సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీ పీసీసీ) అధ్యక్షురాలిగా షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) మంగళవారం మధ్యాహ్నం అధికారిక ప్రకటన వెలువరించింది. తాజాగా ఏపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏఐసీసీ నియమించింది.
(చదవండి : షర్మిల కాంగ్రెస్‌లో చేరడం చంద్రబాబు కుట్రే)
వైఎస్సార్‌టీపీని 2021 జులై 8వ తేదీన ప్రారంభించారు షర్మిల. 2021 అక్టోబర్‌లో చేవెళ్ల నుంచి పాదయాత్ర చేశారు షర్మిల. తన పార్టీ YSRTPని జనవరి 4, 2024న కాంగ్రెస్‌లో విలీనం చేశారు షర్మిల. ఆ తర్వాత పరిణామాలు చకచకా మారిపోయాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా APCC చీఫ్‌గా ఉన్న గిడుగు రుద్రరాజు సోమవారం ఆ పదవికి రాజీనామా చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే షర్మిలను కాంగ్రెస్ పెద్దలు ఏపీసీసీ చీఫ్‌గా నియమించారు.
I thank hon'ble @kharge ji , #SoniaGandhi ji , @RahulGandhi ji , and @kcvenugopalmp ji for trusting me with post of the president of @INC_Andhra Pradesh.
I promise to work faithfully towards rebuilding the party to its past glory in the State of Andhra Pradesh with total… https://t.co/C6K8cQEz1F— YS Sharmila (@realyssharmila) January 16, 2024
Comments
Please login to add a commentAdd a comment