
సాక్షి,హైదరాబాద్:కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు అను నిత్యం ప్రజల్లో ఉండి సేవలు చేస్తున్నారని పీసీసీ అద్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం(నవంబర్ 20) జరిగిన సేవాదల్ కార్యక్రమంలో మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడారు.
‘రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ కోసం 18 వేల కోట్ల రూపాయలు ఇచ్చాం.10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసింది. 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పాలకులది. మహాత్మ గాంధీ,నెహ్రూలు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. చరిత్రను వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేసి బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తోంది.
రాహుల్ గాంధీ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు దేశంలో పాదయాత్ర చేశారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయాలన్న లక్ష్యంతో మనం పని చేయాలి’అని మహేష్‌కుమార్‌గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment