TG: కొత్త పీసీసీ చీఫ్‌ ఖరారు ! ముగిసిన ఏఐసీసీ కీలక భేటీ | Congress High command Key Meeting On Tpcc Chief Selection | Sakshi
Sakshi News home page

TG: కొత్త పీసీసీ చీఫ్‌ ఖరారు ! ముగిసిన ఏఐసీసీ కీలక భేటీ

Published Fri, Aug 23 2024 3:02 PM | Last Updated on Fri, Aug 23 2024 7:07 PM

Congress High command Key Meeting On Tpcc Chief Selection

సాక్షి,ఢిల్లీ: తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపిక, కేబినెట్‌ విస్తరణపై శుక్రవారం(ఆగస్టు23) ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ హైకమాండ్‌ కీలక సమావేశం ముగిసింది. కొత్త పీసీసీ అధ్యక్ష పదవిపై ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్‌కు పీసీసీ చీఫ్ పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ విషయమై రేపో మాపో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. పీసీసీ రేసులో మధు యాష్కి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి  బలరాం నాయక్ , ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ , అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. పీసీసీ చీఫ్‌ ఎంపికతో పాటు కేబినెట్‌ విస్తరణపైనా  ఏఐసీసీ సమావేశంలో చర్చించారు. సమావేశంలో  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ , సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణ పీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి కొనసాగుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement