బెదిరింపులకు లొంగేది లేదు | will not step back at any cost, say rebels | Sakshi
Sakshi News home page

బెదిరింపులకు లొంగేది లేదు

Published Wed, Jan 29 2014 11:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

బెదిరింపులకు లొంగేది లేదు

బెదిరింపులకు లొంగేది లేదు

రాజ్యసభకు పోటీలో ఉన్నరెబల్‌ అభ్యర్ధులను కట్టడి చేసేందుకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, తాము మాత్రం బెదిరింపులకు లొంగేది లేదని రెబల్స్ అంటున్నారు. చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డిలకు మద్దతుగా వారి నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేసిన ఎమ్మెల్యేలతో బొత్స ఇప్పటికే మాట్లాడుతున్నారు. ఆ సంతకాలు వెనక్కి తీసుకోవాలని వారిని బొత్స కోరారు. ఆ ఎమ్మెల్యేల నుంచి లేఖలు తీసుకుని, వాటిని రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు పంపి, చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డిల నామినేషన్లు చెల్లకుండా చేసేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

అయితే, తాము మాత్రం బెదిరింపులు.. ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగేది లేదని చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తామిద్దరిలో ఎవరో ఒకరం తప్పనిసరిగా పోటీలో ఉండి తీరుతామని వారు తెలిపారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని తామిద్దరిపై రోజురోజుకూ ఒత్తిడి బాగా పెరుగుతోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement