హైదరాబాద్: స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతివ్వడం లేదని ఎమ్మెల్యేలు నీరజారెడ్డి, విజయ్, శేషు రిటర్నింగ్ అధికారికి లేఖలు ఇచ్చారు. మరో స్వతంత్ర అభ్యర్థి చైతన్యరాజకు మద్దతివ్వడం లేదని ఎమ్మెల్యేలు ముత్యాల పాప, మురళీకృష్ణ రిటర్నింగ్ అధికారికి లేఖలు ఇచ్చారు. ఆ ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరించుకుంటూ రిటర్నింగ్ అధికారికి లేఖలు ఇవ్వడంపై రాజ్యసభ స్వతంత్ర అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి నలుగురు రాజ్యసభ అభ్యర్థులను గెలిపించుకునే బలం ఉందని, అయినా కూడా ముగ్గురిని మాత్రమే బరిలో నిలబెట్టారని ఆరోపిస్తూ నెల్లూరు జిల్లాకు చెందిన నాయకుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.