
హైదరాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. బీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రేవంత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ అని ధ్వజమెత్తారు.
ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు మారలేదా? అని సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. వాళ్లంతా ముడుపులిస్తే మేం కూడా ఇచ్చినట్లే అని వ్యాఖ్యానించారు. బీజేపీకి బీ టీంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పనిచేస్తోందని సుధీర్ రెడ్డి ఫైర్ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రేవంత్ కాంగ్రెస్‌ను బలహీనపరుస్తున్నారని విమర్శించారు.
చదవండి: ఇన్ని రోజులు నిద్రపోయారా.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment