Rajya sabha polls
-
రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు
బెంగళూరు: కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థులు అజయ్ మాకెన్, నాజీర్ హుస్సేన్, పీ. చంద్రశేఖర్ రాజ్యసభ్యులుగా గెలుపొందారు. బీజేపీ నుంచి నారాయణ్ భాండగే.. రాజ్యసభ ఎంపీగా విజయం సాధించారు. ఇక.. జేడీ(ఎస్) అభ్యర్థి బరిలోకి దిగిన కుపేంద్రరెడ్డి 36 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. బీజేపీ ఎదురుదెబ్బ.. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ కాంగ్రస్ అభ్యర్థి అజయ్ మాకెన్ క్రాస్ ఓట్ వేశారు. మరో ఎమ్మెల్యే అర్బైల్ శివరామ్ ఓటింగ్ దూరంగా ఉండటంతో అజయ్ మాకెన్ సునాయాసం అయింది. తమ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందని అభ్యర్థికి ఓటు వేయటం బీజేపీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. -
నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ జారీకానుంది. తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికెషన్ విడుదలైతే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 15 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంటుంది. ఈనెల 16న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 20 వరకు గడవు విధించారు. తెలంగాణలో ఉన్న మూడు స్థానాల్లో రెండు అధికార కాంగ్రెస్ కు, ఒకటి ప్రతిపక్ష బీఆర్ఎస్ కు నామినేషన్ వేసే అవకాశం ఉంది. మూడు కన్నా ఎక్కువ నామినేషన్లు పడితే ఎన్నికల నిర్వహణ జరపాల్సి ఉంటుంది. ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఈ నెల 27న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఇదీ చదవండి: రానున్న కాలం బీఆర్ఎస్దే -
Rajya Sabha polls: ఓటు కోసం స్ట్రెచర్‌పై వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే
దేశవ్యాప్తంగా రాజ్యసభలో ఖాళీగా ఉన్న 16 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, రాజ్యసభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటమి, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ముక్తా తిలక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఆమె క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుప్రతిలో చికిత్స పొందుతోంది. మహారాష్ట్రలో రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా ఆమె.. ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో ఓటు వేసేందుకు వచ్చారు. ఆమె స్ట్రెచర్‌పై నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ఆమె ఓటు వేసే సమయంలో ఆమె భర్త శైలేష్ శ్రీకాంత్ తిలక్ హాజరు కావడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. కాగా, ముక్తా తిలక్ పూణెలోని కస్బా అసెంబ్లీ నియోజకవర్గం నుండి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. మరోవైపు.. మహారాష్ట్రలో రాజసభ్య ఎన్నికల వేల ఎంఐఎం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హికి తమ మద్దతు ఇస్తున్నట్టు మజ్లిస్ పార్టీ తెలిపింది. ఎంఐఎం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయనున్నట్టు ఆ పార్టీ ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ తెలిపారు. ఇక, రాజ్యసభ ఎన్నికల్లో 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర, రాజస్థాన్‌లో ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. BJP MLA from Pune Mukta Tilak battling health issues is brought in an Ambulance to Vidhan Bhavan to vote for Rajya Sabha polls. Another BJP MLA Laxman Jagtap suffering from ailment has also been airlifted from Pimpri Chinchwad for voting today. pic.twitter.com/oEcoWAq2YJ — Ritvick Bhalekar (@ritvick_ab) June 10, 2022 ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌కు ఓటేసిన జేడీఎస్ ఎమ్మెల్యే.. కారణం ఏంటంటే! -
సోనియా జీ.. నాకు ఆ అర్హతే లేదా?: నటి నగ్మా
ముంబై: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయ్. నాయకత్వ లోపాల కారణంగా సీనియర్లు సైతం ఓవైపు పార్టీని వీడుతుంటే.. మరోవైపు ఇప్పుడు ‘రాజ్యసభ’ చిచ్చు మరికొందరిలో తీవ్ర అసంతృప్తిని రాజేస్తోంది. తాజాగా మాజీ నటి, కాంగ్రెస్ నేత నగ్మా కాంగ్రెస్‌పై బహిరంగంగానే వ్యతిరేక పోస్ట్ చేశారు. సోనియా జీ.. కాంగ్రెస్ చేరిక సమయంలో రాజ్యసభ సీటును నాకు ఇస్తామని ఆఫర్ చేశారు. 2003 నాటికి కాంగ్రెస్ అధికారంలో లేదు. అప్పటి నుంచి 18 ఏళ్ల పాటు అవకాశం కోసం ఎదురు చూడడంతోనే సరిపోయింది. ఇప్పుడు ఇమ్రాన్(ఇమ్రాన్ ప్రతాప్ఘడిని ఉద్దేశించి)ను మహారాష్ట్ర నుంచి పెద్దల సభకు పంపిస్తున్నారు. అసలు నాకు ఆ అర్హతే లేదా? అని నగ్మా ట్విటర్ ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు. SoniaJi our Congress president had personally committed to accommodating me in RS in 2003/04 whn I joined Congressparty on her behest we weren’t in power thn.Since then it’s been 18Yrs they dint find an opportunity Mr Imran is accommodated in RS frm Maha I ask am I less deserving — Nagma (@nagma_morarji) May 30, 2022 మా 18 ఏళ్ల తపస్సు కూడా ఇమ్రాన్ భాయ్ ముందు వెనుకబడి పోయింది అంటూ ఓ ట్వీట్లో వైరాగ్యం ప్రదర్శించారు ఆమె. हमारी भी १८ साल की तपस्या कम पड़ गई इमरान भाई के आगे । https://t.co/8SrqA2FH4c — Nagma (@nagma_morarji) May 29, 2022 ఇదిలా ఉంటే.. జూన్ 10న జరగబోయే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఏడు రాష్ట్రాల నుంచి పది మంది సభ్యులతో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్ నుంచి రాజీవ్ శుక్లా, రంజిత్ కుమార్, హర్యానా నుంచి అజయ్ మాకెన్, మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ ప్రతాప్‌ఘడి, కర్ణాటక నుంచి జైరామ్ రమేష్, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ తన్హా, తమిళనాడు నుంచి చిదంబరం, రాజస్థాన్ నుంచి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తావారి(ముగ్గురు రాజస్థాన్ వాళ్లు కాకపోవడం గమనార్హం) పేర్లను ప్రకటించింది. ఇక బీజేపీ ఎనిమిది రాష్ట్రాల నుంచి 16 మందికి సీట్లు ఖారారు చేసింది. వీరిలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్(మహారాష్ట్ర), నిర్మలా సీతారామన్(కర్ణాటక) సైతం ఉన్నారు. Congratulations to all those who made it to the Rajya Sabha @ShuklaRajiv ji Ranjeet Ranjan ji @ajaymaken ji @Jairam_Ramesh ji @VTankha ji @ShayarImran ji @rssurjewala ji @MukulWasnik ji @pramodtiwari700 ji & @PChidambaram_IN ji. And to all those who r selected to the Rajya Sabha https://t.co/GSQ070QgOk — Nagma (@nagma_morarji) May 30, 2022 -
ఎన్నికల్లో ఓటమి: మాజీ సీఎం కీలక ప్రకటన
సాక్షి, లక్నో: రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఎస్పీ-బీఎస్పీ మధ్య సంబంధాలపై ప్రభావం చూపించే ప్రసక్తే లేదని యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఎస్పీ-బీఎస్పీల పొత్తు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని కీలక ప్రకటన చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన తమ పార్టీ అభ్యర్థులపై మాయావతి గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి ఓటేసిన పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సింగ్‌ను ఆమె సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. బీఎస్పీ అభ్యర్థికి మద్దతివ్వకుండా ఇతర పార్టీకి ఓటేశారన్న కారణంగా అనిల్ కుమార్‌పై వేటు పడే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. లక్నోలో మాయావతి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌లు తమను ఒక్క ఇంచు కూడా కదిలించలేరన్నారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేసిందనడానికి తాజా రాజ్యసభ ఓటింగే నిదర్శనంగా నిలిచిందన్నారు. ఎస్పీ-బీఎస్పీలు పరస్పర అవగాహనతో ఓటింగ్‌లో పాల్గొంటే.. సీటు కోల్పోతామన్న భయంతో బీజేపీ మా ఎమ్మెల్యేలను భయపెట్టిందని, ప్రలోభాలకు గురిచేసిందని మాయావతి ఆరోపించారు. ప్రజలు బీజేపీని నమ్మడం నిజమైతే గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ ఎందుకు ఓడిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎన్నుకున్న నేతలు ఆ పార్టీకి మద్దతు తెలపకపోవడం ప్రజాస్వామ్య విజయం ఎలా అవుతుందని బీజేపీ అధిష్టానాన్ని ఈ సందర్భంగా మాయావతి ప్రశ్నించారు. మరోవైపు యూపీ రాజ్యసభ ఎన్నికల్లో 10 సీట్లకు 9 సీట్లు బీజేపీ కైవసం చేసుకోగా సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఒకరు నెగ్గారు. ఎస్పీ-బీఎస్పీ మద్దతిచ్చిన అభ్యర్థి మాత్రం ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థులు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు సహా 9 మంది విజయం సాధించగా ఎస్పీ తరపున జయాబచ్చన్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఓ బీఎస్పీ, ఓ బీజేపీ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లలేదు. -
మూడు సీట్లూ గులాబీకే
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, బండా ప్రకాశ్ గెలుపొందారు. వీరిలో బండా ప్రకాశ్‌కు అత్యధికంగా 33 ఓట్లురాగా.. సంతోష్, లింగయ్యయాదవ్‌లకు 32 ఓట్ల చొప్పున పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌కు 10 ఓట్లు పడ్డాయి. దీంతో ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందినట్టుగా రిటర్నింగ్ అధికారి నర్సింహాచార్యులు ప్రకటించి, ధ్రువ పత్రాలు అందజేశారు. 107 ఓట్లు మాత్రమే.. శాసనసభలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇద్దరు సభ్యులు (కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్) ఇటీవల అనర్హత వేటుకు గురయ్యారు. దాంతో ఎన్నికల సంఘం మిగతా 117 సభ్యులను ఓటర్లుగా ప్రకటించగా.. 108 మంది ఓటు వేశారు. మొత్తంగా టీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీకి చెందిన ముగ్గురు (శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డితో పాటు ఆర్.కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్య), బీజేపీకి చెందిన ఐదుగురు, సీపీఎం సభ్యుడు ఒకరు ఓటు వేయలేదు. ఇక నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్వతంత్రుడిగా గెలిచినా.. తాను కాంగ్రెస్ అసోసియేట్‌గా కొనసాగుతానని గతంలో స్పీకర్‌కు విన్నవించుకున్నారు. ఆ ధ్యాసలోనే శుక్రవారం పోలింగ్ సందర్భంగా మాధవరెడ్డి తన ఓటును కాంగ్రెస్ ఏజెంట్‌కు చూపించి వేశారు. కానీ స్వతంత్ర ఎమ్మెల్యే అయిన మాధవరెడ్డి కాంగ్రెస్ పోలింగ్ ఏజెంటుకు ఓటును చూపించడం నిబంధనల ప్రకారం తప్పు. దీనిపై టీఆర్ఎస్ ఫిర్యాదు చేయడంతో.. ఆ ఓటును లెక్కపెట్టవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దాంతో 107 ఓట్లను మాత్రమే లెక్కించారు. ఇక టీఆర్ఎస్లో చేరిన ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లను తిరస్కరించాలని, విప్‌ను ధిక్కరించిన వారిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించాలనే నిర్ణయించింది. తొలి ఓటు వేసిన ఈటల అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఉదయమే తెలంగాణ భవన్‌కు చేరుకుని, అక్కడే అల్పాహారం ముగించుకుని బస్సుల్లో అసెంబ్లీకి వచ్చారు. నేరుగా పోలింగ్ హాల్లోకి వెళ్లి ఓటేశారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తొలి ఓటు వేశారు. తర్వాత మంత్రులు మహేందర్‌రెడ్డి, హరీశ్‌రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎల్పీ కార్యాలయంలో కొంతసేపు సమావేశమైన అనంతరం వెళ్లి ఓటేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మజ్లిస్ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి వేసిన చివరి ఓటుతో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక టీడీపీ, బీజేపీ, సీపీఎం సభ్యులు అసెంబ్లీకి వచ్చినా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మీడియాను రానీయకుండా.. రాజ్యసభ ఎన్నికల కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను అసెంబ్లీ పోలింగ్ స్టేషన్లోకి అనుమతించలేదు. పోలింగ్ స్టేషన్లలో ప్రవేశానికి ఎన్నికల కమిషన్ జారీ చేసిన పాసులున్నా రానీయకపోవడం గమనార్హం. రోజువారీ అసెంబ్లీ కార్యకలా పాలు జరిగే సమయంలో లాబీల్లోకి ప్రవేశ మున్నా.. ఎన్నిక జరుగుతోందంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలింగ్ ప్రారంభమైన సమయంలో మీడియా ప్రతినిధులకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఆ ముగ్గురికి అభినందనల వెల్లువ రాజ్యసభ సభ్యులుగా గెలుపొందిన సంతోష్‌కుమార్, బండా ప్రకాశ్, లింగయ్య యాదవ్‌లను పలువురు అభినందించారు. శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇక పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు అసెంబ్లీ వద్దకు వచ్చి.. గెలుపొందినవారిని శాలువాలతో సత్క రించి, పూలబొకేలు అందించారు. గెలుపుతో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఆ ఏడుగురు టీఆర్ఎస్కే.. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కు వినియోగించు కున్నారు. వారం తా కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్లకు ఓటును చూపించి మరీ.. టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేయడం గమనార్హం. టీడీపీ నుంచి గెలిచి, తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అసెంబ్లీకి వచ్చినా ఓటు వేయలేదు. టీఆర్ఎస్ తరఫున పోలింగ్ ఏజెంట్లుగా ఆర్.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఎం.రమేశ్‌రెడ్డి, ఎన్.రాజేశ్వర్‌రావు, గట్టు రామచందర్ రావులు వ్యవహరించారు. కాంగ్రెస్ అభ్యర్థి పక్షాన రేగా కాంతారావు, మల్లురవి, సీతక్క ఏజెంట్లుగా కూర్చున్నారు. -
ఎన్నికల్లో అదరగొట్టిన టీఎంసీ
సాక్షి, కోల్‌కతా : రాజ్యసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అదరగొట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి సీఎం మమతా బెనర్జీ మరోసారి సత్తా చాటుకున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు ఖాళీగా ఉన్న ఐదు స్థానాలకు గానూ నాలుగు స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులను బరిలోకి దించింది. ఆ నలుగురు అభ్యర్థులు విజయం సాధించడంతో టీఎంసీ శ్రేణులు సంబరాలు చేసుకుంటోంది. రాజ్యసభకు నేడు (శుక్రవారం) జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ తమ పార్టీ నుంచి అభ్యర్థులుగా సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు నడిముల్ హక్, సుభాశిస్ చక్రవర్తి, అబిర్ బిస్వాస్, సంతును సేన్ లను బరిలో దించగా అందరూ విజయం సాధించారు. మరో స్థానంలోనూ టీఎంసీ బలపరిచిన నేత గెలుపొందారు. టీఎంసీ మద్దతిచ్చిన కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ సైతం గెలుపొందారు. సీపీఎం అభ్యర్థి రణ్ బీర్ దేవ్‌కు వామపక్ష కూటమి మద్దతిచ్చినా సింఘ్వీనే విజయం వరించింది. ఒక్కో అభ్యర్థి నెగ్గాలంటే 50 ఓట్లు కావాలి. అధికార టీఎంసీకి 213 ఓట్ల బలం ఉండగా, కాంగ్రెస్ కు 42 మంది సభ్యులు, సీపీఎంకు 26 మంది సభ్యుల ఉంది. దీంతో నలుగురు అభ్యర్థులను మాత్రమే గెలిపించుకునే అవకాశం ఉన్నందున మమతా బెనర్జీ తమ పార్టీ నుంచి నలుగురిని ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించుకున్నారు. -
రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం
-
ముగిసిన రాజ్యసభ పోలింగ్.. ఓటేయని రేవంత్
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. శాసనసభలోని కమిటీ హాల్ నంబర్– 1లో నేటి (శుక్రవారం) ఉదయం 9 గంటలకు ప్రారంభైమన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగింది. 117 మంది ఓటర్లు ఉన్నట్టు అధికారికంగా ప్రకటించగా.. అందులో 108 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సమాచారం. ఎన్నికలు జరిగిన మూడు రాజ్యసభ స్థానాల్లోనూ తమదే విజయమని అధికార టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీ చేయగా.. టీఆర్ఎస్ అభ్యర్థులుగా జోగినపల్లి సంతోష్‌కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్.. కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పి.బలరాంనాయక్ బరిలో దిగిన విషయం తెలిసిందే. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఓటింగ్‌ను ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఓ సీపీఎం ఎమ్మెల్యే బహిష్కరించారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం ఇటీవల రద్దయింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మాధవరెడ్డి ఓటుపై టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఏజెంట్‌కు పోలింగ్ పేపర్ చూపించిన కారణంగా ఆ ఓటును రద్దు చేయాలని ఎన్నికల అధికారిని కలిసి టీఆర్ఎస్ నేతలు కోరారు. నేడు దేశ వ్యాప్తంగా 7 రాష్టాల్లో 26 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. -
నేడు రాజ్యసభ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శాసనసభలోని కమిటీ హాల్ నంబర్– 1లో శుక్రవారం ఉదయం 9 గంటలకు పోలిం గ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు శాసనసభ సచివాలయం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 117 మంది ఓటర్లు ఉన్నట్టు అధికారికంగా ప్రకటించారు. మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా.. నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా జోగినపల్లి సంతోష్‌కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్ బరిలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పి.బలరాంనాయక్ పోటీ చేస్తున్నారు. 10.30కు ఓటేయనున్న కేసీఆర్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉదయం 10.30 గంటలకు ఓటు వేయనున్నారు. శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ఉదయమే తొలి ఓటు వేసే అవకాశముంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. సుమారు ఆరు గంటల సమయంలో ఫలితాలను అధికారికంగా ప్రకటించే అవకాశముంది. పక్కా వ్యూహంతో టీఆర్ఎస్.. తాము నిలబెట్టిన ముగ్గురు అభ్యర్థులను కచ్చితంగా గెలిపించుకోవడడంపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. వరుసగా మూడు రోజులపాటు మాక్‌పోలింగ్‌ను నిర్వహించి.. ఓటు వేయడంలో ఏ మాత్రం పొరపాటు జరగకుండా ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చింది. ఒకే అభ్యర్థికి ఎక్కువగా ఓట్లు పడకుండా, అభ్యర్థులందరికీ సమానంగా వచ్చేలా ఎమ్మెల్యేలను విభజించారు కూడా. వాస్తవానికి ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం, కొన్ని పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో ఒక్కో రాజ్యసభ అభ్యర్థి గెలవడానికి 27 ఓట్లు సరిపోతాయన్న అంచనాలో టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ సొంత ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, సీపీఐ మినహా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినవారు కలిపి 82 మంది ఉన్నారు. మజ్లిస్ మద్దతిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను కలిపితే 89 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లతోనే టీఆర్ఎస్ ముగ్గురు అభ్యర్థులు గట్టెక్కుతారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఏడుగురు ఎమ్మెల్యేల ఓట్లు, ఒక సీపీఐ ఎమ్మెల్యే ఓటు కూడా కలిపితే అవసరానికంటే ఎక్కువగానే ఓట్లు వస్తాయని లెక్కిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఉదయమే తెలంగాణభవన్‌కు చేరుకుని.. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీలోని పోలింగ్ కేంద్రానికి రానున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో సమావేశమై.. రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఓటింగ్‌కు దూరంగా బీజేపీ, టీడీపీ, సీపీఎం రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు సమాన దూరం పాటించాలని బీజేపీ, టీడీపీ, సీపీఎం నిర్ణయించాయి. ఈ మేరకు మూడు పార్టీలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి, రాజ్యసభ ఎన్నికల్లో వైఖరిపై జాతీయపార్టీతో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో చర్చలు జరిపామని.. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటికీ సమాన దూరం పాటించాలని నిర్ణయించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో సభా కార్యక్రమాలకు అడ్డు తగలడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. -
యూపీలోనే విపక్షాలకు తొలి పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓ ఉమ్మడి ఫ్రంట్‌గా ఏర్పడేందుకు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయా? ప్రతిపక్షాల ప్రయత్నాలకు తొలి పరీక్ష ఉత్తరప్రదేశ్ నుంచే ఎదురుకానుంది. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఏప్రిల్ నెలలో పది సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు తమ విభేదాలను విస్మరించి చేతులు కలుపుతాయా? ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు 31 మంది సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తుండగా, వారిలో తొమ్మిది మంది సభ్యత్వం ఏప్రిల్ రెండో తేదీతో ముగిసి పోతుంది. బీఎస్పీ చీఫ్ మాయావతి తన రాజ్యసభ సభ్యత్వానికి గత జూలై నెలలోనే రాజీనామా చేశారు. దీంతో మొత్తం పది సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. రిటైర్ అవుతున్న తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో సమాజ్‌వాది పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు, నరేష్ అగర్వాల్, జయాబచ్చన్, కిరణ్మయ్ నందా, అలోక్ తివారీ, మునావర్ సలీం, దర్శన్ సింగ్ యాదవ్‌లు, బీజేపీ సభ్యుడు వినయ్ కటియార్, బీఎస్పీ సభ్యులు మొహమ్మద్ అలీ, కాంగ్రెస్‌కు చెందిన ప్రమోద్ తివారీలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 312 మంది సభ్యుల బలం కలిగిన బీజేపీ సులభంగా ఎనిమిది రాజ్యసభ సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. 47 మంది సభ్యులు కలిగిన సమాజ్‌వాది పార్టీ ఒక్క రాజ్యసభ సీటును గెలుచుకోగలదు. పదవ సీటును గెలుచుకోవాలంటే మూడూ పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేయాల్సిందే. ఈ విషయంలో మూడు పార్టీలు ఒక అవగాహనకు వస్తాయన్నది ప్రశ్న. తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి బీఎస్పీ ముందుకు వస్తే మంచిదని సమాజ్‌వాది పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మాయావతి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని బీఎస్పీ నాయకుడు సతీష్ శర్మ తెలిపారు. ఉమ్మడి అభ్యర్థి విషయంలో నిర్ణయం చొరవ తీసుకోవాల్సింది ఆ రెండు పార్టీలేనని అసెంబ్లీలో అంతగా బలంలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఏదిఏమైనా ఇప్పుడు ఓ అవగాహనకు వచ్చినట్లయితే గోరఖ్‌పూర్, ఫుల్పూర్ లోక్‌సభ స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికలకు, 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఏకమయ్యేందుకు దోహదపడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. గతవారమే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ 17 పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంట్ లోపల, బయట వివిధ సమస్యలపై పోరాటం జరిపేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకతాటిపైకి రావాలని చర్చించారు. ఈ సమావేశానికి కూడా బీఎస్పీ గైర్హాజరవడం పలు సందేహాలకు దారితీసింది. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏకం కావాలంటే ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయడం అవసరం. -
'పటేల్‌కే ఓటేశా.. నితీష్ ఫోన్ చేయలే'
గాంధీనగర్: తాను కాంగ్రెస్ పార్టీ నేత రాజ్యసభ అభ్యర్థి అహ్మద్ పటేల్‌కు ఓటు వేశానని గుజరాత్ జేడీయూ ఎమ్మెల్యే చోటు వాసవ చెప్పారు. పేద ప్రజలను, గిరిజనులను బీజేపీ చిన్నచూపు చూస్తున్న కారణంగానే తాను తన ఓటును అహ్మద్‌కు వేసినట్లు తెలిపారు. గుజరాత్‌లోని గిరిజనులకు ప్రాతినిధ్యం ఉన్న నియోజవర్గం బారుచ్‌లో వాసవ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల జేడీయూ బీజేపీతో చేతులు కలిపింది. బిహార్ లో బీజేపీ సహాయంతోనే జేడీయూ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో జేడీయూ ఎమ్మెల్యే అయిన వాసవ సహకారం బీజేపీకే ఉంటుందని అనుకున్నారు. అంతేకాకుండా, ఆయన ఓటింగ్ సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలతో కలసి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీకి ఆయన ఓటు పడకపోవచ్చని భావించారు. అయితే, ఆయన మాత్రం అనూహ్యంగా తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్‌కు ఓటు వేసినట్లు తెలిపారు. 'బీజేపీ 22 ఏళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది. కానీ, గిరిజన ప్రాంతాల ప్రజలకు చేసేందేమి లేదు. చేసే సహాయం అరకొరగానే చేస్తుంటుంది. ఓట్ల గురించి నితీష్ కుమార్ నాకు ఫోన్ చేయలేదు. పార్టీ ఎలాంటి విప్ కూడా జారీ చేయలేదు. పటేల్‌కు ఓటు వేయాలన్న నిర్ణయం నేను తీసుకున్నదే' అని ఆయన చెప్పారు. -
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రపుల్ పటేల్ షాక్
న్యూఢిల్లీః గుజరాత్ నుంచి కాంగ్రెస్ తరపున పెద్దల సభకు బరిలో నిలిచిన అహ్మద్ పటేల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరంలోకి క్యూ కడుతున్న క్రమంలో తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రపుల్ పటేల్ వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత కలవరపెడుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనేదానిపై తమ పార్టీ ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని ఆయన ప్రపుల్ పటేల్ వ్యాఖ్యానించారు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసింది. గుజరాత్ శాసనసభలో ఆ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. గుజరాత్ నుంచి ముగ్గురు రాజ్యసభకు ఎంపికవనుండగా వారిలో బీజేపీ నుంచి అమిత్ షా, స్మతీ ఇరానీలు సులభంగా ఎన్నికవనున్నారు. మూడో అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి తిరిగి బరిలో నిలిచిన అహ్మద్ పటేల్‌కు 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. సీనియర్ నేత వాఘేలా మద్దతుదారులు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ వద్ద ప్రస్తుతం 44 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో అహ్మద్ పటేల్ గెలువాలంటే ఎన్సీపీ మద్దతు కీలకమని కాంగ్రెస్ భావిస్తోంది. -
తప్పు మార్కర్ పెన్నుదా? పార్టీ సభ్యులదా?
న్యూఢిల్లీ: భారత పార్లమెంట్లో ప్రజాస్వామ్యం ఓ బూటకమని, రాజకీయ పార్టీలు ఆడే నాటకమని తెల్సిందే. ఈ బూటకపు నాటకంలో పార్టీ అధిష్టానం చేతుల్లో పార్లమెంట్ సభ్యులు జవసత్వాలు లేని పాత్రలుగా వ్యవహరించడం మనం ఇంతకాలం చూశాం. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికే షాకిచ్చిన పార్టీలోని ఓ వర్గం ఆడిన సరికొత్త నాటకం ఇప్పుడు తెరపైకి వచ్చింది. హర్యానాలోని రెండు సీట్లతో సహా దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ సీట్లకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ రెండు సీట్లను బీజేపీ కైవసం చేసుకున్నాయి. అసెంబ్లీలో ఆ పార్టీకున్న బలం ప్రకారం ఒక్క సీటు మాత్రమే బీజేపీకి దక్కాలి. మరోసీటు కాంగ్రెస్-ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ కూటమికి వెళ్లాలి. బీజేపీ అధికార అభ్యర్థిగా కేంద్ర మంత్రి వీరేందర్ సింగ్‌తోపాటు బీజేపీ మద్దతిచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఈస్ట్ గ్రూప్, జీ మీడియా చైర్మన్ సుబాస్ చంద్ర అనూహ్యంగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 ఓట్లు చెల్లకుండా పోవడమే కాంగ్రెస్ కూటమి బలపర్చిన స్వతంత్య్ర అభ్యర్థి ఆర్కే ఆనంద్ ఓటమికి కారణమని రిటర్నింగ్ అధికారితోపాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాదిస్తోంది. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే తన బ్యాలెట్ పత్రాన్ని తోటి సభ్యుడికి బహిరంగంగా చూపించినందుకు ఒక ఓటు, ఎన్నికల నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి సూచించిన వయలెట్ మార్కర్ పెన్నును ఉపయోగించక పోవడం వల్ల 12 ఓట్లు చెల్లకుండా పోయాయి. మరో ఓటరు ఎవరికి ఓటు వేయకుండా ఖాళీగా వదిలేశారు. దీంతో కాంగ్రెస్ కూటమి బలపర్చిన ఆనంద్‌కు దక్కాల్సిన 14 ఓట్లు రాకుండా పోయాయి. దీనికి రిటర్నింగ్ అధికారి బీజేపీ పార్టీతో అక్రమాలకు కుమ్మక్కు అవడం వల్లనే ఇలా జరిగిందని, సూచించిన మార్కర్ పెన్నుకు బదులుగా ఓటేసేటప్పుడు మరో పెన్నును ఎలా పెడతారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాదిస్తోంది. ఈ విషయమై ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసింది. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా వర్గానికి చెందిన 14 మంది శాసనసభ్యుల ఓట్లే చెల్లకుండా పోయాయని, వారే ఇందులో కుట్రపన్ని తప్పుడు పెన్నుతో ఓటేశారని ఓడిపోయిన స్వతంత్య్ర అభ్యర్థి ఆనంద్ ఆరోపిస్తున్నారు. ఆయన వాదనలో వాస్తవం లేకపోలేదు. బీజేపీతో అంటకాగే ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌తో పొత్తు పెట్టుకోవడం భూపేందర్ సింగ్ హూడాకు ఏమాత్రం ఇష్టం లేదు. పార్టీ అధిష్టానంకు ఆయన ఓ షాక్ ఇవ్వాలనుకున్నారు. ఇచ్చారు. పార్టీ అంతర్గత కుమ్ములాటల గురించి, అవిధేయత గురించి బహిరంగంగా మాట్లాడడం ఇష్టంలేని కాంగ్రెస్ అధిష్టానం నెపాన్ని రిటర్నింగ్ అధికారిపైకి నెట్టేస్తోంది. ఇందులో పూర్తిగా రిటర్నింగ్ అధికారి తప్పిదమేననుకుంటే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సరైన మార్కర్‌తోనే ఓట్లు ఎలావేశారన్న ప్రశ్న వస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో రిటర్నింగ్ అధికారి హస్తం ఉన్నా, లేకున్నా హూడా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కుమ్మక్కు కాకపోతే ఇలా జరగదనే విషయం సుస్పష్టం. ఎమ్మెల్యేలు డబ్బులకు అమ్ముడుపోయి పార్టీ అధిష్టానం ఆదేశాలకు విరుద్ధంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడరాదనే ఉద్దేశంతో రాజ్యసభ ఎన్నికల్లో 2003 నుంచి ఏజెంట్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి ప్రకారం పార్టీ నియమించిన ఏజెంట్‌కు చూపించి పార్టీ సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది. హర్యానా నుంచి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్‌గా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బీకే హరిప్రసాద్ వ్యవహరించారు. ఓట్లు చెల్లకుండా పోయిన 13 మంది శాసన సభ్యులు సహా పార్టీ సభ్యులంతా తనకు చూపించే ఓటు వేశారని హరిప్రసాద్ ఓటింగ్ అనంతరం మీడియా సమక్షంలో ప్రకటించారు. అందరు కూడా ఆనంద్‌కే ఓటేశారని చెప్పారు. ఎవరికి ఓటు వేశారన్న విషయాన్ని గ్రహించిన ఆయన ఏ పెన్నుతో ఓటు వేశారన్న విషయాన్ని గమనించలేకపోయారు. ఎన్ని కొత్త పద్ధతులు తీసుకొచ్చిన క్రాస్ ఓటింగ్ జరుగుతోందన్నది నిర్వివాదాంశం. ఏదేమైతేనేం! మరో పారిశ్రామికవేత్త, ధనవంతుడు రాజ్యసభకు ఎన్నికయ్యారు. -
జూన్ 11న రాజ్యసభ పోలింగ్
- ఏపీలో మోగిన రాజ్యసభ ఎన్నికల నగారా.. ఎన్నికల నోటిఫికేషన్ జారీ - నాలుగు సీట్లలో మూడు టీడీపీ, ఒకటి వైఎస్సార్సీపీ గెలుచుకునే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. రాష్ర్ట ముఖ్య ఎన్నికల అధికారి మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 31 వరకు ఏపీ శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 3వ తేదీ వరకు గడువుంది. జూన్ 11న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రానికి సంబంధించి జూన్ 21న నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. నలుగురు కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లయితే జూన్ 11న ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్లు లెక్కిస్తారు. జూన్ 13 నాటికి ఎన్నికల ప్రక్రియను ముగిస్తారు. రాష్ట్ర శాసనసభలో ప్రస్తుతం పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా.. నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు స్థానాలు మాత్రమే అధికార తెలుగుదేశం కైవసం చేసుకునేందుకు అవకాశం ఉంది. ఒక స్థానాన్ని విపక్ష వైఎస్సార్సీపీ గెలుచుకోనుంది. సుజనా చౌదరికి మళ్లీ అవకాశం! ఏపీకి సంబంధించి వచ్చే నెలలో రాజ్యసభ సభ్యత్వం ముగియనున్న వారిలో టీడీపీ తరఫున కేంద్ర మంత్రులు వై.ఎస్.చౌదరి (సుజనాచౌదరి), నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రులు జేడీ శీలం, జైరాం రమేశ్ ఉన్నారు. సుజనా చౌదరిని మళ్లీ రాజ్యసభకు పంపాలని చంద్రబాబు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వొద్దని లోకేశ్ గట్టిగా పట్టుపడుతున్నా గతంలో చేసిన సాయానికి ప్రతిఫలంగా మరోసారి సీటు ఇవ్వక తప్పదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. రెండో సీటును మిత్రపక్షం బీజేపీకి (నిర్మలా సీతారామన్‌కు) చంద్రబాబు కేటాయించనున్నారు. ఇక మూడో సీటును బీసీ లేదా ఎస్సీ సామాజికవర్గాలకు ఇవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. బీసీ కోటాలో నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు పేరు పరిశీలనలో ఉంది. బీసీ కోటాలోనే కర్నూలు జిల్లా నుంచి గతంలో రెండు విడతలు లోక్‌సభకు పోటీచేసి ఓడిన బీటీ నాయుడు పేరును కూడా పరిశీలిస్తున్నారు. ఇలావుండగా కాపు సామాజికవర్గానికి ఓ రాజ్యసభ సీటు ఇవ్వాలని కాపు సంఘాల నేతలు ఇటీవల చంద్రబాబును కలసి కోరారు. గుంటూరు జిల్లా పార్టీ నేత దాసరి రాజా మాస్టారు పేరును పార్టీ నేతలు కొందరు సూచించినట్టు సమాచారం. ఇదే సామాజికవర్గానికి చెందిన చిక్కాల రామచంద్రరావు కూడా సీటు ఆశిస్తున్నారు. ఎస్సీ కోటాలో మాజీ ఎమ్మెల్యే హేమలత పేరుతో పాటు జేఆర్ పుష్పరాజ్, వర్ల రామయ్య, లలితా థామస్‌ల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కంభంపాటి రామ్మోహనరావు కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. -
వాళ్ల విషయం హైకమాండే చూసుకుంటుంది: బొత్స
కాంగ్రెస్ పార్టీకి నాలుగో అభ్యర్థిని గెలిపించుకునేంతగా ఎమ్మెల్యేల బలం లేదని, అందువల్లే తాము రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని పోటీ చేయించలేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ అభ్యర్థులకు ఓటేయని ఇద్దరు ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అరిగెల నర్సారెడ్డిల విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానమే చూసుకుంటుందని బొత్స సత్యనారాయణ చెప్పారు. అధికారం కోసం పొత్తుపెట్టుకున్నది చంద్రబాబేనని, ఆయన తమపై విమర్శలు చేయడం తగదని తెలిపారు. -
పెద్దల సభ ఫలితాలు విడుదల
-
వీరే మన 'పెద్దలు'
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఊహించినట్టే వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థులు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, ఎం.ఎ. ఖాన్.. టీడీపీ తరపున గరికపాటి మోహనరావు, సీతామహాలక్ష్మి, టీఆర్ఎస్ తరఫున కె.కేశవరావు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురు, టీడీపీ అభ్యర్థులు ఇద్దరు తొలి ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు. కాగా 26 ఓట్లు సాధించిన కేశవ రావు ఎలిమినేషన్ ప్రక్రియలో విజయం సాధించడం లాంఛనమే. వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సివుంది. రాష్ట్రం నుంచి ఆరు స్థానాలకు ఎన్నికలు జరగగా ఏడుగురు బరిలో నిలిచారు. చిట్టచివరి నిమిషంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి తప్పుకోవడంతో ఆరుగురి ఎన్నిక కావడం ఖాయమని ముందుగానే తేలిపోయింది. నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగియడంతో సాంకేతికంగా ఆదాల పోటీలో ఉన్నా.. మిగిలిన అభ్యర్థులే ఓట్లు పంచుకున్నారు. దీంతో వీరి ఎన్నిక లాంఛనమైంది. ఓటింగ్ లో మొత్తం 248 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా మంగళగిరి ఎమ్మెల్యే కాండ్రు కమల ఖాళీ బ్యాలెట్ పేపర్‌ను బాక్సులో వేయగా, మరో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా తిరస్కార హక్కును వినియోగించుకున్నారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ వారే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సీపీఎం సభ్యులు ఓటింగులో పాల్గొనలేదు. కాంగ్రెస్ తరపున ముగ్గురూ సిట్టింగ్ అభ్యర్థులే ఎన్నికయ్యారు. వీరికి మరోసారి రాజ్యసభ అవకాశం దక్కింది. ఇక టీఆర్ఎస్ నేత కేశవరావు కూడా రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గతంలో కాంగ్రెస్ తరపున అవకాశం వచ్చింది. అయితే కాంగ్రెస్ తో విభేదించి రాజీనామా చేసిన కేకే టీఆర్ఎస్ లో చేరారు. ఇక టీడీపీ తరపున గెలిచిన గరికపాటి, సీతామహాలక్ష్మి ఇద్దరూ కొత్తవారు. -
గరంగరంగా రాజ్యసభ ఎన్నికలు
-
గరంగరంగా రాజ్యసభ ఎన్నికలు
రాజ్యసభ ఎన్నికల వ్యవహారం మహా వాడి వేడిగా సాగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరెవరికి ఎవరు ఓట్లేయాలన్న విషయమై స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇందుకు తగిన వ్యూహాలు రూపొందించారు. తమ ఎమ్మెల్యేల ఓట్లను 46, 46, 47 గా ముగ్గురికి మాత్రమే కేటాయించినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ మాత్రం ఎప్పటిలాగే తిరుగుబాటు స్వరం వినిపించారు. తమ ఓట్లన్నీ కేవలం తెలంగాణ అభ్యర్థులకే వేస్తామని, సీమాంధ్ర అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లో వేసేది లేదని చెప్పారు. అయితే రంగంలో ఇద్దరు సీమాంధ్ర అభ్యర్థులు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి ఉన్నారు. ఎం.ఎ. ఖాన్ ఒక్కరు మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. దాంతో తెలంగాణ ఎమ్మెల్యేలు తమ ఓట్లను ఆయనకు వేయగా మిగిలినవారు ఎటు మొగ్గుతారన్నది అనుమానంగానే కనపడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉదయం గోల్కొండ హోటల్లో నిర్వహించిన సమావేశానికి టీఆర్ఎస్ నాయకులు కేకే, హరీష్ రావు, ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎమ్మెల్యేలమంతా తమ ఐక్యతను నిరూపించుకుంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో.. తెలంగాణ వాదిగా తాను పోటీలో ఉన్నందున తనకు ఓట్లేయాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోరానని కేకే తెలిపారు. దీంతో ఎవరి ఓట్లు ఎటు పడతాయోనన్న విషయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈసారి చరిత్ర సృష్టించారు. రాజ్యసభ ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన తిరస్కరణ ఓటును ఆయన వినియోగించుకున్నారు. అభ్యర్థులెవరూ తనకు నచ్చలేదని, ముందుగానే ముఖ్యమంత్రికి, పీసీసీ చీఫ్ బొత్సకు చెప్పి తాను తిరస్కరణ ఓటు వేశానని ఆయన అన్నారు. విభజనకు అనుకూలంగా వ్యవహరించిన వారిని తాను రాజ్యసభకు ఎన్నుకోవడం మనసుకు నచ్చలేదని, అందుకే ఎవరికీ ఓటు వేయదలచుకోలేదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. -
బరిలో ఆదాల, రాజ్యసభ ఎన్నిక అనివార్యం
-
బెదిరింపులకు లొంగేది లేదు
రాజ్యసభకు పోటీలో ఉన్నరెబల్ అభ్యర్ధులను కట్టడి చేసేందుకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, తాము మాత్రం బెదిరింపులకు లొంగేది లేదని రెబల్స్ అంటున్నారు. చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డిలకు మద్దతుగా వారి నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేసిన ఎమ్మెల్యేలతో బొత్స ఇప్పటికే మాట్లాడుతున్నారు. ఆ సంతకాలు వెనక్కి తీసుకోవాలని వారిని బొత్స కోరారు. ఆ ఎమ్మెల్యేల నుంచి లేఖలు తీసుకుని, వాటిని రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు పంపి, చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డిల నామినేషన్లు చెల్లకుండా చేసేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అయితే, తాము మాత్రం బెదిరింపులు.. ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగేది లేదని చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తామిద్దరిలో ఎవరో ఒకరం తప్పనిసరిగా పోటీలో ఉండి తీరుతామని వారు తెలిపారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని తామిద్దరిపై రోజురోజుకూ ఒత్తిడి బాగా పెరుగుతోందని చెప్పారు. -
స్వతంత్ర అభ్యర్థులకు ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణ
-
స్వతంత్ర అభ్యర్థులకు ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణ
హైదరాబాద్: స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతివ్వడం లేదని ఎమ్మెల్యేలు నీరజారెడ్డి, విజయ్, శేషు రిటర్నింగ్ అధికారికి లేఖలు ఇచ్చారు. మరో స్వతంత్ర అభ్యర్థి చైతన్యరాజకు మద్దతివ్వడం లేదని ఎమ్మెల్యేలు ముత్యాల పాప, మురళీకృష్ణ రిటర్నింగ్ అధికారికి లేఖలు ఇచ్చారు. ఆ ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరించుకుంటూ రిటర్నింగ్ అధికారికి లేఖలు ఇవ్వడంపై రాజ్యసభ స్వతంత్ర అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి నలుగురు రాజ్యసభ అభ్యర్థులను గెలిపించుకునే బలం ఉందని, అయినా కూడా ముగ్గురిని మాత్రమే బరిలో నిలబెట్టారని ఆరోపిస్తూ నెల్లూరు జిల్లాకు చెందిన నాయకుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. -
రెబల్స్ ఉన్నారా.. నాకు తెలియదే
రాజ్యసభ బరిలో స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా పోటీ చేసిన విషయం తనకు తెలియదని కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ఒకవేళ రెబెల్స్ ఎవరైనా ఉంటే ఆ విషయాన్ని పార్టీ అధిష్ఠానం, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చూసుకుంటారని ఆయన అన్నారు. వాస్తవానికి నాలుగో అభ్యర్థిని గెలిపించుకునే బలం కాంగ్రెస్ పార్టీకి లేదని, అందుకే అధిష్ఠానం కేవలం ముగ్గురు అభ్యర్థులను మాత్రమే బరిలోకి దింపిందని టీఎస్సార్ చెప్పారు. అయితే, గోదావరి జిల్లాల నుంచి చైతన్య రాజు, నెల్లూరు జిల్లాకు చెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తం ఆరు స్థానాలకు గాను ఎనిమిది మంది బరిలో ఉన్నట్లయింది. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఇద్దరు, టీఆర్ఎస్ నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు రాజ్యసభ సీట్ల కోసం పోటీ పడనున్నారు. -
రాజ్యసభకు నేనూ పోటీ చేస్తున్నా: ఆదాల
-
రాజ్యసభకు నేనూ పోటీ చేస్తున్నా: ఆదాల
కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది రాజ్యసభ అభ్యర్థులను గెలిపించుకునే బలం ఉందో తెలియదు గానీ, ఎవరికి వారే, తామంటే తాము రాజ్యసభ బరిలో ఉన్నామంటూ ముందుకొస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన నాయకుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీకి నలుగురు రాజ్యసభ అభ్యర్థులను గెలిపించుకునే బలం ఉందని, అయినా కూడా ముగ్గురిని మాత్రమే బరిలో నిలబెట్టారని ఆయన అన్నారు. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు ఓటేసే పరిస్థితి ఉందని, దీన్ని నివారించేందుకు తాను కూడా బరిలోకి దిగానని ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతను కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియజెప్పేందుకే తాను రాజ్యసభకు పోటీచేస్తున్ననని, సమైక్యాన్నికోరుకునే ఎమ్మెల్యేలంతా పార్టీలకు అతీతంగా తనకు ఓటేస్తారని ఆశిస్తున్నానని నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన చెప్పారు. తొలుత రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేసిన సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి ఉపసంహరించుకోవడంతో చైతన్య రాజు, ఆదాల మాత్రమే రెబెల్స్ గా బరిలో నిలిచినట్లు అయ్యింది. సమైక్యాంధ్ర కోరుకునే వాళ్లంతా తమకు ఓటు వేయాలనేది తమ నినాదం అని ఆదాల అంటున్నారు. విభజనపై కాంగ్రెస్ వైఖరిని వ్యతిరేకించేలా తమ చర్యలు ఉండాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అందులోభాగంగా సమైక్యానికి మద్దతు ఇచ్చే కాంగ్రెస్ నాయకులు ఎవరు రాజ్యసభ అభ్యర్థులుగా పోటీ చేసినా తమ ఓటు వారికే వేస్తామని ప్రకటించారు. ఎం.ఎ.ఖాన్, టి.సుబ్బిరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు అధికారికంగా రాజ్యసభ బరిలో నిలవనున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ప్రకటించింది. -
నేనూ రాజ్యసభ బరిలో ఉన్నా
రాజ్యసభ బరిలో తాను ఉన్నట్లు ఎమ్మెల్య్ఏ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు తాను రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు చెప్పారు. తాను, జేసీ దివాకర్ రెడ్డి, చైతన్య రాజులలో రాజ్యసభ అభ్యర్థులుగా బరిలో ఉన్నామని, అయితే చివరకు బరిలో మాత్రం నిలిచేది ఇద్దరమే అని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర కోరుకునే వాళ్లంతా తమకు ఓటు వేయాలనేది తమ నినాదం అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను కాంగ్రెస్ పార్టీకి చెందిన సమైక్యాంధ్ర ఎమ్మెల్యేలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో విభజనపై కాంగ్రెస్ వైఖరిని వ్యతిరేకించేలా తమ చర్యలు ఉండాలని ఇప్పటికే సదరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అందులోభాగంగా సమైక్యానికి మద్దతు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు ఎవరు రాజ్యసభ అభ్యర్థులుగా పోటీ చేసిన తమ ఓటు వారికే వేస్తామని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలవనున్నారు. అయితే ఎం.టి.ఖాన్, టి.సుబ్బిరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావులు తమ రాజ్యసభ సభ్యులగా మరోసారి రాజ్యసభ బరిలో నిలవనున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. -
రాజుగారికి లైన్ క్లియర్
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాజ్యసభ ఎన్నికలకు జిల్లా నుంచి పోటీ చేసే అభ్యర్థులపై వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు సోమవారం రాత్రి తెరపడింది. కోస్తా ఆంధ్రా ప్రాంతం నుంచి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చైతన్యరాజు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. రెబల్‌గా పోటీలోకి దిగేందుకు చైతన్యరాజు, విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి పోటీ పడ్డారు. దీనిపై రెండు రోజులుగా హైదరాబాద్‌లో సీమాంధ్ర ఎమ్మెల్యేలతో జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. చివరకు చైతన్యరాజుకు లైన్ క్లియర్ అయింది. ఆయన పోటీ చేసేందుకు, గంటా, ఏరాసు బరి నుంచి తప్పుకునేందుకు వారి మధ్య అంగీకారం కుదిరింది. హైదరాబాద్ మంత్రుల క్వార్టర్స్‌లో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ మూడు దఫాలుగా జరిగిన చర్చల్లో చైతన్యరాజు అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వచ్చింది. అయితే రాయలసీమ నుంచి జేసీ దివాకరరెడ్డి పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ సీమాంధ్ర నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు చైతన్యరాజు వైపు మొగ్గు చూపారు. నామినేషన్ వేసేందుకు అవసరమైన ఎమ్మెల్యేల నుంచి సంతకాల సేకరణ పూర్తి చేసినట్టు చైతన్యరాజు అనుచరులు చెబుతున్నారు. ఆయన మంగళవారం ఉదయం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.మరోపక్క రాయలసీమకు చెందిన మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి కూడా కాంగ్రెస్ రెబల్‌గా పోటీలో నిలుస్తున్నారు. గతంలో జిల్లా ఇన్చార్జి మంత్రిగా పని చేసిన ఆయనకు మద్దతుగా జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. బరిలో ఉంటానని చైతన్యరాజు ముందునుంచీ చెబుతున్నప్పటికీఆ ముగ్గురు ఎమ్మెల్యేలూ జేసీకి మద్దతు తెలపడంతో, మిగిలిన ఎమ్మెల్యేలు అయోమయాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఎలాగూ చైతన్యరాజు బరిలో దిగుతుండడంతో వారు ఎటువైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే. ఈ పరిస్థితుల్లో చైతన్యరాజుకు జిల్లా నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఓటేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు తమ్ముళ్ల ఆశలు అడియాసలే.. రాజ్యసభ టిక్కెట్టు కోసం జిల్లా టీడీపీ నేతలు పెట్టుకున్న ఆశలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నీళ్లు చల్లేశారు. కోస్తా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట సీతామహాలక్ష్మిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈమేరకు హైదరాబాద్‌లో సోమవారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. ఆమె పేరును మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జిల్లాకు చెందిన మాజీ మంత్రులు చిక్కాల రామచంద్రరావు, డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం నిరాశ చెందుతున్నారు. తమకు అవకాశం కల్పించాలని దాదాపు వీరంతా చంద్రబాబును కోరారు. వీరిలో చిక్కాల, చినరాజప్ప సీటు ఖాయమన్న ధీమాతో కనిపించారు. కొత్తపేట నియోజకవర్గంలో పాతకాపులు తిరిగి పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో.. బీసీల్లో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యానికి రాజ్యసభ టిక్కెట్టు దక్కుతుందని ఆశించారు. చివరకు ఆయనకు కూడా చంద్రబాబు మొండిచెయ్యి చూపారు. -
రాజ్యసభ ఎన్నికలపై కేకే మంత్రాంగం
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఆరు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో తమ అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు ఆయా పార్టీలు రంగంలోకి దిగాయి. టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు పోటీచేస్తున్న సీనియర్ నేత కే కేశవరావు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు సోమవారం అసెంబ్లీకి వచ్చారు. కేకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలసి ఎంఐఎం లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలోకి వెళ్లి మంతనాలు జరిపారు. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. టీఆర్ఎస్ఎల్పీకి మంత్రి పొన్నాల లక్ష్మయ్య వచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్.. ఎంఐఎంతో పాటు సీపీఐ, బీజేపీ మద్దతు కోరుతోంది. కేకే గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్ మూడు, టీడీపీ రెండు, టీఆర్ఎస్ ఒక స్థానం నుంచి పోటీ చేయనున్నాయి. కాగా కాంగ్రెస్ నుంచి రెబెల్ అభ్యర్థులు పోటీ చేయనుండటంతో రాజకీయాలు రసకందాయంగా మారాయి. -
సోలోగానైనా సై
సాక్షి ప్రతినిధి, కాకినాడ :నామినేషన్ల ఘట్టం దగ్గర పడటంతో రాజ్య(పెద్దల)సభకు పార్టీల అభ్యర్థులెవరన్న దానిపై సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్సీ చైతన్యరాజు పార్టీ అవకాశం ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి చైతన్యరాజుతో పాటు మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి జె.సి.దివాకరరెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ల పేర్లు నాలుగైదు రోజులుగా నలుగుతున్నాయి. నామినేషన్ల అనంతరం బరిలో మిగిలే వారెవరనే విషయం ప్రస్తుతానికి పక్కనబెడితే సీమాంధ్ర జిల్లాల్లో ఎవరు బరిలో నిలిస్తే ఎంతమంది మద్దతు లభిస్తుందని నేతలు లెక్కలు తీస్తున్నారు. ఈ క్రమంలో తొలుత సొంత జిల్లాల్లో మద్దతు సాధించే దిశగా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బరిలో నిలుస్తానంటున్న ఎమ్మెల్సీ చైతన్యరాజు ఆదివారం హైదరాబాద్‌లో రెండు విడతలుగా జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. జేసీ, గంటా, ఉండవల్లి, చైతన్యరాజుల్లో చివరకు బరిలో ఒకరే నిలుస్తారా లేక ఒకరికి మించే పోటీ పడతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. చైతన్యరాజు అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారు సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. ఆ ముగ్గురితో కూడా ఆయన మాట్లాడుతున్నారని సమాచారం. విశాఖ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు తొలుత చైతన్యరాజుకు మద్దతు ఇవ్వడం, అనంతరం బరిలోకి వచ్చిన గంటా వైపు మొగ్గు చూపడం, విభజన పరిణామాల్లో జేసీ, గంటా టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్వతంత్రంగా బరిలోకి దిగితే చైతన్యరాజు పేరు పరిశీలించాలనే ప్రతిపాదన కాంగ్రెస్ వర్గాల్లో వచ్చిందని సమాచారం. ఉండవల్లి పేరును ఎంపీ హర్షకుమార్ శనివారమే తెరపైకి తీసుకురాగా మిగిలిన నాయకులెవరూ సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నామినేషన్ వేయనున్నట్టు చైతన్యరాజు హైదరాబాద్ నుంచి ‘సాక్షి ప్రతినిధి’కి ధ్రువీకరించారు. ధనబలమే ‘దేశాని’కి గీటురాయి..! తెలుగుదేశం విషయానికి వస్తే సమర్థత కంటే ఆర్థిక అంశాలే ప్రామాణికమవుతున్నాయి. పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా రికార్డు స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించిన నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రులు చిక్కాల రామచంద్రరావు, మెట్ల సత్యనారాయణరావు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం రాజ్యసభకు వెళ్లాలని ఆశిస్తున్నా వారిని పక్కనబెట్టే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లా ల పార్టీ అధ్యక్షులు చినరాజప్ప, సీతామహాలక్ష్మి అవకాశం కోసం పోటీపడుతుం డగా మహిళా కోటాలో సీతామహలక్ష్మికే అవకాశం ఉండవచ్చన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం వీరందరినీ కాదని ఆర్థిక దన్ను కలిగిన నారాయణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ పి.నారాయణ వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే అంతకంటే అన్యాయం మరొకటి ఉండబోదని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. -
రాజ్యసభ రాజకీయాలు
-
చిరంజీవితో మాట్లాడి చెబుతా: గంటా
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో వేడి రాజేస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానికి వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు పావులు కదుపుతున్నారు. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు తెరపైకి వచ్చింది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా గంటాను బరిలో నిలబెట్టవచ్చనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి కేంద్ర మంత్రి చిరంజీవితో మాట్లాడిన తర్వాతే తన నిర్ణయం వెల్లడిస్తానని గంటా చెబుతున్నారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన గంటాకు, ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక చిరు సూచన మేరకు రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా వ్యవహరిస్తున్న గంటా శ్రీనివాసరావును రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిపి అధిష్టానానికి షాక్ ఇవ్వాలని కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా కాంగ్రెస్‌కు మూడు దక్కనున్నాయి. ఇదిలావుండగా, రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. సోనియా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడిన జేసీకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు. అయితే ఆయనింకా స్పందించలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్‌ను ధిక్కరిస్తూ పోటీచేస్తున్న జేసీకి ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతిస్తారన్నది గందరగోళంగా మారింది. -
రాజ్యసభకు పోటీ చేస్తా: జేసీ
-
రాజ్యసభకు పోటీ చేస్తా: జేసీ
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యత్వానికి పోటీ చేస్తున్నట్లు మాజీమంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆమేరకు ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తనకు సహకరించాలని గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటష్తో పాటు ఇతర నేతలను కోరినట్లు ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. రాజ్యసభకు గంటా పోటీ చేస్తారో లేదో తనకు తెలియదన్నారు. అధిష్టానాన్ని ధిక్కరించి రాజ్యసభకు స్వతంత్ర్యంగా పోటీ చేసేందుకు జేసీ అడుగులు వేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా అధిష్ఠానం నుంచి అభ్యర్థుల జాబితా రాకముందే పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికివారుగా రాజ్యసభ అభ్యర్థిత్వానికి సంతకాల సేకరణ చేపట్టడంపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహంగా ఉంది. మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ సీమాంధ్ర కాంగ్రెస్ తరపున ఒక్కరే పోటీలో ఉంటారని అన్నారు. చిరంజీవితో సంప్రదించాకే పోటీపై నిర్ణయం ఉంటుందన్నారు. తమలో ఒకరిని మాత్రమే బరిలో దింపే యోచనలో ఉన్నట్లు గంటా తెలిపారు. -
'వెళ్లాలనుకుంటే పార్టీ నుంచి వెళ్లిపోండి'
హైదరాబాద్ : అసెంబ్లీ లాబీలో గురువారం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, జేసీ దివాకర్ రెడ్డిల మధ్య సంవాదం చోటుచేసుకుంది. రాజ్యసభకు పోటీ చేస్తానంటూ ఎమ్మెల్యేల సంతకాలు ఎందుకు తీసుకుంటున్నారని బొత్స... ఈ సందర్భంగా జేసీని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే చర్యలు వద్దని... వెళ్లాలనుకుంటే పార్టీ నుంచి వెళ్లిపోవాలని బొత్స సూచించారు. అంతేకానీ ఇటువంటి చర్యలు సరికాదని జేసీతో ..పీసీసీ చీఫ్ అన్నారు. కాగా జేసీ దివాకర్‌రెడ్డి రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగే ప్రయత్నాల్లో ఉన్నారు. తాను స్వయంగా పోటీ చేయలేకపోతే మరో అభ్యర్థిని రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రాజ్యసభ నామినేషన్ పత్రాలపై పది మంది ఎమ్మెల్యేల సంతకాలను కూడా సేకరించారు. నిన్న అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో మాజీ పీఆర్పీ నేతలైన ఎమ్మెల్యేలతో జేసీ సమావేశమై, ఈ ప్రతిపాదన చేశారు. పీఆర్పీకి చెందిన ఎమ్మెల్యేలు ఎలమంచిలి రవి, వంగా గీత, పంతం గాంధీమోహన్, బండారు సత్యానందరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉగ్ర నర్సింహారెడ్డి, రాజా అశోక్బాబులతో పాటు మరో ఐదుగురు జేసీ తెచ్చిన నామినేషన్ పత్రంపై సంతకాలు చేసిన విషయం తెలిసిందే. -
రాజ్యసభ బరిలో జేసీ!
నామినేషన్ పత్రాలపై ఎమ్మెల్యేల సంతకాల సేకరణ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగే ప్రయత్నాల్లో ఉన్నారు. తాను స్వయంగా పోటీ చేయలేకపోతే మరో అభ్యర్థిని రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రాజ్యసభ నామినేషన్ పత్రాలపై పది మంది ఎమ్మెల్యేల సంతకాలను కూడా సేకరించారు. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్‌లో విలీనమైన ప్రజారాజ్యం పార్టీకి చెందినవారు. మిగిలిన వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బుధవారం అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో మాజీ పీఆర్పీ నేతలైన ఎమ్మెల్యేలతో జేసీ సమావేశమై, ఈ ప్రతిపాదన చేశారు. పీఆర్పీకి చెందిన ఎమ్మెల్యేలు ఎలమంచిలి రవి, వంగా గీత, పంతం గాంధీమోహన్, బండారు సత్యానందరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉగ్ర నర్సింహారెడ్డి, రాజా అశోక్బాబులతో పాటు మరో ఐదుగురు జేసీ తెచ్చిన నామినేషన్ పత్రంపై సంతకాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి తగిన రీతిలో నిరసన తెలియచేసేందుకే ఈ సంతకాలు చేశామని, జేసీకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయనకే ఓటు వేస్తామని ఎలమంచిలి రవి తెలిపారు. అంతకుముందు జేసీ దివాకర్‌రెడ్డి ఎంఐఎం నేతలతో కూడా సమావేశమై తనకు మద్దతివ్వాలని కోరారు. -
మూడు స్థానాలకే కాంగ్రెస్ పోటీ?
4వ స్థానం టీఆర్ఎస్కు? రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవానికి నేతల వ్యూహం అన్ని పార్టీల నుంచి ఆరుగురే బరిలో ఉండేలా చర్యలు ఏడో అభ్యర్థి బరిలో ఉంటే పోలింగ్ తప్పదని, అప్పుడు పార్టీకి ఇబ్బందులని ఆందోళన సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కాంగ్రెస్ తరఫున నలుగురిని ఎంపిక చేసే అవకాశమున్నప్పటికీ, మూడు స్థానాలకే పరిమితమవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది. నాలుగో స్థానాన్ని టీఆర్ఎస్కు వదిలేయాలన్న ఆలోచనల్లో ఆ పార్టీ నేతలు ఉన్నారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్రకు చెందిన నేతలు అధిష్టానంపై వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యేలు ఓటు వేస్తారో లేదోనన్న ఆందోళన నేతల్లో నెలకొంది. దీంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యేలా వ్యూహ రచన చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలతోనూ వుంతనాలు జరుపుతున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో పాటు టీఆర్ఎస్, ఎంఐఎం తదితర పార్టీల నేతలతో చర్చిస్తున్నారు. ఏడో నామినేషన్ పడితే పోలింగ్ తప్పదని, అప్పుడు పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని సీనియర్ నేతలు అభిప్రాయుపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలకు పోటీ చేస్తే మిగిలిన ఒక స్థానంలో ఏ పార్టీ అభ్యర్థిని నిలపాలన్న విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి ఒకరిని పోటీకి దింపే అవకాశాలు కనిపిస్తుండటంతో 4వ స్థానాన్ని ఆ పార్టీకే వదిలేస్తే ఎలా ఉంటుందన్న అంశంపైనా చర్చిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వూజీ నేత కె.కేశవరావు పేరు వినిపిస్తుండటంతో ఆయునకు వుద్దతివ్వడానికి టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు వుుందుకొస్తున్నారు. దీంతో నాలుగో స్థానాన్ని టీఆర్ఎస్కు వదిలేస్తేనే మంచిదని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా కాంగ్రెస్ సీనియుర్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. నామినేషన్లపై సంతకాలు సేకరిస్తున్న సీఎల్పీ: వచ్చే నెల 7న జరిగే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు ఈ నెల 28తో ముగుస్తుంది. ఇప్పటివరకు పార్టీ అభ్యర్థుల ఎంపిక జరగలేదు. దీంతో కాంగ్రెస్ శాసన సభాపక్ష సిబ్బంది ముందస్తుగా నామినేషన్ల పత్రాలపై పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల సంతకాల సేకరణ ప్రారంభించారు. అభ్యర్థులకు మద్దతుగా ప్రతి నామినేషన్‌పై పది మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాలి. కాంగ్రెస్ తరఫున నాలుగో అభ్యర్థి గెలుపుపై అనుమానాలు ఉండటంతో ప్రస్తుతానికి మూడు స్థానాలకే నామినేషన్ పత్రాలను తయారు చేస్తున్నారు. అరుుతే మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, మరికొందరు నేతలు సంతకాలు చేసేందుకు నిరాకరించారని సవూచారం. హైకమాండ్ ఆదేశాల మేరకు అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు సీఎం కిరణ్‌కువూర్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలు ఈనెల 24న ఢిల్లీ వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. రాజుకు ఖాయమంటున్న డిప్యూటీ సీఎం పార్టీ అభ్యర్థులపై పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజుకు ఈసారి రాజ్యసభ పదవి దక్కవచ్చని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అంటున్నారు. రాహుల్‌కు సన్నిహితంగా ఉన్న రాజుకు ఇక్కడి నుంచే అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. -
రాజ్యసభ బరిలోకి ఇండిపెండెంట్లు?
రాజ్యసభ బరిలోకి ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు రంగప్రవేశం చేయబోతున్నారా? సమైక్యవాదులు అంతా కలిసి అధిష్ఠానం చెప్పిన అభ్యర్థులను కాకుండా, స్వతంత్ర అభ్యర్థులనే గెలిపించబోతున్నారా? ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అసెంబ్లీ లాబీల్లో బుధవారం నాడు ఆసక్తికరమైన చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ రాజ్యసభ ఎన్నికల గురించి చర్చించుకున్నారు. క్రితం సారిలా ఈ సారి కాంగ్రెస్‌కు నాలుగు రాజ్యసభ సీట్లు రావని, మహా అయితే రెండు సీట్లు మాత్రమే గెలవచ్చునని జేసీ అన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ హైకమాండ్ అభ్యర్థికి ఓటు వేసేందుకు సుముఖంగా లేరని కూడా ఆయన చెప్పారు. ఎంఐఎం తరఫున అభ్యర్థిని పోటీకి నిలపాలని అక్బర్‌కు జేసీ సూచించారు. అయితే, అందుకు అక్బర్ సమాధానమిస్తూ, మీరే నిలబడవచ్చు కదా అన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు బలపరుస్తామంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి రాజ్యసభకు పోటీ చేస్తానని జేసీ ఆయనతో చెప్పారు. ఈ దఫా సమైక్యవాదులెవరైనా స్వతంత్రులుగా పోటీచేస్తే రాజ్యసభ అభ్యర్థిగా గెలవడానికి అవకాశముందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తమ తరఫున ఇండిపెండెంట్లను బరిలోకి దింపే ప్రయత్నాలు సాగుతున్నాయని జేసీ వెల్లడించారు. -
రాష్ట్రం నుంచి రాజ్యసభకు షీలా దీక్షిత్!
కాంగ్రెస్ హైకమాండ్ యోచన మళ్లీ పెద్దల సభ వైపు టీఎస్ఆర్ అడుగులు కొప్పుల రాజు, ఎంఏ ఖాన్, కేవీపీలకు అవకాశం! సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆమెను రాష్ట్రం నుంచి పోటీ చేయించే అవకాశాలను అధిష్టానం పరిశీలించినట్టుగా ఇక్కడి కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందింది. అయితే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సమయంలో దీక్షిత్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తారని తాము భావించడం లేదని పీసీసీ వర్గాలు తెలిపాయి. పార్టీ సూచించే స్థానిక నేతలకే ఓట్లు పడతాయో లేదో తెలియుని పరిస్థితిలో ఇతర రాష్ట్రాల వారిని పంపిస్తే వారిని గెలిపించుకోవడం కత్తిమీద సామేనని కొందరు నేతలు వ్యాఖ్యానించారు. ఇలావుండగా విశాఖపట్నం లోక్‌సభ స్థానం కోసం ఇంతకాలం పట్టుబట్టిన టి.సుబ్బరామిరెడ్డి తాజాగా రాజ్యసభకు తన పేరును పరిశీలించాలని కోరుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయుం వల్ల విశాఖలో లోక్‌సభకు పోటీచేసినా గెలవడం సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే ఆయున మరోసారి రాజ్యసభ సీటు అడుగుతున్నట్లు పార్టీవర్గాలు పేర్కొంటున్నారుు. మొత్తం 6 స్థానాల్లో కాంగ్రెస్ మూడింటిని కచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉండగా, నాలుగో స్థానంపై సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్‌కు సాంకేతికంగా అసెంబ్లీలో 146 వుంది ఎమ్మెల్యేలున్నా వలసలతో ఆ సంఖ్య భారీగా కుదించుకుపోతోంది. కాంగ్రెస్ అభ్యర్థులుగా కొప్పుల రాజు, ఎంఏ ఖాన్ పేర్లు ప్రవుుఖంగా వినిపిస్తున్నారుు. వూజీ ఐఏఎస్ అధికారి అరుున రాజు కాంగ్రెస్‌లో చేరి ఆపార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ టీమ్‌లో వుుఖ్యభూమిక పోషిస్తుండడంతో ఆయునకు సీటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. పదవీ విరమణ చేస్తున్న కేవీపీ రావుచంద్రరావుకు కూడా రెండోసారి అవకాశం దక్కవచ్చని పార్టీలో వినిపిస్తోంది. ‘సీమాంధ్ర’ షాక్ తప్పదా!: రాజ్యసభ ఎన్నికల్లో అధిష్టానానికి షాకిచ్చే అంశంపై సీవూంధ్రకు చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సవూలోచనలు జరిపారు. విభజన అంశంలో తవుకు వీసమెత్తు విలువ కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా వుుందుకు వెళ్తున్న పార్టీ పెద్దలకు గుణపాఠం నేర్పాలంటే ఇదే సరైన సవుయువుని వారు భావిస్తున్నారు. సోవువారం అసెంబ్లీ లాబీల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల వుధ్య ఈ ప్రస్తావన వచ్చింది. అక్కడినుంచి అది ఇతర జిల్లాల ఎమ్మెల్యేలకూ పాకింది. ఈ అసెంబ్లీ సమయంలో జరిగే చిట్టచివరి రాజ్యసభ ఎన్నికలు ఇవే కావడం, త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఎమ్మెల్యేలు ఎవరూ అధిష్టానం వూట వినే పరిస్థితి ఉండదని రాయులసీవు వుంత్రి ఒకరు చెప్పారు.