
మాజీ గవర్నర్‌ను కలిసిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి
అనంతపురం సెంట్రల్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యను పీసీసీ అధ్యక్షులు ఎన్. రఘువీరారెడ్డి కలిశారు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు జిల్లాకు వచ్చిన ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్నారు. శనివారం సాయంత్రం పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, డీసీసీ అధ్యక్షులు కోటా సత్యనారాయణ, నగర అధ్యక్షులు దాదాగాంధీ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.