
సాక్షి,గుంటూరు: శాసన మండలిలో చైర్మన్ సహా వైఎస్సార్సీపీ సభ్యుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. తాజాగా మండలి చైర్మన్ మోషేన్ రాజును ప్రభుత్వం అవమానించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో మండలి చైర్మన్‌పై వివక్ష చూపించారని అన్నారాయన.
శాసన మండలిలో బొత్స మాట్లాడుతూ..క్రీడా పోటీలు రెండు సభల సభ్యులకు నిర్వహించారు. శాసన మండలిని అవమానించారు. సీఎం, స్పీకర్ ఫొటోలు వేసి మండలి చైర్మన్ ఫొటో వేయకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారు. వ్యక్తిగతంగా మండలి చైర్మన్‌ను ఇలా కించపరచడం సమంజసం కాదు.
నిన్న ఉమ్మడి ఫొటోకు పిలిచి అక్కడ నాకు కుర్చీ వెయ్యలేదు. నాకు కుర్చీ వేయకుండా ప్రోటోకాల్ పాటించలేదు.వేరే వాళ్ల కుర్చీలో కూర్చోమని చెప్పారు. ఇప్పుడు ఏకంగా మండలి చైర్మన్‌ను ఇప్పుడు అగౌరవ పరిచారు.బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై బొత్స అభ్యంతరం
సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై విపక్ష నేత బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు అసెంబ్లీలో ఆమోదించారు. రేపు శాసన మండలిలో చర్చించాలి. కానీ అజెండాలో లేకుండా ఈరోజే పాస్ చేయాలనుకోవడం సమంజసం కాదు. ఈ బిల్లు పై చర్చ జరగాలన్నది మా అభ్యంతరం. రేపు సభ లేకపోతే ఈరోజు ఆమోదించాలి. కానీ ఇప్పుడే ఆమోదించేంత అత్యవసరం ఏముంది. మీకు నచ్చినట్టు చేసుకుంటాం అంటే మాకేమి అభ్యంతరం లేదు. ఉద్యోగులకు జీతాలు రేపు ఇస్తారా..?. యనమల చెప్పినట్టు బిల్లుపై చర్చ జరగాలి.బీఏసీలో రెండు రోజులు రిజర్వ్ పెట్టింది. అలాంటప్పుడు అసలు బిల్లు చూసుకునే అవకాశమే లేకుండా చర్చ పెట్టేస్తే ఎలా..?’ అని ప్రశ్నించారు.

Comments
Please login to add a commentAdd a comment