సాక్షి,హైదరాబాద్ : బీజేపీ ఛార్జ్‌షీట్‌పై పీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది కాలం పాలనపై .. కేంద్రంలోని బీజేపీ తన 10 ఏళ్ల పాలనపై చర్చించేందుకు మేం సిద్ధంగా ఉందా? రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాడి పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్ బీజేపీకి పలు ప్రశ్నలు సంధించారు.
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగాన్ని రూపుమాపుతామని చెప్పారు. నల్ల ధనాన్ని తెచ్చి ప్రతి అకౌంట్ కు 15 లక్షల రూపాయలు వేస్తాం అన్నారు.
వంద రోజుల్లో అన్ని రకాల ధరలు తగ్గిస్తాం అన్నారు.. డాలర్ కు పోటీగా రూపాయి విలువ పెంచుతామని అన్నారు.
50 రూపాయలకే లీటర్ పెట్రోల్ అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతాం అన్నారు.. ఏమయ్యాయి?
దేశంలో వందలాది మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీలోకి మార్చారు. దేశంలో 45 ఏళ్లలో లేని నిరుద్యోగ పరిస్థితిని కల్పించారు.
మతతత్వ రాజకీయాలు చేస్తూ.. పార్టీలను చీలుస్తూ రాజకీయ పబ్బం గడిపిన బీజేపీ ఇప్పుడు సుద్దాపూస మాటలు మాట్లాడుతుంది.
రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.
మొన్నటి పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్‌తో చీకటి ఒప్పందం చేసకోవడంతో రాష్ట్రంలో బీజేపీ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. కాబట్టే రాష్ట్రంలో ఇలా ఛార్జ్‌షీట్ పేరుతో రాజకీయాలు చేస్తోంది.
బీజేపీ, బీఆర్ఎస్ కవల పిల్లలు. ఒకరికొకరు ఒకరికొకరు ఏ టీం, బీ టీంగా వ్యవహరిస్తారు. ఇది అనేక సార్లు రుజువైంది.
సార్వత్రిక ఎన్నికల్లో రహస్య ఒప్పందం జరిగింది.
2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ మోదీ గ్యారెంటీ పేరిట ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది.
2014 నుంచి 2024 వరకు పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు ఎన్నిసార్లు పెంచారు? దీనిపైన చర్చించడానికి సిద్ధమా?
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణకు ప్రత్యేకంగా ఏం చేసిందో చర్చించడానికి బీజేపీ నాయకులు సిద్దమా?
రైతుల సంక్షేమం కోసం ఒక్క సంవత్సర కాలంలోనే దాదాపు రూ. 54 వేల కోట్లు కాంగ్రెస్ ఖర్చు చేసింది. దీనిపై చర్చిద్దామా? దీంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీకి కనిపించడం లేదా?
Comments
Please login to add a commentAdd a comment