కారు ఎక్కనున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, కేకే తో భేటి!
కారు ఎక్కనున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, కేకే తో భేటి!
Published Wed, Jun 25 2014 12:41 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు చేరేందుకు రంగం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ కు చెందిన 9 మంది ఎమ్మెల్సీలు, బీఎస్పీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు చేరనున్నట్టు సమాచారం.
తెలంగాణ శాసన మండలిలో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఆమోస్, జగదీశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్, రాజలింగం, భూపాల్‌రెడ్డితోపాటు మరికొందరు, వీరితోపాటు బీఎస్పీకి చెందిన ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అలాగే టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు, పీఆర్‌టీయూకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా అదే దారిలో ఉన్నట్టు తెలుస్తోంది.
Follow @sakshinewsAdvertisement
Advertisement