
వాళ్ల విషయం హైకమాండే చూసుకుంటుంది: బొత్స
కాంగ్రెస్ పార్టీకి నాలుగో అభ్యర్థిని గెలిపించుకునేంతగా ఎమ్మెల్యేల బలం లేదని, అందువల్లే తాము రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని పోటీ చేయించలేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్టీ అభ్యర్థులకు ఓటేయని ఇద్దరు ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అరిగెల నర్సారెడ్డిల విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానమే చూసుకుంటుందని బొత్స సత్యనారాయణ చెప్పారు. అధికారం కోసం పొత్తుపెట్టుకున్నది చంద్రబాబేనని, ఆయన తమపై విమర్శలు చేయడం తగదని తెలిపారు.