలోకి తీసుకొచ్చే యోచన ఆహ్వానించదగ్గ పరిణామమని స్వామి స్వరూపానందేంద్ర అభినందించారు. అలాగే గుడికో గోవు కార్యక్రమం చేపట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ ధార్మిక నిర్ణయాలపై సాంప్రదాయ గురువులను సంప్రదించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో భజన మండళ్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయాలను ముఖ్య నగరాలతో పాటు హరిజన, గిరిజన ప్రాంతాల్లోనూ నిర్మించాలని స్వరూపానందేంద్ర సూచించారు. -
శ్రీవారి హుండీలో బంగారు బిస్కెట్లు..
సాక్షి, తిరుమల: టీటీడీ ఆస్తులపై పూర్తి అధ్యయనం తర్వాత శ్వేత పత్రం విడుదల చేస్తామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని, ప్రస్తుతం బ్రహ్మోత్సవాలకు టెండర్లు పిలిచామని ఈవో వెల్లడించారు. వివాదాలకు తావులేకుండా పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన తర్వాతే శ్వేత పత్రం విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జూన్ 11నుంచి జూలై 10 వరకు హుండి ఆదాయం రూ.16.73 కోట్లు వచ్చిందని ఈవో తెలిపారు. భక్తులు సమర్పించిన తలనీలాల విలువ పెరగడంతో రూ.7కోట్లు అదనంగా ఆదాయం వచ్చిందని వెల్లడించారు. కాగా, తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి హుండిలో ఓ అజ్ఞాత భక్తుడు బంగారు బిస్కెట్లు విరాళంగా వేశారు. ఒక్కొక్కటి 100 గ్రాములు ఉన్న 20 బంగారు బిస్కెట్లను సమర్పించిన విషయం వెలుగు చూసింది. -
తిరుపతి: 11 నుంచి దర్శనాలకు అనుమతి..
సాక్షి, తిరుమల : ఈ నెల 11 నుంచి తిరుమల దర్శనానికి భక్తులను అనుమతినిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలో మూడు రోజులపాటు వైభవంగా జరిగిన జేష్టాభిషేకం నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా అనిల్ సింఘాల్ మాట్లాడుతూ.. ఉత్సవ విగ్రహాలు పటుత్వం కోసమే జేష్ఠమాసంలో జేష్టాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. దూరప్రాంతాల భక్తులెవ్వరూ తొందరపడి తిరుమలకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని వస్తే ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. కౌంటర్ల ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు ఇస్తుండటంతో తిరుపతిలో టికెట్లు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. దర్శనాలు ప్రారంభం అయ్యాక అవసరాన్ని బట్టి మార్పులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. (నిజం కాదు: అక్రమం అంతకంటే కాదు!) -
పరీక్షల తర్వాతే భక్తులను కొండపైకి అనుమతి
-
8 నుంచి ఆన్లైన్లో టికెట్లు: టీటీడీ ఈవో
సాక్షి, తిరుమల : లాక్డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు నెలలకు పైగా నిలిచిపోయిన భక్తుల దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరిగి పునఃప్రారంభిస్తోంది. తొలుత ఈనెల 8 నుంచి టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో మూడ్రోజులపాటు ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ పద్ధతిలో దర్శనాలను టీటీడీ ప్రారంభించనుంది. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. అనంతరం అనిల్‌కుమార్ సింఘాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 8 నుంచి ఆన్లైన్లో శ్రీవారి దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆన్లైన్లో రోజుకు మూడు వేల టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. (ప్రతిరోజూ 7 వేల మందికి మాత్రమే దర్శనం) ఆన్లైన్లో దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన వారికి గదులు కేటాయిస్తామని పేర్కొన్నారు. సరి, బేసి పద్దతిలో గదుల కేటాయింపు ఉంటుందని, ఒక్కో రూమ్‌లో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. గ్రామ సచివాలయాల్లో కూడా ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సూచించారు. క్యూలైన్లో విధులు నిర్వహించే వారికి పీపీఈ కిట్లు ఇస్తామన్నారు. బస్సులతో పాటు భక్తుల లగేజీని కూడా పూర్తిగా శానిటైజ్ చేస్తామన్నారు. ప్రతీ రెండు గంటలకు ఒకసారి లడ్డూ కౌంటర్లను మారుస్తామని తెలిపారు. రోజూ ర్యాండమ్‌గా 200 మంది భక్తులకు పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్షల తర్వాతే కొండపైకి అనుమతినిస్తామన్నారు. ప్రస్తుతానికి కల్యాణకట్ట వద్దకు అనుమతి లేదన్నారు. హుండీ, అన్నప్రసాదం దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఈవో సూచించారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా పరిమితంగానే భక్తులకు అనుమతిస్తామన్నారు. తిరుమలలో గడువు దాటిన వస్తువులు తొలగిస్తామన్నారు. కేంద్రం నిబంధనల పర్యవేక్షణకు సీనియర్ అధికారులు నియమిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. సిఫార్సు లేఖలకు అనుమతి లేదు: ధర్మారెడ్డి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే శ్రీవారి భక్తులు ఆయా రాష్ట్రాల అనుమతితోనే టికెట్లు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. 24 గంటలు పర్యవేక్షిస్తూ భక్తుల దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఉదయం గంట మాత్రమే ప్రోటోకాల్ వీఐపీఎలకు అనుమతి ఉంటుందన్నారు. సిఫార్సు లేఖలకు అనుమతి లేదన్నారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు ప్రస్తుతానికి అనుమతి లేదని ధర్మారెడ్డి పేర్కొన్నారు. -
కనరో శ్రీవారి దర్శన భాగ్యము
తిరుమల శ్రీవారి దర్శన ఏర్పాట్లుపై టీటీడీ యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తోంది. లాక్డౌన్ తరువాత శ్రీవారి దర్శనానికి భక్తులను ఏ విధంగా అనుమతించాలనే దానిపై లోతైన కసరత్తు చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించే విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న టీటీడీ ఇందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లుకు పూనుకుంది. సాక్షి, తిరుమల: భక్తులను శ్రీవారి దర్శనానికి సామాజిక దూరంతో అనుమతించాలని, సంఖ్యను దాదాపుగా కుదించేందుకు టీటీడీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల 28న టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించి దర్శనాలకు సంబంధించి విధి విధానాలతో కూడిన నిర్ణయాన్ని తీసు కోనుంది. ఈ విధి విధానాలతో ప్రయో గాత్మకంగా టీటీడీ ఉద్యోగులతో మొదలుపెట్టేందుకు అధికార యంత్రాంగం నిర్ణయించింది. గంటకు 500 మంది చొప్పున దర్శనానికి అనుమతించనున్నారు. తర్వాత తిరుమల, తిరుపతిలో ఉన్న స్థానికులను 10 నుంచి 15 రోజులు పాటు దర్శనానికి అనుమతించేందుకు సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి రోజూ స్వామివారికి నిత్య కైంకర్యాల సమయం మినహాయిస్తే 14 గంటలు స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ దర్శనానికి అనుమతించే భక్తులు సంఖ్యను 7 వేలకు పరిమితం చేయనున్నారు. ప్రయోగాత్మాక పరిశీలన పూర్తయ్యాక స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించే అవకాశం కల్పిస్తోంది. చదవండి: 22న సీఎం చేతుల మీదుగా ఆన్లైన్లో దర్శన టికెట్లు? శ్రీవారి దర్శనానికి భక్తులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినపక్షంలో టీటీడీ వారికి అవసరమైన దర్శన టికెట్లను ఆన్లైన్లో కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన స్లాట్ల విధానాలను కూడా అధికారులు సిద్ధం చేశారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ ద్వారా కేటాయించి టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అలిపిరి వద్ద అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలిపిరి, నడకమార్గంలో భక్తులను క్షుణంగా తనిఖి చేసిన అనంతరమే దర్శనానికి అనుమతిస్తారు. ప్రతి భక్తుడినీ ధర్మల్ స్కానింగ్ చేయడంతో పాటు శానిటైజేషన్ చేయనున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించేలా నిబంధనలు అమలు చేయనున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రిసెప్షన్ కేంద్రాలలో 50 ఏళ్ల లోపు ఉద్యోగులను డిప్యూటేషన్‌పై నియమించాలని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. తిరుమలలో వ్యాపారస్తులు తీసుకోవలసిన జాగ్రత్తలను టీటీడీ నిర్దేశించనుంది. దర్శన విధివిధానాలపై ఇప్పటికే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి సమీక్షించారు. ఈ నెల 28న నిర్వహించనున్న టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. -
ప్రభుత్వ నిర్ణయం మేరకే శ్రీవారి దర్శనం
సాక్షి, తిరుమల: మే 3 తరువాత లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. బుధవారం రాత్రి శ్రీవారి ఏకాంత సేవలో ఆయన పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. మే 3 తరువాత టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి శ్రీవారి దర్శనానికి సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. అలాగే, తిరుమలలో మే 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించతలపెట్టిన శ్రీపద్మావతి పరిణయోత్సవాలను వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ ఉత్సవానికి కనీసం 70 మంది అవసరం పడుతుందని,సామాజిక దూరం పాటించాల్సిన ప్రస్తుత సమయంలో ఇది కష్టతరమన్నారు. శార్వరి నామ సంవత్సరంలో ఎప్పుడైనా ఈ ఉత్సవాలను నిర్వహించుకునే అవకాశం ఉన్నందున తదుపరి భక్తులందరి సమక్షంలోనే ఉత్సవాలను నారాయణగిరిలో వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. -
కరోనాపై టీటీడీ అప్రమత్తం
సాక్షి, తిరుపతి : భారత్‌లో కరోనా వైరస్ సోకుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతన్న నేపథ్యంలో టీటీడీ ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తిరుమల, అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో అనుమానితుల గుర్తింపునకు పరికరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఈ క్రమంలోనే శుక్రవారం అలిపిరి టోల్ గేట్ వద్ద టీడీపీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డిలు కరోనా నివారణ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అలాగే ప్రతి 2 గంటలకోసారి తిరుమలలో పరిశుభ్రత చర్యలు చేపట్టనున్నట్టు టీటీడీ పేర్కొంది. తిరుమల, తిరుపతిలో కరోనా వైరస్ అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. మరోవైపు కరోనా ఆందోళనల నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో ఏప్రిల్ 7న నిర్వహించే కోదండరామస్వామి కళ్యాణన్ని రద్దు చేసే యోచనలో టీటీడీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వేడుకకు లక్ష మందికి పైగా భక్తులు హాజరుకానున్నడంతో.. కళ్యాణం నిర్వాహణకు సంబంధించి ప్రభుత్వానికి లేఖ రాసినట్టు సింఘాల్ తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అనుమతించకపోతే ఆలయంలోనే సింపుల్‌గా స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని చెప్పారు. -
ఉగాదికి ముందే పంచాంగం
సాక్షి, తిరుమల: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో కొలువుదీరిన కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 14 నుంచి 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరపనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 11, 25 తేదీల్లో వయోవృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఈ నెల 12, 26వ తేదీల్లో 5 సంవత్సరాల్లోపు చంటిబిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనానికి అనుమతి కల్పిస్తాని పేర్కొన్నారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా సేవా టిక్కెట్లు పొందాలని సూచించారు. టీటీడీ వెబ్సైట్లో టికెట్లు లేనట్లయితే ఇతర సైట్లలో ఉన్న టికెట్లు నకిలీవిగా భావించాలని తెలిపారు హెచ్చరించారు. ఇక నకిలీ వెబ్సైట్లు నిర్వహిస్తున్న 19 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. కాగా తెలుగు పండుగ ఉగాదిని పురస్కరించుకుని మార్చి మొదటి వారంలోనే భక్తులకు పంచాగాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం
సాక్షి, తిరుమల: బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన సేవలందించిన టీటీడీ, వివిధ శాఖల సిబ్బందిని అభినందించారు. రద్దీ ఎక్కువగా ఉన్నా.. భక్తులు సమయనం పాటించి స్వామివారి దర్శనం చేసుకున్నారన్నారు. గత ఏడాది 5.8 లక్షల మంది దర్శనం చేసుకోగా, ఈ ఏడాది 7.7 లక్షల మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారని ఈవో వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే లక్షా 5 వేల మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో 3.23 లక్షల మంది స్వామివారికి తలనీలాలు సమర్పించగా.. గత ఏడాది 2.17 లక్షల మంది తలనీలాలు సమర్పించారని వెల్లడించారు. ఆర్టీసీ ద్వారా 4.24 లక్షల మంది తిరుమలకు చేరుకున్నారని చెప్పారు. ఈ ఏడాది భక్తులకు 34 లక్షల లడ్డూలు అందించగా.. గత ఏడాది 24 లక్షల లడ్డూలు అందించామన్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో 18 రాష్ట్రాల నుండి 357 కళా బృందాలు పాల్గొన్నాయన్నారు. వచ్చే ఏడాది 25 రాష్ట్రాల నుండి ఉన్నత స్థాయి కళాకారులు రప్పిస్తామని ఈవో తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.20 కోట్ల 50 లక్షల 85 వేల హుండీ ఆదాయం వచ్చిందని తెలిపారు. -
సామాన్య భక్తులకూ సంతృప్తికర దర్శనం
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో దేవదేవుడు శ్రీవేంకటే«శ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అత్యంత వైభవపేతంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు 14 రాష్ట్రాల కళాకారులను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈఓ అశోక్‌సింఘాల్ ఇచ్చిన ఇంటర్వ్యూ... బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు మెరుగైన దర్శనానికి తీసుకుంటున్న చర్యలు? శ్రీవారి మూలమూర్తితోపాటు వాహనసేవలను భక్తులు సంతృప్తికరంగా దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేపట్టాం. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలను, ప్రత్యేక దర్శనాలను రద్దు చేశాం. బ్రేక్ దర్శనం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం. గరుడసేవ రోజు (అక్టోబరు 4న) బ్రేక్ దర్శనాలు, అంగప్రదక్షిణ టోకెన్లు రద్దు చేశాం. వాహనసేవలు తిలకించేందుకు మాడ వీధుల్లో చేపట్టిన ఏర్పాట్లు? భక్తులు వాహనసేవలను వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు ఏర్పాటు చేశాం. వాహనసేవలను తిలకించేందుకు మాడవీధులు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో 37 పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం. శ్రీవారి ఆలయంలో కైంకర్యాల నిర్వహణ ఎలా ఉంటుంది? శ్రీవారి ఆలయంలో నిత్యకైంకర్యాలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 9 నుండి 11 గంటల వరకు, రాత్రి వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. క్యూలైన్ వెలుపలికి వెళ్లినపుడు నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లు? నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తులకోసం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశాం. ఇక్కడ వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తాం. షెడ్లకు అనుబంధంగా మరుగుదొడ్ల వసతి కల్పించాం. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 7 లక్షల లడ్డూలు నిల్వ ఉండేలా ప్రణాళిక రూపొందించాం. గరుడసేవనాడు భక్తుల కోసం ప్రత్యేకంగా చేపట్టిన చర్యలు? శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 4న గరుడసేవ రోజున విశేష సంఖ్యలో వచ్చే భక్తుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అక్టోబరు 3 రాత్రి 11 గంటల నుండి అక్టోబరు 5 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్‌రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను రద్దు చేయనున్నాం. ద్విచక్రవాహనాలపై వచ్చే భక్తుల కోసం అలిపిరి పాత చెక్‌పోస్టు, శ్రీవారిమెట్టు వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశాం. తిరుపతిలోని పార్కింగ్ ప్రదేశాల నుంచి తిరుమలకు వెళ్లేలా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశాం. బస్సుల్లో 3 వేల రౌండ్ ట్రిప్పుల ద్వారా దాదాపు 2 లక్షల మందిని తరలిస్తాం. ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు? భక్తులకు ఎలాంటి ఇక్కట్లు తలెత్తకుండా ఉండేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశాం. దాదాపు 1,200మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందితోపాటు 4,200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టాం. మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో 1,650 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశాం. íపీఏసీ–4లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో వీడియోవాల్ ద్వారా పలు ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తాం. భక్తులు ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్లు ఏమైనా ఉన్నాయా? భక్తులు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు టోల్‌ఫ్రీ నంబర్లు 18004254141, 1800425333333కు ఫిర్యాదు చేయవచ్చు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబరు 18004254242ను అందుబాటులో ఉంచాం. తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు ? తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 9 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టాం. తిరుమలలో తిరువేంకటపథం, బాలాజినగర్, కౌస్తుభం ఎదురుగా, రాంభగీచా బస్టాండు, ముళ్లగుంటలోపార్కింగ్ ప్రదేశాలు ఉన్నాయి. తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్, శ్రీవారి మెట్టు వద్ద 5 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశాం. పారిశుద్ధ్యం కోసం చేపట్టిన చర్యలు? అదనపు సిబ్బందిని నియమించారా? తిరుమలలో రోజువారీ మొత్తం 1,088 మంది సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణ. ఆలయ నాలుగు మాడవీధుల్లో పరిశుభ్రత, కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం బ్రహ్మోత్సవాల రోజుల్లో అదనంగా 510 మంది, గరుడసేవ నాడు అదనంగా మరో 1,075 మంది ఏర్పాటు చేయనున్నాం. భక్తులకు ఎక్కడెక్కడ అన్నప్రసాదాలు అందిస్తారు? ఫుడ్ కౌంటర్లు ఎన్ని? బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, కంపార్ట్మెంట్లు, క్యూలైన్లు, కాలిబాట మార్గాల్లో అన్నప్రసాదం, పాలు, అల్పాహార వితరణకు ఏర్పాట్లు. తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో 5 ఫుడ్ కౌంటర్ల ద్వారా అన్నప్రసాదాలు అందిస్తాం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ. వైద్యం కోసం చేపట్టిన చర్యలు? 2 వైద్యకేంద్రాలు, 6 డిస్పెన్సరీలు, 11 ప్రథమ చికిత్స కేంద్రాలు, ఒక మొబైల్ క్లినిక్, 45 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్ సిబ్బంది, 12 అంబులెన్సులతో వైద్యసేవలు అందించనున్నాం. అలాగే వివిధ శాఖల పరిధిలో 3,500 మంది శ్రీవారి సేవకులు, దాదాపు వెయ్యిమంది ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు సేవలందిస్తారు. టీటీడీ కాల్ సెంటర్, వాట్సాప్ నంబరు, ఈ–మెయిల్? టీటీడీ కాల్‌సెంటర్ ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమస్త సమాచారాన్ని భక్తులకు అందించే ఏర్పాటు. కాల్ సెంటర్ నంబరు: 0877–2277777, 2233333. భక్తులు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వీలుగా వాట్సాప్ 9399399399, ఈ–మెయిల్: helpdesk@tirumala.org బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండంగా ఏర్పాట్లు ‘తిరుమల బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశాం. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. టీటీడీకి బ్రహ్మోత్సవాలు నిర్వహించటం సర్వసాధారణమే అయినా, ప్రతి ఏటా నిర్వహణ లోపాలను సమీక్షించుకుని, అవి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాం. గత ఏడాది గరుడోత్సవం రోజున భక్తులు లగేజీని పెట్టుకున్న ప్రాంతం చేరుకోవటానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాం. ఈసారి వాహనాల పార్కింగ్ ఏర్పాట్లకు ఎక్కువ స్థలం కేటాయించాం. గోగర్భం నుంచి నారాయణగిరి వరకు రింగ్ రోడ్డు వచ్చింది. అక్కడ పార్కింగ్‌కు ఎలాంటి సమస్య ఉండదు. దేవుని కృపతో చిత్తశుద్ధితో నిజాయతీగా కార్యక్రమాలు చెయ్యగలుగుతున్నాం. సీఎం ఆదేశాల మేరకు తు.చ. తప్పకుండా కార్యక్రమాలు చేపడుతున్నాము’ అని టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మారెడ్డి చెప్పిన బ్రహ్మోత్సవాల విశేషాలు ఆయన మాటల్లోనే... టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా... తిరుమలలో పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా టీటీడీ భారీ మార్పులు చేపట్టింది. గతంలో 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు వచ్చేవారు. ప్రస్తుతం 70 వేల నుంచి 80 వేల మంది వరకు భక్తులు ప్రతిరోజూ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. గతంలో 20 వేల నుంచి 30 వేల మందికి అన్నదానం చేసేవాళ్లం. ప్రస్తుతం లక్ష మందికిపైగా భక్తులకు టీటీడీ అన్నదానం చేస్తోంది. క్యూకాంప్లెక్స్‌లో భక్తులకు పాలు, కాఫీ, టీ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. శ్రీవారి సేవకులను నా హయాంలో మొదలు పెట్టాం. ఇప్పుడు వైకుంఠం క్యూకాంప్లెక్స్, రిసెప్షన్, కళ్యాణకట్ట.. ఇలా ఆలయంలోని ప్రతి శాఖలోనూ శ్రీవారి సేవకులను తీసుకుంటున్నాం. ప్రతి రోజూ మూడువేల నుంచి మూడున్నరవేల మంది శ్రీవారి సేవకులు వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపటమే లక్ష్యం ఎల్1, ఎల్2, ఎల్3 పద్ధతిని రద్దుచేసి ప్రొటోకాల్‌కి సమస్య లేకుండా వీఐపీ దర్శనాలు కొనసాగిస్తున్నాం. ప్రతిరోజూ అదనంగా 2 గంటల సమయం సామాన్య భక్తులకు కేటాయిస్తున్నాం. ఈ పద్ధతిలో ప్రముఖులకు ఎక్కడా సమస్య లేకుండా చర్యలు తీసుకుంటూనే దళారీ వ్యవస్థను కట్టడి చేశాం. ప్రస్తుతం 90 శాతం మేరకు దళారీ వ్యవస్థ లేకుండా చర్యలు చేపట్టాం. నిరంతరం తిరుమలలోనే ఉంటూ రిసెప్షన్, కళ్యాణకట్ట, అన్నదానం, వైకుంఠం–1, వైకుంఠం–2 క్యూకాంప్లెక్స్లు, ఆలయంలో రెగ్యులర్‌గా పర్యవేక్షిస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తిరుమలకు రాలేని వారిని దృష్టిలో ఉంచుకుని... తిరుమలకు రాలేని పరిస్థితిలో ఉన్న భక్తులు కూడా స్వామివారి కళ్యాణం చూసి తరించేందుకు అవకాశాలు కల్పిస్తున్నాం. 2004 నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఎస్వీబీసీ చానెల్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా స్వామివారి సేవలను భక్తులకు తెలియజేస్తున్నాం. పరకామణిలో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలనే దానిపై దృష్టి సారించాం. పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత నిర్ణయం తీసుకుంటాం. కాలుష్య రహిత తిరుమల తిరుమల ఎంత పవిత్రమైన క్షేత్రమో అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తిరుమలను ప్లాస్టిక్ రహిత తిరుమలగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. అందులో భాగంగా ఉద్యోగులు ప్లాస్టిక్ బాటిళ్లు, వస్తువులు వాడకుండా రెండు నెలలుగా నియంత్రించాం. అతిథి గృహాల్లో వాటర్ డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తున్నాం. వాటి ద్వారా జల ప్రసాదం నీళ్లను అందించేందుకు ప్రణాళికలు చేపట్టాం. వీఐపీలకు అదే నీటిని గాజు గ్లాసులో అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్లను ఆపేశాం. ప్రస్తుతం వాటర్ బాటిళ్ల కొనుగోలు నిలిపివేశాం. ప్లాస్టిక్ నియంత్రణకు తిరుమలలోని హోటల్స్ యాజమాన్యాలతో సంప్రదింపులు చేపట్టాం. జనతా క్యాంటీన్లలో కూడా ఇదే పద్ధతిని తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చాం. ఇంకా చిన్న చిన్న హోటళ్లు, ఫుడ్ సెంటర్స్ వారితో సమావేశం ఏర్పాటు చేసి ప్లాస్టిక్ రహిత తిరుమలపై అవగాహన కల్పించి, నియంత్రించే ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నదానం కోసం కూరగాయలు, బియ్యం సరఫరా చేసే డోనర్లతో సమావేశం ఏర్పాటు చేశాం. మరింత నాణ్యమైన సరుకులు సరఫరా చెయ్యాలని కోరాం. శ్రీవారి సేవలో అరుదైన అవకాశం శ్రీవారికి సేవ చేసేందుకు నాకు అరుదైన అవకాశం దక్కింది. తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నాలుగు మాఢవీధులు విస్తరణ చేపట్టాం. ప్రైవేటు వారి చేతుల్లో ఉన్న ఆస్తులను సేకరించాం. రెండవసారి అవకాశం వచ్చాక బూందీ పోటును బయటకు తెచ్చాం. అప్పట్లో 40వేల లడ్డు ప్రసాదాలు తయారు చేసేవారు. ఇప్పుడు 4 లక్షల నుంచి 5 లక్షల లడ్డుప్రసాదాలు తయారు చేసే స్థాయికి తీసుకొచ్చాం. మొదట్లో 40వేల నుంచి 45 వేల మంది భక్తులు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉండేది. మహాలఘు దర్శనం ద్వారా లక్ష మందికి పైగా దర్శన ఏర్పాట్లు కల్పించే స్థాయికి తీసుకొచ్చాం. వైకుంఠం–1, వైకుంఠం–2 క్యూ కాంపెక్స్‌లను ఎయిర్ కండిషన్ చేశాం. అతిథి గృహాల్లో 4వేల గదులు ఉండేవి. అటువంటిది 3,500 గదులను అదనంగా నిర్మించగలిగాం. అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారిలో ఉన్న షెడ్ల ఆధునికీకరణ కోసం డోనర్‌ను ఒప్పించాం. త్రీడీ రూపంలో స్వామి వారి నగలు స్వామివారి నగలను అందరూ చూసే అవకాశం ఉండదు. అందుకోసం స్వామి వారి నగలను త్రీడీ ఇమేజ్ చెయ్యనున్నాం. అలాగే మ్యూజియంలో ఆలయ నమూనా కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. అందులో ఆలయ విశేషాలను కళ్లకు కట్టినట్లు చూపించనున్నాం. దీని కోసం డోనర్ కూడా ముందుకు వచ్చారు. మా ప్రయత్నాలు విజయవంతమైతే వచ్చే ఆరునెలల్లోగా స్వామి వారి నగలను త్రీడీ ద్వారా చూపించనున్నాం. టైమ్ స్లాట్‌తో రండి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంటి నుంచి బయలు దేరేటప్పుడే టైమ్ స్లాట్ తీసుకొస్తే దర్శనం సులభతరం. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యనున్నాం. టైమ్ స్లాట్ లేకుండా వస్తే ఆలస్యం అవుతుందని తెలుసుకుని ప్రతి ఒక్కరూ టైమ్ స్లాట్ తీసుకొచ్చేలా చర్యలు చేపట్టనున్నాం. – మోపూరి బాలకృష్ణారెడ్డి, సాక్షి ప్రతినిధి, తిరుపతి. -
టీటీడీ విద్యా సంస్థల అభివృద్ధికి రూ.100 కోట్లు
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను తిరుపతిలోని పరిపాలన భవనంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సోమవారం వెల్లడించారు. సుమారు 8 వేల మంది కాంట్రాక్టు సిబ్బందికి టైమ్‌స్కేల్ ఇచ్చే అంశంపై చర్చ జరిగిందన్నారు. దీనిపై ఫైనాన్స్ కమిటీ పరిశీలించి సూచనలు చేయాల్సిందిగా పాలకమండలి కోరిందన్నారు. బర్డ్ ఆస్పత్రి డైరెక్టర్‌గా జగదీష్‌ను కొనసాగించాలన్న ప్రతిపాదనను తిరస్కరించిందన్నారు. తిరుపతిలో నిర్మించే గరుడ వారధిపై ప్రభుత్వంతో సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీటీడీకి బిల్డింగ్ అప్రూవల్ వంటివాటిపై బకాయిలు చెల్లించాల్సిందిగా తుడా ఇచ్చిన నోటీసుపై చర్చించామన్నారు. సుమారు రూ.23 కోట్ల మేరకు రావాల్సిందిగా తుడా తన నోటీసులో పేర్కొందన్నారు. ప్రమాణస్వీకారం చేసిన నూతన సభ్యులు నూతనంగా నియమితులైన టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా ఎక్స్అఫీషియో సభ్యులైన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, దేవదాయ శాఖ కమిషనర్ పద్మజ, తర్వాత సభ్యులుగా మేడా మల్లికార్జునరెడ్డి, బి.పార్థసారథిరెడ్డి, పి.ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ నిచితా, కె.పార్థసారథి, మురళీకృష్ణ, ఎన్.శ్రీనివాసన్, జె.రామేశ్వరరావు, ఎన్.సుబ్బారావు, జి.వెంకటభాస్కర్‌రావు, డి.దామోదర్‌రావు, ఎంఎస్ శివశంకర్, కుమారగురు, సి.ప్రసాద్‌కుమార్, ఎం.రాములు, కె.శివకుమార్, యువి.రమణమూర్తి రాజులు ప్రమాణస్వీకారం చేశారు. సభ్యులతో ఈవో సింఘాల్ ప్రమాణస్వీకారం చేయించారు. సభ్యులందరూ శ్రీవారిని దర్శించుకున్నాక రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి సభ్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అదేవిధంగా ధర్మకర్తల మండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, రాకేష్ సిన్హా, ఏజే శేఖర్, కుపేందర్ రెడ్డి, దుష్మంత కుమార్ దాస్, అమోల్ కాలేలతో తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్అఫీషియో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన దేవదాయ కమిషనర్ పద్మ దంపతులకు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌కు శ్రీవారి చిత్రపటాన్ని అందజేస్తున్న తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి తాగునీటి కోసం బాలాజీ రిజర్వాయర్ తిరుమలలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టామని, దీని అంచనా రూపొందించి వచ్చే ధర్మకర్తల మండలి సమావేశంలో ఆమోదిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ 50వ ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఆయన నేతృత్వంలో జరిగింది. వివిధ అంశాలను చర్చించిన పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామన్నారు. తిరుమలలో పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రానిక్ బస్సులు, కార్లు ప్రవేశపెడతామన్నారు. టీటీడీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి సబ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. తిరుపతిలో గరుడ వారధి నిర్మాణానికి ప్రభుత్వంతో సంప్రదించి నిధులు కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుపతి వాసులకు ఉపయోగపడేలా అవిలాల చెరువు, పార్కును నిర్మిస్తామన్నారు. ధర్మకర్తల మండలి నిర్ణయాల్లో ముఖ్యమైనవి ఎస్సీ, ఎస్టీ నివాస ప్రాంతాల్లో శ్రీవాణి ట్రస్టు కింద దేవాలయాల నిర్మాణాలకు రూ.10 లక్షలు తక్కువ కాకుండా ఇచ్చేవారికి ఏడాదిలో ఒకసారి వీఐపీ దర్శనం టీటీడీ విద్యా సంస్థల అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు వచ్చే ఏడాది నుంచి టీటీడీ విద్యా సంస్థల్లో మేనేజ్మెంట్ కోటా రద్దు బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి రూ.150 కోట్లు అవసరమవుతాయని అంచనా. తదుపరి సమావేశం లోపు ప్రణాళికలు రూపొందించాల్సిందిగా ఆదేశాలు టీటీడీ అధికారుల కోసం అందుబాటులోకి 40 బ్యాటరీ వాహనాలు. వీటి నిర్వహణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలకు.. ఇందుకోసం ఏటా రూ.2.45 కోట్లు టీటీడీ ఉద్యోగులకు సంబంధించి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయింపు కొత్తగా మూడు కల్యాణ మండపాల నిర్మాణానికి నిధుల మంజూరు ఎస్టేట్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం సన్నిధి గొల్లగా పనిచేస్తున్న ఎస్.పద్మనాభంను పర్మినెంట్ చేయాల్సిందిగా ప్రభుత్వ అనుమతిని కోరుతూ నిర్ణయం గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసి ఆ తర్వాత టీటీడీ ఏడీ బిల్డింగ్‌లో భద్రపరచిన బంగారు ఆభరణాలను తాత్కాలికంగా ఒక ఏడాది కాలపరిమితితో డిపాజిట్ చేయాలని నిర్ణయం. -
ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ
సాక్షి, తిరుమల: భక్తులు కానుకగా సమర్పించిన రూ.47.5 కోట్ల పాత కరెన్సీ మార్పిడికి చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ తెలిపారు. అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈవో అనిల్ కుమార్ భక్తుల సందేహాలకు సమాధానమిచ్చారు. అనంతరం మాట్లాడుతూ తిరుమలలో నీటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ఏడాది గరుడ సేవ రోజు తలెత్తిన సమస్యపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. ఈ సారి బ్రహ్మోత్సవాల్లో విజిలెన్స్, పోలీసుల మధ్య సమన్వయ లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొన్ని కీలక నిర్ణయాలు టీటీడీ బోర్డు సమక్షంలో తీసుకుంటామన్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు హుండీ ద్వారా రూ. 479.29 కోట్ల ఆదాయం సమకూరగా, 524 కిలోల బంగారాన్ని భక్తులు కానుకగా సమర్పించారన్నారు. నగదు రూపంలోనే కాకుండా చెక్కులు, డీడీలు, ఫారెన్ కరెన్సీ మార్పిడిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పాత నోట్ల మార్పిడి కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్లను టిటిడి ఆన్లైన్లో విడుదల చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించి మొత్తం 68,466 టికెట్లను విడుదల చేయగా ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 6,516 సేవాటికెట్లను అందుబాటులో ఉంచింది. ఇందులో సుప్రభాతం 3856, తోమాల 60, అర్చన 60, అష్టాదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం కోసం 2,300 టికెట్లను విడుదల చేసింది. కరెంట్ బుకింగ్ కింద మరో 61,950 ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. విశేష పూజ 2,500, కల్యాణోత్సవం 13,775, ఊంజల్ సేవ 4,350, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,975, వసంతోత్సవం 15,950, సహస్ర దీపాలంకరణ కోసం 17,400 టికెట్లను టిటిడి విడుదల చేసింది. -
ముంబైలో శ్రీవారి ఆలయం
సాక్షి, ముంబై : దేశ ప్రముఖ నగరాల్లో ఒకటైన ముంబైలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వం తూర్పు బాంద్రాలో 6,975 చదరపు అడుగుల స్థలాన్ని అంటే సుమారు 16 సెంట్ల మేరకు స్థలాన్ని కేటాయించింది. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అభ్యర్థన మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇందులో భాగంగా తిరుపతి జేఈఓ బసంత్ కుమార్‌కు ముంబైలోని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో స్థల కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులను ముంబై సబర్బన్ జిల్లా కలెక్టర్ మిలింద్‌బోరికర్ అందజేశారు. అలాగే ఇదే ప్రాంగణంలో శ్రీవారి ఆలయంతో పాటు సమాచార కేంద్రాన్ని కూడా టీటీడీ నిర్మించనుంది. దేశవ్యాప్తంగా శ్రీవారి దివ్యక్షేత్రాలను నిర్మించే దిశగా టీటీడీ కృషి చేస్తోంది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ ముంగటివార్, టీటీడీ ఎస్టేట్ అధికారి విజయసారథి, డెప్యూటీ ఈఓ విశ్వనాథ్, స్థానిక సలహా మండలి సభ్యుడు వీ రంగనాథన్, డాక్టర్ గీతా కస్తూరి, సమీర్, కే మెహెతా తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన నవంబరు మాసం కోటా కింద మొత్తం 69,254 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసినట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆన్లైన్ డిప్ విధానంలో 10,904 సేవా టికెట్లు విడుదల చేశామని.. ఇందులో సుప్రభాతం 7,549, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2,875 టికెట్లు ఉన్నాయని వెల్లడించారు. ఆన్లైన్ జనరల్ కేటగిరిలో 58,350 సేవా టికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 1,500, కల్యాణం 13,300, ఊంజల్‌సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 14,850, సహస్ర దీపాలంకార సేవ 16,800 టికెట్లు ఉన్నాయన్నారు. కాగా, ఈనెల 13, 27 తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు.. 14, 28 తేదీల్లో ఐదేళ్లలోపు చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నామన్నారు. అలాగే ప్లాస్టిక్ నివారణలో భాగంగా ఈ నెల మూడో వారం నుంచి తిరుమలలో అందరికీ జనప నార బ్యాగులను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వివరించారు. టీటీడీ ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. సామాన్య భక్తుల సౌకర్యార్థమే బ్రేక్ దర్శనాల కేటగిరీలను రద్దు చేశామని స్పష్టంచేశారు. దీనివల్ల గంట సమయం ఆదా అవుతోందని, తద్వారా దాదాపు 5 వేల మంది సామాన్య భక్తులకు అదనంగా దర్శనం చేయించేందుకు వీలవుతోందని తెలిపారు. సమావేశంలో తిరుపతి జేఈఓ బసంత్‌కుమార్, సీవీఎస్ఓ గోపినాథ్ జెట్టి, ఇన్చార్జి సీఈ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. 9 నుంచి ‘మనగుడి’ ఇదిలా ఉండగా.. ఈనెల 9 నుంచి 15 వరకు తెలుగు రాష్ట్రాలల్లోని ఎంపిక చేసిన ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ‘డయల్ యువర్ ఈఓ’ కార్యక్రమంలో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. 9న తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్న నేపథ్యంలో మహిళలకు సౌభాగ్యం పేరిట కుంకుమ, గాజులు, కంకణాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే తిరుమలలో 124 రోజులకు సరిపడా నీటి నిల్వలున్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత ఏడాది జూలైలో హుండీల ద్వారా శ్రీవారికి రూ.102.88కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అదే నెలలో రూ.109.60 కోట్లు వచ్చిందని ఈఓ వెల్లడించారు. -
టీటీడీ ప్రతిష్టను పెంచుతాం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి ఆగమ శాస్త్రాలు, సంప్రదాయాలు, నియమాలను గౌరవిస్తూ టీటీడీ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచుతామని తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీ మీద వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ ఉంటుందని ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం 50వ చైర్మన్‌గా శనివారం ప్రమాణ స్వీకారానంతరం మీడియాకు తెలిపారు. వారం రోజుల్లో పూర్తిస్థాయి పాలక మండలి ఏర్పాటవుతుందన్నారు. అంతకుముందు.. శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ కొత్త చైర్మన్‌తో ఉదయం 11.47గంటలకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన వైవీ సుబ్బారెడ్డి.. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. తులాభారం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. సామాన్య భక్తులకూ ప్రాధాన్యత.. కలియుగ దైవం కృపవల్ల సీఎం వైఎస్ జగన్ ఈ బాధ్యతను తనకు అప్పగించినందుకు ముఖ్యమంత్రికి వైవీ సుబ్బారెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అందరినీ కలుపుకుని సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ వారికి మెరుగైన సేవలు అందించమని సీఎం చేసిన సూచనలను పాటిస్తానన్నారు. ఇక్కడ ప్రతి పైసా పేద ప్రజలది, భక్తులదని.. అలాంటిది ప్రతిపైసా స్వామి సేవకే వెచ్చిస్తామన్నారు. తిరుమల నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషిచేస్తానని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అర్చకుల వయోపరిమితిపై పీఠాధిపతుల సలహాలు తీసుకుని బోర్డులో చర్చించి చివరిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామన్నారు. స్వామివారి ఆభరణాల విషయంలో వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఆలయ ప్రతిష్టను దేశ విదేశాలకు విస్తరించేలా, ప్రభుత్వ ప్రతిష్టను పెంపొందించేలా వైవీ సుబ్బారెడ్డికి శక్తినివ్వాలని కోరుతూ శ్రీవారిని ప్రార్థించానన్నారు. వైవీని టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియమించడం హర్షించదగ్గ విషయమని డెప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. -
కొండపై రాజకీయం
సాక్షి, తిరుపతి/తిరుమల: టీటీడీ పాలకమండలి సభ్యుల పాచిక పారలేదు. పది మందికి తాత్కాలిక ఉద్యోగాలు ఇప్పించడం, కాంట్రాక్టు పనులు దక్కించుకోవడం కోసం ఏర్పాటు చేస్తున్నారంటూ విమర్శల నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాలకమండలి సమావేశం చివరకు అర్ధంతరంగా ముగిసింది. టీటీడీ ఈవో, జేఈవో సమావేశాన్ని బహిష్కరించడంతో సభ్యుల వ్యూహం బెడిసికొట్టింది. తర్వాత పది నిముషాల్లో చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, సభ్యులు కూడా సమావేశాన్ని ముగించారు. టీటీడీ అధికారుల తీరుకు నిరసనగా పాలకమండలి సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని చైర్మన్ పుట్టా చెప్పారు. తిరుమల జేఈవోపై విమర్శలు గత ప్రభుత్వం హయాంలో నియమించిన టీటీడీ పాలకమండలి సభ్యులు మంగళవారం సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తిరుమల అన్నమయ్య భవన్లో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సమావేశం ప్రారంభం కాగానే తిరుమల జేఈవోపై పలువురు బోర్డు సభ్యులు దర్శన టికెట్లకోసం విమర్శలు చేయడంతో రసాభాసగా మారింది. దీంతో జేఈవో శ్రీనివాసరాజు బయటకు వచ్చేశారు. టికెట్ల విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, అలాంటి విషయాలు జేఈవో పరిధిలోనిది అని బోర్డు సభ్యులకు ఈవో ఎకె సింఘాల్ వివరించారు. అనంతరం సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కూడా బయటకు వచ్చారు. తర్వాత బోర్డు సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి బయటకు వచ్చి తన రాజీనామా లేఖను ఈవోకు ఇచ్చి వెళ్లిపోయారు. మరో పది నిమిషాల తర్వాత బోర్డు చైర్మన్ పుట్టా కూడా సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. కాగా ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు పాలకమండలి కొనసాగుతుందని చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. రాజీనామా చేసే యోచన తమకు లేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే తాము నడుచుకుంటామని తెలిపారు. అంతవరకు టీటీడీ చైర్మన్ పదవిని వదిలే ప్రసక్తే లేదని చెప్పడం గమనార్హం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టీటీడీ సమావేశాన్ని బహిష్కరించిన ఈవో, జేఈవో
-
రసాభాసగా టీటీడీ పాలకమండలి సమావేశం
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) పాలకమండలి సమావేశం రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజులు బయటకు వచ్చారు. పాలకమండలి సభ్యత్వానికి చల్లా రామచంద్రారెడ్డి (బాబు) రాజీనామా చేయడంతో కార్యదర్శి హోదాలో టీటీడీ ఈవో సమావేశం నిర్వహించాల్సింది. కానీ టీటీడీ అధికారులు సమావేశాన్ని బహిష్కరించడంతో బోర్డు తీర్మానాల అమలు కోసం నిర్వహించిన సమావేశం అర్థాంతరంగా ముగిసింది. అంతకు ముందు బోర్డు సభ్యుడుగా ఇచ్చిన లెటర్ పై ఎందుకు దర్శనాలు ఇవ్వటంలేదని సభ్యుడు చల్లాబాబు అధికారులను నిలదీశారు. అధికారులు ససేమిరా అనటంతో.. ఆగ్రహం వ్యక్తం చేశారు చల్లా బాబు. తీరు మారకపోవటంతో.. చల్లా రామచంద్రారెడ్డి పాలమండలికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. నెల రోజుల క్రితమే పాలక మండలి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించామని.. అందులో భాగంగానే ఈ భేటీ జరిగినట్లు చైర్మన్ సుధాకర్ యాదవ్ మీడియాకు తెలిపారు. సమావేశంలో తాము వేచి చూసినా అధికారులు రాలేదన్నారు. తమని ప్రభుత్వం నియమిస్తేనే ప్రమాణ స్వీకారం చేశామని, వాళ్లు రద్దు చేస్తేనే పదవులు వదులుకుంటామన్నారు. స్వచ్చందంగా మాత్రం రాజీనామా చేయమన్నారు. ఇక టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి చల్లా బాబుతో పాటు పార్థసారథి, రాయపాటి, బోండా ఉమలు కూడా రాజీనామా చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయితే రాష్ట్రంలో మరో రెండ్రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న సమయంలో హడావుడిగా టీటీడీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సాధారణంగా ఎన్నికల్లో పాలక ప్రభుత్వం ఓడిపోతే దాని ద్వారా నియమితులైన పాలక మండళ్లు నైతికంగా రాజీనామా చేస్తాయి. కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా టీటీడీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించటానికి ప్రయత్నించారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తిరుమలలో విస్తృత ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో ఇటీవల పెద్దఎత్తున బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ ఓ మాట.. బ్యాంకు అధికారులు మరోమాట చెప్పడంతో అనేకానేక అనుమానాలు తలెత్తాయి. వీటిని ఇటు టీటీడీ కానీ, అటు టీడీపీ సర్కారు కానీ నివృత్తి చేసిన దాఖలాల్లేవు. అదే విధంగా.. ప్రైవేటు బ్యాంకుల్లో నగదు, బంగారం డిపాజిట్ల వెనుక కొందరు పాలక మండలి సభ్యులతో పాటు ప్రభుత్వంలోని పలువురు పెద్దల పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ పది మంది తాత్కాలిక ఉద్యోగుల నియామకానికి కూడా పచ్చజెండా ఊపేందుకు కూడా ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. -
శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్
తిరుమల/ తిరుమల రూరల్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు, కుటుంబ సభ్యులు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించారు. వారికి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కె.ఎస్.శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్, ఈఓ, జేఈఓలు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని కేసీఆర్‌కు అందించారు. టీటీడీ అతిథి మర్యాదలపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. వారితో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి శ్రీవారిని దర్శించుకున్నారు. కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజల శ్రేయస్సు కోసం శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా ఎదగాలని ప్రార్థించానన్నారు. రెండోసారి శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం శ్రీకృష్ణా గెస్ట్ హౌస్‌కు చేరుకుని అల్పాహారం తీసుకుని, అమ్మవారి దర్శనార్థం తిరుచానూరుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి, టీటీడీ చైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. కాగా, సోమవారం తిరుమల శ్రీవారు, పద్మావతీ అమ్మవారి దర్శనానంతరం తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంటలోని ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. మంగళవాయిద్యాలు, మేళతాళాలతో చెవిరెడ్డి వారికి ఘన స్వాగతం పలికారు. శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి మేల్చాట్ వస్త్రాలను బహూకరించారు. అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులు చెవిరెడ్డి ఇంట్లో ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించారు. చెవిరెడ్డి కుటుంబ సభ్యులను పేరుపేరునా పలకరించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన కేసీఆర్‌కు నియోజకవర్గానికి చెందిన నేతలను, కార్యకర్తలను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
‘ఆ బంగారం’ లెక్క తేల్చేందుకేనా
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో మరో రెండ్రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న సమయంలో హడావుడిగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశాన్ని మంగళవారం నిర్వహించనుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. సాంకేతికంగా నిర్వహించుకోవచ్చన్న సాకు చూపించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఎన్నికల్లో పాలక ప్రభుత్వం ఓడిపోతే దాని ద్వారా నియమితులైన పాలక మండళ్లు నైతికంగా రాజీనామా చేస్తాయి. కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా టీటీడీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించటానికి రంగం సిద్ధంచేశారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తిరుమలలో విస్తృత ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో ఇటీవల పెద్దఎత్తున బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ ఓ మాట.. బ్యాంకు అధికారులు మరోమాట చెప్పడంతో అనేకానేక అనుమానాలు తలెత్తాయి. వీటిని ఇటు టీటీడీ కానీ, అటు టీడీపీ సర్కారు కానీ నివృత్తి చేసిన దాఖలాల్లేవు. అదే విధంగా.. ప్రైవేటు బ్యాంకుల్లో నగదు, బంగారం డిపాజిట్ల వెనుక కొందరు పాలక మండలి సభ్యులతో పాటు ప్రభుత్వంలోని పలువురు పెద్దల పాత్ర ఉందనే ఆరోపణలున్న నేపథ్యంలో మంగళవారం నిర్వహించే పాలక మండలి సమావేశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగారం వివాదానికి క్లీన్చిట్? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఏప్రిల్ 17న తమిళనాడు నుంచి తరలిస్తున్న 1381 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఎటువంటి భద్రతా ఏర్పాట్లులేకుండా సాధారణ వాహనంలో సుమారు రూ.450 కోట్లు విలువ చేసే బంగారాన్ని తరలించడం.. దానిని తమిళనాడులో ఎన్నికల అధికారులు పట్టుకోవడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. బంగారాన్ని పట్టుకున్న సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు అది టీటీడీదని అన్నారు. మరోవైపు.. ఆ బంగారం తమది కాదని టీటీడీ ఈఓ విస్పష్టంగా చెప్పారు. ఆ తరువాత కొంత సమయానికే ఆయన మాటమార్చి పట్టుబడ్డ బంగారం టీటీడీదేనని చెప్పుకొచ్చారు. దీంతో అక్రమ బంగారాన్ని సక్రమం చేశారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఆ తరువాత కూడా టీటీడీ రకరకాల ప్రకటనలు చేసి ప్రజల్లో అనుమానాలకు ఆస్కారమిచ్చింది. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాల మేరకు ముఖ్య కార్యదర్శి మన్మోహన్సింగ్ తిరుపతిలో విచారణ చేపట్టారు. ఆ నివేదికను ప్రభుత్వానికి నివేదించారు. అయితే, అది ఇప్పటివరకు వెలుగుచూడలేదు. ఇలాగే.. టీటీడీకి సంబంధించిన బంగారం, నగదును ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చెయ్యటంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ పెద్దలు, కొందరు టీటీడీ అధికారులు, మరికొందరు పాలక మండలి సభ్యులు కమీషన్లకు కక్కుర్తిపడి కోట్ల రూపాయలను ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని ప్రచారంలో ఉంది. టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఈ రెండు ప్రధాన ఆరోపణల్లో వాస్తవంలేదని చెప్పుకునేందుకే ఈ టీటీడీ బోర్డు సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు సమాచారం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి రాజీనామా చేయకుండా.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న సందర్భంలో నైతిక బాధ్యత వహించి నామినేటెడ్ సంస్థల చైర్మన్లు, సభ్యులు రాజీనామా చేస్తున్నారు. కానీ, టీటీడీ పాలకమండలి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సాంకేతిక అంశం సాకుతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాత్కాలిక నియామకాల కోసం.. ఓ పది మంది తాత్కాలిక ఉద్యోగుల నియామకానికి కూడా పచ్చజెండా ఊపేందుకు కూడా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో టీటీడీలో ఓ అధికారి.. ఇద్దరు బోర్డు సభ్యుల పాత్ర ఉన్నట్లు సమాచారం. ఆ పది మంది నుంచి గతంలోనే భారీగానే మామూళ్లు పుచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. అదే విధంగా మరికొన్ని కాంట్రాక్టు పనులు ఖరారు చేసుకునేందుకు ఈ పాలక మండలి భేటీని కొందరు ఉపయోగించుకుంటున్నట్లు తెలిసింది. టీటీడీ బోర్డును రద్దు చేయాలి చంద్రబాబునాయుడు హయాంలో ఏర్పాటైన టీటీడీ పాలక మండలిని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ రద్దుచెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారు? టీడీపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఎస్వీబీసీ చైర్మన్‌గా ఉన్న కే రాఘవేంద్రరావు రాజీనామా చేయడం అభినందనీయం. ఆయనలాగే టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, పాలక మండలి సభ్యులు వెంటనే రాజీనామా చెయ్యాలి. అలా కాకుండా బోర్డు సమావేశం నిర్వహిస్తే అడ్డుకుంటాం. – నారాయణస్వామి, ఎమ్మెల్యే, గంగాధర నెల్లూరు గోవిందా.. ఇదేంటయ్యా..! గోవిందుని పాదాల చెంత నిరుపేదలకు వైద్య సేవలందిస్తున్న బర్డ్ ఆస్పత్రి పరువును బజారు పాలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టక ముందే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ ఆస్పత్రి ట్రస్ట్ బోర్డు సమావేశాన్ని హడావుడిగా నిర్వహించారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జగదీష్ పదవీ కాలం ఇంకా ముగియకమునుపే మరో రెండేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కొత్త బర్డ్ ట్రస్ట్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సివుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్నది నామినేటెడ్ బోర్డు అన్న విషయాన్ని సభ్యులు మరిచి డైరెక్టర్ పదవీ కాలం పొడిగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. మరో రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం రానుంది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ బోర్డు అయితే పాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డుకు సాధారణంగా అధికారం ఉండదు... బోర్డు రద్దు అవుతుంది. అయితే సోమవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతి«థి గృహంలో బర్డ్ ట్రస్ట్ బోర్డు సమావేశం హడావుడిగా జరిగింది. గంట పాటు వాడివేడిగా చర్చలు జరిగాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకున్నారు. బర్డ్ ఆస్పత్రి డైరెక్టర్‌గా గత 20 ఏళ్లుగా డాక్టర్ జగదీష్ కొనసాగుతున్నారు. గత టీటీడీ బోర్డు సమావేశంలో ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని అజెండాలో చేర్చగా పలువురు తిరస్కరించారు. అత్యవసర సమావేశం ఎందుకు.? నామినేటెడ్ కిందకు వచ్చే బర్డ్ ట్రస్ట్ బోర్డు సమావేశాన్ని హడావుడిగా నిర్వహించారు. 450 పడకల అత్యంత ప్రతిష్టాత్మక బర్డ్ ఆస్పత్రికి డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపు నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యత వుంది. అటువంటి నిర్ణయం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త సభ్యుల సమక్షంలో తీసుకోవాలి. అయితే డాక్టర్ జగదీష్ పదవీ కాలం మరో నెల రోజుల పాటు ఉంది. ఈ దశలో పదవీ కాలం పొడిగింపు నిర్ణయం తీసుకోవడం దుమారం రేపుతోంది. తొందర పాటు నిర్ణయం కొత్త ప్రభుత్వం ఏర్పడితే నామినేటెడ్ బోర్డులు రద్దు అవుతాయి. బోర్డు చైర్మన్‌తో పాటు సభ్యులు రాజీనామా చేయడం సాధారణం. టీడీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ నియమించిన పలు బోర్డుల చైర్మన్లు, సభ్యులు రాజీనామాలు చేశారు. తిరుపతిలో తుడా చైర్మన్ నర్సింహయాదవ్ తన పదవీకి రాజీనామా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో నామినేటెడ్ బర్డ్ ట్రస్ట్ బోర్డు సమావేశాన్ని నిర్వహించి డైరెక్టర్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ తొందర పాటు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోర్డు సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల పట్ల టీటీడీ అధికారులు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే కొత్త సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. మీడియాను పక్కదారి పట్టించిన వైనం శ్రీ పద్మావతి అతిధి గృహంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు బర్డ్ ట్రస్ట్ బోర్డు సమావేశం జరుగుతుందని మీడియాకు లీకు కావడంతో సభ్యులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా రు. సాయత్రం 4.50 గంటలకే బోర్డు సమావేశా న్ని ముగించారు. దీంతో సాయంత్రం 5 గంటల కు అతి«థి గృహం వద్దకు చేరుకున్న మీడియాకు సమావేశం ముగిసిందని అక్కడి వారు చెప్పడం తో అవాక్కయ్యారు.సమావేశంలో నిర్ణయాలను గోప్యంగా ఉంచారు. టీటీడీ పీఆర్వో విభాగం అధికారులు సమావేశానికి హాజరైనా కనీసం పత్రికా ప్రకటన విడుదల చేయలేదు. టీటీడీ అధికారులు పత్రికా ప్రకటన విడుల చేయొద్దని పీఆర్వో సెక్షన్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. రహస్య సమావేశంలో బర్డ్ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపు, బర్డ్ ఆస్పత్రిలో ఫైనాన్స్ సెక్షన్లో పోస్టు భర్తీతోపాటు ఆస్పత్రి నిర్వహణ ఇకపై బోర్డు అధీనంలో జరగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీటీడీ బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ బోర్డు సమావేశాన్ని నడిపించినట్లు సమాచారం. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్
-
శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్
తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి సీఎం కేసీఆర్ శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో కేసీఆర్‌కు వేదిపండుతులు ఆశీర్వచనం చేశారు. ఆదివారం సాయంత్రం ఆయన తిరుమలకు చేరుకున్న విషయం తెలిసిందే. రేణిగుంట విమానాశ్రయంలో, తిరుమలలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఆదివారం సాయంత్రం 4.10 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, నారాయణస్వామి, నవాజ్‌బాషా, చింతల రామచంద్రారెడ్డి, టీటీడీ జేఈవో లక్ష్మీకాంతం, తిరుపతి సబ్‌కలెక్టర్ మహేష్‌కుమార్, అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్, నగర పాలక కమిషనర్ విజయ్‌రామరాజు తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్న వారికి శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ జేఈవో శ్రీనివాసరాజు, టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్ జెట్టీ ఘనస్వాగతం పలికారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి శ్రీవారి పాదాలు సందర్శించిన కేసీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్ సతీమణి శోభారాణి, కోడలు శైలిమారావు, మనవడు హిమాన్షు ఇతర కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం సాయంత్రం శ్రీవారి పాదాలను, శిలాతోరణంను సందర్శించారు. ఘనంగా ఆతిథ్యం తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్ తిరుమలకు రెండవసారి వచ్చారు. ఆయనకు టీటీడీ ఘనంగా ఆతిథ్య మర్యాదలు చేసింది. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సీఎం కేసీఆర్‌కు శ్రీకృష్ణ అతిథి గృహాన్ని కేటాయించారు. ముఖ్యమంత్రి భద్రతాధికారి ఎం.కె. సింఘ్, సీఐఎస్ఎఫ్ అడిషనల్ కమాండెంట్ శుక్లా, టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
హుండీలో వేస్తోన్న వజ్రాలు కొందరి చేతుల్లోకి వెళ్తున్నాయి
-
‘దానిలో టీటీడీ బంగారం కూడా ఉంది’
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవకతవకలపై మాజీ ఎంపీ చింతమోహన్ స్పందించారు. ఈ క్రమంలో శనివారం విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన పలు అనుమానాలు లేవనేత్తా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల హుండీ ఆదాయం రోజూ ప్రకటిస్తున్న టీటీడీ అధికారులు.. నిలువు దోపిడీ ఆదాయం వివరాలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. హుండీలో భక్తులు వేస్తోన్న విలువైన వజ్రాలు లెక్కల్లోకి రాకుండా మధ్యలోనే కొందరి చేతుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. టీటీడీలో అసలు జమాలజిస్టులు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాక టీటీడీ బంగారం చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన సమయంలో బోర్డు సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డి పాత్ర బయటకు రావాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. గతంలో శేఖర్ రెడ్డి ఇంట్లో జరిగిన దాడుల్లో దొరికిన బంగారంలో టీటీడీ బంగారం కూడా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. శ్రీవారి సొమ్ము రూ. 11 వేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఏ ఏ బ్యాంకులలో ఉన్నాయో భక్తులకు తెలియాలన్నారు. టీటీడీకి, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి మధ్య ఉన్న ఒప్పందం ఏంటో బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బ్యాంక్‌తో టీటీడీకి మధ్య ఉన్న లావాదేవీలు ఏంటో జనాలకు చెప్పాలన్నారు. టీటీడీ అవినీతిపై ఈఓను చర్చకు పిలిచాను.. కానీ అనిల్ కుమార్ సింఘాల్ చర్చకు రాకుండా ముఖం చాటేస్తున్నారని చింతా మోహన్ మండిపడ్డారు. -
దోపిడీ దొంగలు కొట్టేసుంటే..!
సాక్షి, అమరావతి: తమిళనాడులోని పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) నుంచి తిరుపతికి 1,381 కిలోల బంగారాన్ని తరలిస్తున్న వ్యాన్‌ను దొంగలు దోపిడీ చేసుంటే పరిస్థితి ఏమిటి? దోపిడీ దొంగలే పోలీస్ దుస్తుల్లో వచ్చి తనిఖీ చేసి బంగారానికి రశీదులు లేనందున దొంగ బంగారం సీజ్ చేస్తున్నామని తీసుకెళ్లుంటే ఏమయ్యేది? దురదృష్టవశాత్తూ ఇలా జరిగుంటే ఎంత ఉపద్రవం కలిగేది? కలియుగ వైకుంఠ దైవమైన శ్రీవారి కోట్లాది మంది భక్తులను వేధిస్తున్న ప్రశ్నలివి. ఈ ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లోనూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ బంగారం విలువ రూ.415 కోట్లే కావచ్చు. ఇది శ్రీవారికి పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ స్వామి వారి బంగారమే దోపిడీ అయితే భక్తుల, ప్రజల మనోభావాల మాటేమిటి? అని అధికారులు అంతర్మథనం చెందుతున్నారు. తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలకు ముందు రోజు ఈనెల 17న ఎన్నికల కమిషన్ అధికారులు (రెవెన్యూ, పోలీసు సిబ్బంది) తనిఖీ సందర్భంగా వాహనంలో తరలిస్తున్న 1,381 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం.. తర్వాత అది తిరుమల – తిరుపతి దేవస్థానం (టీటీడీ)ది అని చెప్పడంతో వారికి ఇచ్చిన విషయం విదితమే. ఇంత విలువైన స్వామి వారి బంగారానికి సరైన రక్షణ, ఆధార పత్రాలు లేకుండా ఎలా తరలిస్తారు? ఇది అసలు టీటీడీదేనా? మరెవరిదైనా దొంగ బంగారమైతే స్వామి వారిదని కథ అల్లారా? అనే అనుమానాలు కూడా భక్తుల మదిని తొలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఆయన దీనిని పరిశీలించి ముఖ్యమంత్రికి సమర్పించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), పోలీసు, బ్యాంకింగ్, టీటీడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. టీటీడీది బాధ్యతారాహిత్యం కాదా? తాము డిపాజిట్ చేసిన స్వామి వారి బంగారాన్ని టీటీడీ ఖజానాకు చేర్చాల్సిన బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంకుదేనని కార్యనిర్వహణాధికారి (ఈఓ) అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొనడాన్ని అన్ని వర్గాలు తప్పు పడుతున్నాయి. అధికార వర్గాలు ఈ వాదనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన స్వామి వారి బంగారాన్ని అగ్రిమెంట్లతో ముడి పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు. డిపాజిట్ గడువు ఎప్పుడు ముగుస్తుంది? మా బంగారాన్ని ఎప్పుడు ఎలా తరలించి మాకు అప్పగిస్తారు? మీరు అప్పగింతకు ఎప్పుడు.. ఎవరు వస్తున్నారు? తరలింపునకు అనుసరిస్తున్న రక్షణ చర్యలేమిటి? ఏమేమి పత్రాలు కావాలి? వాటిని తెస్తున్నారా? మేము ఎలాంటి పత్రాలు ఇవ్వాలి? అనే కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం కచ్చితంగా టీటీడీ అధికారుల తప్పిదమే. శ్రీవారి బంగారం తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత పీఎన్‌బీదే అనే విషయం వాస్తవమే. మార్గంమధ్యలో ఏదైనా జరగరానిది జరిగి ఈ బంగారం మాయమైతే.. అనే కనీస ఊహ కూడా లేకుండా వ్యవహరించడం తప్పు. బంగారం పోతే ఇన్సూరెన్సు ఉందా? లేదా? అనేది ఇక్కడ ప్రశ్నే కాదు. మొన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నది ఎన్నికల కమిషన్ అధికారులు కాకుండా పోలీసులు/ విజిలెన్స్ అధికారుల ముసుగులో ఉన్న దోపిడీ దొంగలైతే పరిస్థితి ఏమిటి? కేసులు, పోలీసు జాగిలాలు, దర్యాప్తు బృందాలు పరుగులు తీయాల్సి వచ్చేది. అదే జరిగితే స్వామి వారి భక్తుల్లో అలజడి వస్తే దానికి బాధ్యులెవరు? అసలు ఈ ప్రశ్నలు ఊహించడానికే భయమేస్తోంది’ అని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యాఖ్యానించారు. పీఎన్బీదీ అవగాహన రాహిత్యమా? ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని వ్యాన్‌లో తరలిస్తుంటే మధ్యలో ఎవరైనా తనిఖీ చేస్తే పత్రాలు చూపించాల్సి వస్తుందన్న కనీస అవగాహన పీఎన్బీ అధికారులకు ఎలా లేకుండా పోయిందన్నది వేయి డాలర్ల ప్రశ్నగా మారింది. ఇది అనుమానాలకు తావిస్తోంది. ‘బంగారాన్ని బ్యాంకు నుంచి టీటీడీకి తరలిస్తున్నట్లు అధికారిక ధ్రువపత్రాలు వాహనంలోని అధికారులు వెంట పెట్టుకుని వెళ్లాల్సి ఉంది. ఇలా పత్రాలు తీసుకెళ్లక పోవడం తీవ్ర తప్పిదం. అలాగే స్వామివారి బంగారాన్ని ప్రయివేటు లాజిస్టిక్ వాహనాల్లో సాధారణంగా బ్యాంకు నగదు తీసుకెళ్లినట్లు తీసుకెళ్లడం లోపభూయిష్ట విధానం. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించాల్సి ఉండగా.. సాదాసీదాగా కూరగాయలను తీసుకెళ్లినట్లు తరలించడం దారుణం’ అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యవహారం వివాదానికి దారితీసినా మొత్తంమీద మంచే జరిగినట్లు చెప్పక తప్పదని అధికార వర్గాలు అంటున్నాయి. దీనివల్లే స్వామి వారికి చెందిన 1,381 కిలోల బంగారం తరలింపులో భద్రత డొల్లేనని తేలిందని, భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి మార్గం ఏర్పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
బంగారం తరలింపు: గోల్‌మాలేనా.. గోవిందా!
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసుల తనిఖీల్లో బయటపడింది కాబట్టి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, లేదంటే బ్యాంకుల నుంచి బంగారం తిరిగి టీటీడీ ట్రెజరీకి చేరుతోందా? లేదా మరో చోటుకి వెళ్తోందా? అనే అనుమానాలు వ్యక్తం కావడానికి టీటీడీతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా అవకాశం కలిగించిందని మన్మోహన్సింగ్ విచారణ నివేదికలో చెప్పినట్లు సమాచారం. సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బంగారం వివాదంపై ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వాదన సరికాదని ఈ అంశంపై విచారణ చేసిన రాష్ట్ర రెవెన్యూ(దేవాదాయ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ తేల్చిచెప్పారు. బంగారం వ్యవహారంలో అటు బ్యాంకు గానీ, ఇటు ఈవో గానీ పాటించాల్సిన నియమ నిబంధనలేవీ పాటించలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్.వి.సుబ్రహ్మణ్యంకు ప్రాథమిక నివేదిక సమర్పించారు. మన్మోహన్సింగ్, దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ సచివాలయంలో ఎల్.వి.సుబ్రహ్మణ్యంను కలిశారు. టీటీడీ బంగారం తరలింపులో చోటుచేసుకున్న లోపాలను వివరించారు. ఆ బంగారం తరలింపు బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంకుదేనని, అది టీటీడీకి చేరే వరకూ తనకు సంబంధం లేదని ఈవో సింఘాల్ వ్యాఖ్యానించడం సరికాదని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా ఈ విషయంలో నిబంధనలను పాటించలేదనే నివేదికలో వెల్లడించినట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగానే లేఖ ఇవ్వలేదా? బ్యాంకులో పెట్టిన బంగారం గడువు తీరిపోయి టీటీడీ ట్రెజరీకి తరలిస్తున్న నేపథ్యంలో.. ఆ బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినదేనని లేఖ ఇవ్వాల్సి ఉందని, కానీ, ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే లేఖ ఇవ్వలేదా? అనే సందేహాలున్నాయని విచారణ నివేదికలో మన్మోహన్సింగ్ పేర్కొన్నట్లు తెలిసింది. ఏ రోజున బ్యాంకులో బంగారం పెట్టిందీ.. గడువు తీరాక ఎంత బంగారం టీటీడీకి జమ చేయాలో కూడా ఆ లేఖలో టీటీడీ ఈవో వివరించాల్సి ఉంటుందని, సదరు లేఖతో సహా బంగారం తరలింపునకు పంజాబ్ నేషనల్ బ్యాంకు చర్యలు తీసుకోవాల్సి ఉందని, అయితే ఇవేమీ పాటించలేదని నివేదికలో తేల్చిచెప్పినట్లు సమాచారం. ఆభరణాల్లోని రాళ్లు, రత్నాలను ఏం చేస్తున్నారు? స్వామి వారికి కానుకల రూపంలో వచ్చిన బంగారు ఆభరణాలను పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారని, అయితే అలా డిపాజిట్ చేసిన బంగారం గడువు తీరాక తిరిగి టీటీడీ ట్రెజరీకి చేరుతోందా? లేదా? అనే దానిపై తాజా ఘటన తరువాత సందేహాలు తలెత్తుతున్నాయనే అభిప్రాయాన్ని విచారణ నివేదికలో మన్మోహన్సింగ్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల నియామవళి అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు తనిఖీల్లో బయటపడింది కాబట్టి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, లేదంటే బ్యాంకుల నుంచి బంగారం తిరిగి టీటీడీ ట్రెజరీకి చేరుతోందా? లేదా మరో చోటుకి వెళ్తోందా? అనే అనుమానాలు వ్యక్తం కావడానికి టీటీడీతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంకులు అవకాశం కలిగించాయని చెప్పినట్లు సమాచారం. స్వామి వారికి ఆభరణాల రూపంలోనే భక్తులు బంగారం సమర్పిస్తారని, ఆ బంగారాన్ని కరిగించి కడ్డీలుగా మార్చడానికి ముందు ఆ ఆభరణాల్లో ఉన్న విలువైన రాళ్లు, రత్నాలను ఎక్కడ భద్రపరుస్తారో కూడా విచారించాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ‘‘డిపాజిట్ చేసిన బంగారం బ్యాంకు నుంచి టీటీడీ ట్రెజరీకి చేరే వరకూ తనకు సంబంధం లేదంటూ ఈవో చేసిన వాదన సరిగా లేదు. ఆయన పాటించాల్సిన నియమ నిబంధనలను పాటించలేదు. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా నిబంధనలు పాటించలేదు. తగిన భద్రత లేకుండా బంగారాన్ని తరలించడం ఏమిటి? ఇందులో టీటీడీ ఈవో, పంజాబ్ నేషనల్ బ్యాంకు తప్పిదాలకు పాల్పడ్డారు. భవిష్యత్తులో స్వామి బంగారం, ఆభరణాల విషయంలో మరింత పారదర్శకతతో వ్యవహరించాలి. దీనిపై ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి’’ అని విచారణ నివేదికలో మన్మోహన్సింగ్ సిఫార్సు చేసినట్లు సమాచారం. భక్తుల మనోభావాలతో వ్యాపారమా? తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించుకునే బంగారాన్ని టీటీడీ పాలక మండలి వ్యాపార వస్తువుగా మార్చేసిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హుండీ ద్వారా వచ్చే బంగారాన్ని అధికారులు కడ్డీలుగా మార్చి, బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. బ్యాంకులేమో ఆ బంగారాన్ని విక్రయించి, వచ్చిన సొమ్మును వడ్డీలకు ఇచ్చుకుంటున్నాయి. టీటీడీ డిపాజిట్ చేసిన బంగారంపై బ్యాంకులు చెల్లించే వడ్డీ 2 శాతంలోపే. అదే బంగారాన్ని అమ్మేసి, వచ్చిన సొమ్మును ప్రజలకు అప్పుగా ఇచ్చి 7 నుంచి 9 శాతం దాకా వడ్డీలు వసూలు చేస్తున్నాయి. అంటే బ్యాంకులు ఏ స్థాయిలో లాభపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గడువు తీరిన తర్వాత తమ వద్ద ఉండే ఇతర బంగారం, లేదంటే దేశవిదేశాల్లో కొనుగోలు చేసి టీటీడీకి బ్యాంకులు తిరిగి ఇచ్చేస్తున్నాయి. అంటే భక్తులు సమర్పించిన బంగారం అచ్చంగా అదే తిరిగి రాదు. ఇలా బంగారం డిపాజిట్లతో టీటీడీ ప్రతిఏటా రూ.60 కోట్ల దాకా వడ్డీ ఆర్జిస్తున్నట్లు అంచనా. శ్రీవారి ఖజానాలో 9,259 కిలోల బంగారం తమిళనాడులో తనిఖీల్లో పట్టుబడ్డ 1,381 కిలోల బంగారంపై భక్తుల్లో అనుమానాలు వెంటాడుతున్నాయి. దాన్ని ప్రస్తుతం టీటీడీ ఖజానాకు చేర్చారు. ఆ బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకు స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసి, విమానంలో భారత్‌కు తరలించినట్లు సమాచారం. టీటీడీ ఖజానాలో ప్రస్తుతం కడ్డీల రూపంలో 9,259 కిలోలకు పైగా బంగారం ఉన్నట్లు అంచనా. ఈ మొత్తం బంగారాన్ని నగదు రూపంలోకి మార్చాలని టీటీడీ పాలక మండలి యోచిస్తున్నట్లు సమాచారం. బంగారం డిపాజిట్లపై బ్యాంకులిచ్చే వడ్డీ 2 శాతం లోపే ఉండడం, నగదు డిపాజిట్లపై వడ్డీ 8 శాతానికి పైగానే ఉండడంతో బంగారాన్ని నగదు రూపంలో మారిస్తే అదనంగా 6 శాతం వడ్డీ వస్తుందని భావిస్తున్నారు. -
బంగారం వివాదంలో..టీటీడీకి సంబంధమే లేదు
తిరుపతి అర్బన్ : చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) నుంచి తిరుపతికి తీసుకొస్తూ పట్టుబడ్డ 1,381 కిలోల బంగారం వ్యవహారంలో టీటీడీకి ఎలాంటి సంబంధంలేదని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టంచేశారు. సోమవారం తిరుపతిలోని పరిపాలనా భవనంలో ఈవో మీడియాతో మాట్లాడారు. 2000వ సంవత్సరం ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు.. 2015కు చెందిన రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు టీటీడీ బంగారాన్ని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే 2016 ఏప్రిల్ 18న పంజాబ్ నేషనల్ బ్యాంకులో టీటీడీకి చెందిన 1,311 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. అందుకుగానూ ఈనెల 18తో గడువు ముగిసే ఆ డిపాజిట్‌కు వడ్డీతో కలిపి పీఎన్బీ అధికారులు టీటీడీకి 1,381 కిలోల బంగారాన్ని అప్పగించాల్సి ఉందన్నారు. అయితే, ఎన్నికల ప్రక్రియలో భాగంగా తమిళనాడు పోలీసుల జరిపిన తనిఖీల్లో ఆ బంగారం పట్టుబడడం, అనంతరం పూర్తి విచారణ, పరిశీలన తర్వాత ఎన్నికల అధికారులు దానిని విడుదల చేసినట్లు ఈవో వివరించారు. ఈ కారణంగానే రెండు రోజులు ఆలస్యంగా ఈనెల 20న రాత్రి తిరుపతిలోని టీటీడీ ఖజానాకు బంగారం చేరిందన్నారు. ఈ సమయంలో తమ బంగారు విభాగం నిపుణులు, సంబంధిత అధికారులు నాణ్యత, పరిమాణం అంశాలను పరిశీలించాకే 1,381 కిలోలను తీసుకోవడం పూర్తిచేశామన్నారు. కానీ, తాము బ్యాంకులో డిపాజిట్ చేసిన బంగారాన్ని వడ్డీతో కలిపి తిరిగి తమకు అప్పగించే వరకు పూర్తి బాధ్యత పీఎన్బీ అధికారులదేనని ఈవో వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో బంగారం తరలింపు విషయంలో చోటుచేసుకున్న వివాదానికి టీటీడీ ఏమాత్రం బాధ్యత వహించబోదన్నారు. టీటీడీకి చెందిన బంగారం డిపాజిట్ విషయంలో పూర్తిగా ఆర్బీఐ నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టంచేశారు. అందుకే అయితే ‘బోర్డు మీటింగ్’ అక్కర్లేదు చెన్నై పీఎన్బీ నుంచి తిరుపతికి తరలించిన బంగారం వివాదం కోసమే అయితే టీటీడీ బోర్డు మీటింగ్ అక్కర్లేదని ఈవో సింఘాల్ స్పష్టంచేశారు. ఈ విషయంలో టీటీడీ పూర్తి పారదర్శకంగానే వ్యవహరించిందన్నారు. అయితే, ఈ వివాదం అంశంపై త్వరలో బోర్డు మీటింగ్ నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ ప్రకటించారన్న అంశానికి ఈవో పైవిధంగా స్పందించారు. గడువు ముగిసిన బంగారం డిపాజిట్లను తిరిగి ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం, లేదా ఇతరత్రా నిర్ణయాలు మాత్రం బోర్డుతో పాటు ఆయా సబ్ కమిటీల నిర్ణయాల మేరకే ఉంటాయన్నారు. ఈ విషయంపై స్వామీజీలు చేస్తున్న వ్యాఖ్యలకు ఈ ప్రెస్‌మీట్ ద్వారా సమాధానం లభించినట్లేనని ఈవో తెలిపారు. సూచనలిచ్చేందుకే సీఎస్ విచారణకు ఆదేశం ఇదిలా ఉంటే.. 1,381 కిలోల బంగారం విషయంలో నాలుగు రోజులుగా రగులుతున్న వివాదం దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం టీటీడీ అధికారులకు ఏమైనా సూచనలు ఇచ్చేందుకే విచారణకు ఆదేశించి ఉంటారని ఈవో పేర్కొన్నారు. టీటీడీ పాలనతోపాటు ఇతర అనేక విషయాల్లో సంపూర్ణ అవగాహన కలిగిన ఆయన విచారణను తాము స్వాగతిస్తామన్నారు. -
తిరుమలలో ‘టీడీపీ’ హైడ్రామా
సాక్షి, తిరుపతి: తిరుమల స్థానికులు.. టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో టీడీపీ నేతలు ఆడిన హై డ్రామా సీన్ రివర్స్ అయ్యింది. ఐదేళ్లుగా అదిగో.. ఇదిగో అంటూ వాయిదా వేస్తూ వచ్చిన టీటీడీ పాలకమండలి మంగళవారం జరిగిన సమావేశంలోనూ తమ సమస్యలపై చర్చించకుండా ముగించడంపై తిరుమల వాసులు ఆగ్రహం వ్యక్తం చేసి పాలకమండలి సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్‌ని ఘెరావ్ చేస్తూ నినాదాలు చేశారు. అలాగే మంగళవారం ఉదయం తిరుపతి పరిపాలన భవనం వద్ద టీటీడీ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన కూడా ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. టీడీపీ నేతల తీరు వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. టీటీడీలో మొత్తం 14,370 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నా వేతనాలు పెంచలేదని పలుమార్లు టీటీడీ అధికారులు, పాలకమండలి సభ్యులు, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. ఫలితం లేకపోవడంతో తిరుపతిలో గత కొద్దిరోజులుగా దీక్షలు చేస్తున్నారు. మంగళవారం జరుగనున్న పాలకమండలి సమావేశంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించారు. అయితే అజెండాలో ఆ ప్రస్తావనే లేదని తెలిసి పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పరిపాలన భవనంలోకి అధికారులెవ్వరినీ వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని కార్మికులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్టు చేశారు. చైర్మన్‌ను అడ్డుకున్న తిరుమల స్థానికులు తిరుమలలో మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గొల్లకిష్టయ్య సందు, వరాహస్వామి ఆలయం వద్ద, దక్షిణ మాడవీధుల్లో నివాసం, దుకాణాలను తొలగించారు. నిరాశ్రయులైన స్థానికులు పునరావాసం, పరిహారంతో పాటు హాకర్స్ అనుమతుల కోసం పదేళ్లుగా పాలకుల చుట్టూ తిరుగుతున్నారు. టీడీపీ ప్రభుత్వానికి కేవలం రెండునెలల సమయం ఉండడం, పాలకమండలి సమావేశం ఇదే చివరిది అవుతుందని బాధితులు పాలకులపై ఒత్తిడి తెచ్చారు. సమావేశంలో చర్చించి న్యాయం చేయమని సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసంలో ఆందోళనకారులు చర్చలు జరిపారు. చేసేది లేక ఎమ్మెల్యే చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌తో కలిసి అన్నమయ్య భవన్లో జరుగుతున్న టీటీడీ పాలకమండలి సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి హై డ్రామాకు తెరతీశారు. కొంత సమయం నడచిన హైడ్రామా అనంతరం పాలకమండలి సమావేశం యధావిధిగా నడిచింది. సమావేశంలో తిరుమల స్థానికుల సమస్యలు చర్చకే రాలేదని, బడ్జెట్ చర్చతోనే ముగించారని తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. సమావేశం నుంచి బయటకు వెళుతున్న చైర్మన్ సుధాకర్‌యాదవ్‌ని అడ్డుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా సమ్మె బాట పట్టేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయా కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. సంబంధం లేనట్టు వ్యవహరించిన ఉన్నతాధికారులు టీటీడీ పాలకమండలి సమావేశం పూర్తయ్యాక తమకు ఎటువంటి సంబంధం లేనట్లు ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు వ్యవహరించారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. పాలకమండలిలో బడ్జెట్ కేటాయింపు వివరాలు మీడియాకు వివరించాల్సి ఉన్నా... ఇరువురు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఆంగ్లంలో ఉన్న బడ్జెట్ వివరాలు చదవడంలో చైర్మన్ సుధాకర్‌యాదవ్ తీవ్ర ఇబ్బంది పడ్డారు. -
సప్త వాహనాలపై సప్తగిరీశుడు
తిరుమల: సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి రథసప్తమి మహోత్సవం వైభవంగా జరిగింది. ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన రథసప్తమిలో సప్తవాహనాలపై ఊరేగుతూ మలయప్ప దివ్యమంగళ రూపంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 5.30 నుంచి రాత్రి 10 గంటల వరకు ఏడు వాహన సేవలు అంగరంగ వైభవంగా సాగాయి. సప్తవాహనాలపై సర్వాంతర్యామి వైభోగం మాఘమాసం శుద్ధ సప్తమి రోజు సూర్యజయంతి పర్వదినం పురస్కరించుకుని తిరుమలలో ప్రతిఏటా రథసప్తమి ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా మంగళవారం వేకువజామున ఆలయంలో సుప్రభాతం, అభిషేకం, ఇతర వైదిక సేవలు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం ఆలయం నుంచి మలయప్పను వాహన మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. మంగళ ధ్వనులు, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉదయం 5.30 గంటలకు సూర్య ప్రభ వాహనం ప్రారంభించి ఉదయం 7.50 గంటలకు పూర్తిచేశారు. తర్వాత వరుసగా చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలపై ఊరేగారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.15 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోకంగా నిర్వహించారు. తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కల్పవృక్ష , సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. కాగా, శ్రీవారి రథ సప్తమి వాహన సేవలు అంగరంగ వైభవంగా సాగాయని, రెండు లక్షల మందికి పైగా భక్తులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. -
నన్ను విధుల్లోకి తీసుకోండి..
తిరుమల: అర్చకుల వయోపరిమితి వివాదం టీటీడీని ఇప్పట్లో వీడేలా లేదు. తిరుచానూరు ఆలయంలో మిరాశీ అర్చకులకు వయోపరిమితి లేదంటూ.. వారిని విధుల్లోకి తీసుకోవాలని టీటీడీని హైకోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో అవే నిబంధనలను తమకూ వర్తింపచేయాలని శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు టీటీడీ ఈవోకు రెండు రోజుల కిందట లేఖ రాశారు. దీంతో అర్చకుల వివాదం ఒక్క పట్టాన తెగేలా లేదు. 1986లో మిరాశీ వ్యవస్థ రద్దు చేసినప్పటి నుంచి కూడా కోర్టుల చుట్టూ అర్చకుల వివాదం తిరుగుతూనే ఉంది. ఈ ఏడాది మే నెలలో అర్చకులకు 65 ఏళ్ల వయోపరిమితి నిబంధనలను అమలు చేయాలని టీటీడీ బోర్డు.. అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఫలితంగా శ్రీవారి ఆలయంలో ప్రధానార్చక హోదాలో ఉన్న నలుగురు మిరాశీ అర్చకులతో సహా.. తిరుచానూరు ఆలయంలోని అర్చకులతో పాటు దాదాపు 20 మంది అర్చకులకు ఉద్వాసన పలికారు. మిరాశీ అర్చకులకు వయోపరిమితి నిబంధన అమలు చేయడం సబబు కాదంటూ వారు కోర్టును ఆశ్రయించారు. రమణ దీక్షితుల ఉద్వాసనకే.. టీటీడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన రమణదీక్షితులను సాగనంపేందుకే అన్నట్లుగా 65 సంవత్సరాల వయోపరిమితి నిబంధనను పాలకమండలి తెరపైకి తెచ్చింది. శ్రీవారి ఆలయంలో ఏడుగురు, తిరుచానూరు అమ్మవారి ఆలయంలోని ఇద్దరు అర్చకులను ఉద్యోగ విరమణ చేయించారు. తిరుచానూరు అమ్మవారి ఆలయ అర్చకులు హైకోర్టునాశ్రయించగా.. శ్రీవారి ఆలయ అర్చకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ దశలో ఉండగానే.. హైకోర్టులో మాత్రం తిరుచానూరు అమ్మవారి ఆలయ అర్చకులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మిరాశీ అర్చకులకు రిటైర్మెంట్ అనేదే లేదని, పనిచేసే శక్తి ఉన్నన్నాళ్లు వారిని సంభావన అర్చకులుగా అర్చకత్వానికి అనుమతించాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇదే తీర్పును తమకు అమలుజేయాలని రమణదీక్షితులు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు వెంటనే లేఖ రాశారు. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే ఆలోచనలో ఉన్న టీటీడీ.. రమణదీక్షితుల వ్యవహారంలో ఎలా ముందుకెళుతుందోనన్నది ఆసక్తిగా మారింది. సుప్రీంకోర్టులో కేసు తేలే వరకు మిరాశీ అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకునే పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి టీటీడీలో కనిపించడం లేదు. రమణదీక్షితులు పక్షాన రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యంస్వామి కూడా హైకోర్టులో కేసును దాఖలు చేశారు. రమణదీక్షితులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ దశలోనే ఉంది. ఈ నేపథ్యంలో లేఖను పరిశీలించిన టీటీడీ.. న్యాయశాఖకు పంపినట్లు సమాచారం. -
నన్ను మళ్లీ విధుల్లోకి తీసుకోండి : రమణ దీక్షితులు
సాక్షి, తిరుమల : హైకోర్టు తీర్పును శిరసావహించి తనను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘల్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం టీటీడీ ఈవోకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. రెండు రోజుల క్రితమే ఈఓకు లేఖ రాశానని, స్పందించకపోవడంతో ఫోన్ చేసి మాట్లాడానని రమణ దీక్షితులు తెలిపారు. కాగా హైకోర్టు తీర్పు కాపీ ఇంకా తనకు అందలేదని ఈవో సింఘల్ పేర్కొన్నారు. మరికాసెపట్లో తిరుచానురు ఆలయ మాజీ అర్చకుల తరపు న్యాయవాది హైకోర్టు తీర్పు కాపీని ఈవోను అందజేయనున్నారు. ఈ రోజు సాయంత్రం టీటీడీ ఈవోను రమణ దీక్షితులు కలిసే అవకాశం ఉంది. -
పుష్పక విమానంపై సప్తగిరీశుని దివ్య దర్శనం
తిరుమల: వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం పుష్పక విమానంలో శ్రీవారు ఊరేగారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి సంప్రదాయబద్ధంగా చామంతి, వృక్షం, గన్నేరు, మల్లెలు, కనకాంబరాలు వంటి పుష్పాలతో తయారుచేసిన పల్లకీ పై విహరిస్తూ భక్తకోటికి తన దివ్యమంగళ రూప దర్శనంతో సాక్షాత్కరించారు. ఈ పుష్ప పల్లకీకి మొత్తం 300 కేజీల పూలను ఉపయోగించారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు అశేష భక్త జన గోవింద నామ స్మరణల మధ్య మంగళ వాయిద్యాలు, వేద పండితుల గోష్ఠి, జానపద కళా బృందాల సంగీత, గాన కచేరీలు కనువిందు చేయగా ఆద్యంతం ఉత్సవం వేడుకగా సాగింది. ఇక ఉదయం శ్రీరామచంద్రుని రూపంలో మలయప్ప స్వామి తన భక్తశిఖామణి హనుమంతుని వాహనంగా మలుచుకుని ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్బాణాలు చేతపట్టిన శ్రీరామచంద్రుడిని ఆంజనేయుడు తన భుజంపై ఉంచుకుని ఆలయ పురవీధుల్లో అశేష భక్త జనులకు కనువిందు చేశారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ముగ్ధమనోహరుడైన శ్రీనివాసుడు గజ వాహనంపై ఆశీనుడై రాజసంగా నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు. భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే తను శరణు కోరే వారిని ఎల్లవేళలా కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఈ వాహనంపై విహరించారు. ఆదివారం రాత్రి శ్రీవారి గరుడ వాహన సేవ వైభవంగా నిర్వహించామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. సోమవారం వారు మీడియా తో మాట్లాడుతూ.. టీటీడీ ఉద్యోగులు, విజిలెన్స్, పోలీసులు సమష్టిగా పనిచేసి వాహన సేవల్ని వైభవంగా నిర్వహించారని కొనియాడారు. గజవాహనంపై శ్రీనివాసుడు -
సాక్షి ‘ఫన్ డే’ ఆవిష్కరణ
సాక్షి, తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కథనాలతో ‘బ్రహ్మోత్సవానికి బ్రహ్మాండ నీరాజనం’శీర్షికన ప్రచురితమైన సాక్షి ‘ఫన్ డే’పుస్తకాన్ని గురువారం చిన్నశేషవాహనం ఊరేగింపులో ఆవిష్కరించారు. టీటీడీ ఈవో అనిల్కుమార్సింఘాల్ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక సంచిక తీసుకొచ్చిన ఘనత సాక్షి యాజమాన్యానికే దక్కిందని కొనియాడారు. తిరుమలేశుని లీలా వైభవం, కంటి మీద కునుకేలేని స్వామి, ఆలయంలోని కైంక ర్యాలు, చారిత్రక నేపథ్యం, భక్తులకు టీటీ డీ కల్పించే సౌకర్యాలు, కొత్త మార్పులతోపాటు అరుదైన ఫొటోలతో ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలతో వెలువడిన ‘ఫన్ డే’సంచిక విశ్లేషణాత్మకంగా ఉందన్నారు. సాక్షి యాజమాన్యం, విలేకరుల బృందాన్ని ఈవో అభినందించారు. ఫండే బుక్‌ను ఆవిష్కరిస్తున్న టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ..చిత్రంలో సాక్షి ప్రతినిధులు -
ఆగమోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుంచి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలపై ఏర్పాట్లపై ఆయన సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భక్తులకు పెద్దపీట శ్రీవారి దర్శనానికి భక్తులకే పెద్దపీట వేస్తాం. నలుమాడ వీధుల్లో 2 లక్షల 26 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశాం. వారికి 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 లక్షల వాటర్ ప్యాకెట్లను సిద్ధం చేశాం. ఒక్కో సెక్టార్‌కు ఒక అధికారకిని నియమించాం. తిరుమలలో ఇప్పటికే 900 సీసీ కెమెరాల నిఘా ఉంది. ఆలయ నలుమాడ వీధుల్లో 280 అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. వీటిని 24 గంటలు పర్యవేక్షించేందుకు టీవీవాల్, సిబ్బందిని ఏర్పాటు చేశాం. విజిలెన్స్ సిబ్బంది 3 వేల మంది, పోలీసులు 2,500 మంది బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వహిస్తారు. గరుడ సేవ రోజున అదనంగా మరో 1,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారు. హోంగార్డులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు టోల్‌ఫ్రీ నంబర్లు 18004254141, 1800425333333కు భక్తులు ఫిర్యాదు చేయవచ్చు. బ్రేక్ దర్శనాలు, సేవలు రద్దు బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశాం. రూ.98 కోట్ల వ్యయంతో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా నిర్మించిన నూతన భవనాలను బ్రహ్మోత్సవాల్లో ప్రారంభిస్తాం. భక్తుల సౌకర్యార్థం రూ.26 కోట్లతో అదనపు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాం. వాహనసేవలను తిలకిం చేందుకు మాడ వీధుల్లో 19, భక్తుల రద్దీ ఉన్న ఇతర ప్రాంతాల్లో 12 కలిపి మొత్తం 31 డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం. శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ చేస్తాం. తిరుమలలోని ప్రధాన కూడళ్లలో 11 ప్రథమ చికిత్స కేంద్రాల ఏర్పాటు చేస్తున్నారు. 3 వేల మంది శ్రీవారి సేవకులు, దాదాపు 1000 స్కౌట్స్ అండ్ గైడ్స్ తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు సేవలందిస్తారు.’ అని ఈవో వివరించారు. -
ఆగమోక్తంగా అష్టబంధన సమర్పణ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణలో భాగంగా మంగళవారం ఆగమోక్తంగా అష్టబంధన సమర్పణ జరిగింది. ఉదయం 5.30 నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరిగి రాత్రి 7 నుంచి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. గర్భాలయంలోని శ్రీవారి మూలమూర్తితోపాటు ఉప ఆలయాలైన గరుడాళ్వార్, పోటు తాయార్లు, వరదరాజస్వామి, యోగ నరసింహస్వామి, విష్వక్సేన, భాష్యకార్లు, వేణుగోపాలస్వామి, బేడి ఆంజనేయస్వామివారి విగ్రహాలకు అష్టబంధన సమర్పణ జరిగింది. ఈ అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో సమర్పించారు. ఆనందనిలయ విమానం, ధ్వజస్తంభం శుద్ధి పనులను టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు పరిశీలించారు. ధ్వజస్తంభ శిఖరానికి అలంకరించేందుకు రూ.1.5 లక్షల విలువైన 11 నూతన బంగారు రావి ఆకులను, పీఠానికి, స్తంభానికి మధ్య ఉంచేందుకు రూ.4 లక్షల విలువైన బంగారు చట్రాన్ని, విమాన వేంకటేశ్వర స్వామికి అలంకరించేందుకు రూ.1.75 లక్షల విలువైన వెండి మకరతోరణాన్ని టీటీడీ సిద్ధం చేసింది. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా బుధవారం ఉదయం శ్రీవారి మూలవర్లకు, పరివార దేవతలకు చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు మహాశాంతి పూర్ణాహుతి, తరువాత శ్రీవారి మూలవర్లకు, పరివార దేవతలకు మహాశాంతి తిరుమంజనం చేపడతారు. రాత్రి యాగశాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
‘ఆగమ సలహా మండలి సూచనలు తీసుకుంటున్నాం’
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టదిగ్బంధన బాలాలయ మహా సంప్రోక్షణను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై ఆగమ సలహా మండలి సూచనలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. మహా సంప్రోక్షణను లైవ్‌లో ప్రసారం చేయడం కుదరన్న టీటీడీ నిర్ణయంపై ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో మహా సంప్రోక్షణపై విచారణ చేపట్టని హైకోర్టు.. ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అభ్యంతరాలు ఏంటని ప్రశ్నించింది. అదే సమయంలో నివేదిక సమర్పించాలని కోరింది. దాంతో దిగివచ్చిన టీటీడీ.. ఆగమ సలహా మండలి సూచనలు తీసుకుంటుంది. ఈ మేరకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. ఆగమ సలహా మండలి సూచనలు తీసుకున్న తర్వాతే మహా సంప్రోక్షణ ప్రత్యక ప్రసారంపై ఒక నిర్ణయానికి వస్తామన్నారు. ఆపై హైకోర్టుకు నివేదిక అందజేస్తామని తెలిపారు. మరొకవైపు టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె తప్పదని హెచ్చరించిన నేపథ్యంలో వారితో ఈవో అనిల్‌కుమార్ చర్చలు జరుపుతున్నారు. ఉద్యోగులు సమస్యలను తన దృష్టికి తెచ్చిన విషయాన్ని స్పష్టం చేసిన ఈవో.. సమస్యలపై చర్చలు జరుపుతున్నామన్నారు. -
శ్రీవారి దర్శనం రద్దుపై టీటీడీ పునరాలోచన
-
ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి 50శాతం ఇవ్వండి
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్ డిప్ విధానం ద్వారా 50 శాతం, ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి మొదటి ప్రాధాన్యత కింద మరో 50శాతం టికెట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ను కోరారు. తిరుమలలో ప్రతి నెల మొదటి శుక్రవారం నిర్వహించే డయిల్ యువర్ ఈవో కార్యక్రమంలో 16 మంది భక్తులు తమ సూచనలు, సలహాలు, విన్నపాలు తెలియజేశారు. ఆర్జిత సేవలు పరిమితంగా ఉన్నాయని, లక్షమందికి పైగా భక్తులు నమోదు చేసుకుంటున్నారని వారిలో కేవలం 5 వేల మందికి మాత్రమే అవకాశం లభిస్తుందని ఈవో తెలిపారు. వేసవి సెలవుల అనంతరం వృద్ధులు, దివ్యాంగులు 5ఏళ్ళలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు నెలలో 2రోజుల పాటు కల్పించే ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని తిరిగి అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జూలై 10, 24 తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులు, జూలై 11, 25 తేదీల్లో 5ఏళ్ళలోపు చంటిపిల్లలు, వారి తల్లిదండ్రులకు దర్శనభాగ్యాన్ని కల్పిస్తామన్నారు. కాగా, శ్రీవారి ఆలయంలో 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం, ఆగçస్టు 12 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఈ తేదీల్లో ఆర్జిత సేవలన్నీ రద్దు చేశామన్నారు. ఆన్లైన్లో 53,642 ఆర్జిత సేవా టికెట్లు విడుదల శ్రీవారి ఆర్జితసేవలకు సంబంధించి అక్టోబర్ నెల కోటాలో మొత్తం 53, 642 టికెట్లను శుక్రవారం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ విడుదల చేశారు. ఆన్లైన్ డిప్ విధానంలో 9,742 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 7,597, తోమాల 90, అర్చన 90, అష్టదళ పాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 1,725 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్లైన్లో జనరల్ కేటగిరీలో 43,900 సేవా టికెట్లు ఉండగా వీటిలో విశేష పూజ 2,000, కళ్యాణం 9,975, ఊంజలసేవ 3,150, ఆర్జిత బ్రహ్మోత్సం 5,775, వసంతోత్సవం 11,000, సహస్రదీపాలకంరణ సేవ 12,000 టికెట్లును విడుదల చేశారు. కాగా భక్తుల సౌకర్యార్థం అక్టోబర్ నెలకు సంబంధించి రూ.300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్, ఈ– దర్శన్, పోస్టాఫీస్‌లో ఈనెల 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చని టీటీడీ పేర్కొంది. -
మండలి సభ్యుడిగా రమణ దీక్షితులు తొలగింపు
సాక్షి, తిరుమల : గతకొన్ని రోజులుగా రమణ దీక్షితులు టీటీడీ పాలక మండలిపై ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించిన అధికారులు.. రమణ దీక్షితులను ఆగమ సలహా మండలి సభ్యుడిగా తొలగించాలని తీర్మానించారు. ఈ సమావేశంలోనే మరికొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. వాటిలో కొన్ని.. రమణ దీక్షితులు స్థానంలో వేణుగోపాల్ దీక్షితులు నియామకం, మీరాశి వంశీకుల నుంచి అర్హత కలిగిన 12మంది అర్చకులను నియమించడం, తిరుమలలో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 15కోట్లు, గోవిందరాజు స్వామి ఆలయం గోపురం బంగారు తాపడానికి 32కోట్లు, ఒంటి మిట్టలోని కోదండ స్వామి ఆలయ అభివృద్ది పనులకు రూ.36కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దివ్య దర్శనం కోసం రూ. 1.25కోట్లు, ప్రకాశం జిల్లా దుడ్డుకురు గ్రామంలో చెన్నకేశవ స్వామి ఆలయ పునరుద్దరణకు 25లక్షలు, అనంతపురం జిల్లా పరిగి మండలం మోద గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 75లక్షలు, రోద్దకంబ ఆలయ సమీపంలో కమ్యూనిటీ హాల్‌కు రూ. 75లక్షలు, తిరుమలలో యాత్రికుల వసతి సముదాయ నిర్మాణానికి రూ.79కోట్లు కేటాయించినట్లు టీటీడీ ఈవో సింఘాల్ ప్రకటించారు. చిల్లర నాణేల మార్పిడిపై ఆర్బీఐతో సంప్రదింపుల కోసం కమిటీని నియమించినట్లు తెలిపారు. రమణ దీక్షితులుకు ఇచ్చిన నోటీసులపై ఇంకా వివరణ రాలేదని తెలిపారు. నూతన కళ్యాణ మండపాల నిర్మాణంపై సబ్ కమిటీ నివేదిక అందిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ఈవో సింఘాల్ తెలిపారు. -
రమణదీక్షితులుపై చర్యలకు సిద్ధమైన టీటీడీ
-
విజిలెన్సు నివేదికలో వందల కోట్ల విలువైన డైమండ్
-
టీటీడీలో మరో వివాదం మొదలైంది
-
టీటీడీలో రాజుకున్న మరో వివాదం..
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో మరో వివాదం మొదలైంది. ఇటీవల ప్రధాన అర్చుకులు రమణ దీక్షితులును తొలగించడం, టీటీడీలో విలువైన సొత్తు మాయం అంటూ గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రధాన అర్చకులుగా వేణుగోపాల్ దీక్షితులును నియమించి టీటీడీ నిబంధనలు ఉల్లంఘించిందంటూ తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై టీటీడీ ఈవో అనిల్ సింఘాల్‌కి గొల్లపల్లి వంశ అనువంశిక అర్చకుడు ఏఎస్ సుందరరామ దీక్షితులు లేఖ రాశారు. కాగా, గొల్లపల్లి వంశీకులతో సంప్రదింపులు చెయ్యకుండానే టీటీడీ నిర్ణయం తీసుకుందన్నారు. నేటికి కూడా తమకిచ్చే సంభావనలో టీటీడీ రికవరీ చేస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. గొల్లపల్లి వంశంలో రమణ దీక్షితులు తర్వాత సీరియర్‌ని తానేనని ఏఎస్ సుందరరామ దీక్షితులు వాదిస్తున్నారు. దీంతో ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులును తొలగించిన స్థానంలో తనను నియమించాలని విజ్ఞప్తి చేశారు. రమణ దీక్షితులు తర్వాత వయసు దృష్ట్యా పూర్వపు మిరాశీదారుగా తనకు అవకాశం ఇవ్వాలన్నారు. కానీ తనను పరిగణనలోకి తీసుకోకుండా, మరొకరికి ప్రధాన అర్చక పదవి ఇచ్చి తనకు తీవ్ర అన్యాయం చేశారని ఏఎస్ సుందరరామ దీక్షితులు తన లేఖలో పేర్కొన్నారు. -
నిక్షేపాల కోసం వంటగదిలో తవ్వకాలు జరిపారు
-
ప్రశ్నిస్తే పంపేస్తారా..?
-
నా ఆరోపణలకు కట్టుబడి ఉన్నా: రమణదీక్షితులు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి వంటశాల(పోటు) గురించి తాను చేసిన ఆరోపణలపై కట్టుబడి ఉన్నానని ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపిస్తే అన్నీ నిజాలు బయటకొస్తాయని, వాటిని నిరూపించడానికి సిద్ధమని ఆయన తెలిపారు. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా శ్రీవారి పోటును మూసివేసి, తవ్వకాలు జరిపారని పునరుద్ఘాటించారు. పింక్ డైమండ్ విషయంలో ఆలయ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అసలు పింక్ డైమండే లేదని, అది పింక్ రూబీ మాత్రమేనని ఈవో చెప్తుతున్నారని మండిపడ్డారు. -
సీబీఐతో విచారణ చేయిస్తేనే నిజాలు తెలుస్తాయి
-
సీబీఐ విచారణ చేయించండి
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి పలు ప్రశ్నలు సంధించారు. ఆదివారం ఆయన హైదరాబాద్ అబిడ్స్‌లోని ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీవారి ఆభరణాలు సురక్షితమని, అన్నీ ఆగమశాస్త్రం ప్రకారమే చేపడుతున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించిన కొన్ని గంటల్లోనే రమణ దీక్షితులు తన వాదనను మళ్లీ వినిపించారు. తాను చేసిన ఆరోపణలకు, విమర్శలకు కట్టుబడి ఉన్నానని ఆయన ప్రకటించారు. వాటిపై సీబీఐతో విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. అలాగే మరోసారి కొన్ని విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ టీటీడీ అధికారులు, ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాచీన కట్టడంపై పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఎవరి అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎలా చేపడతారంటూ ఆయన ప్రశ్నించారు. కేవలం నాలుగు బండలను తొలగించడానికి 22 రోజులపాటు పోటును ఎందుకు మూసివేశారో చెప్పాలని నిలదీశారు. స్వామివారికి మూడు పూటలా అన్న ప్రసాదాలు తయారు చేసే పోటును మూసివేయడం అపచారమన్నారు. తాత్కాలికంగా మరోచోట ప్రసాదాలు తయారు చేస్తున్నారని, ఇది ఆగమశాస్త్రానికి విరుద్ధం అన్నారు. ప్రసాదం తయారీని భక్తులు చూడకూడదని, కేవలం తయారు చేసే వ్యక్తి, అర్చకుడు మాత్రమే వాటిని పర్యవేక్షించాలని రమణ దీక్షితులు అన్నారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ స్వామివారిని పస్తులుంచడం ఘోరమని వ్యాఖ్యానించారు. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కట్టడం భాగం పడగొట్టి, రాళ్లు తొలగించాల్సిన అవసరమేముందని, వాటి కింద ఏమున్నాయని ఈ అపచారానికి పాల్పడ్డారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. మరమ్మతుల పేరుతో ప్రాచీన కట్టడాలను పడగొట్టడం ఎంతవరకు శ్రేయస్కరమంటూ నిలదీశారు. ఎవరి అనుమతి లేకుండా మరమ్మతులు చేయడం ఎందుకోసం అని ప్రశ్నించారు. నేలమాళిగల కోసం తవ్వారా? అన్నదానికి సమా«ధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకొస్తాయని అన్నారు. గులాబీ రంగు వజ్రం ఏమైంది..? గులాబీ రంగు వజ్రం దేశం దాటిపోయిందన్న తన ఆరోపణకు కట్టుబడి ఉన్నానని రమణ దీక్షితులు చెప్పారు. ఇటీవల జెనీవాలో వేలానికి వచ్చిన గులాబీ రంగు వజ్రం, శ్రీవారి ఆలయంలో భక్తులు విసిరిన నాణేలు తగిలి పగిలిందని చెబుతున్న వజ్రం ఒకటేనన్నారు. శ్రీవారి అలంకారానికి పాత నగలు ఎందుకు వాడటంలేదని నిలదీశారు. కొత్త నగలు మాత్రమే వాడడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. టీటీడీ కింద అర్చకులు జీతగాళ్లుకాదన్నారు. కేవలం సంభావన కింద మాత్రమే పనిచేస్తున్నామని తెలిపారు. శిల్ప సంపదతో కూడిన వెయ్యి కాళ్ల మండపాన్ని తొలగించ వద్దని చెప్పినా వినిపించుకోలేదని పేర్కొన్నారు. రథ మండపాన్ని కూడా తీసేసి అపచారం చేశారన్నారు. వీటన్నింటినీ ప్రశ్నిస్తున్నందుకే తనను ప్రధాన అర్చక హోదా నుంచి తొలగించారన్నారు. నేను తప్పులు చేస్తే శిక్షించండి... కానీ శ్రీవారి ఆస్తులను మాత్రం కాపాడండి.. అని విజ్ఞప్తి చేశారు. -
12 నామాలు పెట్టరు.. సెంట్ రాసుకొని తిరుగుతారు!
సాక్షి, తిరుమల: కలియుగదైవానికి పూజలు జరిపించే అర్చకుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. శ్రీవారి ఆభరణాలు మాయమవుతున్నాయంటూ, పోటు(వంటశాల)ను 22 రోజులపాటు మూసివేయడంలో కుట్రదాగుందంటూ తీవ్రస్థాయిలో అనుమానాలు వ్యక్తం చేసిన మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులుపై ప్రస్తుత అర్చకులు అంతేస్థాయిలో మండిపడ్డారు. రమణదీక్షితులు గొల్లపల్లి వంశానికి దత్తపుత్రుడని, 12 నామాలు పెట్టుకోకుండా స్వామివారికి కైకకర్యాలు చేస్తారని, కొడుకులకేమో అభిషేక విధులు అప్పగించి, మిగతావారికి ఆర్జితసేవ డ్యూటీలు వేసేవారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం తిరుమలలో ప్రధాన అర్చకులు, సంభవ అర్చకులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. (చదవండి: తొలగించిన బండల కింద ఏమున్నాయి: రమణ దీక్షితులు) ఆయన 12 నామాలు పెట్టుకోరు.. ‘‘25 ఏళ్లపాటు శ్రీవారి ఆలయం రమణదీక్షితులు ఆధ్వర్యంలోనే నడిచింది. కొత్తవారికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చారు తప్ప మరో ఉద్దేశంలేదు. కానీ తనను, తన కుమారులను విధుల నుంచి తప్పించారని రమణదీక్షితులు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఆయనను ఆలయం నుంచి ఎవరూ బయటికి పంపలేదు. అయితే గడిచిన కాలమంతా ఆయన తీరుతో అందరూ ఇబ్బందులు పడ్డారు. నిజానికి శ్రీవారికి పంగనామాలు పెట్టిందే ఆయన. వారు ఏనాడూ 12 నామాలు పెట్టుకోలేదు. కానీ సెంటు రాసుకుని ఆడీకారులో తిరుగుతారు. అసలు 12 నామాలు లేనిదే స్వామివారికి కైకర్యాలు చేయకూడదు. ఆయన గొల్లపల్లి వంశానికి దత్త పుత్రుడు. కల్యాణోత్సవంలో కనీసం మత్రాలు చెప్పగలరా? తన కొడుకులకు మాత్రం అభిషేక విధులు వేస్తారు. మిగతావారికి ఆర్జితసేవల డ్యూటీలు కేటాయిస్తారు. స్వామివారికి బయటి నుంచి అన్నప్రసాదాలు తేవడం గతం(2001)లోనూ జరిగింది. ఇకపోతే, సౌందర రాజన్‌కు ఏం సంబంధం ఉందని ఈ ఆలయం గురించి మాట్లాడుతున్నారు? ఆత్రయబాబు ఒక న్యాయవాది. ఆయన కూడా రమణదీక్షితులును సమర్థించడమేంటి? ముఖ్యమంత్రి ముందే కంకణ బట్ట వస్ర్తం లాక్కున్నప్పుడు వీళ్లలో ఎవరూ మాట్లాడలేదు. 2013 నుండి నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. ప్రధాన అర్చకుడిగా ఒకటే కోరుతున్నాను.. మంచిని నేర్పిస్తే మేము సహకరిస్తాం. చెడుకు ఎట్టిపరిస్థితుల్లో సపోర్ట్ చేయం. స్వామివారి సేవకు మూడో తరం వారికి అవకాశం వచ్చింది. బ్రాహ్మణ సంఘాలు, అర్చక సంఘాలు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని వేణుగోపాల దీక్షితులు అన్నారు. (చూడండి: వజ్రం ఎక్కడైనా పగులుతుందా?) ఆరోపణల్లో నిజంలేదు.. ‘‘గత వారం రోజులుగా వినిపిస్తోన్న ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిజంకాదు. స్వామివారికి నైవేద్యాలు, కైంకర్యాలు సకాలంలోనే జరుగుతున్నాయి. సేవల్లో మార్పులు జరిగాయంటే అది సమిష్టినిర్ణయంతో జరిగినవే. పోటులో ఇంతకుముందు కూడా చాలా మార్పులు జరిగాయి. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు మరమ్మత్తులు చేసిన విషయం గుర్తే. అన్ని సందర్భాల్లోనూ ఆగమ సలహాల ప్రకారమే నిర్ణయాలు జరిగాయి’’ అని కృష్ణశేషచల దీక్షితులు పేర్కొన్నారు. రాయల నగలు చూపలేదు.. కైంకర్యపరులు 32 మందిమి ఉన్నాం. అందరికీ 65 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరాం. మిరాసి అర్చకుల మాదిరిగానే మాకూ నిబంధనలు వర్తింపజేయాలని అడిగాం. రిటైర్మెంట్ అనేది అర్చకులకు అవసరం. ఈ వయో పరిమితి ద్వారా వారి తర్వాతి వంశాలకు అవకాశం వస్తుంది. కైంకర్య పరుల పిల్లలకు కూడా ఆ అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. స్వామివారికి కైంకర్యాల విషయంలో ఎలాంటి లోపం జరగలేదు. నగల విషయంలో వస్తున్న ఆరోపణలు కూడా నిరాధారమైనవి. రాయలవారి నగలు ఎక్కడా చూపలేదు. మైసూరు, గద్వాల్, వెంకటగిరి రాజావారలు ఇచ్చిన నగల వివరాలు మాత్రమే ఉన్నాయి. రమణదీక్షితులు నగలు తిరిగిచ్చినప్పుడు కూడా రాయల నగల ప్రస్తావనేలేదు. రమణధీక్షతుల కుమారులు కూడా కైంకర్యాలకు సరిగా రారు. ఇదేమని అడిగినందుకే అడిగినందుకే ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారు. తోటి అర్చకులను ఆయన హీనంగా చూస్తారు..’’ అని కాత్తి నరసింహ దీక్షితులు అన్నారు. -
వజ్రం ఎక్కడైనా పగులుతుందా?
సాక్షి, అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు, ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితుల మధ్య వివాదం రోజు రోజుకు ముదిరిపోతోంది. ఆలయం నిర్వహణపై గత కొద్దికాలంగా రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ సింఘాల్ స్పందించారు. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. అయితే మరికొద్ది సేపటికే మీడియా ముందుకు వచ్చిన రమణ దీక్షితులు మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరతరాలుగా శ్రీవారి ఆభరణాలను అర్చకులు కాపాడుతూ వచ్చారని అన్నారు. 1996లో మిరాశి రద్దు కావడంతో ఆభరణాలను టీటీడీ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచే స్వామివారి ఆభరణాలకు రక్షణ కరువైందని ఆయన ఆరోపించారు. ఐదు పేట్ల ప్లాటినం హారంలో గులాబీ రంగు వజ్రం ఉండేదని, గరుడ సేవలో భక్తులు విసిరిన నాణేలకు వజ్రం పగిలిందని రికార్డుల్లో రాశారని, వజ్రం పగలడం జరుగుతుందా అని రమణ దీక్షితులు ప్రశ్నించారు. ఇటీవల జనీవాలో వేలం వేసిన వజ్రం ఇక్కడిదే అయి ఉండచ్చొని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఇరువై రెండేళ్లలో ఎన్ని మణులు, మాణిక్యాలు కనిపించకండా పోయాయని, వాటిపై ఎందుకు విచారణ చేపట్టేదని నిలదీశారు. ఇలాంటి తప్పిదాల కారణంగానే స్వామివారి తేజస్సు తగ్గిపోతోందని, అలా జరిగితే భక్తులకు అనుగ్రహం దొరకదని అన్నారు. వెయ్యికాళ్ల మండపం తొలగించకూడదని చాలాసార్లు చెప్పామని, శిల్ప సంపదతో కూడిన మండపాన్ని కాపాడాలని కోరినా కూడా ఫలితం లేకుండా పోయిందని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. రథ మండపాన్ని కూడా తేసేశారని అన్నారు. వీటన్నింటిని ప్రశ్నిస్తున్నందుకే తనని తొలగించారని పేర్కొన్నారు. శ్రీవారి అలంకారానికి పాత నగలు బదులు కొత్త నగలు ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించారు. టీటీడీ కింద అర్చకులు జీతగాళ్లు కాదని, సంభావణ కింద పనిచేస్తామని తెలిపారు. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ప్రాకారాలను ఎందుకు తవ్వారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉందన్నారు. తాను తప్పులు చేస్తే శిక్షించాలని.. కానీ శ్రీవారి ఆస్తులను కాపాడాలని కోరారు. -
శ్రీవారికి నూతన ప్రధాన అర్చకులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి పూజా కైంకర్యాల నిర్వహణకోసం కొత్తగా నలుగురు ప్రధాన అర్చకులు నియమితులయ్యారు. అనూహ్య పరిణామాల మధ్య గొల్లపల్లి కుటుంబం నుంచి వేణుగోపాల దీక్షితులు, పైడిపల్లి కుటుంబం నుంచి కృష్ణ శేషసాయి దీక్షితులు, పెద్దింటి వంశం నుంచి శ్రీనివాస దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి గోవిందరాజ దీక్షితులను ఆలయ ప్రధాన అర్చకులుగా నియమిస్తూ టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీలో 65 ఏళ్లు దాటిన అర్చకులను విధుల నుంచి తొలగించి ఉద్యోగ విరమణ వర్తింపజేయాలన్న నిర్ణయం నేపథ్యంలో ఆలయ ప్రధానార్చక కుటుంబాలకు చెందిన రమణ దీక్షితులు, నరసింహదీక్షితులు, శ్రీనివాస దీక్షితులు, నారాయణ దీక్షితుల స్థానంలో వీరిని నియమించారు. ఆ మేరకు వీరు నలుగురూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మొదటిరోజు వంతుగా ప్రధానార్చక విధుల్లో ఉన్న వేణుగోపాల దీక్షితులు శుక్రవారం ఉదయం స్వామివారికి పూర్ణాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం నూతన ప్రధాన అర్చకులు ఆనంద నిలయానికి పక్కనే ఉన్న వైఖానస అర్చక నిలయంలో మీడియాతో మాట్లాడారు. వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ.. 65 ఏళ్లు దాటాక అర్చకులకు రిటైర్మెంట్ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించడం శుభపరిణామమన్నారు. దీనివల్ల భవిష్యత్ తరాల వారికీ స్వామివారిని సేవించే భాగ్యం దొరుకుతుందన్నారు. కృష్ణ శేషసాయి దీక్షితులు మాట్లాడుతూ.. టీటీడీలో చోటు చేసుకున్న మార్పులను స్వాగతిస్తున్నామన్నారు. కాగా, వేంకటేశ్వరస్వామి నైవేద్య సమర్పణలో ఎలాంటి లోటు లేదని జియ్యంగార్లు పేర్కొన్నారు. టీటీడీ అధికారులు, అర్చకుల వివాదం నేపథ్యంలో పెద్దజియ్యర్, చిన్నజియ్యర్లు తిరుమలలోని తిరుమలాంబి వద్ద మీడియా ముందుకు రావడం సంచలనం కలిగించింది. -
టీటీడీలో పురావస్తు లేఖ కలకలం
సాక్షి, తిరుమల: టీటీడీకి భారత పురావస్తు శాఖ శుక్రవారం రాసిన లేఖ కలకలం రేపింది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని రక్షిత సంపదగా గుర్తించాలని పురావస్తు శాఖ ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ఆలయ చారిత్రక ప్రాధాన్యతాంశాలను పరిశీలించేలా, దాన్ని రక్షిత సంపదగా గుర్తించేలా తమ శాఖ ప్రతినిధులకు సహకరించాలని పురావస్తు శాఖ నుంచి టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు లేఖ అందింది. అయితే తిరుమల శ్రీవారి ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించే ప్రసక్తే లేదని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ శనివారం స్పష్టం చేశారు. అనంతరం టీటీడీ ఈవోకు పంపిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్టు భారత పురావస్తు శాఖ అధికారిణి టి.శ్రీలక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం లేఖ విడుదల చేశారు. దీనిపై టీటీడీ ఈవో హర్షం వ్యక్తం చేశారు. -
వైభవంగా అప్పన్న చందనోత్సవం
సింహాచలం: వైశాఖ శుద్ధ తదియని పురస్కరించుకుని సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. భక్తులు స్వామివారి నిజరూపాన్ని దర్శించుకొని పరవశించారు. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం తెల్లవారుజాము ఒంటిగంటకు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి చందనం ఒలుపును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆరాధన నిర్వహించి దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజుకు తొలిదర్శనం కల్పించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్వామికి పట్టువస్త్రాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, డాలర్ శేషాద్రి తరలివచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు అందజేశారు. విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి, మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొల్లురవీంద్ర, చినరాజప్ప, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీతారామ్మూర్తి, జస్టిస్ శివశంకర్‌రావు, జె.ఉమాదేవి, ఎ.రామలింగేశ్వరరావు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, విశ్వంజీమహరాజ్ స్వామి దర్శించుకున్నారు -
టీటీడీ డిపాజిట్లు భద్రమేనా!?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కోట్లాది రూపాయల డిపాజిట్ల భద్రతపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, టీటీడీ ఇన్వెస్ట్మెంట్ కమిటీ సూచనల మేరకు భద్రత విషయంలోనూ, బ్యాంకుల ఎంపికలోనూ తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ చెబుతున్నప్పటికీ భక్తుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తిరుపతికి చెందిన శ్రీవారి భక్తుడు, రాయలసీమ పోరాట కమిటీ కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి సోమవారం సాయంత్రం తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి టీటీడీకి చెందిన రూ.4 వేల కోట్ల డిపాజిట్లను అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు కట్టబెట్టారని సంచలన ఆరోపణ చేశారు. ఎక్కువ వడ్డీ ఇస్తామన్న విజయా బ్యాంకును పక్కన పెట్టి దానికంటే తక్కువ కొటేషన్ దాఖలు చేసిన ఆంధ్రా బ్యాంకుకు రూ.3 వేల కోట్లు, ప్రైవేటు బ్యాంకు ఇండస్కు రూ.1,000 కోట్లు డిపాజిట్లు ఇవ్వడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు. ఇందులో పెద్దఎత్తున అవకతవకలు ఉన్నాయని నవీన్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు బ్యాంకుకు రూ.1000 కోట్లు టీటీడీకి చెందిన రూ.10,589 కోట్ల డిపాజిట్లలో ఈ మార్చి 31 నాటికి రూ.4 వేల కోట్ల విలువైన డిపాజిట్ల కాలపరిమితి ముగిసింది. వీటిని తిరిగి డిపాజిట్ చేసే క్రమంలో టీటీడీ అధికారులు వివిధ బ్యాంకుల నుంచి వడ్డీ రేట్లు కోరుతూ సీల్డు బిడ్ కొటేషన్లు ఆహ్వానించారు. తొమ్మిది ప్రభుత్వరంగ బ్యాంకులు, నాలుగు ప్రైవేటు బ్యాంకులు సమర్పించిన సీల్డు బిడ్ కొటేషన్లను పరిశీలించిన అధికారులు ఆంధ్రా బ్యాంకులో రూ.3 వేల కోట్లు (వడ్డీ 7.32 శాతం), ఇండస్ బ్యాంకులో రూ.1,000 కోట్లు (వడ్డీ 7.66 శాతం) డిపాజిట్లు చేశారు. దీంతో కొటేషన్ల స్వీకరణ, బ్యాంకుల ఎంపికలో పారదర్శకత పాటించలేదని ఆరోపణలు వెల్లు వెత్తాయి. ఎక్కువ వడ్డీ ఇస్తామన్న విజయా బ్యాంకును కాదని దానికంటే తక్కువ వడ్డీ కోట్ చేసిన బ్యాంకులకు డిపాజిట్లు అప్పగిం చారని నవీన్‌కుమార్‌రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతా పారదర్శకమే.. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఈ విషయమై మీడియాకు వివరణ ఇస్తూ.. టీటీడీ నగదును డిపాజిట్ చేసే విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టంచేశారు. సీల్డు కొటేషన్లు పరిశీలించాకే బ్యాంకుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఆర్థిక స్థితిగతులను బట్టి డిపాజిట్ల విషయంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనికితోడు టీటీడీ ఇన్వెస్ట్మెంట్ కమిటీ సూచనల మేరకు కొటేషన్లు ఆహ్వానించగా 9 జాతీయ బ్యాంకులు, 4 ప్రైవేటు బ్యాంకులు తాము చెల్లించే వడ్డీ రేటును వెల్లడిస్తూ కొటేషన్లు పంపాయన్నారు. అదనపు వడ్డీ రాబట్టేందుకు రివైజ్డ్ కొటేషన్ల అడిగామన్నారు. తుది కొటేషన్లు పరిశీలించాకే ఆంధ్రా బ్యాంకులో రూ.3 వేల కోట్లు, ఇండస్ బ్యాంకులో రూ.1000 కోట్లు డిపాజిట్లు చేశామన్నారు. విజయా బ్యాంకు 7.27శాతం వడ్డీ మాత్రమే చెల్లిస్తామని చెప్పిందన్నారు. -
ఆన్లైన్లో 61,858 ఆర్జితసేవా టికెట్లు
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి మే నెల కోటాలో మొత్తం 61,858 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసినట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆన్లైన్ డిప్ విధానంలో 10,913 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 8,013, తోమాల 150, అర్చన 150, అష్టదళ పాదపద్మారాధన 300, నిజపాద దర్శనం 2,300 టికెట్లు ఉన్నాయని వివరించారు. పాతవిధానంలో 50,945 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 1500, కల్యాణం 11,625, ఊంజల్‌సేవ 3,100, ఆర్జితబ్రహ్మోత్సవం 6,665, వసంతోత్సవం 13,330, సహస్రదీపాలంకారసేవ 14,725 టికెట్లు ఉన్నాయని తెలిపారు. టికెట్లు రిజిష్ట్రేషన్ చేసుకునేందుకు నాలుగు రోజుల పాటు అవకాశం ఉంటుందని, లక్కీడిప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు ఆ తర్వాత 3 రోజుల్లోపు టికెట్లకు సంబంధించి నగదు చెల్లింపులు చేయాల్సి ఉంటుందన్నారు. విదేశీ నాణేలు మార్పిడికి చర్యలు: ఈవో టీటీడీ ఖజానాలో మొత్తం 45 టన్నుల విదేశీ నాణేలు ఉన్నాయని, వాటిని మార్పిడి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఈవో అనిల్ కుమార సింఘాల్ తెలిపారు. టీటీడీ కల్యాణ మండపాలు కూడా ఆన్లైన్ బుకింగ్‌ను ప్రారంభించామని, తొలిదశలో ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలోని 39 కల్యాణ మండపాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామన్నారు. -
వెంకన్న ఖాతాలో భారీగా విదేశీ కరెన్సీ
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. మే నెలకు సంబంధించి 61,858 సేవా టికెట్లను భక్తుల కోసం అందుబాటులోకి తెచ్చినట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టికెట్లను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'టీటీడీ వద్ద 45 టన్నుల విదేశీ నాణేలున్నాయి. నాణేల మార్పిడికి టీటీడీ సంవత్సరాల తరబడి ప్రయత్నిస్తోంది. ఇందులో మలేసియా దేశ నాణేలు 18 టన్నులు ఉండగా.. వాటి మార్పిడికి బ్యాంక్ ముందుకొచ్చింది. త్వరలో 18 టన్నుల మలేషియా నాణేలు స్వదేశీ కరెన్సీగా మారుస్తాం. గత నెలలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించాం. అదే విధంగా ఈనెలలో శ్రీనివాసమంగాపురం, కపిలేశ్వర బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 13, 20 తేదీల్లో వికలాంగులు, వయో వృద్దులకు..14, 21వ తేదీల్లో చంటిబిడ్డ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా దర్శనం కల్పిస్తున్నాం. గదుల పొందిన భక్తులకు ఇబ్బందులు తలెత్తితే టీటీడీ టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తాము. క్యూ కాంప్లెక్స్ లో తోపులాటల నివారణకు మార్పులు తీసుకొచ్చాము. ఆన్లైన్లో లక్కీ డ్రిప్‌లో సేవా టికెట్లు పొందేందుకు లక్షమంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. భక్తుల కోసం నడక మార్గంలో, ఘాట్ రోడ్డులో అనేక ఏర్పాట్లు చేస్తున్నాము. మూడు నెలల్లో ప్రత్యేక పూల మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాము. జనవరి నెలలో 20.96 లక్షల మంది భక్తులు శ్రీవారి సేవలో పాల్గొనగా.. 87.49 లక్షల లడ్డూ విక్రయాలు జరిగాయి. హుండి ద్వారా స్వామి వారికి రూ.83.84 కోట్లు ఆదాయం లభించింది. టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థులపై త్వరలో చర్యలు తీసుకుంటాం. ఆనందనిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టు కోసం సమర్పించిన బంగారాన్ని కొంతమంది దాతలు వెనక్కి తీసుకుంటున్నార'ని అనిల్ కుమార్ వెల్లడించారు. -
తిరుమలలో రద్దీ నియంత్రణకు టైంస్లాట్!?
సాక్షి, తిరుమల: తిరుమల వైకుంఠ క్షేత్రంలో ఈసారి ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో భక్తులు పోటెత్తడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. భవిష్యత్తులో తిరుమల కొండపై రద్దీని నియంత్రించాలంటే టైంస్లాట్ విధానమే పరిష్కార మార్గమనే సూచనలు వస్తున్నాయి. సామాన్య భక్తులు శుక్ర, శనివారాల్లో నరకయాతన అనుభవించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ టైంస్లాట్ విధానంపై పడింది. రూ.300 టికెట్లు, సర్వదర్శనం, కాలిబాట దర్శనాలకు అమలుచేస్తున్నట్లుగానే పర్వదినాల్లోనూ టైంస్లాట్ విధానమే రద్దీ సమస్యకు ఏకైక పరిష్కారమని నిపుణులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధానంవల్ల ఆరు బయట ఎలాంటి క్యూలైన్లు ఉండవు. ముందస్తుగా టికెట్లు పొందిన భక్తులు తమకు కేటాయించిన సమయాల్లో మాత్రమే క్యూలోకి వచ్చి కనిష్టంగా 2 గంటలు గరిష్టంగా 4 గంటల్లోపే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. పర్వదినాల్లో టైంస్లాట్‌ను పరిశీలిస్తున్నాం: టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రస్తుతం శ్రీవారి దర్శనంలో రూ.300 టికెట్లు, సర్వదర్శనం, కాలిబాట దర్శనాలకు టైంస్లాట్ పద్ధతిని అమలుచేస్తున్నాం. పర్వదినాల్లో కూడా ఈ విధానం ఎంతవరకు వీలవుతుందో? ఎంతమంది భక్తులకు టికెట్లు లభిస్తాయి? ఆన్లైన్ టికెట్లు పొందలేని వారికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి? అన్న విషయాలు పరిశీలిస్తున్నాం. -
నాణేల లెక్కింపునకు కొత్త యంత్రాలు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించే నాణేలను వేగవం తంగా లెక్కించేందుకు నూతన యంత్రాలు కొనుగోలు చేస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరకామణిలో నాణేలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు లెక్కించేందుకు వీలుగా అధునాతన పరికరాలు కొనుగోలు చేస్తామ న్నారు. చిల్లర కానుకల్ని లెక్కించేందుకు వీలుగా తిరుపతిలో ప్రత్యేకంగా భవనం నిర్మిస్తున్నామని, నవంబరు 30 నాటికల్లా పూర్తిచేస్తామని చెప్పారు. హుండీ ద్వారా సమకూరే కానుకలు రోజువారీగా టీటీడీ ఖాతాలో చేరే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ప్రైవేట్ బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కూడా పరకామణి సేవలో అవకాశం ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఈవో తెలిపారు. -
ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల్లో భాగంగా 2018, జనవరికి సంబంధించి మొత్తం 50,879 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసినట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం డయల్ యువర్ ఈవోలో మాట్లాడారు. విడుదల చేసిన వాటిలో 6,744 టికెట్లు లక్కీడిప్ విధానంలో కేటాయించామన్నారు. వీటిలో సుప్రభాతం 4,104, తోమాల 50, అర్చన 50, అష్టదళ పాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2,300 ఉన్నాయన్నారు. భక్తులు వారంపాటు ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని, తర్వాత కంప్యూటర్ లక్కీడిప్ విధానంలో టికెట్లు కేటాయిస్తామన్నారు. టికెట్ పొందినవారు 3 రోజుల్లో నగదు చెల్లించాలని, చెల్లించని టికెట్లను మరోసారి లక్కీడిప్‌లో ఇతర భక్తులకు కేటాయిస్తామన్నారు. మిగిలిన 44,135 సేవా టికెట్లను పాత పద్ధతిలోనే ఆన్లైన్లో విక్రయిస్తారు. కల్యాణోత్సవం 10,125, ఊంజల్‌సేవ 2,700, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,805, వసంతోత్సవం 11,180, సహస్ర దీపాలంకార సేవ 12,825, విశేష పూజ 1,500 టికెట్లు ఉన్నాయి. వాహన సేవల సమయం మార్పు సమీక్షిస్తున్నాం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవా ల్లో గరుడవాహన సేవ తరహా లోనే రాత్రి వేళల్లో నిర్వహించే మిగిలిన వాహన సేవల సమయం మార్పు అంశాన్ని సమీక్షిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. వివాదాల్లేకుండా ఆగమ పండితుల సూచనల ప్రకారమే చేస్తామన్నారు. డిసెంబర్ 29వ తేదీ వైకుంఠ ఏకాదశితోపాటు వచ్చే బ్రహ్మోత్సవాలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తిరుమలలో ఉద్యానవనాల సుందరీకరణ కోసం రూ.20 కోట్లు కేటాయించామన్నారు. -
స్వామి దర్శనం సగం మందికే
సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడవాహన సేవలో విశ్వపతిని దర్శించాలని భక్తులు తండోపతండాలుగా తరలిరావటం, దర్శనం లేక ఆవేదనతో వెనుదిరిగిపోవటం సర్వసాధారణమైంది. ఈ ఏడాది కూడా సగం మంది భక్తులకు కూడా దర్శన భాగ్యం లభించలేదు. ఈ నేపథ్యంలో ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడవీధుల విస్తరణ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడవీధుల్లో 1.80 లక్షల మంది భక్తులు హాయిగా కూర్చుని ఉత్సవ మూర్తులను దర్శించవచ్చని టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి 1.5 లక్షలకు మించి భక్తులు కూర్చుని వాహన సేవలను దర్శించే అవకాశం లేదు. ఎందుకంటే సెక్యూరిటీ నిబంధనల ప్రకారం వాహన సేవలు వీక్షించే సందర్భంలో ప్రతి గ్యాలరీ పక్కన, ముందు ‘డి సర్కిల్’ పేరుతో కొంత ఖాళీ స్థలాన్ని వదలాల్సి ఉంటుంది. భద్రతా, పోలీసు సిబ్బంది భక్తులకు ఆయా స్థలాల్లో కూర్చునే అవకాశం కల్పించటం లేదు. పోలీసు కట్టడితో భక్తులకు ఇక్కట్లు పెరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు సాగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు రాత్రి జరిగే గరుడవాహన సేవకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ సేవకు ప్రతియేటా 3 నుంచి 4 లక్షల మంది వరకు భక్తులు తిరుమలకు చేరుకుంటారు. మధ్యాహ్నం సమయానికే గ్యాలరీలు నిండిపోతాయి. ఆ తర్వాత వచ్చిన భక్తులను గ్యాలరీలకే కాదు... నాలుగు మాడ వీధుల చుట్టుపక్కలకూ పంపకుండా పోలీసులు కట్టడి చేస్తారు. దీంతో వాహన సేవలో స్వామిని దర్శిద్దామని వచ్చిన భక్తులు తీవ్ర ఆవేదనతో తిరిగి వెళుతుంటారు. కొత్త నిర్మాణాల వల్లే సమస్యంతా? ఆలయ నాలుగు మాడవీధులు విస్తరణ ఆలోచన 1978లో నాటి ఈవో పీవీఆర్కే ప్రసాద్ హయాంలోనే మొదలైంది. 1983 నుంచి దశలవారీగా అమలు చేశారు. 2003లో ఆలయ నాలుగు మాడవీధుల్లోని స్థానికుల ఇళ్లు, మఠాలు, చిన్న ఆలయాలు పూర్తి స్థాయిలో తొలగించారు. దీంతో భక్తులకు వాహన సేవల భాగ్యం కలుగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొందరి ఒత్తిడితో కొన్ని నిర్మాణాలు వెలిశాయి. ప్రస్తుతం బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల్లో భక్తులు ఉత్సవమూర్తిని దర్శించేందుకు ఆ నిర్మాణాల్లో అవరోధాలుగా నిలిచాయి. ఖాళీ ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చు ప్రస్తుతం ఆలయానికి తూర్పు, దక్షిణ మాడ వీధిలోని హథీరాంజీ మఠం స్థల సేకరణ అంశం కోర్టులో నడుస్తోంది. ఇక దక్షిణ మాడవీధిలోని గ్యాలరీల వెనుక వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కొంత స్థలాన్ని వినియో గించుకోవచ్చని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. పడమర మాడ వీధిలోని కొన్ని ప్రాంతాల్లోని గ్యాలరీలు అభివృద్ధి చేసే అవకాశమున్నట్లు చెబుతు న్నారు. ఇక ఉత్తర మాడవీధిలో ఎక్కువ స్థాయిలో గ్యాలరీలు అభివృద్ధి చేయవచ్చని అంటున్నారు. మాడవీధులు అభివృద్ధి చేస్తాం.. ‘‘బ్రహ్మోత్సవాల్లో యేటేటా భక్తులు పెరుగుతున్నారు. అందు లోనూ గరుడవాహన సేవ, రథోత్సవంలో భక్తులు ఎక్కువ మంది వస్తుంటారు. వారందరికీ ఉత్సవమూర్తిని దర్శించే అవకాశం కల్పించాలంటే మాడవీధులు విస్తరించాల్సిందే. వచ్చే బ్రహ్మోత్సవాల్లోపు కొత్త గ్యాలరీలు నిర్మిస్తాం.’’ – అనిల్‌కుమార్ సింఘాల్, ఈవో, టీటీడీ తిరుమలలో పోటెత్తిన భక్తులు తిరుపతి (అలిపిరి): దసరా సెలవులు పూర్తవుతుండటంతో సోమవారం తిరుమలకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి ఆలయ మాడవీధులు, లడ్డూ కౌంటర్లు, బస్టాండ్లు, విచారణ కార్యాలయాలు, ఉచిత సముదాయాలు, అన్నప్రసాద కేంద్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శ్రీవారి సర్వదర్శన భక్తులు క్యూ వెలుపల కిలోమీటర్ వరకు బారులు తీరారు. క్యూలో గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో అవస్థలు పడ్డారు. వైకుంఠం కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వైభవంగా బాగ్ సవారి తిరుపతి (అలిపిరి): తిరుమలలో సోమవారం బాగ్ సవారి వైభవంగా సాగింది. సాధారణంగా అన్ని ఉత్సవాలు, సేవలు, ఊరేగింపుల్లో ఉత్సవర్లు ఆలయానికి ప్రదక్షిణంగానే ఊరేగు తారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు మాత్రమే మలయప్ప ఆలయానికి, పుష్కరిణికి అప్రదక్షిణగా ఊరేగుతా రు. దీనిలో భాగంగా మలయప్ప అనంతాళ్వారుల తోటలో పూజా నివేదనలు అందుకున్నారు. తిరిగి అప్రదక్షిణగానే ఆల యానికి చేరుకున్నారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కోదండరామారావు, డాలర్ శేషాద్రి ఉన్నారు. -
ఘనంగా శ్రీవారి ధ్వజారోహణం
-
ఘనంగా శ్రీవారి ధ్వజారోహణం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆరంభానికి నాందిగా శ్రీవా.. ఆలయంలో శనివారం ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 5.48 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో వైఖానస ఆగమోక్తంగా పవిత్ర గరుడ పతాకాన్ని (ధ్వజపటం) బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రంలో అర్చకులు ఆవిష్కరించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ధ్వజారోహణానికి ముందు తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప.. పరివార దేవతలైన అనంతుడు (ఆదిశేషుడు), గరుత్మంతుడు, విష్వక్సేనుడు, గరుడధ్వజం, సుదర్శన చక్రతాళ్వార్‌తో కలసి ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇదిలా ఉండగా, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ శనివారం తొమ్మిది రోజుల బ్రహ్మో త్సవానికి నాందిగా ఆలయ సంప్రదా యం ప్రకారం కంకణం ధరించారు. ఈ కార్యక్రమంలో జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్వో రవికృష్ణ పాల్గొన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వ రస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప.. పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం తిరుమలేశునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారికి కానుకగా భారీ కాసుల హారం విజయవాడకు చెందిన రామలింగరాజు అనే భక్తుడు శనివారం ఐదు పేటల బంగారు సహస్రనామ కాసుల హారాన్ని శ్రీవారికి కానుకగా సమర్పించారు. 28.645 కేజీల బరువున్న ఈ ఆభరణం విలువ రూ.8.39 కోట్లు ఉంటుంది. ఈ హారంలో 1,008 కాసులు ఉన్నాయి. ఒక్కో కాసుపై సహస్ర నామావళిని ముద్రించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన అధికారులకు అందజేశారు. -
టైంస్లాట్తోనే శ్రీవారి దర్శనం సులువు
సాక్షితో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ దేశంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) కార్య నిర్వహణాధికారిగా అనిల్‌కుమార్ సింఘాల్ ఈ ఏడాది మే 6వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. తాను భక్తుడిగా చాలా కాలం నుండి తిరుమలేశుని దర్శించుకునే ఆనవాయితీ ఉందని, అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయన్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న భక్తులందరికీ ఒకేరోజులో దర్శనం కల్పించటం కష్టసాధ్యమని, తిరుమలలో క్యూలైన్లు కనిపించకుండా వచ్చేవారందరికీ సులువుగా, సంతృప్తిగా స్వామి దర్శనం కల్పించాలంటే టైం స్లాట్‌తోనే సాధ్యం అవుతుందని అనిల్‌కుమార్ సింఘాల్ అభిప్రాయపడ్డారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సాక్షి ఫన్డే ప్రత్యేక సంచికతో ఆయన పంచుకున్న విశేషాల సమాహారమిది. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టక ముందు తిరుమలతో మీకున్న అనుబంధం? అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పులు వచ్చాయి? శ్రీవారి భక్తుడిగా తరచూ తిరుమలకు వచ్చి స్వామిని దర్శించుకునేవాడిని. అప్పటికీ ఇప్పటికి పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగ్గట్టు టీటీడీ సకల సౌకర్యాలు కల్పిస్తూనే ఉంది. టీటీడీ యంత్రాంగం అవిశ్రాంతంగా పనిచేస్తూ భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తూనే ఉంది. ధార్మిక సంస్థ ఈవోగా మీరు ఎంచుకున్న ప్రాధాన్యతాంశాలు వివరిస్తారా? ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. దివ్యదర్శనం భక్తులకు టైంస్లాట్ ద్వారా నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం కల్పించే విధానాన్ని అమలు చేస్తున్నాం. క్యూకాంప్లెక్స్‌ల్లో మౌలిక సదుపాయాలు పెంచాము. కంపార్ట్మెంట్లలో వేచి ఉంటున్న భక్తుల నుంచి ఫిర్యాదులు, సూచనలు సలహాలను స్వీకరిస్తున్నాం.హెల్ప్‌డెస్క్‌లు, ఉచిత ఫోన్, డిస్ప్లే స్క్రీన్లు ఏర్పాటు చేశాం. అందరికీ భోజనం, అల్పాహారం, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నాం. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా రోజుకు 1,500 టోకెన్లు జారీ చేస్తున్నాం. నెలలో రెండురోజులు అదనంగా నాల్గు వేల మందికి దర్శన సౌకర్యం కల్పిస్తున్నాం. భక్తులకు సంతృప్తి దర్శనం చర్చకు మాత్రమే పరిమితమైనట్లుంది. భక్తుల నుంచి ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. దీనికి సంబంధించి మీ వద్ద సరికొత్త ప్రణాళికలేమైనా ఉన్నాయా? దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాం. కంపార్ట్మెంట్ల లో భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాం. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల జారీపై విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. అందరికీ ఆర్జితసేవలు లభించాలనే సంకల్పంతో ప్రతినెలా మొదటి శుక్రవారం ఆన్లైన్ డిప్ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఆన్లైన్లో గదులు బుక్ చేసుకున్న భక్తులు 48 గంటల ముందు రద్దు చేసుకుంటే 100 శాతం నగదును తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేశాం. వెండివాకిలి వద్ద తోపులాటలకు ఆస్కారం లేకుండా మార్పులు తీసుకొచ్చాం. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దర్శనంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రకరకాల క్యూలైన్లు పెరుగుతున్నాయి. వాటిని తగ్గించేందుకు రూ.300 టికెట్లు, కాలిబాట టికెట్ల తరహాలోనే సర్వదర్శనం, ఇతర దర్శనాలకు టైంస్లాట్ అమలు చేసే యోచన ఉందా? ప్రస్తుతం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్యదర్శనం భక్తులకు టైంస్లాట్ విధానం అమల్లో ఉంది. భవిష్యత్తులో సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్ ప్రవేశపెట్టేందుకు విస్తృతంగా చర్చిస్తున్నాం. త్వరలో సర్వదర్శనంలోనూ వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా టైంస్లాట్ విధానాన్ని ప్రవేశపెడతాం. ఈ అనుభవాల ఆధారంగా అనువైన నిర్ణయం తీసుకుంటాం. ఆలయ క్యూలైన్లో మీరు తీసుకొచ్చిన మార్పులు ఏమిటి? అవి ఎలా ఉపయోగకరంగా ఉన్నాయి? దీనివల్ల భక్తుల సంఖ్య పెరిగిందా? తోపులాటలు తగ్గాయా? ఆలయంలో ఇదివరకే మూడు క్యూలైన్ల విధానం అమల్లో ఉండేది. వెండివాకిలి వద్ద తోపులాటలు జరిగేవి. ఆలయం లోపలికి, వెలుపలికి వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడేవారు. వెండివాకిలి వద్ద ఒకే క్యూను ఏర్పాటుచేశాం.తద్వారా తోపులాటలు నివారించాం. భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. తరలివచ్చే భక్తులందరికీ తిరుమలలో మౌళిక సదుపాయాలు కల్పించటం కష్టసాధ్యం కదా! దీన్ని అధిగమించేందుకు మీ వద్ద ప్రణాళికలు, ప్రత్యామ్నాయ మార్గాలేమైనా ఉన్నాయా? తిరుమలలోని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పలు సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు ఉచితంగా దర్శనం, అన్నప్రసాదాలు, ఆర్వో తాగునీటి ప్లాంట్లు, యాత్రికుల వసతి సముదాయాల్లో బస, ఉచిత లగేజి, సెల్‌ఫోన్ డిపాజిట్ కౌంటర్లు, అదనపు మరుగుదొడ్లు, కంపార్ట్మెంట్లలో ఉచిత ఫోన్, ఉచిత వైద్య సౌకర్యం అందుబాటులో ఉన్నాయి. అన్నప్రసాద భవనం, పీఏసీ–2, వైకుంఠం క్యూకాంప్లెక్స్–1లో భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నాం. భక్తుల రద్దీ ప్రాంతాల్లో ఫుడ్‌కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాలు, బర్డ్, స్విమ్స్, రుయా, మెటర్నిటి ఆసుపత్రుల్లోనూ, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నాం. తిరుమలలో 13, తిరుపతిలో 3.. మొత్తం 16 ధర్మరథాలతో ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. తిరుమలలో ఉన్న దాదాపు 7 వేల గదులను భక్తులు వినియోగించుకునేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నాం. గదుల కేటాయింపులో మరింత పారదర్శకత పెంచేందుకు, ఎక్కువసేపు క్యూలో వేచి ఉండకుండా నివారించేందుకు సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టాం. ఆలయంలో నేత్రద్వారాలు (వెండివాకిలికి అటుఇటుగా ప్రత్యేక ద్వారాలు, సన్నిధిలో రాములవారి మేడ నుంచి వైకుంఠద్వారం ప్రవేశం వరకు కొత్తద్వారం) తెరవాలని కొందరు, వద్దని మరికొందరు వివాదాస్పద అంశాలు తెరపైకి తెచ్చారు... ఈ నేత్రద్వారాలు, కొత్త నిర్మాణాల ఏర్పాటు సాధ్యమా? మీ అభిప్రాయం చెప్పగలరు? తిరుమల శ్రీవారి ఆలయంలో నూతన మార్పులకు సంబం«ధించిన విషయాలను ఆగమ సలహాదారులు, ఇతర నిపుణుల అంగీకారం మేరకు పరిశీలించటం జరుగుతుంది. శ్రీవారికి కనీస విరామం కొరవడుతోందని కొందరు మఠాధిపతులు, పీఠాధిపతులు, అర్చకులు ఆవేదన చెందుతున్నారు. దీనివల్ల తరతరాల ఆలయ ఆగమ సంప్రదాయం పక్కదారి పట్టడంతోపాటు దేశంలో అరిష్టాలు, సంక్షోభ పరిస్థితులు చవిచూడాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. స్వామి కైంకర్యాలకు ఎలాంటి అనుకూల పరిస్థితులు చేయబోతున్నారు? ఆగమ సలహాదారులు, పండితుల సూచనల మేరకే సంప్రదాయబద్ధంగా తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రద్దీ వల్ల కొన్నేళ్లుగా గరుడ వాహనాన్ని రాత్రి 7.30 గంటలకే ఊరేగిస్తున్నారు. దీనివల్ల త్వరగా ఉత్సవమూర్తిని దర్శించుకున్న భక్తులు తిరుమల నుండి తిరుపతికి వెళ్లిపోవటంతో గదుల కొరత, నీటి వినియోగం, ఇతర ఇబ్బందులు తగ్గుతున్నాయి. ఇదే తరహాలోనే మిగిలిన వాహనసేవల్లో మార్పులు చేసే అవకాశం ఉందా? ఆగమపండితులు, సలహాదారుల సూచన మేరకు తగు నిర్ణయం తీసుకోగలం. హిందూ ధర్మప్రచార విస్తరణ, యువతలో ధార్మిక చింతన పెంపొందేందుకు టీటీడీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు? టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా మనగుడి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అర్చక శిక్షణ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో భజన మందిరాల నిర్మాణం, భజనమండళ్లకు శిక్షణ, భక్తి చైతన్యయాత్రలు, స్వామీజీల ద్వారా ధార్మిక సందేశాలు, యజ్ఞయాగాల నిర్వహణకు ఆర్థికసాయం, శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తున్నాం. డిజిటల్ గ్రంథాలయం, సప్తగిరి మాసపత్రిక, శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ద్వారా ధర్మప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళుతున్నాం. టీటీడీ వెబ్సైట్ ద్వారా పుస్తకాలు, భక్తి సంకీర్తనలు ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించాం. శుభప్రదం, గీతాజయంతి, సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల ద్వారా విద్యార్థులు, యువతలో హిందూ ధార్మిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. టెక్నాలజీని ఉపయోగించి సనాతన ధర్మాన్ని యువతకు చేరువ చేసేందుకు ప్రత్యేకంగా హెచ్‌డిపిటి వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నాం. రూ.25 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత, గిరిజన, మత్స్యకార ప్రాంతాల్లో 500 ఆలయాల నిర్మాణం జరుగుతోంది. విదేశాల్లో ఉన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయాల్లోని అర్చకులకు కూడా శిక్షణ ఇచ్చి తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే ఆగమశాస్త్ర బద్ధంగా కైంకర్యాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. వేద పరిరక్షణ కోసం దేశంలోనే ఏకైక వేద విశ్వ విద్యాలయం తోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 7 వేద పాఠశాలలు నిర్వహిస్తున్నాం. ∙టీటీడీ ఈవోగా పరిపాలనలో కొత్త సంస్కరణలేమైనా ఉన్నాయా... ? పరిపాలన అనేది నిరంతర ప్రక్రియ. మార్పులకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. బర్డ్‌లో అదనపు భవనాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించాం. శస్త్ర చికిత్సల కోసం నమోదు చేసుకుని, వేచి చూసే గడువును రెండేళ్లలోపే పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాం. తిరుపతిలో టాటా క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎంఓయూ కుదుర్చుకున్నాం. అరవింద నేత్ర వైద్యశాల నిర్మాణం జరుగుతోంది. పాలనను సులభతరం చేసేందుకు ఈ–ఆఫీస్ విధానానికి శ్రీకారం చుట్టాం. తెలుగు వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నాం. దేశంలో ప్రకృతి ప్రకోపాలు, జనోద్యమాలు, అశాంతి పెరిగిపోతున్నాయి కదా... ప్రకృతిని ప్రసన్నం చేసుకునేందుకు, లోక కల్యాణం కోసం టీటీడీ పాత్ర ఎలాంటిది? వర్షాలు కురవాలని వరుణదేవుని ప్రార్థిస్తూ ప్రతి ఏటా వరుణజపం, పర్జన్యశాంతి హోమం, ప్రకృతిని ప్రసన్నం చేసుకునేందుకు అద్భుత శాంతి యాగం నిర్వహిస్తున్నాం. ఇక ప్రతిరోజూ ఆలయంలో జరిగే నిత్యపూజలన్నీ లోకకల్యాణం కోసమే. తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు తొలిసారి మీ చేతుల మీదుగా జరుగుతున్నాయి. మీ స్పందన. టీటీడీలో సేవ చేసే అవకాశం రావటం పూర్వజన్మ సుకృతం. ఇక ఆ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించే భాగ్యం కలగటం మహదానందంగా ఉంది. సంప్రదాయాలను పాటిస్తూ ఉత్సవ వైభవాన్ని చాటేలా స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. -
ప్రతి ఒక్కరికీ సంతృప్తికర దర్శనం
టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి సాక్షి ప్రతినిధి, తిరుపతి: పేద, ధనిక, చిన్నా, పెద్దా తేడా లేకుండా భక్తులందరూ కనులారా శ్రీవారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశామని టీటీడీ ముఖ్య కార్యనిర్వహణాధికారి(ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ఈ నెల 23 నుంచి మొదలయ్యే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను జయప్రదం చేసేందుకు సహకరించాలని ప్రభుత్వ శాఖలతో పాటు భక్తులు, మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేస్తున్నాం. రోజువారీ సుప్రభాతం, శుక్రవారపు అభిషేకాలు మాత్రం కొనసాగుతాయి. వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేస్తున్నాం’’ అని తెలిపారు. -
ఆన్లైన్లో 44,896 ఆర్జిత సేవా టికెట్లు
టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడి సాక్షి, తిరుమల: సెప్టెంబర్ నెలకు సంబంధించి 44,896 సేవాటికెట్ల కోటాను శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమలలోని అన్న మయ్య భవనంలో గురువారం జేఈవో కేఎస్.శ్రీనివాస రాజుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతినెలా ఆర్జితసేవా టికెట్లు విడుదలైన నిమిషాల వ్యవధిలోనే అమ్ము డవుతున్నాయని, ఇంటర్నెట్ వేగంగా లేక రిజర్వు చేసు కోలేక పోతున్నామని భక్తుల నుంచి సూచనలు రావడంతో సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశామన్నారు. కొత్త విధానంలో సుప్రభాతం 6,985, తోమాల 90, అర్చన 90, అష్టద ళపాద పద్మారాధన 120, విశేష పూజ 1,125, నిజపాద దర్శనం 2,300 టికెట్లు కలసి మొత్తం 10,710 సేవాటికెట్లను లక్కీడిప్ విధానం ద్వారా కేటాయిస్తామన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 23వ తేదీ వరకు భక్తులు తమకు అవసరమైన టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో డిప్ తీస్తా మని, టికెట్లు పొందిన భక్తులకు ఎస్ఎంఎస్ లేదా ఈ–మొ యిల్లో సమాచారాన్ని తెలియజేస్తామని వివరించారు. ఒకసారి సేవా టికెట్ పొందిన భక్తుడు తిరిగి 180 రోజుల తర్వాతే బుక్ చేసుకునే వీలవుతుందన్నారు. ఇక శ్రీవారి కల్యాణోత్సవం 8,250, ఊంజల్ సేవ 2,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 4,730, వసంతోత్స వం 9,030, సహస్ర దీపాలంకార సేవ 9,976 టికెట్లు.. మొత్తం 34,186 సేవా టికెట్లను పాత విధానంలో ఇంటె ర్నెట్ ద్వారా రిజర్వు చేసుకోవచ్చన్నారు. జూలై 1 నుంచి గదులు ముందస్తుగా ఖాళీ చేస్తే కొంత నగదు తిరిగి చెల్లిస్తామన్నారు. ఆనంద నిలయుడి దర్శనానికి ఆధార్ స్వామివారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులకు ఆధార్ అనుసంధానం ద్వారా పారదర్శకమైన సేవలు అందించేం దుకు టీటీడీ సమాయత్తమవుతోంది. టీటీడీ తాజా లెక్కల ప్రకారం సగటున నిత్యం 72,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దీనికి పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఓటరుకార్డు, రేషన్‌కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇలా దాదాపు 9 రకాలైన గుర్తింపు కార్డులను టీటీడీ అనుమతిస్తోంది. ఆధార్ మినహా ఇతర కార్డుల వల్ల భక్తుడి సమగ్ర వివరాలు తెలుసుకోవటం కష్టమవుతోంది. ఈ నేప థ్యంలో అన్నిరకాల దర్శనాలు, సేవలకు ఆధార్ అనుసం ధానం చేయటంతో తిరుమలకు ఎవరు ఎప్పుడు వచ్చారు? ఎన్నిసార్లు దర్శించుకున్నారు? పొందిన సౌకర్యాలు, రోజులో ఎంతమంది వచ్చారు? తదితర వివరాలతో సమగ్ర వివరాలు సేకరించవచ్చని టీటీడీ భావిస్తోంది. బుకింగ్ రద్దు చేసుకుంటే డబ్బు వాపస్ తిరుమలలో నేరుగా నగదు చెల్లించి గది పొందిన భక్తుల తోపాటు ఆన్లైన్లో అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్నవారు గదుల బుకింగ్ రద్దు చేసుకున్నా, నిర్ణీత సమయం కంటే ముందుగానే ఖాళీ చేసినా ఆ మేరకు నగదు తిరిగి భక్తుల ఖాతాకు బదిలీ చేసే విధానం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆధార్‌తో దర్శనానికి ‘రేషన్’ తిరుమల, తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెలా ఐదువేల మందికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. డిమాండ్ అధికంగా ఉండటంతో ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేశారు. దీంతో ఒకసారి వచ్చినవారు మూడు నెలల తర్వాతే తిరిగి శ్రీవారి దర్శనం పొందే అవకాశం ఉంది. ప్రతినెలా మొదటి శుక్రవారం ఆన్లైన్లో విడుదల చేసే టికెట్ల కోటాకూ దీన్ని అమలు చేస్తున్నారు. ఇదే విధానాన్ని భవిష్యత్‌లో అన్ని రకాల దర్శనాలకు అమలు చేయాలని టీటీడీ భావిస్తోంది. -
పవన్‌కు మోహన్‌బాబు పంచ్!
ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా నియమించడంపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై ప్రముఖ నటుడు మోహన్ బాబు స్పందించారు. పవన్‌కు ఆయన తన మార్కు పంచ్ వేశారు. టీటీడీ ఈఓగా సింఘాల్ నియామకానికి ఆయన మద్దతు తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ వెంకన్న బాబు దేవుడని, అలాంటి దేవుడిని ఒక ప్రాంతానికో, ఒక భాషకో మాత్రమే పరిమితం చేయడాన్ని తాను ఖండిస్తున్నానని తెలిపారు. తెలుగు భాష రాకపోవడం ఒక్కటే పెద్ద సమస్య అని తాను అనుకోవట్లేదని మోహన్ బాబు చెప్పారు. ఉత్తరాది ఐఏఎస్ అధికారినిని టీటీడీ ఈవోగా నియమించడంపై తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని పవన్ ఇటీవల ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఉత్తరాది ఐఏఎస్ అధికారులకు తాను వ్యతిరేకం కాదని అన్నారు. అయితే అమర్నాథ్, వారణాసి, మధుర లాంటి పవిత్ర ఆలయాల్లో దక్షిణాది అధికారులకు ఎందుకు స్థానం కల్పించడం లేదని పవన్ ప్రశ్నించారు. దానిపైనే ఇప్పుడు మోహన్ బాబు స్పందించారు. -
భక్తులకే తొలి ప్రాధాన్యం
► టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్ బాధ్యతల స్వీకరణ ► సామాన్య భక్తుడిగానే తిరుమలతో అనుబంధమెక్కువ ► శ్రీవారి దయ, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో శ్రీవారి సేవా భాగ్యం ► ఉత్సవమూర్తి ఊరేగింపులో తొలిరోజే సింఘాల్ మార్క్ సాక్షి, తిరుమల: సామాన్య భక్తుడిగానే తరచూ శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే సంప్రదాయముందని, ఆవిధంగా 1994 నుంచి తనకు తిరుమలతో అనుబంధముందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. శనివారం ఆయన తిరుమల ఆలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తాను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నపుడు తరచూ తిరుమలను సందర్శించే అవకాశం కలిగిందన్నారు. శ్రీవారి దయ, తన తల్లిదండ్రుల ఆశీస్సులతో టీటీడీ ఈవోగా సేవలందించే భాగ్యం కలగడం ఆనందంగా ఉందన్నారు. కాలిబాట, రూ.300 టికెట్లు, ఇతర సేవల్లో పాల్గొనే భక్తులందరికీ మెరుగైన దర్శనం కల్పించే ఏర్పాట్లు చేపడతానన్నారు. ఇప్పటికే అలాంటి చర్యలు అమలవుతున్నాయనీ, పెరుగుతున్న భక్తుల రద్దీని బట్టి మార్పులు చేస్తానన్నారు. మానవ సేవే, మాధవసేవగా విధులు కొనసాగిస్తానని చెప్పారు. ఇందులో భాగంగా టీటీడీ ధర్మకర్తల మండలి, అధికారులు, సిబ్బందిని కలుపుకుని మెరుగైన సేవలు అందిస్తానన్నారు. తొలిరోజే ఈవో సింఘాల్ మార్క్ అనిల్‌కుమార్ సింగాల్ టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే తన మార్కు చూపించారు. శనివారం పద్మావతి పరిణయోత్సవ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాహన తిరుగు ప్రయాణంలో కల్యాణవేదికపై ఉండే భక్తులందరికీ ఉత్సవమూర్తులు కనిపించేలా అటు ఇటు తిప్పుతూ చూపించాలని ఆదేశించారు. ఆమేరకు పేష్కార్ రమేష్, డాలర్ శేషాద్రి, గురురాజా వాహనాన్ని అటు ఇటు తిప్పుతూ భక్తులు అందరూ స్వామి అమ్మవార్లను దర్శించుకునే వెసులుబాటు కల్పించారు. -
కాలి నడకన తిరుమలకు టీటీడీ ఈవో
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో)గా నియమితులైన ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం కాలినడకన తిరుమల చేరుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడికి ఆయన తలనీలాలు అర్పించి మొక్కు తీర్చుకున్నారు. అలాగే నడకదారి భక్తుల క్యూలో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రస్తుత ఈవో సాంబశివరావు నుంచి శనివారం ఉదయం సింఘాల్ టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా తితిదే ఈవోగా సాంబశివరావు పదవీకాలం ముగియడంతో ఆయనను ప్రభుత్వం.. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే. టీటీడీ చరిత్రలో ఉత్తరాది వ్యక్తి ఈవోగా నియమితులవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకు ముందు అనిల్‌కుమార్ సింఘాల్‌కు టీటీడీ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కమిటీ కన్వీనర్లు, కో కన్వీనర్లు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. -
టీటీడీ ఈవో..ఉత్తరాది ఐఏఎస్ సింఘాల్
టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఉత్తరాది అధికారికి అవకాశం సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో)గా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉత్తరాది వ్యక్తి ఈవోగా నియమితులైనట్లయింది. సింఘాల్‌తో పాటు మరికొందరు ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇప్పటి వరకు తెలుగువారినే టీటీడీ ఈవోగా నియమించే సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఆ రాష్ట్ర సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారులు చేసిన విజ్ఞప్తిని తోసిరాజని ఉత్తరాదికి చెందిన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సింఘాల్‌ను టీటీడీ ఈవోగా నియమించారు. దీంతో ఈ వ్యవహారం సీనియర్ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం పేషీ అధికారి, ఢిల్లీలోని కేంద్ర మంత్రి చేసిన తీవ్ర ఒత్తిడికి లొంగిపోయి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఐఏఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, టీటీడీ ఈవోగా ఉన్న డి.సాంబశివరావును వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ , రిజిస్ట్రేషన్లు, స్టాంపుల (రెవెన్యూ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ప్రవీణ్ ప్రకాష్‌ను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించింది. -
టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్
రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాంబశివరావు అమరావతి: తిరుమల-తిరుపతిదేవస్థానం (టీటీడీ) చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉత్తరాది వ్యక్తి కార్యనిర్వహణాధికారి (ఈవో)గా నియమితులయ్యారు. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఉత్తరాది ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయనతోపాటు మరికొందరు ఐఏఎస్ అధికారులను కూడా సోమవారం ప్రభుత్వం బదిలీ చేస్తూ జీవో ఇచ్చింది. తెలుగువారినే టీటీడీ కార్యనిర్వహణాధికారులుగా నియమించే సంప్రదాయం ఇప్పటి వరకూ కొనసాగుతూ వచ్చింది. తెలుగువారికే ఈ పోస్టు ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాదికి చెందిన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా నియమించారనే విషయం సీనియర్ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం పేషీ అధికారి, ఢిల్లీలోని కేంద్ర మంత్రి చేసిన తీవ్ర ఒత్తిడికి లొంగిపోయి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఐఏఎస్ వర్గాలు చెబుతున్నాయి. టీటీడీ ఈవోగా ఉన్న డి. సాంబశివరావును వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ , రిజిస్ట్రేషన్లు, స్టాంపుల (రెవెన్యూ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసి ఈ స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించింది. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ప్రవీణ్ ప్రకాష్‌ను ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించింది. ప్రవీణ్ ప్రకాష్ బాధ్యతలు చేపట్టే వరకూ ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించాలని ప్రస్తుతం అక్కడ స్పెషల్ కమిషనర్‌గా పనిచేస్తున్న అర్జ శ్రీకాంత్‌ను ఆదేశించింది. కృష్ణాజిల్లా కలెక్టరుగా పనిచేసి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎ. బాబును ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఇక్కడ పనిచేస్తున్న కె. సాంబశివరావు (ఐఆర్టీఎస్)ను బదిలీ చేసింది. రియల్‌టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) వైఎస్ ఛైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను కూడా ఎ. బాబుకు అప్పగించింది. ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న జె.నివాస్‌ను విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సంగారెడ్డి కోర్టుకు హాజరైన అసదుద్దీన్
సంగారెడ్డి: గతంలో మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్‌ను దూషించిన ఘటనలో ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోమవారం సంగారెడ్డి కోర్టుకు హాజ రయ్యారు. 2005లో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పటాన్చెరు మండలం ముత్తంగి మసీదును తొలగిస్తున్న క్రమంలో అప్పటి కలెక్టర్ అనిల్‌కుమార్ సింఘాల్‌ను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు మరికొందరు ఎంఐఎం నేతలు అడ్డుకుని దూషించారు. ఈ కేసు విచారణ నిమిత్తం అసదుద్దీన్ సంగారెడ్డిలోని ఎక్సైజ్ కోర్టు మేజిస్ట్రేట్ వెంకట్రాం ఎదుట హాజరయ్యారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, మొజంఖాన్, అహ్మద్ పాషా ఖాద్రి, ముంతాజ్‌ఖాన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్‌లు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉన్న కారణంగా కోర్టుకు హాజరుకాలేదు. మేజిస్ట్రేట్ వెంకట్రామ్ ఈ కేసు విచారణను వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేశారు.