pcc chief
-
బీజేపీ ఛార్జ్‌షీట్‌పై కాంగ్రెస్ సెటైర్లు
సాక్షి,హైదరాబాద్ : బీజేపీ ఛార్జ్‌షీట్‌పై పీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది కాలం పాలనపై .. కేంద్రంలోని బీజేపీ తన 10 ఏళ్ల పాలనపై చర్చించేందుకు మేం సిద్ధంగా ఉందా? రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాడి పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్ బీజేపీకి పలు ప్రశ్నలు సంధించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగాన్ని రూపుమాపుతామని చెప్పారు. నల్ల ధనాన్ని తెచ్చి ప్రతి అకౌంట్ కు 15 లక్షల రూపాయలు వేస్తాం అన్నారు. వంద రోజుల్లో అన్ని రకాల ధరలు తగ్గిస్తాం అన్నారు.. డాలర్ కు పోటీగా రూపాయి విలువ పెంచుతామని అన్నారు.50 రూపాయలకే లీటర్ పెట్రోల్ అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతాం అన్నారు.. ఏమయ్యాయి?దేశంలో వందలాది మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీలోకి మార్చారు. దేశంలో 45 ఏళ్లలో లేని నిరుద్యోగ పరిస్థితిని కల్పించారు.మతతత్వ రాజకీయాలు చేస్తూ.. పార్టీలను చీలుస్తూ రాజకీయ పబ్బం గడిపిన బీజేపీ ఇప్పుడు సుద్దాపూస మాటలు మాట్లాడుతుంది.రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్తో చీకటి ఒప్పందం చేసకోవడంతో రాష్ట్రంలో బీజేపీ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. కాబట్టే రాష్ట్రంలో ఇలా ఛార్జ్‌షీట్ పేరుతో రాజకీయాలు చేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ కవల పిల్లలు. ఒకరికొకరు ఒకరికొకరు ఏ టీం, బీ టీంగా వ్యవహరిస్తారు. ఇది అనేక సార్లు రుజువైంది.సార్వత్రిక ఎన్నికల్లో రహస్య ఒప్పందం జరిగింది. 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ మోదీ గ్యారెంటీ పేరిట ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది. 2014 నుంచి 2024 వరకు పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు ఎన్నిసార్లు పెంచారు? దీనిపైన చర్చించడానికి సిద్ధమా?కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణకు ప్రత్యేకంగా ఏం చేసిందో చర్చించడానికి బీజేపీ నాయకులు సిద్దమా? రైతుల సంక్షేమం కోసం ఒక్క సంవత్సర కాలంలోనే దాదాపు రూ. 54 వేల కోట్లు కాంగ్రెస్ ఖర్చు చేసింది. దీనిపై చర్చిద్దామా? దీంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీకి కనిపించడం లేదా? -
కేసీఆర్ పదేళ్లలో చేయనివి ఏడాదిలో చేశాం: మహేష్‌గౌడ్
సాక్షి,హైదరాబాద్:కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు అను నిత్యం ప్రజల్లో ఉండి సేవలు చేస్తున్నారని పీసీసీ అద్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం(నవంబర్ 20) జరిగిన సేవాదల్ కార్యక్రమంలో మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడారు.‘రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ కోసం 18 వేల కోట్ల రూపాయలు ఇచ్చాం.10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసింది. 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పాలకులది. మహాత్మ గాంధీ,నెహ్రూలు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. చరిత్రను వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేసి బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తోంది. రాహుల్ గాంధీ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు దేశంలో పాదయాత్ర చేశారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయాలన్న లక్ష్యంతో మనం పని చేయాలి’అని మహేష్‌కుమార్‌గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
TG: కొత్త పీసీసీ చీఫ్ ఖరారు ! ముగిసిన ఏఐసీసీ కీలక భేటీ
సాక్షి,ఢిల్లీ: తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణపై శుక్రవారం(ఆగస్టు23) ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ హైకమాండ్ కీలక సమావేశం ముగిసింది. కొత్త పీసీసీ అధ్యక్ష పదవిపై ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్‌కు పీసీసీ చీఫ్ పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రేపో మాపో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. పీసీసీ రేసులో మధు యాష్కి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ , ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ , అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. పీసీసీ చీఫ్ ఎంపికతో పాటు కేబినెట్ విస్తరణపైనా ఏఐసీసీ సమావేశంలో చర్చించారు. సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ , సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణ పీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి కొనసాగుతున్నారు. -
రేవంత్ రెడ్డికి చెక్ ?.. తెలంగాణలో కర్ణాటక ఫార్ములా
-
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా షర్మిల
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీ పీసీసీ) అధ్యక్షురాలిగా షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) మంగళవారం మధ్యాహ్నం అధికారిక ప్రకటన వెలువరించింది. తాజాగా ఏపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏఐసీసీ నియమించింది. (చదవండి : షర్మిల కాంగ్రెస్‌లో చేరడం చంద్రబాబు కుట్రే) వైఎస్సార్టీపీని 2021 జులై 8వ తేదీన ప్రారంభించారు షర్మిల. 2021 అక్టోబర్‌లో చేవెళ్ల నుంచి పాదయాత్ర చేశారు షర్మిల. తన పార్టీ YSRTPని జనవరి 4, 2024న కాంగ్రెస్‌లో విలీనం చేశారు షర్మిల. ఆ తర్వాత పరిణామాలు చకచకా మారిపోయాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా APCC చీఫ్‌గా ఉన్న గిడుగు రుద్రరాజు సోమవారం ఆ పదవికి రాజీనామా చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే షర్మిలను కాంగ్రెస్ పెద్దలు ఏపీసీసీ చీఫ్‌గా నియమించారు. I thank hon'ble @kharge ji , #SoniaGandhi ji , @RahulGandhi ji , and @kcvenugopalmp ji for trusting me with post of the president of @INC_Andhra Pradesh. I promise to work faithfully towards rebuilding the party to its past glory in the State of Andhra Pradesh with total… https://t.co/C6K8cQEz1F — YS Sharmila (@realyssharmila) January 16, 2024 ఇదీచదవండి.. రిమాండ్ సబబే.. కేసు కొట్టేయలేం -
AP: ఏపీ పీసీసీ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. దీంతో, త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ రానున్నారు. వివరాల ప్రకారం.. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రుద్రరాజు తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఏపీకి కొత్త పీసీసీ చీఫ్‌ను ఏఐసీసీ నియమించే అవకాశం ఉంది. -
పీసీసీ చీఫ్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి..
బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొట్టింది. దీంతో హెచ్ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో హెలికాప్టర్ అద్దం పగిలింది. శివకుమార్ ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు బెంగళూరులోని జక్కూర్ ఎయిర్‌పోర్టు నుంచి కోలార్ జిల్లాలోని ముల్బాగల్ వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపరిపీల్చుకున్నాయి. ఘటన సమయంలో హెలికాప్టర్లో డీకే శివకుమార్‌ను ఓ కన్నడ టీవీ ఛానల్ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తున్నారు. పైలటతో కలిపి మొత్తం ముగ్గురు హెలికాప్టర్లో ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతల ో జరగనున్న విషయం తెలిసిందే. 13 న కౌంటింగ్ ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 స్థానాలున్నాయి. మెజార్టీకి 123 సీట్లు అవసరం. ఈ సారి కచ్చితంగా 150 స్థానాలకుపై కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చదవండి: లిక్కర్ స్కాం కేసు: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు షాక్! -
మా నామినేషన్లు చెల్లకుండా చేసే కుట్ర
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడితో పాటే అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కూడా తారస్థాయికి చేరుతోంది. తమ నామినేషన్లను ఏదోలా చెల్లకుండా చేసేందుకు బసవరాజ్ బొమ్మై సర్కారు భారీ కుట్రకు తెర తీస్తోందని పీసీసీ చీఫ్ శివకుమార్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తమ అభ్యర్థుల నామినేషన్లలో ఏదో ఒక లోపాన్ని వెతకాలని, అలాగే బీజేపీ నామినేషన్లలో ఏమైనా తప్పులుంటే సరి చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్లందరి మీదా ఎంతగానో ఒత్తిడి తెస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు స్వయానా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వారికి ఫోన్లు వెళ్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం రంగంలోకి దిగి దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సీఎంఓ కాల్ డీటైల్స్ తెప్పించుకుని పరిశీలించాలని సూచించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి అంతూ పొంతూ లేకుండా పోతోందంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ కుట్రకు సంబంధించి మా దగ్గర సాక్ష్యాలున్నాయి. సౌందత్తి ఎల్లమ్మ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో తప్పులున్నాయి. వాటిని సరిచేయాల్సిందిగా సీఎంఓ నుంచి ఆర్ఓకు ఫోన్ వెళ్లింది. ఇక నా నామినేషన్‌ను ఏదోలా తిరస్కరింపజేసేందుకు బీజేపీ తరఫున పెద్ద టీమే రంగంలోకి దిగింది. నా పరిస్థితే ఇలా ఉంటే ఇతర సాధారణ అభ్యర్థుల సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. -
రేవంత్ మాపై పిర్యాదు చేయడం హాస్యాస్పదం: సుధీర్ రెడ్డి
హైదరాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. బీఆర్ఎస్లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రేవంత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ అని ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు మారలేదా? అని సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. వాళ్లంతా ముడుపులిస్తే మేం కూడా ఇచ్చినట్లే అని వ్యాఖ్యానించారు. బీజేపీకి బీ టీంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పనిచేస్తోందని సుధీర్ రెడ్డి ఫైర్ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రేవంత్ కాంగ్రెస్‌ను బలహీనపరుస్తున్నారని విమర్శించారు. చదవండి: ఇన్ని రోజులు నిద్రపోయారా.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్ -
పదవి అంటే పరారే.! కాంగ్రెస్‌కు ఎందుకీ పరిస్థితి?
రాజకీయ నాయకులు పదవులంటే తెగ మోజు పడతారు. వాటి కోసం పెద్ద నాయకుల చుట్టూ తిరుగుతారు. కాని హస్తం పార్టీలో పదవులిస్తామంటే పారిపోతున్నారట. ఆ పదవి మాకొద్దు.. అదేదో మీరే అనుభవించండని సీనియర్లకు తెగేసి చెబుతున్నారట. ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవులంటే ఎందుకు భయపడుతున్నారు? జేబుకు చిల్లు? కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఇతర పార్టీల కంటే కొంచెం ఎక్కువే. ప్రతి విషయంలోనూ నాయకులు ఉత్తర, దక్షిణ ధృవాల్లా వ్యవహరిస్తుంటారు. పదవుల కోసం కుస్తీ కూడా అందరికీ తెలిసిందే. కాని తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల ఏదైనా హోదా ఇస్తామన్నా.. పదవి ఇస్తామన్నా వద్దు బాబోయ్ అంటూ పారిపోతున్నారట. పెద్దవారు మీరే ఆ బాధ్యత తీసుకోండని చెప్పి చల్లగా జారుకుంటున్నారట నాయకులు. రెండుసార్లు అధికారం లేక అల్లాడిపోతోంది కాంగ్రెస్ పార్టీ. నాయకుల జంపింగ్‌లతో రాష్ట్రంలో రాను రాను నీరసించిపోతోంది. ఉన్నవారు నిధుల కోసం నానాపాట్లు పడుతున్నారు. ఏదైనా కార్యక్రమం జరిగినపుడు దాని బాధ్యత తీసుకోమంటే అధికారంలో ఉన్నపుడు అయితే పోటీ పడేవారు. ఇప్పుడు మాత్రం డబ్బు ఖర్చు పెట్టాల్సిన బాధ్యతలు వద్దని తప్పుకుంటున్నారు. పిలిస్తే ఖర్చు, పిలవకపోతే ఖాళీ ఏ చిన్న కార్యక్రమం నిర్వహించాలన్నా నిధులు అవసరం అవుతాయి. పెద్ద నాయకులైతే ఏదో విధంగా డబ్బు సమకూర్చుకుంటారు. రాష్ట్ర స్థాయి అయితే గాంధీభవన్ చూసుకుంటుంది. స్థానికంగా జరిగే కార్యక్రమాలు... రాష్ట్రం అంతటా ప్రాంతాలవారీగా జరిగే కార్యక్రమాలైతే అక్కడి నాయకులే భరించాల్సి ఉంటుంది. ఈ 8 సంవత్సరాల్లో జరిగిన అనేక కార్యక్రమాలు నిర్వహించి, ఉప ఎన్నికల బాధ్యతలు మోసిన.. చోటా మోటా నాయకుల నుంచి సీనియర్ల వరకు చాలా ఖర్చు చేశారు. అందుకే ఇటీవల ఏదైనా కమిటీ బాధ్యతలు అప్పగిస్తున్నా.. కార్యక్రమాల బాధ్యత అప్పగిస్తున్నా వద్దని ఖరాకండీగా చెప్పేస్తున్నారట. తమ చేతి చమురు వదులుతుందని భయపడి పారిపోతున్నారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. జోడో అనగానే బాగో తాజాగా..మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ గాంధీ పాదయాత్ర రెండు ఓకేసారి రావడంతో కాంగ్రేస్ నేతలు కలవరపడుతున్నారు. రెండూ ఆర్టికంగా భారమైనవే కావడంతో నేతలు డీలా పడిపోతున్నారు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక కోసం చాలామంది నేతలకు గ్రామాల వారిగా ఇంఛార్జ్ బాధ్యతలను అప్పగించింది పీసీసీ. చాలా రోజుల నుంచి ఆయా గ్రామాలలో ఖర్చంతా ఇంఛార్జ్ నేతలే భరిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ వేసిన తర్వాత పార్టీ తరుపున కొంత మోత్తాన్ని ఆయా గ్రామాల ఇంచార్జ్ లకు పార్టీ తరపున ఇస్తున్నట్లు సమాచారం. కానీ చాలా మంది నేతలు ఇంఛార్జ్ బాధ్యతలు తీసుకోవడానికి ఇష్ట పడడంలేదు. మరికొందరు బాధ్యతలు ఇచ్చినట్లు ప్రకటించినా తమకు వద్దని తప్పించుకుంటున్నారు. గాంధీ భవన్‌కు దూరం దామోదర రాజనర్సింహా, గీతారెడ్డి, మధు యాష్కి, మహేశ్వర్ రెడ్డి లాంటి వారు సైలెంట్ గా మునుగోడు భాధ్యతల నుంచి తప్పించుకున్నారని తెలుస్తోంది. కనిపిస్తే ఇంచార్జ్ బాధ్యతలు ఎక్కడ ఇస్తారో అని మరికొందరు అసలు గాంధీ భవన్‌కే దూరంగా ఉంటున్నారు. దీంతో భారం అంతా పీసీసీ ఛీఫ్ మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరో వైపు భారత్ జోడో యాత్రకు ఇంఛార్జ్ భాద్యతలు తీసుకునేందుకు చాలా మంది వెనకా ముందు ఆలోచిస్తున్నారు. ఇంఛార్జ్ బాధ్యతలు తీసుకుంటే ఖర్చంతా తమ మీదే వేస్తారేమోనని నేతలు భయపడుతున్నారు. ఈ పరిణామాలు గమనిస్తున్న కొందరు సినియర్ నేతలు పార్టీ పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడకు దిగజారిందంటూ నిట్టూరుస్తున్నారు. ఖర్చొద్దు.. పదవులొద్దు ఒకప్పుడు కమిటీల్లో పదవులు ఇవ్వలేదని అలిగిన నాయకులే.. ఇప్పుడు ఆ పదవులంటే పారిపోతున్నారు. గాంధీభవన్‌కు మళ్ళీ పూరన్వ వైభవం రావాలంటే కనీసం మునుగోడులో మంచి ఫలితం సాధించాలి..అలాగే రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ సూపర్ హిట్ కావాల్సిందే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. చదవండి: కాంగ్రెస్ భిక్షతో ఎదిగినవాళ్లే వెన్నుపోటు పొడిచారు.. రేవంత్ షాకింగ్ కామెంట్స్ -
కాంగ్రెస్‌లో మరో ట్విస్ట్.. యూపీసీసీ చీఫ్‌గా బ్రిజ్‌లాల్ ఖాబ్రీ నియామకం
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్టులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. తాజాగా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌ను నియమించింది. యూపీసీసీ చీఫ్‌గా బ్రిజ్‌లాల్ ఖాబ్రీని నియమిస్తున్నట్టు పార్టీ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. యూపీలో కాంగ్రెస్ కమిటీకి ఆరుగురు రీజినల్ హెడ్స్‌ను సైతం నియమించారు. నసిముద్దీన్ సిద్ధిఖీ, అజయ్ రాయ్, వీరేంద్ర చౌదరి, నకుల్ దూబే, అనిల్ యాదవ్, యోగేష్ దీక్షిత్‌లను రీజినల్ హెడ్స్‌గా నియమిస్తున్నట్టు స్పష్టం చేశారు. అయితే, ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటమికి బాధ్యత వహిస్తూ యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ లల్లూ పీసీసీ పదవికి రాజీనామా చేశారు. ఇక, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, మరో ముఖ్య నేత, ఎంపీ శశిథరూర్‌లు నిలిచారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం కాంగ్రెస్ సీనియర్ నేత కేఎన్ త్రిపాఠి(45) కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ మధుసుదన్ మిస్ట్రీ వెల్లడించారు. ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాల సెట్ నిబంధనల ప్రకారం లేదని, సంతకాలకు సంబంధించిన సమస్య తలెత్తిందని తెలిపారు. మొత్తం 20 పత్రాలు వచ్చాయని, అందులో నాలుగు సంతకాల సంబంధిత కారణాలతో తిరస్కరణకు గురైనట్లు మధుసుదన్ వెల్లడించారు. Congress rejigs Uttar Pradesh unit, appoints Brijlal Khabri as party’s state chiefhttps://t.co/QZOCoosSEK — The Indian Express (@IndianExpress) October 1, 2022 -
Karnataka: పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు
సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ నివాసం, ఆయనకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో సీబీఐ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. రామనగర జిల్లాలోని ఆయన స్వగ్రామంతోపాటు కనకపుర, దొడ్డనహళ్లి, సంతే కొడిహళ్లిలో ఈ సోదాలు జరిగాయి. శివకుమార్‌కు చెందిన ఆస్తులు, భూములు, వాటికి సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించారు. కనకపుర తహసిల్దార్‌ను కలుసుకున్నారు. శివకుమార్ ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. 2017లో శివకుమార్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. అనంతరం ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), తర్వాత సీబీఐ పరిధిలోకి వచ్చింది. శివకుమార్‌పై దర్యాప్తు కొనసాగించేందుకు 2019 సెప్టెంబర్ 25న కర్ణాటక ప్రభుత్వం సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. మానసికంగా వేధిస్తున్నారు సీబీఐ దాడులపై డీకే శివకుమార్ స్పందించారు. దాడుల పేరుతో తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ‘నేను చట్టాన్ని గౌరవిస్తాను. వాళ్లు అడిగిన పత్రాలు ఇప్పటికే ఇచ్చాను. అయినప్పటికీ వారు నా ఆస్తులను తనిఖీ చేశారు. ఎంతోమంది ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ నా కేసులో మాత్రమే సీబీఐకి అనుమతి లభించింది. సీబీఐ నాపై మాత్రమే ఎందుకు దర్యాప్తు చేస్తోంది?’ అని శివకుమార్ ప్రశ్నించారు. చదవండి: అక్టోబర్‌లో అమిత్ షా పర్యటన.. జమ్మూ కశ్మీర్లో జంట పేలుళ్ల కలకలం -
రైతులు బ్యాంకు రుణాలు చెల్లించొద్దు
బొంరాస్‌పేట/కొడంగల్: తీసుకున్న బ్యాంకు రుణాలను రైతులెవరూ పైసా కూడా చెల్లించొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రకటించిన డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాల భూమి, రూ.లక్ష రుణమాఫీ వంటి హామీలన్నీ ఉత్తివేనని, వీటిలో ఏఒక్కటీ నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండల పరిధిలోని తుంకిమెట్ల,అంగడిరాయిచూర్, చంద్రకల్, కొడంగల్‌లో ఆదివారం నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్‌లు ఢిల్లీ, లండన్ పర్యటనలు చేస్తున్నందున రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా గాలి పీల్చుకునే అవకాశం కలిగిందని, తెలంగాణ సమాజానికి ఈ స్వేచ్ఛ శాశ్వతంగా దక్కాలంటే వారిని రాష్ట్ర పొలిమేరల నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 2004లో వైఎస్సార్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. అధికారంలోకి వచ్చాక నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఉద్యమ స్ఫూర్తిని విస్మరించి కేసీఆర్ మార్కు పాలన అమలు చేస్తున్నారని ఆరోపించారు. రైతు గోస పట్టడం లేదు ప్రతీ గ్రామం, తండాకు కాంగ్రెస్ డిక్లరేషన్ తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గూడెం, గిరిజన తండాల్లో రైతు రచ్చబండ నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా వర్షాలకు మొలకెత్తిన వరి ధాన్యాన్ని రైతులు రేవంత్‌రెడ్డికి చూపించారు. తుంకిమెట్లకు చెందిన బ్యాగరి ఎల్లప్ప మాట్లాడుతూ..రైతుల గోడును టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిరుపతిరెడ్డి, మండల నాయ కులు వెంకట్రాములుగౌడ్, నర్సిములుగౌడ్, జయకృష్ణ, రాంచంద్రారెడ్డి, రాజేశ్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: ‘సార్’ ఊరు నుంచే ‘కారు’ పతనం -
గుడ్ బై.. గుడ్ లక్.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన పీసీసీ మాజీ చీఫ్
దేశంలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఎలాగైనా మరోసారి పార్టీకి పూర్వవైభవం తేవాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్తాన్‌లోని జైపూర్‌లో చింతన్ శిబర్ నిర్వహించి హస్తం పార్టీలో సంస్థాగత మార్పులకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ పార్టీని వీడుతూ.. గుడ్ లక్.. గుడ్ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాకర్ శనివారం కాంగ్రెస్ పార్టీకి గుబ్ బై చెప్పారు. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో జాకర్ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పంజాబ్ సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత జాకర్ సీఎం రేసులో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, అధిష్టానం అందరికీ షాకిస్తూ ఛన్నీని సీఎం సీటులో కూర్చోబెట్టింది. దీంతో జాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పంజాబ్‌లో అమరీందర్ సింగ్ రాజీనామా తర్వాత ఆయన స్థానంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా ఛన్నీని నియమించడంతో అధిష్టానాన్ని జాకర్ ప్రశ్నించారు. ఆ తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ, ఛన్నీ ఓటమి చెందడంతో జాకర్ మరోసారి కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. దీంతో అనుహ్యంగా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. శనివారం ఫేస్ బుక్ లైవ్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వీడుతున్నానని చెబుతూ.. గుడ్ బై.. గుడ్ లక్ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: లౌడ్‌స్పీకర్ల వివాదం..చంపేస్తామని బెదిరింపులు.. రాజ్ ఠాక్రేకు భద్రత పెంపు -
అమిత్‌షాకు 9 ప్రశ్నలు.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. అమిత్‌షాకు 9 ప్రశ్నలను ఆయన సంధించారు. మోసానికి బీజేపీ, టీఆర్ఎస్ కవల పిల్లలు అంటూ లేఖలో మండిపడ్డారు. మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు గడప దాటడం లేదు అన్న సామెత కేంద్రంలోని మీ ప్రభుత్వానికి అతికినట్టు సరిపోతుంది. 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మీ హామీ ఒట్టి బూటకం అని అర్థమైయిందని నిప్పులు చెరిగారు. చదవండి: తెలంగాణ కడుపు కొడుతోంది! లేఖలో రేవంత్ ఏమన్నారంటే? ‘‘అన్నదాతల ఆదాయం రెట్టింపు సంగతి అటుంచి మీ పాలనలో వారి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టయింది. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన మీ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తూ లక్షలాది మంది రైతులు రోడ్డెక్కారు. ఈ ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు వదిలారు. ఎరువుల సబ్సిడీలు ఎత్తివేసి రైతుల నెత్తిన బరువు మోపింది మీ ప్రభుత్వం. బ్యాంకులను వేల కోట్లకు ముంచిన బడాబాబులు దేశాన్ని వదిలి స్వేచ్ఛగా ఎగిరిపోతుంటే.. రైతుల రుణాలను మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మొత్తంగా మీ పాలనలో వ్యవసాయంలో గుణాత్మక మార్పు అన్నది జీరో. ఇక తెలంగాణ విషయానికి వస్తే... బీజేపీ-టీఆర్ఎస్లు ఎనిమిదేళ్లు అంటకాగి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పథకాలన్నింటినీ ఇద్దరూ కలిసి విజయవంతంగా తుంగలో తొక్కారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడో సారి మీరు తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వచ్చిన ప్రతిసారీ సెంటిమెంట్ డైలాగులే తప్ప తెలంగాణ ప్రజలు, రైతులు, యువత సమస్యల పరిష్కారానికి మీరు ఇచ్చిన మాట లేదు.. చేసిన పనీ లేదు. కేసీఆర్ కుటుంబ అవినీతితో ఇప్పటికే వేల కోట్ల తెలంగాణ ప్రజల సంపద దోపిడీకి గురైతే.. మీరు చోద్యం చూస్తున్నారు. బొగ్గు స్కాం నుంచి భూముల స్కాం వరకు పలు ఫిర్యాదులు ఇచ్చినా స్పందించలేదు. ఇటీవల మీ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి గడ్కరీ వచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేశారు. మీ పార్టీ రాష్ట్ర నాయకులేమో టీఆర్ఎస్ తో లడాయి అంటూ తొడలు కొడుతుంటారు. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేస్తోన్న మీ రెండు పార్టీల చీకటి సంబంధం తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో... 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడోసారి తెలంగాణకు వస్తున్న మీకు తెలంగాణ ప్రజలు, రైతులు, యువత తరఫున కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు కాళేశ్వరం అని పేరు మార్చి, రీ డిజైనింగ్ పేరుతో కేసీఆర్ కమీషన్లు దండుకుంటున్నారని మేం మొదటి నుండి ఆరోపిస్తున్నాం. ఈ ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఎటీఎంలా మారింది అని... మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇటీవల పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి జరిగింది అని అంగీకరిస్తున్న మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? దేశంలో ప్రతిపక్ష నేతలు, మీ సొంత పార్టీలో నిజాలు మాట్లాడే నేతల పై ఈడీ, సీబీఐ ద్వారా కొన్ని గంటల వ్యవధిలోనే దాడులు చేయించే మీరు ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెబుతారా!? తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో మీరు, కేసీఆర్ కలిసి మొదట ఒక చీకటి ఒప్పందం చేసుకున్నారు. యాసంగి (2022) నుండి తెలంగాణలో ధాన్యం సేకరణ ప్రభుత్వం చేయకూడదు అన్నది ఆ ఒప్పందం. దానికి రైతుకు సంబంధం లేని బాయిల్డ్ రైస్ అని ఒక వంక తెర మీదకు తెచ్చారు. దానికి అనుగుణంగానే కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఎత్తేశారు. రైతుల వద్ద ధాన్యం కొంటుంటే ప్రభుత్వానికి రూ.7000 కోట్ల నష్టం వచ్చిందని కుంటి సాకులు చెప్పారు. వరి వేస్తే ఉరే అని హెచ్చరికలు చేశారు. వరి వేస్తే రైతు బంధు ఇవ్వబోమని సంకేతాలు పంపారు. ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని అంగీకారం తెలుపుతూ 2021 అక్టోబర్ 4న మీ ఆదేశాల మేరకే FCI కి కేసీఆర్ లేఖ రాశారు. ఆ లేఖపై క్షేత్ర స్థాయిలో "కల్లాల్లోకి కాంగ్రెస్" అని మేం పోరుబాట పట్టడంతో మాటమార్చారు. మీ రెండు పార్టీలు కలిసి ఆడిన రాజకీయ డ్రామా కారణంగా గడచిన వానాకాలం నుండి తెలంగాణ రైతులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. పదుల సంఖ్యలో రైతులు వడ్ల కుప్పలపై గుండె పగిలి చనిపోయారు. ఈ మరణాలకు బాధ్యులు మీ రెండు పార్టీలు కాదా!? గత పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు, ఉద్యమాన్ని కించ పరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దీనిపై టీఆర్ఎస్ మౌనందాల్చినా... కాంగ్రెస్ పక్షాన అప్పుడే మేం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాం. మీరు స్పందించ లేదు. ఇప్పుడు తెలంగాణకు వస్తున్న సందర్భంగా మీరు ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో మీ రాకను తెలంగాణ సమాజం ఎట్లా ఆమోదిస్తుందనుకుంటున్నారు? మా ప్రజలకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేదు అని మీరు భావిస్తున్నారా!? మీ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు చేయిస్తామని లోక్ సభ ఎన్నికల ప్రచార సందర్భంగా మీ పార్టీ అగ్రనేత రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఆ మేరకు మీ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. వీరిద్దరి మాటలు విశ్వసించిన నిజామాబాద్ ప్రజలు అరవింద్ ను ఎంపీగా గెలిపించారు. మూడేళ్లవుతున్నా పసుపుబోర్డు ఊసే లేదు. దీనికి మీ సమాధానం ఏమిటి? ఇది ప్రజలను చీట్ చేయడం కాదా!? తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ లాంటి బృహత్తర పథకాలకు కాంగ్రెస్ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం విభజన చట్ట ప్రకారం హామీ ఇచ్చింది. మీరు అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నింటికీ మంగళం పాడారు. తెలంగాణకు కేంద్రం పదే పదే రిక్తహస్తం చూపిస్తున్నా ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ మీరు అనేక సందర్బాల్లో మద్ధతిస్తూ వచ్చింది. ఇది బహిరంగమే. తెలంగాణ ప్రజలను నిలువునా వంచించిన మీ ఇద్దరినీ మేం ఎందుకు నమ్మాలి... మీకు మా ప్రజలు మద్ధతు ఎందుకు ఇవ్వాలి? విభజన చట్టం హామీ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీకి మోక్షం ఎప్పుడు? అయోధ్య నుండి రామేశ్వరం వరకు ఉన్న రాముడి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా "రామాయణం సర్క్యూట్" పేరిట శ్రీ రామాయణ్ యాత్ర ఎక్స్ ప్రెస్ పేరిట రైలును ప్రవేశ పెట్టారు. 7,500 కిలో మీటర్లు సాగే ఈ సర్క్యూట్ లో దక్షిణ అయోధ్యగా ఖ్యాతికెక్కిన మా భద్రాద్రి రాముడుకి చోటు దక్కలేదు. రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా ఉండి కూడా మాకు మొండి చెయ్యి చూపారు. దీనికి మీ సమాధానం ఏమిటి? భద్రాద్రి రాముడు రాముడు కాదా!? అయోధ్య రాముడు, భద్రాద్రి రాముడు మీ దృష్టిలో ఒక్కరు కాదా!? ఒడిస్సాలోని నైనీ కోల్ మైన్స్ టెండర్ విషయంలో జరిగిన అవినీతిపై మా పార్టీ సహచర ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నేను స్వయంగా కేంద్ర బొగ్గుశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను. ఈ కుంభకోణం వెనుక కేసీఆర్ కుటుంబ పాత్రపై వివరాలు సమర్పించాం. ఇంత వరకు దీనిపై అతీగతీ లేదు. కారణం ఏమిటి? కేసీఆర్ అవినీతి విషయంలో మీరు నిజంగా అంత సీరియస్ గా ఉంటే... అది చేతల్లో ఎందుకు కనిపించడం లేదు? పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణలో రెండు ప్రధాన ప్రాజెక్టుల్లో ఒక్క దానికి కూడా జాతీయ హోదా ఇవ్వాలన్న ఆలోచన మీకు రాలేదు. అడగే బుద్ధి టీఆర్ఎస్ సర్కారుకు లేదు. మీ దుర్మార్గ చట్టాలకు వారి మద్ధతు.. వారి అక్రమాలు అవినీతికి మీ మద్ధతు.. ఇది కాదా ఎనిమిదేళ్లుగా జరిగింది!? 2014లో మేం అధికారం నుండి దిగిపోయే నాటికి పెట్రోల్ ధర రూ.71.41 పైసలు, డీజిల్ ధర రూ.55.49 పైసలు. గ్యాస్ సిలెండర్ ధర రూ.470 ఉన్నది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.119.66 పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.105.65 పైసలు. గ్యాస్ సిలెండర్ ధర రూ.1052 ఎగబాకాయి. మీరు అధికారంలోకి వచ్చాక దశల వారిగా గ్యాస్ పై సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు. సామాన్యులు బతికే పరిస్థితి లేదు. ప్రతి రోజు ఉదయం పెట్రోలియం ధరల పెరుగుదల వార్తతోనే జనం జీవితాలు మొదలవుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలా ధరల పెరుగుదలతో జన చస్తుంటే మీకు చీమకుట్టినట్టైనా అనిపించడం లేదా? ఈ ధరల్లో 60 శాతం వరకు బీజేపీ - టీఆర్ఎస్ ప్రభుత్వాలు బాదుతున్న పన్నులే ఉన్నాయి. మీరు తగ్గించాలని వారు, వారు తగ్గించాలని మీరు డ్రామాలు చేయడం తప్ప... ప్రజలకు ఇద్దరు కలిసి ఇస్తున్న ఉపశమనం శూన్యం. ఇంతలా జనాలను పన్నులు, సెస్సులతో చావగొట్టే మిమ్మల్ని మా తెలంగాణ ప్రజలు ఎందుకు క్షమించాలి? అమిత్ షా గారూ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీరు తెలంగాణకు ఏ మొఖం పెట్టుకుని వస్తారు? మోసానికి కవల పిల్లలు లాంటి బీజేపీ - టీఆర్ఎస్ జిత్తులు, ఎత్తులు గ్రహించ లేని అమాయకులా తెలంగాణ ప్రజలు? మా ప్రజలకు ఒపిక ఎక్కువ... దానిని అమాయకత్వం అనుకుంటే పొరపాటు. సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర పోరాటం వరకు ప్రపంచానికే పోరాట పంథాను చూపిన తెగువగల ప్రజలు మా వాళ్లు. సెంటిమెంట్ తో ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేయాలనుకునే మీ కుతంత్రం ఇక్కడ పని చేయదు’’ అంటూ రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. -
హిమాచల్ పీసీసీ చీఫ్‌గా ప్రతిభా వీరభద్ర సింగ్
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య, ఎంపీ ప్రతిభా వీరభద్ర సింగ్‌ను నియమించారు. కుల్దీప్ సింగ్ రాథోర్ స్థానంలో ఆమెను నియమించారు. దీంతోపాటు రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా హర్ష మహాజన్, రాజేందర్ రాణా, పవన్ కాజల్, వినయ్‌కుమార్‌ను సోనియా నియమించారు. స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా ఆనంద్ శర్మ, ప్రచార కమిటీ చైర్మన్‌గా సుక్వీందర్ సింగ్, సీఎల్పీ లీడర్‌గా ముకేశ్ అగ్నిహోత్రి నియమితులయ్యారు. చదవండి: (నవనీత్ కౌర్-రాణా దంపతులపై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు) -
స్వరం మార్చిన కాంగ్రెస్ చీఫ్.. బీజేపీపై ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో హస్తం నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి మరో పార్టీలో చేరుతున్నారు. కాగా, భవిష్యత్ ప్రణాళికలపై ఇప్పటికే కాంగ్రెస్ చర్యలకు దిగింది. పార్టీ ప్రక్షాళనకు ప్లాన్స్ తయారుచేస్తోంది. అయితే, ఈ ఏడాది చివరలో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్ తగిలేలా ఉంది. తాజాగా గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్ధిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానాన్ని టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. ఇప్పటికే హర్ధిక్ పటేల్.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేయగా.. శుక్రవారం మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉన్నఫలంగా తాను రాముడి భక్తుడినని ప్రకటించుకొన్నారు. హఠాత్తుగా హార్ధిక్.. హిందుత్వ బాణిని వినిపించారు. అలాగే బీజేపీని ప్రశంసిస్తూ కామెంట్స్ చేశారు. ‘‘బీజేపీకి సంబంధించి కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. వాటిని మనం అంగీకరించాలి. రాజకీయంగా ఇటీవల బీజేపీ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించాలి. అలాంటి చర్యలు తీసుకునే శక్తి వారికి ఉందని మనం అంగీకరించాలి. అలాగే గుజరాత్లో కాంగ్రెస్ బలంగా మారాంటే కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. నిర్ణయాధికారాన్ని మెరుగుపరచుకోవాలి’’ అన్ని అన్నారు. మరోవైపు.. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై హార్ధిక్ పటేల్ స్పందిస్తూ.. తాను పార్టీ మారాలా? వద్దా అన్నది మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నానని అన్నారు. బీజేపీలో చేరే ఆలోచనలేదని తెలిపారు. కాగా, హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జీ కేసీ వేణుగోపాల్‌తో భేటీ సందర్భంగా తాను పీసీసీ బాధ్యతలు నిర్వర్తించలేనని చెప్పినట్లు సమాచారం. తన పనులకు కొందరు అడ్డుతగులుతున్న కారణంగా ప్రజల పక్షాన పోరాడలేకపోతున్నానని గుజరాత్ నేతలపై అధిష్టానానికి హార్ధిక్ ఫిర్యాదు చేశారు. -
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
సోనియా గాంధీ కీలక నిర్ణయం.. పీసీసీ చీఫ్‌లకు షాక్!
ఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడటంతో కాంగ్రెస్ హైకమాండ్ ప్రక్షాళన చేపట్టింది. ఆయా రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్లుగా ఉన్నవారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే మరిన్ని కఠిన నిర్ణయాలకు సమాయత్తమవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. పంజాబ్‌లో అధికారం నిలబెట్టుకోవాలని చూసిన కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ కాంగ్రెస్‌లో ఏర్పడ్డ సంక్షోభం ఆ పార్టీకి తీవ్ర నష్టం చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ఆప్ అధికారంలోకి వచ్చింది. కచ్చితంగా పంజాబ్‌లో గెలుస్తామనుకున్న కాంగ్రెస్‌కు.. అక్కడ ప్రతికూల ఫలితాలు రావడం హైకమాండ్ జీర్ణించుకోలేకపోతోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేలోపే పార్టీకి తీవ్ర నష్టం కల్గడంతో చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఆ ఐదు రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్లుగా ఉన్నవారిని తొలగిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ను ముంచేసి..రాజీనామానా? -
Revanth Reddy : జల దోపిడీకి కారణం కేసీఆరే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న జల దోపిడీకి కారణం సీఎం కేసీఆర్ అని మాత్రమేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాదిగా మారి, కాసుల కోసం తెలంగాణ ప్రయోజనాలు పణంగా పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఓట్లకోసం నీటిని ఏటీఎంలా మార్చుకున్నారని, కాంగ్రెస్ శ్రేణులను తప్పుదోవ పట్టించేందుకే జల వివాదాల డ్రామా నడుపుతున్నారని దుయ్యబట్టారు. నీటి తరలింపుపై కేసీఆర్‌కు అన్ని విషయాలు చెప్పాకే ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలిపారు. నీటి తరలింపుపై అన్ని విషయాలు తెలిసిన కేసీఆర్, కృష్ణా జలాల విషయంలో కృత్రిమ పంచాయతీ పెడుతున్నరని మండిపడ్డారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు సురేశ్ షెట్కార్ ఇంట్లో పీసీసీ అనుబంధ సంఘాల చైర్మన్లతో జరిగిన సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కేసీఆర్ జల వివాదాల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ప్రస్తుతం రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారని, అలాంటి వారిని సామాజిక బహిష్కరణ చేయాలని సీనియర్ కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. వైఎస్, ఎన్టీఆర్‌లది ఓ శకం.. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలది ఒక శకం అని, వారిద్దరూ సంక్షేమం ద్వారా ప్రజలకు చేయాల్సినంత సేవ చేశారని రేవంత్ కొనియాడారు. వైఎస్సార్, ఎన్టీఆర్ రాజకీయాలకు అతీతులని, వారిని విమర్శించే వాళ్లు నికృష్టులని అన్నారు. ఈ రోజు జరుగుతున్న నీళ్ల దోపిడీలో రాజశేఖర రెడ్డి పాత్ర లేదన్నారు. కాంగ్రెస్ అభిమానులను తప్పు దారి పట్టించేందుకు కేసీఆర్ డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులను షర్మిల వైపు నడిపించేందుకు కేసీఆర్ ఇదంతా చేస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రులు రాజశేఖరరెడ్డిని తిట్టడం ద్వారా రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారన్నారు. -
చిచ్చు రేపుతున్న పీసీసీ చీఫ్ ఎంపిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించిన ప్రక్రియ పార్టీలో చిచ్చు రాజేస్తుంది. ఇప్పటికే పదవి కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఢిల్లీ బాట పట్టారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం పార్టీ చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఇక మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడి, జగ్గారెడ్డి తదితరులు నేడో, రేపో ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇక పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి ఇస్తే.. తాము పార్టీలో ఉండలేమని కొందరు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్‌లో అభిప్రాయ సేకరణ చేపట్టినట్లు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ తెలిపారు. -
అధ్యక్షుడి ఎంపిక.. ఆలస్యం!
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ తెలిపారు. అధిష్టానానికి నివేదిక సమర్పించేందుకు ఇంకా సమయముందన్నారు. పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియపై ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రా రంభించి ఇప్పటివరకు 18 కేటగిరీల్లోని రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు 162 మంది నేతల అభిప్రాయాల ను సేకరించాం.. అయితే ఈ కసరత్తు పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుంది. రాష్ట్రం లో సేకరించిన అభిప్రాయాల ఆధారంగా నివేదికను సిద్ధం చేసి సోనియా, రాహుల్ గాంధీలకు అందిస్తాం. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అందరి అభిప్రాయాలను అధిష్టానం పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటుంది..’అని చెప్పారు. పీసీసీ చీఫ్ ఎంపిక కసరత్తుపై రాష్ట్ర నాయకులకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే, పార్టీ అధిష్టానాన్ని నేరుగా కలిసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మాణిక్యం ఠాగూర్ అన్నారు. ‘క్షేత్రస్థాయిలో ఏమాత్రం ప్రజాదరణ లేని నాయకులే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నారు. సంస్థాగతమైన లోపాల కారణంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి బలహీనంగానే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో భేటీ అవుతారని మేం ముందుగా చెప్పినట్లే జరిగింది. ఢిల్లీలో దోస్తీ.. గల్లీ మే కుస్తీ అన్నట్టుగా టీఆర్ఎస్–బీజేపీల వ్యవహారశైలి ఉంది.’ అని మాణిక్యం వ్యాఖ్యానించారు. -
టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బెటర్
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందన్న అం శంపై అభిప్రాయసేకరణ వరుసగా మూడో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. కాంగ్రె స్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ దీనిపై గాంధీభవన్‌లో పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అను బంధ సంఘాల చైర్మన్లు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు... ఇలా దాదాపు 80 మంది నాయకులు శుక్రవారం ఠాగూర్‌ను కలిసి అభిప్రాయాలను తెలియజేశారు. గత ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్య ర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో కూడా ఆయన శని వారం మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసు కుంటారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కొండా దంపతుల భేటీ కాగా, శుక్రవారం గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు మాణిక్యం ఠాగూర్‌తో భేటీ అయ్యారు. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై తమ అభిప్రాయాలు చెప్పిన కొండా దంపతులతో వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల గురించి మాణిక్యం చ ర్చించారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, జిల్లా లోని అందరు నేతలతో సమ న్వయం చేసుకోవాలని కొండా దంపతులకు ఆయన చెప్పినట్టు తెలిసింది. బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్న నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా గాంధీభవన్‌కు వచ్చి మాణిక్యంను కలిశారు. పార్టీ మారే అంశంపై విలేకరులు మహేశ్వర్‌రెడ్డిని ప్రశ్నించగా, తా ను పార్టీ మారేటట్లయితే ఇప్పుడు గాంధీభ వన్‌కు ఎందుకు వస్తానని, ఈ ప్రచారం ఎలా జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు. పారిశ్రామిక పార్కులు అమ్మే కుట్ర: షబ్బీర్ సాక్షి, హైదరాబాద్: రాజధాని చుట్టుపక్కల పారిశ్రామిక పార్కులకు కేటాయించిన భూములను ఐటీ పార్కుల పేరిట ప్రైవేటు కంపెనీలకు అమ్మేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. కూకట్పల్లి, గాంధీనగర్, బాలానగర్, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, మౌలాలీ, పటాన్చెరు, రామచంద్రాపురం, సనత్‌నగర్, కాటేదాన్ ప్రాంతాల్లోని భూములను మంత్రి కేటీఆర్ స్నేహితులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ పారిశ్రామిక పార్కుల్లో చాలాకాలంగా వేలాది పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న వారి పరిస్థితి ఏంటన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ‘టీఆర్ఎస్తో బీజేపీకి చీకటి ఒప్పందం’ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్తో బీజేపీకి చీకటి ఒప్పందం ఉందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో బీజేపీని తిట్టే కేసీఆర్ రాత్రికి ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్‌షాలతో మంతనాలు జరుపుతారని ఎద్దేవా చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మా ట్లాడారు. కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదు అనేది అవాస్తవమని, సోనియా, రాహుల్ గాంధీలు తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఇలా మాట్లాడ గలిగేవాడా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. -
‘పీసీసీ కోసం సీరియస్‌గా ట్రై చేస్తున్నా’
సాక్షి, హైదరాబాద్: పీసీసీ చీఫ్ పదవి కోసం తాను సీరియస్‌గా ట్రై చేస్తున్నానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తేల్చిచెప్పారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు నష్టం చేసే చట్టాలను బీజేపీ తీసుకొచ్చిందని, రైతులకు మద్దతుగా నేటి బంద్‌లో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటుందని తెలిపారు. వ్యవసాయ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడే సోనియాగాంధీ, కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారని గుర్తుచేశారు. బీజేపీ తపన రాజకీయాల కోసం తప్ప ప్రజల కోసం కాదన్నారు. రైతులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం కొనసాగుతుందని చెప్పారు. మంగళవారం సంగారెడ్డి హైవేను రెండు గంటలు దిగ్బంధం చేస్తామన్నారు. (చదవండి: కాంగ్రెస్ ఓటమి.. రేవంత్ వర్గంలో ఆశలు) -
మధుయాష్కీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు అవసరం ఉందంటూ ఏఐసీసీ కార్యదర్శి, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. మధుయాష్కి తనతో మాట్లాడారని, పీసీసీ మార్పుపై ఆయన ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో 60వేల కోట్లు ఖర్చు చేశామనడంపై ఆయన మాట్లాడుతూ.. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఇక్కడే మేము వ్యవసాయం చేశాం. కేసీఆర్ హైదరాబాద్‌లో 60వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎక్కడ చేశారో తెలియదు. వరదలు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగాయి. వర్షాలకే నగరం సగం మునిగిందంటే ఇది టీఆర్ఎస్ పని తీరుకు నిదర్శనం. వరదల్లో వంద మంది చనిపోతే.. ఒక్కచోట కూడా పరామర్శించలేదు. 550 కోట్లు వరద బాధితులకు ఇస్తామన్నారు. (పీసీసీ మార్పు: మధుయాష్కీ హాట్ కామెంట్స్) రూ.2 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు హైదరాబాద్‌కు ఇవ్వలేరా..?. ప్రతీ కుటుంబానికి 50వేల రూపాయల పరిహారం ఇవ్వాలి. ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామంటే ముఖ్యమంత్రి, సీఎస్ అపాయింట్ ఇవ్వడం లేదు. వరద సహాయాన్ని దోచుకుతింటున్నారు. రూ.350కోట్లు నగదు ఎలా డ్రా చేస్తారు. లబ్ధిదారుల జాబితా ఎందుకు ఇవ్వడం లేదు. వరద సహాయం అతిపెద్ద కుంభకోణం. దోపిడీపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. 3లక్షల 87వేల మంది లబ్దిదారుల జాబితా ఎందుకు ఇవ్వరు. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. జరుగుతున్న దోపిడీని గవర్నర్‌కు ఫోన్లో వివరించాం. విచారణ జరిపించాలని కోరాం. కరోనా సమయంలో రూ.1,500 బ్యాంకు లో వేసిన ప్రభుత్వం.. ఇప్పుడు రూ.10వేలు క్యాష్ ఎట్లా ఇస్తారు. గ్రేటర్ ఎన్నికల కోసం ఇంతగా దిగజారాలా. పరిహారం దోపిడీపై వదిలేది లేదు. అధికారులను కోర్టుకు ఈడ్చుతాం అని అన్నారు. -
పీసీసీ మార్పు: మధుయాష్కీ హాట్ కామెంట్స్
సాక్షి, నిజామాబాద్ : ఎన్నికల్లో వరుస ఓటములు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీపై ఏఐసీసీ కార్యదర్శి, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అవసరం ఉందన్నారు. దుబ్బాక ఫలితాల తర్వాత పీసీసీ మార్పుకు అవకాశం ఉండవచ్చు అంచనా వేశారు. దుబ్బాక ఫలితం ఎలా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహాంతో ముందుకు వెళ్తుందని అధిష్టానం ఆ దిశలో ఆలోచన చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. శుక్రవారం నిజమాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మధుయాష్కీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉందన్నారు. నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని రాహుల్ గాంధీ సూచించారని తెలిపారు. ఫలితాలు ఎలా ఉన్నా ఏమీ ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్లాలని ఆదేశించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కింది స్థాయి కార్యకర్త వరకూ అందరూ కృషి చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ తమ రిపోర్టులు జాతీయ పార్టీకి అందిస్తారని తెలిపారు. ఆ తరువాత అధిష్టానం పీసీసీ మార్పు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో పార్టీ నాయకత్వలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు. కాగా పీసీసీ చీఫ్ మార్పుపై మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా ఉత్తమ్‌ను బాధ్యత నుంచి తప్పించి ఆయన స్థానంలో మరొకరిని నియమిస్తారని జోరుగా ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. -
బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు మృతి
కోల్‌కతా: బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ( పీసీసీ) అధ్యక్షుడు సోమెన్ మిత్ర(78) గురువారం మృతి చెందారు. 1972-2006 వరకు ఆయన ఎమ్మెల్యేగా పని చేశారు. పశ్చిమ బెంగాల్ యూత్ కాంగ్రెస్ ఆయన మరణించినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది. కిడ్ని, గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న మిత్రను కోల్‌కతా ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన జూలై 30వ తేదీ అర్ధరాత్రి 1.30 గంటలకు గుండె నొప్పితో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. మిత్రకు కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్న మిత్ర ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆమె ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషించారు. ఆయన తన భార్య, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మిత్ర మరణవార్తను ఆయన కుటుంబం అధికారికంగా ప్రకటించలేదు. సోమెన్ మిత్ర మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. చదవండి: కరోనా కంటే తీవ్రంగా ఉంది: మమతా బెనర్జీ My heart goes out to the family of the Lt Somen Mitra. He was a giant of Bengal and he touched the lives of millions of people in his long journey. My condolences to his family and all those who admired him. His legacy will not be forgotten. @INCIndia @INCWestBengal https://t.co/YljhsJ0f0M — Gaurav Gogoi (@GauravGogoiAsm) July 29, 2020 -
కాంగ్రెస్‌లో మళ్లీ పీసీసీ ‘లొల్లి’!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మళ్లీ రచ్చ మొదలయింది. టీపీసీసీ అధ్యక్ష మార్పు గురించి పార్టీ శ్రేణులన్నీ మర్చిపోయి, అధిష్టానం కూడా ఆ వైపు ఆలోచించడం లేదన్న నేప«థ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని ఉద్దే శించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆదివారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్ష మార్పు గురించిన అంశాన్ని ప్రస్తావిం చారు. ఉత్తమ్‌ను మార్చాల్సిన పనిలేదంటూనే రేవంత్‌కు ఇవ్వొద్దని ప్రతిపాదించారు. దీనికి తోడు జూన్ 2.. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ‘దీక్ష’లపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో టీపీసీసీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ పార్టీ నేతలు దామోదర రాజనర్సింహ, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య ప్రత్యేకంగా భేటీ కావడం రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలను మరోమారు రసకందాయంలో పడేసింది. జగ్గారెడ్డి ‘స్టైలే’సెపరేటు... 2018 ముందస్తు ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారారు. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే అవుతోంది. టీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేయడం నుంచి సొంత పార్టీ పరిణామాలపై ఆయన వ్యాఖ్యలు దుమారానికి దారి తీస్తున్నాయి. తాజాగా టీపీసీసీ అధ్యక్ష పదవి వ్యవహారంలో ఆయన అన్న మాట లు అటు పార్టీలోనూ, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీస్తున్నాయి. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌కు మాత్రం టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వొద్దని, తనను సంప్రదించకుండా ఇస్తే తన రాజకీయం తాను చేస్తానన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ను మార్చాల్సిన పనిలేదని, ఆయన బలమైన నాయకుడని చెప్పారు. ఉత్తమ్ భార్య పద్మావతిని ఎన్నికల్లో గెలిపించుకోలేనంత మాత్రా న ఆయన బలహీనుడు కాదని.. అందరినీ గెలిపిస్తానని చెప్పి తానే ఓడిపోయిన రేవంత్ బలవంతుడెలా అవుతాడ ని ప్రశ్నించారు. దీంతో పాటు రేవంత్‌పై తనకు కొన్ని అపోహలున్నాయని, వాటి గురించి రేవంత్‌తోనే మాట్లాడుతానన్నారు. కాంగ్రెస్‌లోకి వచ్చి ఎంపీగా గెలిచి.. అధికార పార్టీ పై పోరాటం చేస్తున్న రేవంత్‌పై జగ్గారెడ్డికి ఉన్న అపోహలేంటని, అలాంటి వ్యాఖ్యల వెనుక జగ్గారెడ్డి ఆంతర్యం ఏమిటనేది.. అంతుపట్టడం లేదు. పైగా రేవంత్‌కు టీపీసీసీ ఇవ్వద్దంటూ రాహుల్‌గాంధీకి లేఖ రాస్తానని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. ఉత్తమ్ ఉండాలంటూ.. రేవంత్ వద్దంటూ జగ్గారెడ్డి పేర్కొనడం కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. పార్టీలో, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా చుట్టూ ప్రభుత్వ కోవర్టులున్నారని జగ్గారెడ్డి అన్నారు. చాలాకాలంగా కాంగ్రెస్‌లో జరుగుతున్న కోవర్టుల చర్చ జగ్గారెడ్డి వ్యాఖ్యలతో మరో మలుపు తీసుకుంది. వీరి భేటీ ఎందుకో?.. ఇక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు కొందరు పార్టీ సీనియర్ల ప్రత్యేక భేటీ నిదర్శనంగా నిలుస్తోంది. వాస్తవానికి, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరేళ్లవుతున్నా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదని ఆరోపిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కృష్ణానది పరీవాహక ప్రాజెక్టుల వద్ద ధర్నా నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. సీనియర్లు, ముఖ్య నేతలతో సమావేశమై చర్చించిన తర్వాతే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు మాత్రం ఈ నిర్ణయాన్ని విభేదిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే ఈ ముగ్గురూ శనివారం పొన్నాల నివాసంలో భేటీ అయ్యారని, ప్రాజెక్టుల వద్ద చేపట్టే దీక్షలో పాల్గొనవద్దని నిర్ణయించారని తెలుస్తోంది. నా కంటే నా బిడ్డ ఎక్కువ కొట్లాడుతుంది తన కుమార్తె జయారెడ్డికి ఇష్టం లేకున్నా రాజకీయాల్లోకి తీసుకువస్తున్నానని జగ్గారెడ్డి ప్రకటించారు. పరిస్థితిని బట్టి ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావడం తప్పడం లేదని, తనపై ప్రభు త్వం రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడితే తన కుమార్తె రాజకీయాల్లో ఉంటుందని మీడియా తో మాట్లాడుతూ చెప్పారు. జగ్గారెడ్డి కంటే జయారెడ్డి బాగా కొట్లాడుతుందని వివరించారు. -
సింధియా రాజీనామాతో మేలుకున్న కాంగ్రెస్
సాక్షి, బెంగళూరు : మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా రాజీనామాతో కాంగ్రెస్ అధిష్టానంకు ఊహించిన పరిణామం ఎదురైంది. ఆ షాక్ నుంచి తేరుకున్న పార్టీ నాయకత్వం ఖాళీగా ఉన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) పదవులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్‌కు కీలక పదవి అప్పగించింది. ఆ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా ఆయన్ని నియమించింది. పార్టీలో సమర్థవంతమైన సీనియర్ నేతగా, వ్యూహకర్తగా డీకే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులుగా సలీమ్ అహ్మద్, ఈశ్వర్ ఖాంద్రీ, సతీష్ జర్కీహోళీలు పదవులు దక్కించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం అధికారిక ప్రకటన చేశారు. అలాగే ఢిల్లీ పీసీసీ చీఫ్‌గా సీనియర్ నేత అనిల్ చైదరీని పార్టీ అధిష్టానం నియమించింది. (బీజేపీలో చేరిన సింధియా) కాగా చాలా కాలం నుంచి పలు రాష్ట్రాల్లో పీసీసీ పదవులు ఖాళీగానే ఉంటున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో గుండూరావు రాజీనామా అనంతరం కొత్త నాయకత్వాన్ని నియమించడంపై అధిష్టానం ఆసక్తి కనబరచలేదు. తాజాగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక, ఢిల్లీలకు నూతన పీసీసీలను నియమించింది. -
పీసీసీ చీఫ్ రేసులో ఉన్నా: ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, నల్గొండ: త్వరలో పీసీసీ అధ్యక్షుడి మార్పు జరగవచ్చని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుని రేస్‌లో తను ఉన్నానని తెలిపారు. పార్టీలో సీనియర్‌గా తనకు అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనకు అభివృద్ధి కంటే కమీషన్లపైనే మక్కువ.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడమే తన ఏకైక లక్ష్యం అని పేర్కొన్నారు. కేసీఆర్‌కు రాష్ట్రాభివృద్ధి కంటే కమీషన్లపైనే మక్కువ ఎక్కువని విమర్శించారు. ఐదేళ్లుగా నిధులివ్వకుండా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో సీఎం కేసీఆర్ హడావుడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.చిన్న చిన్న పనులకు కూడా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. ఎంపీగా పార్లమెంటులో జిల్లా సమస్యలను ప్రస్తావించానని తెలిపారు. -
మాజీమంత్రి శైలజానాథ్‌కు కీలక బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పీసీసీ నూతన అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా కార్యనిర్వహణ అధ్యక్షులుగా ఎన్.తులసిరెడ్డి, మస్తాన్ వలీని నియమించారు. ఈ నియామకాలు వెంటనే అమలులోకి వస్తుందని వేణుగోపాల్ పేర్కొన్నారు. కాగా గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే రఘువీరారెడ్డి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన తన రాజీనామా లేఖను గత ఏడాది మే నెలలో కాంగ్రెస్ అధిష్టానానికి పంపించారు. అధ్యక్ష బాధ్యతల నుంచి తనను తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినా, అప్పటి నుంచి రఘువీరా రాజీనామాను కాంగ్రెస్ పార్టీ ఆమోదించలేదు. రఘువీరా తన పట్టు వీడకపోవడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక తప్పనిసరి అయింది. దీంతో పలువురు నేతలు ఆ పదవి కోసం పోటీ పడ్డారు. పార్టీ నేతలు సాకే శైలజానాథ్, మాజీ ఎంపీ చింతా మోహన్, సుంకర పద్మశ్రీ తదితరుల పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి సాకే శైలజానాథ్‌కు దక్కింది. పూర్వ వైభవాన్ని తెచ్చేలా కృషి చేస్తా.. పీసీసీ చీఫ్‌గా నియమకంపై శైలజానాథ్ ఈ సందర్భంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సీనియర్ల అనుభవాలను కలుపుకుని ఏపీలో ముందుకు వెళతామని శైలజానాథ్ పేర్కొన్నారు. రాజధాని మార్పుపై ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మరికొన్ని రోజుల్లోనే రాజధాని అంశంపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. ప్రజల పక్షాన నిలబడి, వారి అభీష్టం నెరవేర్చేలా పోరాడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని పని చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అధికారంలో ఉన్న బీజేపీ ...ప్రజల ఆలోచనలు, కోరికలను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. -
కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటిని మెదక్‌కు ఎప్పుడు తెస్తారో ?
సాక్షి, మెదక్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీటిని మెదక్‌కు ఎప్పుడు తెస్తారో.. టీఆర్ఎస్ నాయకులు చెప్పాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ డిమాండ్ చేశారు. మరో 20ఏళ్లు గడిచినా ఆ నీరు మెదక్‌కు వచ్చే ప్రసక్తి లేదన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో 70శాతం సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నయమంటూ కొందరు నాయకులు చంకలు గుద్దుకుంటున్నారని, మొన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కనీసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు కూడా పోటీ చేయలేనివారు.. టీఆర్ఎస్కు ప్రత్యామ్నయం ఎలా అవుతుందన్నారు. కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌పార్టీకి ఘనమైన చరిత్ర ఉందని, చిరంజీవిలా ఎప్పుడూ వికసిస్తూనే ఉంటుందననారు. మెదక్‌జిల్లాకు ఇందిరమ్మ పేరు పెట్టాలని కోరడం జరిగిందన్నారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల వల్ల కుదురలేదన్నారు. కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి..డబ్బులు సంపాదించి నేడు పార్టీలు మారుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు పేర్కొన్నారు. శనివారం మెదక్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక క్రిస్టల్ గార్డెన్స్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోసురాజు మాట్లాడుతూ పార్టీ మారిన నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లో చేరే విధంగా పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఇందుకోసం జిల్లా మండల, నియోజకవర్గ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల బీఫాంల విషయంలో పీసీసీ, ఏఐసీసీ తలదూర్చదని తెలిపారు డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన విధంగా కాంగ్రెస్‌లో అనేక పదవులు అనుభవించి, నేడు పార్టీ మారినవారు నీతిమాలిన వారన్నారు. కానీ నాయకులు మాత్రమే పార్టీలు మారుతున్నారు తప్ప..కార్యకర్తలు కాదన్నారు. పార్టీలో ఎలాంటి గ్రూప్‌లు లేవని, అంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లా నుంచి అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఇతర జిల్లాలకు తరలిపోయాయని, ప్రస్తుతం మహిళా డిగ్రీ కళాశాల సైతం తరలిస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. అదే జరిగితే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఐదేళ్లుగా మెదక్‌లో రోడ్డు పనులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. సింగూర్ జలాలను ఎలాంటి జీఓ లేకుండా కేటీఆర్ నియోజకవర్గంలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు తరలించి ఈ ప్రాంత రైతుల నోట్లో మట్టి కొట్టారని విమర్షించారు. తాము అధికారంలోకి రాగానే ఎన్డీఎస్ఎల్ను స్వాధీనం చేసుకుంటామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరి మ్యాడం బాలకృష్ణ, నాయకులు మామిళ్ల ఆంజనేయులు, మధుసూదన్‌రావు, పోతరాజు రమణ, ఆవుల గోపాల్‌రెడ్డి, లక్ష్మి, కిష్టయ్య తదితరులు ఉన్నారు. -
అజయ్ మాకెన్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ తప్పుకున్నారు. అనారోగ్య కారణాల రీత్యా తన పదవికి రాజీనామా చేసినట్టు మాకెన్ చెప్పుకొచ్చారు. కానీ, ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన మాకెన్.. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలువనున్నట్టు తెలిసింది. కాగా, మాకెన్ రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదించినట్టుగా సమాచారం. కాగా, గత రాత్రి తన రాజీనామాను సమర్పించక ముందు మాకెన్, రాహుల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ సందేశాన్ని ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘2015 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాను. ఈ నాలుగేళ్లలో నాకు రాహుల్ నుంచి, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి, మీడియా నుంచి అపారమైన ప్రేమ, మద్దతు లభించాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇది తేలికైన విషయం కాదు. అందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాన’ని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధ్యత వహిస్తూ మాకెన్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే అప్పటి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సలహా మేరకు మాకెన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. -
పూర్వ వైభవమే ధ్యేయం
భువనేశ్వర్ : రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతఃకలహాల బలహీనతను బిజూ జనతా దళ్, భారతీయ జనతా పార్టీలు సొమ్ము చేసుకున్నాయని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీఅధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ తెలిపారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షునిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారిగా ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ అంతఃకలహాల్ని తొలగించి కార్యకర్తలంతా ఉమ్మడిగా ఉద్యమించి పూర్వ వైభవాన్ని సాధించడం తన ప్రధాన కార్యాచరణగా పేర్కొన్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునర్వ్యవస్థీకరిస్తామని తెలిపారు. ఇక నుంచి పార్టీ విజయ పంథాలో పుంజుకుంటుందని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుని రాష్ట్రానికి కొత్త కళని సంతరింప చేస్తుందన్నారు. పార్టీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది, రాష్ట్ర రాజకీయాల్లో మూడో స్థానంలో కొనసాగుతోంది, ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో తాను కీలకమైన బాధ్యతల్ని చేపట్టడం పెను సవాలుగా పేర్కొన్నారు. 4 జోన్లుగా విభజించి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పటిష్టత కోసం ప్రత్యేక కార్యాచరణ ఖరారు చేశామన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రముఖుల్ని కూడా ఈ జోన్లలో సభ్యులుగా నియమిస్తామని తెలిపారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునర్వ్యవస్థీకరించేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి జితేంద్ర సింఘ్ కంకణం కట్టుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో దీర్ఘకాలంగా ప్రాంతీయ పార్టీ రాజ్యం ఏలుతోంది. ఆశించిన మేరకు ప్రజలకు ఆ పార్టీ సేవల్ని కల్పించలేని దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీకి పట్టం గట్టిన ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనత బిజూ జనతా దళ్, భారతీయ జనతా పార్టీలకు కలిసి వచ్చింది. గత ఏడాది పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనతతో భారతీయ జనతా పార్టీ పుంజుకోవడం ఉదహరించారు. ఈ అనుభవాల దృష్ట్యా సమైక్య ఉద్యమానికి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం ప్రేరేపిస్తామన్నారు. బలమైన పార్టీలుగా చెలరేగుతున్న పార్టీల ఊహల్ని తలకిందులు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలతో రాష్ట్రంలో రైతు సమస్యలు, మహిళల పట్ల లైంగికదాడులు, నిరుద్యోగం వంటి సమస్యలు తాండవిస్తున్నాయన్నారు. పార్టీ శ్రేణుల్లో తప్పిదాల దృష్ట్యా ఇటీవల ఎన్నికల్లో ప్రజలు తమకు నిరాకరించిన విషయాన్ని ఆయన అంగీకరించారు. ఈ పరిస్థితుల్ని త్వరలో నివారించి పార్టీ పూర్వ వైభవం కూడగడతామని తెలిపారు. -
రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్తటీమ్
భువనేశ్వర్ : రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీకి కొత్త కార్యవర్గం నియామకం జరిగింది. పీసీసీ అధ్యక్షుడిగా నిరంజన్ పట్నాయక్ నియమితులయ్యారు. ప్రసాద్ హరిచందన్ స్థానంలో ఆయన నియామకం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నొబొ కిషోర్ దాస్, చిరంజీవ్ బిశ్వాల్, పార్లమెంట్ మాజీ సభ్యుడు ప్రదీప్ మఝి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర శాఖ వ్యవహారాల ఇన్చార్జి జితేంద్ర సింగ్‌లు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత ఈ నియామకం జరిగింది. ఎమ్మెల్యేలు నొబొ కిషోర్ దాస్, చిరంజీవ్ బిశ్వాల్, పార్లమెంట్ మాజీ సభ్యుడు ప్రదీప్ మఝి రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీని పటిష్ట పరుస్తా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మనోగతాలకు పార్టీ హై కమాండ్ రాహుల్ గాంధీ పరిగణనలోకి తీసుకుని తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంపట్ల కొత్త అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీని రాష్ట్రంలో పటిష్టపరచడమే తన ప్రధాన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం కృషి చేస్తానని తెలిపారు. నిరుద్యోగం, రైతులు, దళితులు, నీటి ఎద్దడి, మహా నది జలాల పంపిణీ వివాదం వంటిక కీలకమైన సమస్యల పట్ల పార్టీ దృష్టి సారిస్తుందని వివరించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉభయ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే ప్రధాన కార్యాచరణగా పేర్కొన్నారు. ఇతర సభ్యులు వీరే.. మాజీ పార్లమెంట్ సభ్యుడు భక్త చరణ్ దాస్‌ను ప్రచార కమిటీ అధ్యక్షుడిగా నియమించారు.పార్టీ రాష్ట్ర శాఖ వ్యవహారాల ఇన్చార్జి జితేంద్ర సింగ్‌ను సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా అదనపు బాధ్యతలు కేటాయించారు. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగన్నాథ్ పట్నాయక్‌ను సమన్వయ కమిటీ కన్వీనర్‌గా నియమించారు. కోర్ కమిటీ అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు జయదేవ్ జెనా, ఈ కమిటీ కన్వీనర్‌గా రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్, క్రమ శిక్షణ కమిటీ అధ్యక్షుడిగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్, సీనియర్ నాయకుడు శరత్ రౌత్ కన్వీనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బర్గడ్ జిల్లా ఉప ఎన్నికలో పార్టీ వైఫల్యాల దృష్ట్యా రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గం నియామకం జరుగుతుందని మాజీ అధ్యక్షుడు ప్రసాద్ హరిచందన్ ముందస్తు సంకేతాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాజా నియామకాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
మాట నిలబెట్టుకున్న రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట నిలబెట్టుకున్నారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా యువతకు ప్రాధాన్యం ఇస్తానని ఆయన ప్లీనరీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పార్టీ కీలక పదవుల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇది కూడా చదవండి.. తొలి వికెట్ డౌన్ ఈ క్రమంలో 35 ఏళ్ల అమిత్ చవ్డా కు గుజరాత్ పీసీసీ బాధ్యతలను అప్పజెప్పారు. మంగళవారం ఈ మేరకు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. అంక్లావ్ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన అమిత్ చవ్డాను జీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. గుజరాత్ ఓటమి తర్వాత సీనియర్ నేత భరత్ సోలంకి జీపీసీసీ పదవికి రాజీనామా చేయాలని భావించారు. అయితే రాహుల్.. వేచి చూడాలన్న ఆదేశాలతో ఆయన వెనక్కి తగ్గారు. ఇక కొప్పుల రాజు స్థానంలో ఎస్సీ సెల్ ఛైర్మన్‌గా నితిన్ రౌత్‌ను నియమించారు. ఇదే తరహాలో మిగతా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల మార్పు కూడా ఉండబోతోందని, యువ నాయకత్వానికి పార్టీలో ప్రాధాన్యం దక్కబోతోందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకంతో అనూహ్య మార్పులు తథ్యమని రాహుల్ సంకేతాలు పంపినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు తమను తొలగించకముందే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని పలువురు సీనియర్ నేతలు భావిస్తున్నారు. -
నేను ‘గుత్తా’ను కాదు పార్టీలు మారడానికి..
సాక్షి, యాదాద్రి : పూటకో పార్టీ మారడానికి నేను గుత్తా సుఖేందర్ రెడ్డిని కాదని నల్లగొండ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్ష పదివి ఇచ్చినా..ఇవ్వకున్నా.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. నల్గగొండ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. ఉన్న ఏడాది కాలమైనా మంచి పాలన అందించాలని ప్రభుత్వానికి సూచించారు. ఆ తర్వాత ఎలాగో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కోమటి రెడ్డి జోస్యం చెప్పారు. స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ఇలాంటి పాలన ఉండటం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను పాటిస్తున్నారని విమర్శించారు. వాటి గురించి ప్రజల్లోకి వెళ్లి వివరిస్తామని ఈ సందర్భంగా కోమటి రెడ్డి పేర్కొన్నారు. ఇక పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకుంటే కోమటి రెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. -
కుంతియాకు ఆ అధికారం లేదు..
నల్లగొండ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోనే ముందుకెళ్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా వ్యాఖ్యలతో కోమటిరెడ్డి సోదరులు విభేదించారు. 2019వరకూ పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కొనసాగుతారని చెప్పే అధికారం కుంతియాకు లేదని వారు స్పష్టం చేశారు. దీనిపై త్వరలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలుస్తామన్నారు. యువకుల నాయకత్వంలోనే కాంగ్రెస్ ముందుకు వెళుతుందని కోమటిరెడ్డి సోదరులు అభిప్రాయపడ్డారు. త్వరలోనే సోనియా, రాహుల్‌ను కలుస్తాం తెలంగాణ వ్యవహారాల కాంగ్రెస్ ఇంచార్జి ఆర్సీ కుంతియా వచ్చి చెప్పినంత మాత్రాన అయ్యేదేమీలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..కార్యకర్తలు, జనాలకు దగ్గరగా ఉండే నాయకుల నాయకత్వం కోరుకుంటున్నారని పరోక్షంగా పీసీసీ నాయకత్వ మార్పు మాట్లాడారు. తొందర్లోనే రాహుల్, సోనియా గాంధీలను కలిసే అవకాశముందని, కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దని కోరారు. త్వరలోనే యువరక్తం ఉన్న నాయకుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రభుత్వం మూడున్నరేళ్లుగా భర్తీ చేయలేని ఉద్యోగాలను ఒక్క ఏడాదిలో ఎలా భర్తీ చేస్తుందని ప్రశ్నించారు. వెంటనే లక్ష ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. అధిష్టానానిదే తుది నిర్ణయం తెలంగాణ వ్యవహారాల కాంగ్రెస్ ఇంచార్జి ఆర్సీ కుంతియాపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. భువనగిరిలో విలేకరులతో మాట్లాడుతూ.. 2019 వరకూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని అనే అధికారం కుంతియాకు లేదని, ఆ వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. హైకమాండ్‌కు ప్రస్తుత నాయకత్వం నచ్చకపోతే ఎన్నికల్లోగా మార్చవచ్చునని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఒక నయీంను చంపి వంద నయీమ్‌లను సృష్టించాడని ఆరోపించారు. వినాశకాలే విపరీతబుద్ధి అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే నయీం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే భువనగిరి నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. -
గోవాలో కాంగ్రెస్ ఎందుకు ఫెయిలైంది?
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావల్సిన బలానికి చాలా దగ్గరగా ఉండి, ఒక చిన్న పార్టీ మద్దతిచ్చేందుకు ముందుకు కూడా వచ్చిన సందర్భంలోనూ తాము గోవాలో అధికారం చేపట్టకుండా ఆగిపోవడానికి ఏకైక కారణం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగేనని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆయనతో పాటు గోవా స్క్రీనింగ్ కమిటీ చీఫ్ కేసీ వేణుగోపాల్ వల్లే తమకు అధికారం దక్కలేదని గోవా పీసీసీ చీఫ్ లుజిన్హో ఫాలైరో తీవ్రంగా ఆరోపించారు. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుపొంది.. అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 21కు కేవలం నాలుగు సీట్ల దూరంలో ఉండటంతో ఎలాగైనా తామే సర్కారును ఏర్పాటుచేస్తామని గోవా కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. కానీ, కేవలం 13 స్థానాలే గెలుపొందిన బీజేపీ రాత్రికే రాత్రే చక్రం తిప్పి.. చిన్న పార్టీల మద్దతుతో మెజారిటీ ఫిగర్‌ను సాధించింది. నిజానికి తాము మద్దతిస్తామంటూ గోవా ఫార్వర్డ్ పార్టీ నాయకుడు విజయ్ సర్దేశాయ్ ముందుగా దిగ్విజయ్ సింగ్‌తోనే చెప్పారు. వాళ్లకు ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. మరొక్క ఇండిపెండెంట్ మద్దతు తీసుకోవడం పెద్ద కష్టం కానే కాదు. కానీ అలాంటి సమయంలో దిగ్విజయ్ సింగ్ సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగిందన్నది స్థానిక కాంగ్రెస్ నాయకుల వాదన. ముందుగానే గవర్నర్ మృదులా సిన్హా వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పి ఉంటే, అతిపెద్ద పార్టీగా ముందు తమకే అవకాశం వచ్చి ఉండేదని ఫాలైరో అన్నారు. మనోహర్ పారికర్ ప్రమాణాన్ని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. దిగ్విజయ్ సింగ్ స్పందించి ఉంటే కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు మరికొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా అప్పటికి సిద్దంగా ఉన్నారు. మార్చి 11వ తేదీ రాత్రికి తమకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, అయితే తమవద్ద వాళ్ల సంతకాలు మాత్రం లేవని ఫాలైరో చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ విషయంలో అన్ని అధికారాలను దిగ్విజయ్, వేణుగోపాల్‌లకు ఇచ్చిందని, వాళ్లు సరైన సమయంలో స్పందించకపోవడం.. మరోవైపు బీజేపీ వెంటవెంటనే స్పందించడం వల్లే తమకు అధికారం దూరమైందని ఆయన వాపోయారు. తాను ఈశాన్య రాష్ట్రాల ఇన్చార్జిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకునేవాడినని తెలిపారు. -
మాజీ గవర్నర్‌ను కలిసిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి
అనంతపురం సెంట్రల్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యను పీసీసీ అధ్యక్షులు ఎన్. రఘువీరారెడ్డి కలిశారు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు జిల్లాకు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్నారు. శనివారం సాయంత్రం పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, డీసీసీ అధ్యక్షులు కోటా సత్యనారాయణ, నగర అధ్యక్షులు దాదాగాంధీ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. -
గొల్లపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన రఘువీరా
గొల్లపల్లి (పెనుకొండ రూరల్) : మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌ను ఏపీపీసీసీ అధ్యక్షడు రఘువీరారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హంద్రీనీవా పాజెక్టును 80శాతం పూర్తి చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రాజెక్టులకు పునాదులు వేశామన్నారు. రూ.1200 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ.4వేల కోట్లు ఖర్చు చేసి అధికార పార్టీ నాయకులు దోచుకున్నారని విమర్శించారు. ప్రాజెక్టు పనులు కూడా నాసి రకంగా ఉన్నాయన్నారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారంగా భూములు ఇవ్వాలన్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజక వర్గ ఇన్చార్జ్ కేటీ శ్రీధర్, డీసీసీ అధ్యక్షుడు చినవెంకటరాముడు, మహేశ్, గోపాల్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్రకాంతమ్మ తదితర నాయకులు పాల్గొన్నారు. -
మంగళసూత్రాలు కూడా లాక్కునే ప్రయత్నం
– చిల్లర నోట్లు తీసుకురాకపోతే సివిల్ వార్ వస్తుంది – పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి హిందూపురం అర్బన్ : మహిళలు ఎంతో పవిత్రంగా చూసుకునే మంగళసూత్రాలు కూడా బంగారంటూ లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ అ«ధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. ఆదివారం హిందూపురం విచ్చేసిన ఆయన కూల్చివేసిన కూరగాయల మార్కెట్ ప్రాంతాన్ని çపరిశీలించారు. అనంతరం అక్కడి వ్యాపారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిరువ్యాపారులు నెల రోజుల్లో రూ.25 వేలు నుంచి రూ.60 వేలు వరకు నష్టం వచ్చిందని వాపోయారు. రూ.2 వేలు తీసుకువస్తే చిల్లర ఇచ్చేదెలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని, సీఎంలు నల్లకుబేరులను పట్టుకునేందుకు చేతకాక పిచ్చుకపై బ్రమ్మాస్త్రం ప్రయోగిస్తున్నారని ఎద్దేవా చేశారు. అనంతరం రఘువీరా మాట్లాడుతూ ప్రజలను ఎందుకు హింసిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఉద్యోగులను భిక్షగాళ్లలా తయారు చేశారని మండిపడ్డారు. ఎంతమంది నల్లకుబేరులకు సంకెళ్లు వేశారని ప్రశ్నించారు. చిల్లరనోట్లు తీసుకురాకుంటే ప్రజల్లో సివిల్ వార్ వస్తుందన్నారు. డబ్బు ఇబ్బందులతో చనిపోయిన వారిని ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నామని చెప్పారు. మార్కెట్ నిర్మిస్తామని 18 నెలలు క్రితం కూల్చివేసి ఇప్పటివరకు నిర్మించకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యం, పీసీసీ అధికార ప్రతినిధి బాలాజి మనోహర్, పీసీసీ కార్యదర్శి ఇందాద్, జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు రహమత్, జబీ, సీనియర్ నాయకులు ఆదిమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నేడు పీసీసీ అధ్యక్షుడి పర్యటన
చిలమత్తూరు : మండలంలోని చెక్‌పోస్టు ప్రాంతంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శనివారం పర్యటించనున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు నాగరాజు యాదవ్ తెలిపారు. ఆయన శనివారం ఉదయం 8.30 గంటలకు చెక్‌పోస్టుకు చేరుకుంటారని అనంతరం మండలంలో ఎండిపోయిన వేరుశనగ పంట పరిశీలిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమానికి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని ఆయన కోరారు. -
గుత్తా అండ్ కో తో ఉత్తమ్ చర్చలు
టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్న పలువురు సీనియర్ నాయకులతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యే భాస్కరరావులతో చర్చలు జరుగుతున్నాయని, వారు కాంగ్రెస్‌లోనే కొనసాగేలా ఒప్పిస్తున్నారని ఆయన చెప్పారు. నేను టీఆర్ఎస్లో చేరట్లేదు: సురేష్ రెడ్డి కాగా, తాను టీఆర్ఎస్ లో చేరడం లేదని మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి తెలిపారు. తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన ఫాంహౌస్‌లో కలిసినట్లుగా వచ్చిన వార్తా కథనాలలో వాస్తవం లేదని ఖండించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు తాను ఆయనను కలవలేదని, తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో 100 ఏళ్లుగా అనుభవం ఉందని, అందువల్ల తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన చెప్పారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. -
'బీసీ సబ్‌ప్లాన్‌ను వెంటనే అమలు చేయాలి'
హైదరాబాద్: బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్‌లో జ్యోతిరావుపూలే జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఉత్తమ్, భట్టి విక్రమార్క, మధు యాష్కీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల అవినీతి వెనక సీఎం
పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపణ ♦ ప్రాణహిత అంచనా వ్యయం రెండున్నర రెట్లు పెంచారు ♦ మెదక్ జిల్లా గజ్వేల్‌లో రూ. 3,500 కోట్ల పనులు నామినేషన్‌పైనే కాంట్రాక్టర్లకిచ్చారని ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్, రీ ఇంజనీరింగ్, టెండర్లు లేకుండానే పనుల అప్పగింత వంటి నిర్ణయాల వెనక జరుగుతున్న అక్రమాల్లో సీఎం కేసీఆర్ హస్తముందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలు భట్టివిక్రమార్క, టి.జీవన్‌రెడ్డి, డీకేఅరుణ, జి.చిన్నారెడ్డి తదితరులతో కలసి ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రూ. 38 వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందిన ప్రాణహిత ప్రాజెక్టును దాదాపు రెండున్నర రెట్ల మేర రూ.83 వేల కోట్లకు పెంచి వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నందుకు సంబరాలు చేసుకుంటున్నారా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. కేసీఆర్ సొంత నియోజకవర్గమైన మెదక్ జిల్లా గజ్వేల్ లో రూ. 600 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ. 3,500 కోట్లకు పెంచి నామినేషన్‌పైనే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. వీటిపై ప్రభుత్వ వివరణ అడిగేం దుకు స్పీకర్ తమకు ఒక్క నిమిషం కూడా సమయమివ్వకుండా సభను వాయిదా వేయడం అభ్యంతరకరమని చెప్పారు. కేసీఆర్ కుటుంబ అవినీతి బయటపడుతుందనే భయంతోనే ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనివ్వకుండా సభను వాయిదా వేశారని ఆరోపించారు. నియంతలా కేసీఆర్ తీరు: జీవన్‌రెడ్డి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మహారాష్ట్రకు శాశ్వతంగా తాకట్టుపెట్టేలా ఒప్పందాలు చేసుకుని ఏదో సాధించినట్టుగా సీఎం కేసీఆర్ సంబరాలు చేసుకున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశమున్నా కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు వల్ల మూడు లిఫ్టులు, భారీగా నిర్వహణ వ్యయం శాశ్వతం గా ఉండేలా డిజైన్ చేస్తున్నారని విమర్శిం చారు. దీనిపై మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తెచ్చుకున్న సంతోషం, అభివృద్ధి లేకుండా కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు. మాజీమంత్రి డి.కె.అరుణ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికే బంగారు తెలంగాణ అని, దీనిని దోపిడీ చేయడానికి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. కేవలం రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే 95 శాతం పూర్తయిన ప్రాజెక్టులతో లక్ష ఎకరాలకుపైగా కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందని...కానీ కేసీఆర్ కమీషన్ల కోసం కక్కుర్తిపడి తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా దెబ్బకొట్టేలా ప్రాజెక్టులకు డిజైన్లు మారుస్తున్నారని అరుణ ఆరోపించారు. -
ఎవరు పార్టీని వీడినా నష్టమేమి లేదు : రఘువీరా
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన భైరవకోనలో మట్టి సత్యాగ్రహం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కనువిప్పు కలిగేలా లక్ష ప్రదేశాల నుంచి మట్టి సేకరించి పంపుతామని తెలిపారు. ఇక ఆనం రాంనారాయణ రెడ్డి సోదరులు పార్టీని వీడటంపై రఘువీరారెడ్డి పరోక్షంగా స్పందించారు. ఎవరు పార్టీని వీడినా కాంగ్రెస్ కు వచ్చే నష్టమేమి లేదని ఆయన వ్యాఖ్యానించారు. (త్వరలో ఆనం సోదరులు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న విషయం తెలిసిందే) ఈ కార్యక్రమంలో ప్రకాశం డీసీసీ అధ్యక్షుడు ఉగ్రనరసింహారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
15న జిల్లాకు పీసీసీ చీఫ్ రాక!
వరంగల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈనెల 15వ తేదీన జిల్లా పర్యటనకు వస్తున్నట్లు తెలిసింది. ఇటీవల పీసీసీ చీఫ్‌గా నియమితులైన ఆయన మొదటి సారిగా జిల్లాకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా పార్టీలోని ముఖ్య నేతల మధ్య అంతరాలు ఉన్న విషయం ఆయన దృష్టికి వెళ్లింది. దీంతో ఉత్తమ్ తన మొదటి అధికార పర్యటనను వరంగల్ జిల్లా నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిసింది. కాగా, పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు పార్టీలోని అన్ని వర్గాలను సమన్వయం చేసేందుకే జిల్లా పర్యటనకు వస్తున్నట్లు సమాచారం. జిల్లా పర్యటన బుధవారం గాంధీభవన్‌లో జరిగే సమావేశంలో ఖరారవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. -
టీడీపీ నేతలు జేబుదొంగల కంటే హీనం: రఘువీరా
దొరికిన కాడికి దోచుకుంటున్నారు వైఎస్సార్ సీపీపై గెలవలేక ఎందరి కాళ్లో పట్టుకున్నారు అనంతపురం: కార్పొరేట్ శక్తుల చేతిలో సీఎం చంద్రబాబు బందీ అయ్యారని, టీడీపీ నేతలు జేబు దొంగల కన్నా హీనంగా మారారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మాఫీచేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురంలో గురువారం మాజీ మంత్రి శైలజానాథ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా విస్త్రృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరా ప్రసంగిస్తూ.. టీడీపీ వెబ్సైట్లో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు సంబంధించి 52 పేజీలను తొలగించారని, గోడల మీద రాసిన రాతలను తుడిపేశారని చెప్పారు. టీడీపీ నేతలు దొరికిన కాడికి దోచుకుంటున్నారని, చివరికి సిఫారసు లేఖలకు కూడా డబ్బు వసూలు చేస్తున్నారన్నారు. దేవినేని నెహ్రూ మాట్లాడుతూ నారా లోకేష్ రూ.2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, వాటికి సంబంధించిన ఆధారాలను సమయం వచ్చినప్పుడు బయటపెడతామన్నారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిపై గెలవడానికి చంద్రబాబు ఎందరి కాళ్లో పట్టుకున్నాడు. మోడీ కాళ్లు పట్టుకున్నాడు. పవన్‌కళ్యాణ్ గడ్డం పట్టుకున్నాడు.’ అని పేర్కొన్నారు. పార్టీ నేతలు చిరంజీవి, బొత్స, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తమిళనాడు పీసీసీ అధ్యక్షుడి రాజీనామా
తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు బీఎస్ గణదేశికన్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీకి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటుచేసేందుకు వీలుగా ఆయన ఈ చర్య తీసుకున్నారు. పార్టీలో ఐక్యత తెచ్చేందుకు తన శాయశక్తులా కృషి చేశానని, అనేక స్థాయిల్లో పలు సమావేశాలు నిర్వహించానని అధినేత్రి సోనియాగాంధీకి ఓ లేఖ రాశారు. పీసీసీ కమిటీని ఎలాంటి ఇబ్బంది లేకుండా పునర్వ్యవస్థీకరించేందుకు గాను తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే, అసలు గణదేశికన్ ఇప్పటికిప్పుడు ఎందుకు రాజీనామా చేశారన్న విషయం మాత్రం ఇంకా తెలియడంలేదు. వాస్తవానికి తమిళనాడు కాంగ్రెస్‌లో సవాలక్ష గ్రూపులున్నాయి. కేంద్ర మాజీమంత్రి జీకే వాసన్‌కు పార్టీలో ఎక్కువ మంది మద్దతుంది. మరో మాజీ మంత్రి చిదంబరానిది మరో వర్గం. చాలాకాలంగా కలిసున్న డీఎంకే కూడా యూపీఏ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇలాంటి సమయంలో పార్టీని నడపడం కన్నా.. పక్కకు వెళ్లిపోవడమే మేలని గణదేశికన్ భావించినట్లు సమాచారం. -
పొన్నాలను అధిష్ఠానమే తప్పిస్తుంది: పాల్వాయి
పొన్నాల లక్ష్మయ్య ఇప్పటికీ పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత తనదేనని చెప్పిన పొన్నాల.. ఇంకా ఎందుకు ఆ పదవిలో ఉన్నారని ఆయన అడిగారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పొన్నాలను అధిష్ఠానమే ఆ పదవి నుంచి తప్పిస్తుందని చెప్పారు. వాస్తవానికి దిగ్విజయ్ సింగ్ కూడా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం లేదని పాల్వాయి విమర్శించారు. అధిష్ఠానానికి తెలియకుండానే జిల్లా నాయకులను పొన్నాల సస్పెండ్ చేస్తుంటే దిగ్విజయ్ స్పందించట్లేదని మండిపడ్డారు. పీసీసీ బాధ్యతలను అధిష్ఠానం యువతరానికి అప్పగించాలని, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆయన అన్నారు. -
''పీసీసీ పదవిలో పొన్నాల కొనసాగడం సరికాదు''
-
జన్మభూమిని అడ్డుకుని తీరుతాం
ఏపీలో 27వేల మంది డ్వాక్రా యానిమేటర్లకు ప్రతినెలా గౌరవ వేతనం చెల్లించాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఇందిరాభవన్‌లో ఆయన డ్వాక్రా యానిమేటర్లు, ఆదర్శ రైతు సమాఖ్య నేతలతో భేటీ అయ్యారు. దసరా పండుగలోపు వారి వేతన బకాయిలను చెల్లించకపోతే.. జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకుంటారని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రఘువీరా చెప్పారు. దసరాలోపు 30వేల మంది ఆదర్శ రైతులను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దుచేయాలని ఆయన అన్నారు. ఆదర్శ రైతులంతా కాంగ్రెస్ వాళ్లేననడం సరికాదని, ఆదర్శ రైతుల్లో అన్ని పార్టీలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. తనను దూషించిన కాంగ్రెస్ నాయకులను కూడా టీడీపీలో చేర్చుకుని, వారిని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపించుకున్న చరిత్ర చంద్రబాబుదని ఆయన విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడంలో లేని అభ్యంతరం ఆదర్శ రైతుల విషయంలో ఎందుకు వచ్చిందని అడిగారు. ఆదర్శరైతులను కొనసాగించాలనే డిమాండుతో ఈనెల 25న ఇందిరాపార్కు వద్ద రెండు రాష్ట్రాల ఆదర్శరైతుల ధర్నా ఉంటుందని ఆయన చెప్పారు. -
టీ పీసీసీకి కొత్త అధ్యక్షుడు!
అధిష్టానం పొన్నాలను తొలగించనుంది: వీహెచ్ కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే సమర్థుడైన నాయకుడు ఉండాలని వ్యాఖ్య మండిపడ్డ పొన్నాల.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించబోనని హెచ్చరిక హైదరాబాద్: తెలంగాణ పీసీసీలో సీనియర్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీని ప్రక్షాళన చేసేదిశగా టీపీసీసీ చీఫ్‌ను అధిష్టానం తప్పించనుందని ఏఐసీసీ కార్యదర్శి, ఎంపీ వి.హనుమంతరావు పేర్కొనగా... పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తే సీనియర్లనైనా వదిలిపెట్టబోమంటూ పొన్నాల తీవ్రంగా స్పందించారు. శనివారం ఉదయం సీఎల్పీ నేత జానారెడ్డితో భేటీ అనంతరం వీహెచ్ మాట్లాడగా.. అనంతరం పొన్నాల గాంధీభవన్‌లో వీహెచ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వీహెచ్ శనివారం ఉదయం సీఎల్పీ నేత కె.జానారెడ్డి నివాసానికి వెళ్లి కొద్దిసేపు ఆయనతో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుని మార్పు, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు తదితర అంశాలపై వారు చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీ అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ఢిల్లీ పెద్దలు యోచిస్తున్నారని ఆయన చెప్పారు. అందులో భాగంగా పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించి కొత్త అధ్యక్షుడిని నియమించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన్ని ఎదుర్కోవాలంటే సమర్థుడైన నాయకుడు అవసరం ఉందన్నారు. ఈ సారి టీపీసీసీ అధ్యక్షుని నియామకం ఢిల్లీలో జరగకూడదని... పార్టీ పెద్దలు రెండ్రోజులపాటు రాష్ట్రంలో మకాం వేసి అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే నియమించాలని వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ మీరొద్దు.. వీహెచ్ వ్యాఖ్యలపై పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో ఉన్న నేతలంతా తనకు సన్నిహితులేనని, పార్టీకి ఉపయోగపడే సూచనలు చేస్తామంటే ఎక్కడికైనా వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. వీహెచ్‌లాంటి వ్యక్తులకు తన స్థాయి తక్కువనుకుంటే హైకమాండ్ పెద్దలను కలసి అభిప్రాయాలను చెప్పుకోవచ్చన్నారు. -
'బాబు శ్వేతపత్రం ... టీడీపీ కరపత్రం'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రంపై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రకటించిన శ్వేతపత్రం టీడీపీ కరపత్రంలా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నిక ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా అవాస్తవ శ్వేతపత్రాన్ని విడుదల చేశారని విమర్శించారు. రాష్ట్ర విభజన సాకుతో చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. అందుకే అసత్యాలు మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. -
పేరు నిలపని పెద్దరికం
జిల్లాకు అచ్చిరాని పీసీసీ పీఠం సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్ష పదవి జిల్లాకు అస్సలు కలిసి రాలేదు. కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ర్టస్థాయిలో ఉన్నత స్థాయి పదవి పీసీసీ చీఫ్. అలాంటి పీఠాన్ని జిల్లా నేతలు రెండు సార్లు అధిరోహించారు. వీరి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన రెండు పర్యాయూలు కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. రాష్ట్రంలో అధికారం కోల్పోవడమే కాకుండా... ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే స్థాయిలోనైనా స్థానాలను గెలచుకోలేకపోయింది. పీసీసీ చీఫ్ పదవిని జిల్లాకు చెందిన మహ్మద్ కమాలుద్దీన్ అహ్మద్, పొన్నాల లక్ష్మ య్య చేపట్టారు. జనగామ నియోజకవర్గానికి చెందిన ఈ ఇద్దరి నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జిల్లాలో ఒకే అసెంబ్లీ స్థానం దక్కింది. 1999 ఎన్నికల ముందు వరకు లోక్‌సభ, అసెంబ్లీకి ఎన్నికలు వేర్వేరుగా వచ్చేవి. 1994 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన కమాలుద్దీన్ అహ్మద్ నియమితులయ్యారు. అప్పుడు ఆయన హన్మకొండ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. జిల్లా నుంచి పలుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన పీవీ.నర్సింహారావు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. 1994లో రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు పీవీతోపాటు కమాలుద్దీన్ అహ్మద్‌కు ప్రతిష్టాత్మకంగా నిలిచాయి. ఈ ఎన్నికల్లో అంతుకుముందు ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ నేతృత్వంలో భారీ బహిరంగ సభ జరిగింది. చివరకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు కేవలం 26 సీట్లే దక్కాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా సైతం దక్కలేదు. పీసీసీ చీఫ్ కమాలుద్దీన్ అహ్మద్ సొంత జిల్లాలో కేవలం డోర్నకల్ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. డీఎస్.రెడ్యానాయక్ మాత్రమే గెలిచారు. ఎన్నికల వరకు జిల్లాలో మంత్రులుగా ఉన్న పీవీ.రంగారావు, టి.పురుషోత్తమరావు, మాదాడి నర్సింహారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పి.జగన్నాయక్ వంటి సీనియర్ నేతలు ఓటమి పాలయ్యూరు. 1994 ఎన్నికల్లో వచ్చినంత దారుణ ఓటమి కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఎప్పుడు రాలేదు. ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ఈ ఎన్నికల్లో కమాలుద్దీన్ అహ్మద్ హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ గెలిచారు. ఇప్పుడూ అదే తీరు... తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికలకు ముందే ప్రత్యేకంగా పీసీసీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు అవకాశం కల్పించింది. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం పొన్నాలను నియమించింది. తెలంగాణ ఏర్పాటు చేసిన పార్టీగా కాంగ్రెస్‌కు విజయం తప్పదని అంచనాలతో ఎన్నికల్లో ముందుకు సాగారు. సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత... తెలంగాణలో తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని పొన్నాల లక్ష్మయ్య, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రకటించారు. తీరా... ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ నేతల అంచనాలను తారుమారు చేశాయి. 1994 ఫలితాలే పునరావృతమయ్యాయి. అప్పటిలాగే కాంగ్రెస్‌కు జిల్లాలో ఒకే స్థానం వచ్చింది. అదీ డోర్నకల్ అసెంబ్లీ సెగ్మెంట్. మిగిలిన 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఓడిపోయింది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య సైతం ఓడిపోయారు. శాసనసభకు, లోక్‌సభకు సంయుక్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లోనూ ఓడిపోయింది. -
రాజీనామా యోచనలో టీపీసీసీ చీఫ్ పొన్నాల
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా యోచనలో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ అంగీకరిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లా జనగామ నుంచి పోటీ చేసిన పొన్నాల లక్ష్మయ్య వెనుకబడి ఓటమి అంచున ఉన్నారు. -
'పొత్తుకు తలుపులు తెరిచే ఉన్నాయి'
-
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల బస్ యాత్ర
-
'పీసీసీ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తా'
-
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా రఘువీరా రెడ్డి
-
పీసీసీ పీఠంపై టీ నేతల గురి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ర్టప్రతి పాలన నిర్ణయం దరిమిలా తీవ్ర నైరాశ్యంలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పీసీసీ పీఠం కోసం ఆరాటపడుతున్నారు. తెలంగాణ, సీమాంధ్రలకు వేర్వేరు పీసీసీలను రెండు మూడు రోజుల్లో ప్రకటించేందుకు అధిష్టానం కసరత్తులు జరుపుతున్న నేపథ్యంలో ఆశావహులంతా ఆ దిశగా ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. సీమాంధ్రలో కాపు లేదా దళిత సామాజిక వర్గానికి, తెలంగాణలో బీసీ లేదా రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ పీఠం దక్కవచ్చని తెలుస్తోంది. కేంద్ర మంత్రి చిరంజీవికి సీమాంధ్రలో ఎన్నికల ప్రచార బాధ్యతలు కట్టబెట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని సమాచారం. తెలంగాణ నుంచి సీఎం పదవికి పోటీ పడ్డ మంత్రి జానారెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర్‌కు పీసీసీ పదవి కూడా దక్కే సూచనలు కనిపించడం లేదు. బీసీ నేతకే అవకాశమివ్వాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. రెడ్డి నేతకు ఇవ్వాలనుకుంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి దక్కే సూచనలున్నాయి. జానా, దామోదర మాత్రం ఢిల్లీలో ఉండి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఉత్తమ్ తరఫున కూడా ఢిల్లీలో లాబీయింగ్ సాగుతున్నట్టు చెబుతున్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు ఆర్.దామోదర్‌రెడ్డి, భిక్షమయ్య గౌడ్ ఢిల్లీ పెద్దలను కలిసి ఉత్తమ్‌కు పగ్గాలివ్వాలని కోరుతున్నట్టు తెలిసింది. జానా మాత్రం కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఆశీస్సులతో ప్రయత్నిస్తున్నారంటున్నారు. జైపాల్‌తో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. -
