K.keshav Rao
-
’గవర్నర్‌గిరీ’ని ఎండగట్టండి
-
టీఆర్ఎస్పీపీకి కేసీఆర్ మార్గనిర్దేశనం
-
నేతల మద్దతు కూడగట్టే పనిలో కేసిఆర్
-
'గవర్నర్‌గిరీ'ని ఎండగట్టండి
టీఆర్ఎస్పీపీకి కేసీఆర్ మార్గనిర్దేశనం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌పై గవర్నర్‌కు విశేషాధికారాలను కట్టబెట్టాలనుకుంటున్న కేంద్ర వైఖరిని పార్లమెంట్లో ఎండగట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలను ఆదేశించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, లోక్‌సభలో టీఆర్ఎస్ పక్షనేత ఎ.పి.జితేందర్‌రెడ్డితో కేసీఆర్ సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌పై గవర్నర్‌కు విశేషాధికారాలను ఇవ్వడం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అవమానించడమేనని, దీనిపై జాతీయస్థాయిలో పోరాటం చేయాలని పార్లమెంటరీ పార్టీ నేతలకు సూచించారు. కేంద్రప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా పార్లమెంట్ ఉభయసభల్లోనూ సోమవారం వాయిదాతీర్మానం నోటీసులు ఇవ్వాలని ఎంపీలను ఆదేశించారు. వాయిదా తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, మమతాబెనర్జీకి ఫోన్లు చేసినట్టు కేసీఆర్ ఎంపీలకు చెప్పారు. తమిళనాడు, మహారాష్ర్ట సీఎంలు జయలలిత, పృథ్వీరాజ్ చౌహాన్‌తోనూ మాట్లాడనున్నట్టుగా తెలిపారు. వీరితో పాటు జాతీయవ్యాప్తంగా బీజేపీయేతర ముఖ్యమంత్రులను, పార్టీలను కూడగట్టే యత్నాలు చేయాలని సూచించారు. హైదరాబాద్‌పై గవర్నర్‌కు విశేషాధికారాలు అమల్లోకి వస్తే బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ కేంద్రం అమల్లో పెట్టేందుకు వెనుకాడదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తమ పోరాటానికి అన్ని పార్టీలూ కలసి వస్తాయని ఆయన ఆకాంక్షించారు. పార్లమెంటులో వాయిదా తీర్మానం సమయంలోనే అన్ని పార్టీలు కలిసి వచ్చేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. పార్లమెంటులో చర్చకు పెట్టేదాకా సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని, అనుసరించాల్సిన విషయాలపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఎంపీలను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌తో సమావేశమైన అనంతరం లోక్‌సభలో టీఆర్ఎస్ నేత ఎ.పి.జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దీనిపై ఇప్పటికే బీజేపీయేతర ముఖ్యమంత్రులు కొందరితో మాట్లాడామని, మిగిలిన వారితోనూ మాట్లాడి కేంద్రప్రభుత్వ తీరును పార్లమెంట్లో ఎండగడతామని తెలిపారు. -
ఆ అయిదుగురు ఎమ్మెల్సీలపై వేటు వేయండి
హైదరాబాద్ : టీఆర్ఎస్లో చేరిన అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని శాసనమండలిలో విపక్ష నేత డీ శ్రీనివాస్ శనివారం శాసనసభ కార్యదర్శి సదారాంకి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఆమోస్, జగదీశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్, రాజలింగం, భూపాల్‌రెడ్డితోపాటు మరికొందరు, వీరితోపాటు బీఎస్పీకి చెందిన ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన అయిదుగురు ఎమ్మెల్సీలపై ఫిర్యాదు చేశామన్నారు. ఫిరాయింపును రుజువు చేసే సాక్ష్యాలను ఫిర్యాదు లేఖలో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. వాటిని ఛైర్మన్ పరిశీలించి తక్షణమే ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేస్తారని ఆశిస్తున్నట్లు డీఎస్ తెలిపారు. చైర్మన్ స్పందించకుంటే న్యాయ పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
కారు ఎక్కనున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, కేకే తో భేటి!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు చేరేందుకు రంగం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ కు చెందిన 9 మంది ఎమ్మెల్సీలు, బీఎస్పీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు చేరనున్నట్టు సమాచారం. తెలంగాణ శాసన మండలిలో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఆమోస్, జగదీశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్, రాజలింగం, భూపాల్‌రెడ్డితోపాటు మరికొందరు, వీరితోపాటు బీఎస్పీకి చెందిన ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అలాగే టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు, పీఆర్టీయూకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా అదే దారిలో ఉన్నట్టు తెలుస్తోంది. Follow @sakshinews -
రాష్ట్రం, కేంద్రంలోనూ టీఆర్ఎస్ కీలకపాత్ర: కేకే
హైదరాబాద్: రాష్ట్రంలో, కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కీలక పాత్ర పోషిస్తుందని టీఆర్ఎస్ నేత కే కేశవరావు అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటికే కేంద్రంలో కొన్ని పార్టీలతో చర్చలు ప్రారంభించామని కేకే తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరిస్తుందని, పూర్తి మెజార్టీతోనే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే విశ్వాసాన్ని కేకే వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో ఎన్నడూలేని విధంగా పోలింగ్ శాతం పెరగడం టీఆర్ఎస్కే అనుకూలమని కేకే అన్నారు. సరాసరి పోలింగ్ 72 శాతం నమోదైందని ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా నివేదిక ప్రకారం తుది పోలింగ్ శాతం 77 నుంచి 80 శాతం దాకా నమోదయ్యేవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. -
రాజ్యసభ ఎన్నికలపై కేకే మంత్రాంగం
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఆరు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో తమ అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు ఆయా పార్టీలు రంగంలోకి దిగాయి. టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు పోటీచేస్తున్న సీనియర్ నేత కే కేశవరావు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు సోమవారం అసెంబ్లీకి వచ్చారు. కేకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలసి ఎంఐఎం లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలోకి వెళ్లి మంతనాలు జరిపారు. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. టీఆర్ఎస్ఎల్పీకి మంత్రి పొన్నాల లక్ష్మయ్య వచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్.. ఎంఐఎంతో పాటు సీపీఐ, బీజేపీ మద్దతు కోరుతోంది. కేకే గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్ మూడు, టీడీపీ రెండు, టీఆర్ఎస్ ఒక స్థానం నుంచి పోటీ చేయనున్నాయి. కాగా కాంగ్రెస్ నుంచి రెబెల్ అభ్యర్థులు పోటీ చేయనుండటంతో రాజకీయాలు రసకందాయంగా మారాయి.