సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక, ఇప్పటి వరకు దోస్తీలుగా ఉన్న బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఇదే క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే షకీల్‌కు డెరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తూ కామెంట్స్ చేశారు. దీనికి షకీల్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు.. అసెంబ్లీలో కూడా అక్బరుద్దీన్ ఒవైసీ.. తెలంగాణ సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. పాతబస్తీ అభివృద్ధి, మెట్రో సేవలపై అసెంబ్లీ వేదికగా పలు ప్రశ్నలు సంధిస్తూ అధికార పార్టీపై ఫుల్ ఫైరయ్యారు. దీంతో, రంగంలోకి దిగిన కేటీఆర్.. ఎంఐఎంకు కౌంటర్ ఇస్తూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. మొన్న నిజామాబాద్‌లో అసదుద్దీన్ చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఒవైసీ మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది. అంతేకాదు.. దళిత బంధులా.. ముస్లిం బంధు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. కారు స్టీరింగ్ తమ చేతిలో ఉందనే వాళ్లు దీనిని గమనించాలని సూచించారు. ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ప్రజల ఆదరణతో తామే మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో తాము ఏ పార్టీతో జట్టు కడతామన్నది ఎన్నికలనాటికి చెబుతామని అనడం కీలకంగా మారింది.
అయితే, బీఆర్‌ఎస్‌పై ఎంఐఎం ఆరోపణల నేపథ్యంలో మజ్లిస్ పార్టీ ప్లాన్ మార్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు కాకుండా కాంగ్రెస్‌కు చేరువయ్యేందకు మజ్లిస్ నేతలు ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: తెలంగాణలో భిన్నంగా ఓటరు నాడి.. ఆ పార్టీకే మెజారిటీ సీట్లు!
Comments
Please login to add a commentAdd a comment