
సంగారెడ్డి కోర్టుకు హాజరైన అసదుద్దీన్
గతంలో మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్‌ను దూషించిన ఘటనలో ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్
సంగారెడ్డి: గతంలో మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్‌ను దూషించిన ఘటనలో ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోమవారం సంగారెడ్డి కోర్టుకు హాజ రయ్యారు. 2005లో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పటాన్‌చెరు మండలం ముత్తంగి మసీదును తొలగిస్తున్న క్రమంలో అప్పటి కలెక్టర్ అనిల్‌కుమార్ సింఘాల్‌ను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు మరికొందరు ఎంఐఎం నేతలు అడ్డుకుని దూషించారు.
ఈ కేసు విచారణ నిమిత్తం అసదుద్దీన్ సంగారెడ్డిలోని ఎక్సైజ్ కోర్టు మేజిస్ట్రేట్ వెంకట్‌రాం ఎదుట హాజరయ్యారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, మొజంఖాన్, అహ్మద్ పాషా ఖాద్రి, ముంతాజ్‌ఖాన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్‌లు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉన్న కారణంగా కోర్టుకు హాజరుకాలేదు. మేజిస్ట్రేట్ వెంకట్‌రామ్ ఈ కేసు విచారణను వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేశారు.