
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూమిని ఇస్తా మని చెప్పి ఆయా వర్గాల ఓట్లు వేయించుకుని రెండుసార్లు సీఎం అయిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చడం హాస్యాస్పదమని మాజీ ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలోని 15వ పేజీ లోని 5వ అంశంగా దళితులకు మూడెకరాల భూమి ఉందని వెల్లడించారు.
మేనిఫెస్టో తనకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్న కేసీఆర్ పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఓ ప్రకటనలో తెలి పారు. దళితబంధు, నిరుద్యోగభృతి, డబుల్‌బెడ్‌రూం ఇళ్లపై కేసీఆర్ ఏదో ఒకరోజు అదేమాట అంటారని ఎద్దేవా చేశా రు. దళితులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి వారికి మేలు చేసింది కాంగ్రెస్‌నేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment