
రాజ్యసభ ఎన్నికలపై కేకే మంత్రాంగం
రాజ్యసభ ఎన్నికలపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఆరు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో తమ అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు ఆయా పార్టీలు రంగంలోకి దిగాయి.
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఆరు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో తమ అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు ఆయా పార్టీలు రంగంలోకి దిగాయి. టీఆర్‌ఎస్ తరపున రాజ్యసభకు పోటీచేస్తున్న సీనియర్ నేత కే కేశవరావు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు సోమవారం అసెంబ్లీకి వచ్చారు.
కేకే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలసి ఎంఐఎం లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలోకి వెళ్లి మంతనాలు జరిపారు. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. టీఆర్‌ఎస్ఎల్పీకి మంత్రి పొన్నాల లక్ష్మయ్య వచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్.. ఎంఐఎంతో పాటు సీపీఐ, బీజేపీ మద్దతు కోరుతోంది. కేకే గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్ మూడు, టీడీపీ రెండు, టీఆర్‌ఎస్ ఒక స్థానం నుంచి పోటీ చేయనున్నాయి. కాగా కాంగ్రెస్ నుంచి రెబెల్ అభ్యర్థులు పోటీ చేయనుండటంతో రాజకీయాలు రసకందాయంగా మారాయి.