సీఎంకు చెక్ పెట్టేందుకు బొత్స ప్రయత్నాలు
-
వాళ్ల విషయం హైకమాండే చూసుకుంటుంది: బొత్స
కాంగ్రెస్ పార్టీకి నాలుగో అభ్యర్థిని గెలిపించుకునేంతగా ఎమ్మెల్యేల బలం లేదని, అందువల్లే తాము రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని పోటీ చేయించలేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ అభ్యర్థులకు ఓటేయని ఇద్దరు ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అరిగెల నర్సారెడ్డిల విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానమే చూసుకుంటుందని బొత్స సత్యనారాయణ చెప్పారు. అధికారం కోసం పొత్తుపెట్టుకున్నది చంద్రబాబేనని, ఆయన తమపై విమర్శలు చేయడం తగదని తెలిపారు. -
అశోక్‌కు కీలక బాధ్యతలు
సాక్షి, ముంబై: ఆదర్శ్ కుంభకోణం కేసులో ఊరట లభించడంతో నేపథ్యంలో అశోక్‌చవాన్‌కు కీలక బాధ్యతలను అప్పగించే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడిగాగానీ లేదా ఎన్నికల ప్రచార ప్రముఖుడి బాధ్యతలుగానీ అప్పగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ఏ పదవి అప్పగిస్తారనేది త్వరలోనే తేలనుంది. నాలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన సంగతి విదితమే. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో మార్పులుచేర్పులు చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కొంతమేర అనుకూలంగానే ఉన్నప్పటికీ పార్టీని మరింత బలోపేతం చేయడంపైనే అధిష్టానం దృష్టిసారించింది. పార్టీని విజయపథంలో నడిపించే నాయకుడికోసం అన్వేషిస్తోంది. మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మరణానంతరం ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకులెవరూ కాంగ్రెస్‌కు లభించలేదని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్... మచ్చ లేని నాయకుడిగా పేరు పొందినప్పటికీ ఆయన సారథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమేననే భావన ఉంది. ఆదర్శ్ కుంభకోణం కేసులో ఊరట లభించడంతో మరోసారి అశోక్ చవాన్‌కు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు మార్గం సుగమమైంది. ఎన్సీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే అశోక్ చవాన్లాంటి నాయకుడి నేతృత్వం అవసరమని భావిస్తున్నట్టు సమాచారం. -
బొత్సపైనే చర్య తీసుకోవాలి: జెసి
-
రాజస్థాన్ పీసీసీ చీఫ్ రాజీనామా
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఘోరంగా చతికిలపడింది. ఓటమికి నైతికబాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు చంద్రభాన్ తన పదవికి రాజీనామా చేశారు. మండవ నియోజకవర్గం నుంచి పోటీచేసిన చంద్రభాను ఓటమి దిశగా పయనిస్తున్నారు. ఏమాత్రం పోటీనివ్వలేకపోగా నాలుగో స్థానానికి దిగజారారు. ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖను ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. 200 స్థానాలున్న రాజస్థాన్ శాసనసభలో కాంగ్రెస్ కేవలం 12 స్థానాల్లో గెలవగా మరో తొమ్మిది చోట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ తిరుగులేని మెజార్టీతో అధికారం దిశగా దూసుకెళ్తోంది. ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ ఘోరంగా చతికిలపడింది. -
ఎసరు?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా కాంగ్రెస్ వర్గ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. జిల్లా కాంగ్రెస్(డీసీసీ) అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ చాపకిందకు నీళ్లు వస్తున్నాయి. ఆయన్ను డీసీసీ పీఠం నుంచి తప్పించాలని పీసీసీ చీఫ్ బొత్స సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సీఎం కిరణ్ వర్గీయుడిగా ఉండేందుకే ఆమంచి మొగ్గుచూపడమే బొత్స ఆగ్రహానికి కారణం. మరోవైపు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కూడా ఆమంచి తీరుపై గుర్రుగా ఉన్నారు. దాంతో ఆమంచి ఉద్వాసనకు రంగం సిద్ధమైంది. ఎన్నికల నాటికి సీఎం కిరణ్వర్గంపై పైచేయి సాధించాలన్నది బొత్స వ్యూహం. అందులో భాగంగానే జిల్లాలో ఆమంచిపై వేటు పడనుందని తెలుస్తోంది. జిల్లా కాంగ్రెస్‌లో సరికొత్త రాజకీయ సమీకరణలిలా ఉన్నాయి.. సీఎంతో సాన్నిహిత్యం...బొత్సకు దూరం రాజకీయంగా రంగులు మార్చే ఆమంచి కృష్ణమోహన్ నైజమే ప్రస్తుత పరిస్థితికి కారణం. బొత్స వర్గీయుడిగా మెలిగి డీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఆయన దక్కించుకున్నారు. ప్రధానంగా మంత్రి మహీధర్ రెడ్డి సీఎం కిరణ్‌కు సన్నిహితుడిగా ఉన్నందున బొత్స తన వర్గీయుడిగా ఉంటారన్న నమ్మకంతో ఆమంచిని డీసీసీ అధ్యక్షుడిని చేశారు. కానీ మారిన పరిస్థితుల్లో ఆయన బొత్సకు దూరం జరుగుతూ వచ్చారు. పూర్తిగా సీఎం వర్గీయుడిగా ముద్ర పడేందుకే మొగ్గుచూపారు. దీన్ని గమనించినప్పటికీ బొత్స ఏమాత్రం బయటపడకుండా వేచిచూసే ధోరణి అవలంబించారు. దీన్ని గుర్తించలేని ఆమంచి పూర్తిగా సీఎం కిరణ్ వర్గీయుడిగా మారిపోయి ఒకానొక దశలో బొత్సను బేఖాతరు చేసే స్థితికి చేరుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే ఊపులో ఆయన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మితో కూడా వైరం కొనితెచ్చుకున్నారు. తన అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమె ఏమాత్రం జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న రీతిలో వ్యవహరించారు. సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో తన మాట చెల్లుబాటు అవుతున్నప్పటికీ... చీరాలలో తనకు కనీస గౌరవం దక్కడం లేదని ఆమె కొంతకాలంగా ఆమంచిపై గుర్రుగా ఉన్నారు. బొత్సకు అందివచ్చిన అవకాశం... ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన - తదనంతర పరిణామాలు బొత్సకు కలసివచ్చాయి. అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పీసీసీకి అధిష్టానం ఆదేశించింది. వాస్తవానికి ఆమంచి అధిష్టానికి వ్యతిరేకంగా పెద్దగా వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. మొదట్లో కాస్త హడావుడి చేసినప్పటికీ ఆయన విభజనకు సహకరించేందుకు మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తున్నారు. కానీ ఆమంచిని డీసీసీ పీఠం నుంచి తప్పించాలని భావిస్తున్న బొత్స మాత్రం దీన్ని అవకాశంగా తీసుకున్నారు. అందుకే అధిష్టానానికి సమర్పించిన నివేదికను జాగ్రత్తగా రూపొందించారు. ‘అధిష్టానాన్ని ఆమంచి విమర్శించారని... కాబట్టి ఆయన్ని డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించలేమని’ బొత్స నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. తద్వారా ఆమంచిని తప్పించి మరొకర్ని డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలన్నది ఆయన ఉద్దేశం. తదుపరి డీసీసీ అధ్యక్షుడిపై కూడా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. అధిష్టానానికి సన్నిహితంగా ఉండే కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఎంపీ మాగుంట సూచించిన మేరకు కొత్త డీసీసీ అధ్యక్షుడి నియామకానికి బొత్స నిర్ణయించారు. తద్వారా ఇటు జిల్లాలోనూ అటు అధిష్టానం వద్ద తన పట్టును పెంచుకోవాలన్నది ఆయన లక్ష్యం. దీనిపై అధికారిక ప్రకటన వారంరోజుల్లోనే వెలువడనుందని తెలుస్తోంది. జిల్లా పార్టీలో వర్గ రాజకీయాలను ప్రభావితం చేయనున్న ఈ పరిణామాలను కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అటు సీఎం కిరణ్ సన్నిహితుడైన మంత్రి మహీధర్ రెడ్డి వర్గంతో వైరం... ఇటు పీసీసీ చీఫ్ బొత్స, కేంద్రమంత్రి పనబాకతో విరోధం... వెరసి ఆమంచి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని వ్యాఖ్యానిస్తున్నాయి. -
మీడియాపై బొత్స దురుసు ప్రవర్తన
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. ఢిల్లీలో.. అసలు వీళ్లతో మాట్లాడటం దండగ అంటూ వ్యాఖ్యానించారు. గతంలో కూడా పలు మార్లు బొత్స తన నోటి దురుసును, అందునా మీడియా మీద అక్కసును ప్రదర్శించారు. వేలు చూపించి మరీ బెదిరించారు. -
వీళ్లతో మాట్లాడటం దండగ.. మీడియాపై బొత్స దురుసు ప్రవర్తన
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా, అసలు వీళ్లతో మాట్లాడటం దండగ అంటూ వ్యాఖ్యానించారు. గతంలో కూడా పలు మార్లు బొత్స తన నోటి దురుసును, అందునా మీడియా మీద అక్కసును ప్రదర్శించారు. శనివారం నాడు మళ్లీ మీడియాపై విరుచుకుపడ్డారు. ఇలా మాట్లాడటం సరికాదని కొంతమంది మీడియా ప్రతినిధులు అన్నా కూడా వేలు పెట్టి బెదిరించినట్లు చూపించి మరీ వ్యాఖ్యానాలు చేశారు. తమ ముఖ్యమంత్రితో తాము ఏమైనా మాట్లాడతామని, నా నోరు.. నా ఇష్టమని అన్నారు. మీకు ఇష్టం వచ్చినది రాసుకోండి అంటూ విసురుగా ప్రవర్తించారు. -
బొత్స ఇంటిని ముట్టడించిన సమైక్యవాదులు
-
అనంతాగ్రహం
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : పసిపిల్లల నుంచి పండుటాకుల వరకూ ‘సమైక్య’ నినాదంతో ‘అనంత’ మార్మోగుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ ఎత్తిన పిడికిలి దించేది లే దంటూ ప్రజలు ఉద్యమపథాన సాగుతున్నారు. ఐదో రోజైన ఆదివారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగింది. గత నాలుగు రోజుల కంటే నిరసన సెగలు మరింత ఎగిసిపడ్డాయి. రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి మాతృమూర్తి వైకుంఠ సమారాధనలో పాల్గొనేందుకు మడకశిర మండలం నీలకంఠాపురానికి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు కూడా ఉద్యమ సెగ తాకింది. రఘువీరాను పరామర్శించి... ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సీఎం, పీసీసీ చీఫ్‌లను చూసిన ఉద్యమకారులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినదించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ వారు జారుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సమైక్య ఉద్యమాన్ని ప్రజా సంఘాలు ముందుండి నడిపించాయి. అనంతపురం నగరంలో వేలాది మంది ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. కవులు, కళాకారులు జాతీయ జెండా పట్టుకుని వివిధ వేషధారణలతో నిరసన ప్రదర్శన చేశారు. ఆటో యూనియన్, మినీవ్యాన్, బోర్‌వెల్స్, జేసీబీ ఓనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. కుక్కలకు ఉన్న విశ్వాసం కూడా సోనియాగాంధీకి లేదంటూ ‘రాజహంస పరివార్’ ఆధ్వర్యంలో కుక్క పిల్లలతో నిరసన తెలిపారు. ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ అధికారులు, ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగుల యూనియన్, బుక్‌సెల్లర్స్ అసోసియేషన్, గౌడ- ఈడిగ ఉద్యోగుల యూనియన్, జాక్టో, వివిధ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. నగరంలోని వివిధ డివిజన్లు, కాలనీల ప్రజలు స్వచ్ఛందంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. స్థానిక టవర్‌క్లాక్, సప్తగిరి , వైఎస్సార్ సర్కిళ్లలో కేసీఆర్, సోనియాగాంధీ శవయాత్రలు, దిష్టిబొమ్మ దహనాలు చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట జాక్టో ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ, నేతలు ఎర్రిస్వామిరెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ధర్మవరంలో దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. విద్యార్థి జేఏసీ నేతలు ఆమరణ దీక్షకు దిగారు. తాడిమర్రి, బత్తలపల్లిలోనూ నిరసనలు మిన్నంటాయి. గుంతకల్లులో జేఏసీ నేతలు రోడ్డుపైనే వంటా వార్పుతో నిరసన కొనసాగించారు. ఇందులో వైఎస్సార్సీపీ నేత వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. గుత్తిలో సోనియా, ప్రధాని మన్మోహన్, సీఎం కిరణ్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ఇదే పట్టణంలో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా పాల్గొన్నారు. హిందూపురంలో జేఏసీ నేతలు, ముస్లింలు, క్రైస్తవులు వేర్వేరుగా ర్యాలీలు చేపట్టారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్టీసీ కార్మికులు ప్రజాకోర్టు నిర్వహించారు. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో ఎంపీ నిమ్మల కిష్టప్పను అడ్డుకున్నారు. అనంతరం కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలతో శవయాత్రలు నిర్వహించారు. కదిరి పట్టణంలో రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గం టీ సర్కిల్లో మానవహారం, కేసీఆర్ వేషధారణలో ర్యాలీ చేపట్టారు. కొత్తచెరువులో యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించగా సమైక్యవాదులు అడ్డుకున్నారు. పెనుకొండలో జాతీయ రహదారిపై వంటా వార్పు కొనసాగించారు. పుట్టపర్తి, పరిగి, గోరంట్ల, కనగానపల్లి, రామగిరి, శింగనమల, గార్లదిన్నె, పామిడి తదితర ప్రాంతాలలో నిరసన ర్యాలీలు హోరెత్తాయి. రొద్దంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను తగులబెట్టారు. తాడిపత్రిలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఉరవకొండ మండలం చిన్నముష్టూరులో సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. సీఎం కిరణ్ కనిపించడం లేదంటూ ఉరవకొండలో పోస్టర్లు అతికించారు. అలాగే ఉరవకొండ-అనంతపురం రహదారిపై రాస్తారోకో చేశారు. ఎంపీ అనంతను అడ్డుకున్న ఎస్కేయూ విద్యార్థులు ఎస్కేయూలో ఆమరణ దీక్ష చేపట్టిన విద్యార్థి జేఏసీ నేతలకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిని జేఏసీ నేతలు అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వారు శాంతించడంతో ఎంపీ మాట్లాడారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని విభజించడం దారుణమన్నారు. అందుకు నిరసనగా స్పీకర్ ఫార్మాట్లో ఎంపీ పదవికి రాజీనామా సమర్పించి.. ప్రజలతో కలిసి ఉద్యమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఆమరణ దీక్ష చేపట్టిన విద్యార్థి జేఏసీ నేతలను ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి వేర్వేరుగా పరామర్శించారు. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఉద్యమాలకు ‘అనంత’ పురిటిగడ్డని అభివర్ణించారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా రెండుసార్లు లేఖ ఇవ్వడం వల్లనే కేంద్రం రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుందన్నారు. తనది ఎక్కడి ప్రాంతమో తెలియకుండానే తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న కేసీఆర్‌కు తలొగ్గిన కాంగ్రెస్ హైకమాండ్ సీమాంధ్రకు తీరని ద్రోహం చేస్తోందని దుయ్యబట్టారు. అలాగే ఎస్కేయూలో సోనియా, కేసీఆర్, చిరంజీవి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అగ్నిగుండమైన మడకశిర మంత్రి రఘువీరా మాతృమూర్తి వైకుంఠ సమారాధనలో పాల్గొనేందుకు వచ్చిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు సమైక్య సెగ తాకింది. మడకశిర పట్టణంలో జేఏసీ, వివిధ వర్గాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఆరు వాహనాలపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని అడ్డుకుని... ఆయన వాహనం అద్దాలు పగులగొట్టారు.