Chaitanya Raju
-
అటు ఎండ భగభగ ఇటు ఎన్నిక సెగ
వేసవి తీవ్రత పెరుగుతుండగా మరోపక్క రాజకీయంగా శాసనమండలి ఎన్నికలు జిల్లాలో ఈ వారం కాక పుట్టించాయి. ఒకపక్క ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక, మరోపక్క ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జిల్లాలో చర్చనీయాంశాలుగా మారాయి. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులే ఓటర్లు. అయినా రాజకీయ ప్రమేయం లేకుండా ఈ ఎన్నికలు జరగకపోవడం విశేషం. ఇదివరకు ఎన్నడూ లేనంత ప్రాధాన్యం ఈ ఎన్నికలకు ఏర్పడింది. తొలిసారి తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ చైతన్యరాజును ప్రకటించింది. టీడీపీలో కీలక నేత, లోక్‌సభ దివంగత స్పీకర్ బాలయోగి హయాం నుంచి చైతన్యరాజుకు టీడీపీతో ప్రత్యక్ష అనుబంధం ఉంది. అదే ఈ ఎన్నికల్లో తనకు సానుకూలమవుతుందని ఆయన ధీమాగా చెబుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండటంతో సమస్యలు పరిష్కరించగలరనే నమ్మకాన్ని ఉపాధ్యాయుల్లో కలిగించగలిగామనే అంచనాల్లో ఉన్నారు. ఒకపక్క చైతన్యరాజు మరోవైపనాయనకు మద్ధతుగా తనయులు ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ, శశివర్మ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలను జిల్లాలో మకాం పెట్టించి మరీ ప్రచారాన్ని హోరెత్తించారు. మరోపక్క ప్రగతి విద్యాసంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు మొదట్లో టీడీపీ మద్ధతు లభిస్తుందని నిరీక్షించారు. ఆ ఆశ నెరవేరదని తేలిపోయాక స్వతంత్ర పోరుకు సై అన్నారు. టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగిన ఆయన.. విద్యాపరంగా తనకున్న పరిచయాలు, ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై ఇచ్చిన హామీలు సానుకూలమవుతాయని అంచనా వేస్తున్నారు. స్నేహితులు, సన్నిహితులు, ఉపాధ్యాయులు వెంట రాగా ఆయన రెండు జిల్లాల్లో ప్రచారం చేశారు. ప్రచారంలో తాను చేయదలుచుకున్న కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.అలాగే ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ బలపరిచిన రాము సూర్యారావు హడావిడి, ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ప్రచారాన్ని ముగించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయనకు అక్కడ విద్యాదాతగా ఉన్న మంచి పేరు ఆ జిల్లాలో కలిసివస్తుందని లెక్కలేసుకున్నారు. మన జిల్లాకు వచ్చేసరికి ఉపాధ్యాయ సంఘ బలంపైనే నమ్మకం పెట్టుకుని బరిలో గెలుపోటములను తేల్చుకోవాలని అనుకుంటున్నారు. తాయిలాలపై వివాదం ఒక అభ్యర్థి సుమారు రూ.15వేల విలువైన ఆరు వెండి గ్లాసుల గిఫ్ట్ ప్యాక్‌లను ఉపాధ్యాయులకు తన అనుచరుల ద్వారా అయితే ఆ గ్లాసులు నాణ్యత లేనివంటూ పోటీలో ప్రత్యర్థి ప్రచారం చేశారు. అయితే ఆ గ్లాసుల నాణ్యతపై నిగ్గు తేల్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆ అభ్యర్థి అనుచరుల ద్వారా సవాల్ కూడా విసరడం గమనార్హం. దీనినిబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ స్థాయికి వెళ్లాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో మొదటి ప్రాధాన్య ఓటుతోనే ఫలితం తేలిపోతుందా లేక రెండో ప్రాధాన్య ఓటు తప్పదా అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎమ్మెల్యేల కోటాలో జిల్లాకు ప్రాధాన్యం ఇదిలా ఉండగా, మరోపక్క ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు లాంఛనంగానే జరిగినా ఆసక్తిని రేకెత్తించాయి. విభజన అనంతరం ఏర్పడ్డ రాష్ట్రంలో వచ్చిన ఐదు ఎమ్మెల్సీల్లో జిల్లాకు రెండు ఎమ్మెల్సీలు దక్కాయి. ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, మరొకటి టీడీపీకి దక్కాయి. మొత్తం ఐదు స్థానాల్లో పాలక పక్షం, ప్రతిపక్షం జిల్లాకే ప్రాధాన్యం ఇవ్వడం కాకతాళీయంగా జరిగినా.. జిల్లా ప్రాధాన్యాన్ని చాటిచెప్పాయి. ఎటువంటి మాట ఇవ్వకుండానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ సీనియర్ అయిన మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను ఎమ్మెల్సీని చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన విశ్వసనీయత, విధేయతకు గుర్తింపుగా ఈ పదవి వరించింది. టీడీపీ నుంచి వీవీవీ చౌదరి(కూర్మాపురం అబ్బు)కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యానికి నిరాశను మిగిల్చారు. తద్వారా గతంలో ఆయనకు ఇచ్చిన మాట తప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో బీసీ ఓట్లు వేయించుకుని బీసీలకు మొండిచేయి చూపిన బాబుపై ఆ పార్టీలో బీసీలు భగ్గుమంటున్నారు. అంగన్వాడీలపై ఉక్కుపాదం వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళన చేసిన అంగన్వాడీ కార్యకర్తలపై సర్కార్ ఉక్కుపాదం మోపింది. జిల్లాలో ఎక్కడికక్కడ చివరకు ఇళ్ల నుంచి కూడా బయటకు రాకుండా హౌస్ అరెస్టులు చేయించింది. అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన సీపీఎం, సీఐటీయూ నేతలను కూడా అన్యాయంగా అరెస్టులు చేసి నిర్బంధించిన చంద్రబాబు సర్కార్ పాత వాసనలు వీడలేదనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. -
‘దేశం’ నేతలకు కొత్త తలనొప్పి
శాసన మండలి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఎన్నిక.. తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చి పెడుతోంది. ఇద్దరు కార్పొరేట్ విద్యారంగ ప్రముఖులు ఈ ఎన్నికల బరిలో దిగేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నారు. ఇద్దరూ టీడీపీ మద్దతు తమకంటే తమకేనంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఇద్దరూ తెలుగుదేశంలోనే ఉండడంతో ఏం జరుగుతుందోనని ఆ పార్టీ నేతలు కలవరపడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి మద్దతివ్వాలన్న అంశం ప్రస్తుతం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ :ప్రస్తుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, శాసన మండలిలో టీడీపీ విప్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. అంతటితో ఆగని ఆయన మరో అడుగు ముందుకేసి గత ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన ఉపాధ్యాయ వర్గాలను సమీకరించుకునే వ్యూహాల్లో బిజీ అయ్యారు. తాను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు, తన కుమారుడు రవికిరణ్‌వర్మ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బరిలోకి దిగినప్పుడు తమ విజయం వెనుక క్రియాశీలక పాత్ర పోషించిన వర్గాలను కూడగట్టే పనిలో చైతన్యరాజు ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అవార్డులు లభించిన ఉపాధ్యాయులకు అమలాపురం కిమ్స్, కాకినాడ ప్రతాప్ నగర్‌లోని చైతన్య కాలేజీ, రాజానగరం గైట్ కళాశాలల్లో పెద్ద ఎత్తున సత్కారాలు కూడా నిర్వహించారు. గతంలో రాజ్యసభ సభ్యత్వంపై మాట ఇచ్చిన టీడీపీ అధినాయకత్వం ఆనక వెనకడుగు వేసిందని, అయినప్పటికీ తాను మద్దతు ఇచ్చానని, అందువల్ల ఎమ్మెల్సీ బరిలో ఆ పార్టీ మద్దతు తనకే లభిస్తుందని చైతన్యరాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శాసన మండలిలో పార్టీ విప్ కూడా కావడంతో చైతన్యరాజుకు మద్దతు విషయంలో టీడీపీ అధినేతకు మరో ఆలోచన లేదని ఆయన వర్గీయులు బాహాటంగానే చెబుతున్నారు. గత ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చిన వివిధ వర్గాలు తన అభ్యర్థిత్వంపై సానుకూలంగా ఉన్నాయని, పార్టీ అధికారంలో ఉండటంతో ఉపాధ్యాయ డిమాండ్లను నెరవేర్చే పరిస్థితి ఉంటుందని, అందువల్ల తనకే ఎక్కువ అవకాశాలున్నాయని చైతన్యరాజు చెబుతున్నారు. చైతన్యరాజుతో పాటు ప్రగతి విద్యాసంస్థల అధిపతి పరుచూరి కృష్ణారావు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సై అంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో పెద్దాపురం సీటు కోసం ఆయన గట్టి ప్రయత్నమే చేశారు. సీటు ఖాయమన్న భరోసాతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, భారీ బ్యానర్లతో ప్రచారం కూడా చేసుకున్నారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో చివరి నిమిషంలో పెద్దాపురం టిక్కెట్టు నిమ్మకాయల చినరాజప్పకు దక్కడం, ఆనక ఆయన డిప్యూటీ సీఎం, హోం మంత్రి కావడం తెలిసిందే. ఆ సమయంలో కొందరు ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చినా కృష్ణారావు పార్టీకి విధేయుడిగానే ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా ఉందని సహచరులు చెబుతున్నారు. పార్టీ మద్దతు తనకు లభిస్తుందన్న నమ్మకంతోనే ఎన్నికల బరిలోకి దిగాలని ఆయన నిర్ణయం తీసుకున్నారంటున్నారు. సొంత సామాజికవర్గ నేతల మద్దతుతో చంద్రబాబును ఏదో విధంగా ఒప్పిస్తామని కృష్ణారావు సహచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాత్రం చైతన్యరాజు వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. లోక్‌సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి హయాంలో చైతన్యరాజు టీడీపీలో తెరవెనుక క్రియాశీలకంగా ఉన్నారు. ఆ సమయంలో యనమల, రాజప్పతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు కలసివస్తుందని అంటున్నారు. కృష్ణారావుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సి వస్తే పెద్దాపురంలో కొరివితో తలగోక్కోవడమే అవుతుందని రాజప్ప వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. మొత్తమ్మీద ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చైతన్యరాజు, కృష్ణారావు చేస్తున్న ప్రయత్నాలు టీడీపీలో గుబులు రేపుతున్నాయి. -
ఏపీ మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈరోజు సాయంత్రం అయిదు గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. అధికార పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ చైతన్య రాజు నామినేషన్ వేయనున్నారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా పోటీకి సిద్ధం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మధ్యాహ్నానికి తన అభ్యర్థిని ఖరారు చేయనుంది. అభ్యర్థుల రేసులో రుద్రరాజు పద్మరాజు, చెంగల్రాయుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. కౌన్సిల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీల సంఖ్య 41 ఉంది. పోటీ అనివార్యమైతే గురువారం ఎన్నిక జరగనుంది. -
చైతన్య రాజును బాగా బెదిరించారు: జేసీ
కాంగ్రెస్ పెద్దల బెదిరింపుల వల్లే రాజ్యసభ ఎన్నికల బరిలో రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన చైతన్య రాజు పోటీ నుంచి తప్పుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్య్ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి సమైక్యవాదం వినిపించడానికే రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేస్తున్నారని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఫిబ్రవరి 7న జరిగే రాజ్యసభ ఎన్నికల ఫలితాలతో ఢిల్లీ పెద్దల కళ్లు తెరిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిందని, నాలుగో అభ్యర్థిని కూడా ప్రకటించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. నాలుగో అభ్యర్థి కూడా తప్పక విజయం సాధించేవారని అన్నారు. నాలుగో అభ్యర్థిని ప్రకటించకుండా కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పు చేసిందని వ్యాఖ్యానించారు. అలాగే రాజ్యసభ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు టిక్కెటు ఇస్తే బాగుండేదని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. -
బెదిరింపుల వల్లే 'చైతన్య' తప్పుకున్నాడు: జేసీ
-
బరిలో ఆదాల, రాజ్యసభ ఎన్నిక అనివార్యం
-
ఒత్తిళ్లకు తల్లొగిన చైతన్యరాజు, ఆదాల నో
-
రాజ్యసభ బరిలోనే ఆదాల.. ఉపసంహరణకు నో
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల విషయంలో హైడ్రామా నడుస్తోంది. రెబెల్ అభ్యర్థులుగా బరిలో నిలబడిన చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు తొలుత కథనాలు వచ్చాయి. అయితే, వీరిలో చైతన్య రాజు స్వయంగా రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లి ఉపసహరణ పత్రాలపై సంతకాలు చేయగా.. ఆదాల ఉపసంహరణ పత్రాలను మాత్రం ఎమ్మెల్యే వెంకటరామయ్య వెళ్లి అందజేశారు. దీంతో ఇద్దరూ బరినుంచి తప్పుకొన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కొద్దిసేపటికే ఆదాల ప్రభాకర్ రెడ్డి నేరుగా రిటర్నింగ్ అధికారి రాజా సదారాంకు ఫోన్ చేసి, తాను పోటీ నుంచి తప్పుకోవట్లేదని, తానింకా రంగంలోనే ఉన్నానని స్పష్టం చేశారు. వెంకటరామయ్య ఇచ్చిన లేఖతో తనకు సంబంధం లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ తనకు ఫోన్ చేసి ఉపసంహరించుకోవాల్సిందిగా చెప్పినా.. తాను పరిశీలిస్తానని చెప్పానే తప్ప సరేననలేదని అన్నారు. దీంతో ఎమ్మెల్యే వెంకటరామయ్య ఇచ్చిన ఉపసంహరణ లేఖను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. సమైక్యం కోసమే తాము నిలబడ్డామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని చెప్పిన చైతన్య రాజు... కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి, ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఒత్తిడితో ఆయన బరి నుంచి వైదొలగారు. మరో అభ్యర్థి, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి మాత్రం ఎవరి మాటా వినకుండా రాజ్యసభ ఎన్నికల బరిలో యథాతథంగా నిలిచారు. దీంతో ఎన్నిక అనివార్యం అయ్యింది. అంతకుముందు రాజ్యసభకు పోటీచేసిన ఆరుగురు అభ్యర్థులూ ఏకగ్రీవం అయినట్లు కూడా వార్తలు వచ్చినా, ఆదాల బరిలోనే ఉండటంతో ఎన్నిక తప్పట్లేదు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజా సదారాం వద్దకు నామినేషన్ ఉపసంహరణకు చైతన్యరాజుతో పాటు ఏరాసు ప్రతాప్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్ వచ్చారు. అధిష్టానం నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో సీఎం సూచనల మేరకే చైతన్య రాజు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు సమాచారం. -
తప్పుకోకుంటే ఐటీ దాడులే !
* రాజ్యసభ రెబల్స్‌పై కాంగ్రెస్ కూటనీతి * అధిష్టానం ఆదేశంతో రంగంలోకి రాష్ట్ర పెద్దలు * ఆదాల, చైతన్య రాజులపై ఒత్తిళ్లు, బెదిరింపులు * అన్నివిధాలా తిప్పలు తప్పవంటూ హెచ్చరికలు * మీ సంగతి చూస్తామన్న మంత్రి కొండ్రు మురళి * ఏమనుకుంటున్నారంటూ దానం వార్నింగులు * మద్దతిచ్చిన ఎమ్మెల్యేలతో ఉపసంహరణ లేఖలు * అవి చెల్లబోవన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి * ఆదాల, రాజు నామినేషన్లు సక్రమమేనని ప్రకటన సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన తిరుగుబాటు అభ్యర్థులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, చైతన్య రాజులను రంగం నుంచి తప్పించడానికి కాంగ్రెస్ పార్టీ బుధవారం ‘అన్ని రకాలుగా’ ప్రయత్నించింది. వారి నామినేషన్లపై సంతకాలు చేసిన పార్టీ ఎమ్మెల్యేలను నయానాభయానా ‘దారి’కి తెచ్చుకుని, వారితో మద్దతు ఉపసంహరణ లేఖలిప్పించడమే గాక హైడ్రామాకు తెర తీసింది. చివరికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కల్పించుకుని అలా ఉపసంహరించుకోవడం చెల్లదని.. ఆదాల, రాజు నామినేషన్లు సక్రమమేనని తేల్చారు. దాంతో అధిష్టానం పెద్దల్లో గుబులు మొదలైంది. రెబల్స్ కారణంగా ఎన్నికలు అనివార్యమయ్యేలా ఉన్నాయంటూ రాష్ట్రంలో మకాం వేసిన ఏఐసీసీ పరిశీలకులు తిరునావుక్కరసు, ఆర్సీ కుంతియా సమాచారం పంపడంతో అధిష్టానం అవాక్కైంది. దాంతో దండోపాయానికి దిగి, ‘నామినేషన్లను ఉపసంహరించుకోకుంటే రాజకీయ భవిష్యత్తుండదు. ఐటీ దాడులు కూడా జరుగుతాయి’ అంటూ ఆదాల, రాజులకు హెచ్చరికలు పంపుతున్నట్టు సమాచారం. సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ బుధవారం ఉదయమే సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు ఫోన్ చేశారు. ‘‘ఎలాగైనా రెబల్స్‌ను తప్పించి, ఎన్నికలను ఏక గ్రీవం చేయండి’’ అని ఆదేశించారు. దాంతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులు కూడా, ‘తప్పుకుంటారా, లేదా?’ అంటూ రెబల్స్‌ను హెచ్చరించడంతో పాటు వారిపై తీవ్రస్థాయిలో బెదిరింపులకు కూడా దిగారు! - ఆదాల, రాజులకు బొత్స ఫోన్ చేసి, ‘అధిష్టానం సీరియస్‌గా ఉంది. తప్పుకుంటే మంచిది. పార్టీలో భవిష్యత్తుంటుంది. లేదంటే రాజకీయంగా, ఆర్థికంగా ఇబ్బందులు తప్పవ్’ అని హెచ్చరించారు. - అసెంబ్లీ లాబీలోని మంత్రి గంటా చాంబర్లో ఆదాల, రాజులతో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, ఎంఏ ఖాన్ సమావేశమై, తప్పుకోవాల్సిందిగా వారిని కోరారు. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమేనంటూ ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. - బొత్స రెబల్స్‌ను మంత్రి ఆనం చాంబర్లోకి తీసుకెళ్లారు. ఎంత బుజ్జగించినా వినకపోవడంతో రెబల్స్‌పై మండిపడ్డట్టు తెలిసింది. మంత్రి కొండ్రు మురళి అయితే, ‘‘కాంగ్రెసంటే ఏమనుకుంటున్నారు? తప్పుకుంటే మంచిది. లేదంటే ఏం చేయాలో తెలుసు. మీ సంగతి చూస్తాం’’ అని హెచ్చరించారు. మరో మంత్రి దానం నాగేందర్ కూడా, ‘డబ్బుంది కదాని ఏది పడితే అది చేస్తామంటే కుదరదు. ఇదేమీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినట్టు కాదు. రిలయన్స్ వద్ద బోలెడు డబ్బుంది కదా అని ముకేశ్ అంబానీ పోటీకి దిగుతాడా? దిగితే ఏమవుతుందో, కాంగ్రెస్ ఏం చేస్తుందో ఆయనకు తెలుసు’’ అని బెదిరించారు. ‘రాజు పోటీ చేసినా బాధలేదు. ఏం చేయాలో మాకు తెలుసు’ అని మీడియాతో అన్నారు. ఢిల్లీ రాజ్యాంగేతర శక్తి భయపెడుతోంది: జేసీ ‘‘ఆదాల, రాజులను తప్పించేందుకు పైనుంచి కుట్ర జరుగుతోంది. ఢిల్లీలోని ఓ రాజ్యాంగేతర శక్తి (అహ్మద్‌పటేల్‌ను ఉద్దేశించి) ఎన్నికల సంఘంపై కూడా ఒత్తిడి తెచ్చింది. అది సాధ్యం కాకపోవడంతో అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఐదేళ్లుగా ఏనాడూ పట్టించుకోని ఎమ్మెల్యేలను ఇప్పుడు బుజ్జగిస్తున్నారు’’ - ఆదాల, చైతన్యరాజులకు మద్దతుగా సంతకం చేసిన ఎమ్మెల్యేలందరిని బుధవారం ఉదయం అసెంబ్లీ మొదలవకముందే బొత్స పిలిపించుకున్నారు. ఒత్తిడి తెచ్చి, ‘పార్టీపరంగా సాయం చేస్తా’మంటూ ప్రలోభపెట్టి, మాట వినకుంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించినట్టు సమాచారం. - సిహెచ్.వెంకట్రామయ్య, శ్రీధర్ కృష్ణారెడ్డి మినహా 8 మంది ఎమ్మెల్యేలు రిటర్నింగ్ అధికారి రాజా సదారాంను కలిసి మద్దతు ఉపసంహరణ లేఖలిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులమని చెప్పినందుకే వారికి సంతకాలు చేశామని, స్వతంత్రులని తేలినందున ఉపసంహరించుకుంటున్నామని, వారి నామినేషన్లను తిరస్కరించాలని పేర్కొన్నారు. - బొత్స, కొండ్రు కూడా సదారాంను కలిసి, తమ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారంటూ కాంగ్రెస్ తరపున లేఖ ఇచ్చారు. వారి సంతకాలను ఫోర్జరీ చేశారనే అనుమానం వ్యక్తం చేశారు. - ఎమ్మెల్యేల మనసు మారవచ్చేమోనని, నామినేషన్ల పరిశీలన పూర్తయేదాకా వారిని ఆనం చాంబర్‌కే పరిమితం చేశారు - ఎమ్మెల్యేల లేఖలపై గంటలో వివరణ ఇవ్వాలని స్వత్రంత అభ్యర్థులను సదారాం కోరారు. ఎమ్మెల్యేలను హాజరు పరచాలన్నారంటూ ప్రచారమూ జరిగింది. ఆయన తీరుపై ఆదాల, రాజు అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను హాజరు పరచాలనే హక్కు మీకెక్కడిదంటూ జేసీ నిలదీయడంతో తానలా అన్లేదని సదారాం వివరణ ఇచ్చారు. - అభ్యర్థులిద్దరూ హైకోర్టు సీనియర్ న్యాయవాదులు, ఎన్నికల న్యాయ నిపుణులతో ఫోన్లో మంతనాలు జరిపి, వారి సూచన మేరకు లేఖ రూపొందించి సదారాంకు అందజేశారు. - వివాదం నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ అసెంబ్లీకి వచ్చారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 37వ సెక్షన్ ప్రకారం ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణ చెల్లదని తేల్చారు. ఆదాల, చైతన్యరాజు నామినేషన్లు సక్రమమేనని ప్రకటించారు. కేసులు బనాయిస్తారట: ఆదాల ‘‘తప్పుకోవాలంటూ మాపై ఒత్తిడి తేవడమే గాక ఐటీ దాడులు చేయిస్తామని, కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నారు. నా వ్యాపారాలన్నీ సక్రమంగానే ఉన్నాయి. ఏటా సక్రమంగా ఐటీ చెల్లిస్తున్నాం. ఏం చేస్తారో చేసుకోండని చెప్పాం. మేమైతే బరిలో ఉంటాం. సమైక్య ఓట్లు చీలకుండా ఉండేందుకు, తద్వారా గెలిచేందుకు అవసరమైతే మాలో ఒక్కరైనా నిలబడి తీరుతాం’’ నిలుస్తా.. గెలుస్తా: చైతన్యరాజు ‘‘ఒత్తిళ్లు వస్తున్నా తగ్గేది లేదు. 54 ఎమ్మెల్యేల మద్దతుతో గెలుస్తాననే నమ్మకముంది. నిన్న రాత్రి సుబ్బరామిరెడ్డి ఫోన్ చేసి తప్పుకోవాలని కోరారు. ఆదాల ఇప్పటికే తప్పుకున్నారని చెప్పారు. నేను ఆదాలకు నేను ఫోన్ చేస్తే అలాంటిదేమీ లేదన్నారు. పైగా నేను తప్పుకున్నానని చెబుతూ సుబ్బరామిరెడ్డే తనకు ఫోన్ చేశారని, తప్పుకోవాలని కోరారని చెప్పారు. తప్పుకునే ప్రసక్తే లేదని మేమిద్దరం ఆయనకు తేల్చిచెప్పాం’’ -
ఆదాల, చైతన్యరాజు నామినేషన్లు ఆమోదం
-
నిద్ర లేకుండా హింసించారు...న్యాయమే గెలిచింది
హైదరాబాద్ : రాజ్యసభ రెబల్ అభ్యర్థులు చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి నామినేషన్లపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. వారిద్దరి నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని ఎన్నికల కమిషన్ తేల్చింది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్లపై అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ బరిలో ఉన్న కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని దుర్మార్గాలు చేసినా చివరికి న్యాయం గెలిచిందన్నారు. తమ నామినేషన్లను తిరస్కరించేందుకు కాంగ్రెస్ పెద్దలు శతవిధాలా యత్నించారని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. తనను, చైతన్య రాజును గత రెండు రోజుల నుంచి నిద్ర లేకుండా హింసించారని ఆదాల అన్నారు. తమకు మద్దతు ఇచ్చి నామినేషన్లపై సంతకాలు చేసిన ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురి చేశారని ఆయన తెలిపారు. వివరణ లేఖలు ఇవ్వాలంటూ తమను వేధించారన్నారు. రిటర్నింగ్ అధికారిపై కూడా తీవ్ర ఒత్తిడి ఒత్తిడి తెచ్చారని ఆదాల అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ఎన్నికల అధికారిని స్క్రూటినీ ప్రక్రియకు రప్పించారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల చట్టం నిబంధన 33 ప్రకారం ప్రతిపాదకుల ఉపసంహరణ అంశమే లేదని అన్నారు. అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు ఉపసంహరించుకోవాలనే నిబంధనను అధికారులు చెప్పటంతో తమ నామినేషన్లు ఆమోదం పొందాయన్నారు. -
ఎమ్మెల్యేలను తీసుకురావాలని రెబల్స్‌కు ట్విస్ట్
-
ఎమ్మెల్యేలను తీసుకురావాలని రెబల్స్‌కు ట్విస్ట్
హైదరాబాద్ : రాజ్యసభ నామినేషన్ల వ్యవహారంలో ఉత్కంఠ కొనసాగుతోంది. రెబల్ అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ట్విస్ట్ ఇచ్చారు. సభ్యుల నుంచి లిఖితపూర్వక లేఖలు తీసుకు రావాలని రిటర్నింగ్ అధికారి వారికి గంట సమయం ఇచ్చారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. అయితే వారికి మద్దతు ప్రకటించిన సభ్యుల్లో కొంతమంది మద్దతు ఉపసంహరించుకున్నారు. చైతన్య రాజుకు ఎనిమిది మంది, ఆదాలకు ఎనిమిది మంది మద్దతు ఉపసంహరించుకున్నారు. ఇక మిగిలినవారిలో కొందరు బయటకు వెళ్లటం, మరికొందరు సెల్ఫోన్లు స్విచాఫ్ చేసినట్లు సమాచారం. దాంతో ఎమ్మెల్యేలు అందుబాటులోకి రాకపోవటంతో ఆదాల, చైతన్య రాజు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు చైతన్య రాజుపై క్రిమనల్ కేసు ఉన్నందున ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని కాంగ్రెస్... రిటర్నింగ్ అధికారిని కోరింది. అలాగే ఆరుగురి నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని రిట్నరింగ్ అధికారి తెలిపారు. కాంగ్రెస్ నుంచి కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్, టి సుబ్బరామిరెడ్డి, టీఆర్ఎస్ నుంచి కేశవరావు, టీడీపీ నుంచి సీతా మహాలక్ష్మి, గరికపాటి మోహనరావు నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ప్రకటించారు. -
బెదిరింపులకు లొంగేది లేదు
రాజ్యసభకు పోటీలో ఉన్నరెబల్ అభ్యర్ధులను కట్టడి చేసేందుకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, తాము మాత్రం బెదిరింపులకు లొంగేది లేదని రెబల్స్ అంటున్నారు. చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డిలకు మద్దతుగా వారి నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేసిన ఎమ్మెల్యేలతో బొత్స ఇప్పటికే మాట్లాడుతున్నారు. ఆ సంతకాలు వెనక్కి తీసుకోవాలని వారిని బొత్స కోరారు. ఆ ఎమ్మెల్యేల నుంచి లేఖలు తీసుకుని, వాటిని రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు పంపి, చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డిల నామినేషన్లు చెల్లకుండా చేసేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అయితే, తాము మాత్రం బెదిరింపులు.. ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగేది లేదని చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తామిద్దరిలో ఎవరో ఒకరం తప్పనిసరిగా పోటీలో ఉండి తీరుతామని వారు తెలిపారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని తామిద్దరిపై రోజురోజుకూ ఒత్తిడి బాగా పెరుగుతోందని చెప్పారు. -
'ఆరు నూరైనా పోటీ నుంచి తప్పుకునేది లేదు'
హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల బరిలో నుంచి వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్సీ చైతన్య రాజు స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన అన్నారు. కాగా పోటీ నుంచి తప్పుకోవాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గతరాత్రి చైతన్య రాజుకు ఫోన్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సీఎం కోరగా...అందుకు చైతన్య రాజు సున్నితంగా తిరస్కరించినట్లు సమచారం. ఈ సందర్భంగా చైతన్యరాజు బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ తాను పోటీ నుంచి తప్పుకుంటే సీమాంధ్ర ప్రజలను మోసం చేసినట్లు అవుతుందని అన్నారు. ఇక పెద్దల సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్‌గా మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన చైతన్యరాజు బరి నుంచి తప్పుకునేలా అధిష్టానం ఒత్తిడి పెంచుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు గురువారంతో ముగియనుండటంతో ఈలోగా రెబల్స్‌ను బరి నుంచి తప్పుకునేలా ఒప్పించగలుగుతామనే ధీమాతో పార్టీ రాష్ట్ర నేతలున్నట్టుగా కన్పిస్తోంది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పార్టీ పెద్దలు చైతన్యరాజుపై పలు రకాలుగా ఒత్తిడి తీసుకురాగా, ఆరు నూరైనా తాను రాజ్యసభ బరి నుంచి వెనక్కు తగ్గేది లేదని చైతన్యరాజు చెబుతున్నారు. -
రెబల్స్‌పై ఒత్తిళ్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పెద్దల సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్‌గా జిల్లా నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన చైతన్యరాజు బరి నుంచి తప్పుకునేలా అధిష్టానం ఒత్తిడి పెంచుతోంది. పార్టీ నాయకత్వం నిర్ణయంతో ప్రమేయం లేకుండా సమైక్యాంధ్ర నినాదంతో చైతన్యరాజు, జేసీ దివాకరరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి బరిలో దిగుతారని అంతా భావించారు. పలు దఫాలు సీమాంధ్ర నేతల మధ్య జరిగిన సంప్రదింపుల అనంతరం చివరకు జిల్లా నుంచి ఎమ్మెల్సీ చైతన్యరాజు, నెల్లూరు జిల్లా నుంచి ఆదాల మాత్రమే నిలిచారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ రెబల్స్‌గా చైతన్యరాజు, జేసీ దివాకరరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి బరిలోకి దిగాలనుకున్నారు. గడచిన రెండు రోజులుగా జరిగిన చర్చల పరంపర కొలిక్కి వచ్చి చైతన్యరాజు, ఆదాల నామినేషన్లు దాఖలు చేశారు. అధిష్టానం నుంచి వచ్చిన ఒత్తిళ్లు లేదా, సీమాంధ్ర నేతల మధ్య కుదిరిన అవగాహన కావొచ్చు జేసీ దివాకరరెడ్డి నామినేషన్ దాఖలు చేయాలనుకున్నప్పటికీ చివరి నిమిషంలో వెనకడుగు వేశారు. మిగిలిన ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న అధిష్టానం రెబల్స్ ఇద్దరిని బరి నుంచి తప్పించేందుకు అన్ని స్థాయిల్లో కసరత్తు చేస్తోంది. చైతన్యరాజు, ఆదాల నామినేషన్లు దాఖలు చేసిన దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ ముఖ్య నేతలు ఒకరి తరువాత మరొకరు వెంటపడుతూ నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి పెంచుతున్నారని జిల్లా కేంద్రానికి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు గురువారం. ఈలోగా రెబల్స్‌ను బరి నుంచి తప్పుకునేలా ఒప్పించగలుగుతామనే ధీమాతో పార్టీ రాష్ట్ర నేతలున్నట్టుగా కన్పిస్తోంది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పార్టీ పెద్దలు చైతన్యరాజుపై పలు రకాలుగా ఒత్తిడి తీసుకురాగా, ఆరునూరైనా తాను రాజ్యసభ బరి నుంచి వెనక్కు తగ్గేది లేదని చెప్పారని హైదరాబాద్‌లో ఉన్న అనుచరుల ద్వారా తెలియవచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఆదాల అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకం చేసిన ఇద్దరు శాసనసభ్యులు పై నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా వెనక్కు తగ్గినట్టు సమాచారం. ఆదాలకు మద్ధతు తెలియచేస్తూ ఇచ్చిన లేఖలను ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వెనక్కు తీసేసుకున్నారని తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ ఉపసంహరించుకోవడం అనివార్యమేనంటున్నారు.గడచిన వారం రోజులుగా చర్చలు, సంప్రదింపుల నేపథ్యంలో చైతన్యరాజుకు మద్ధతుగా 20 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. వారితోపాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా మద్ధతు ఇస్తారనే ధీమా చైతన్యరాజు వర్గీయుల నుంచి వ్యక్తమవుతోంది. అధిష్టానం ఒత్తిళ్లు ఫలితాన్నిస్తాయో, బరి నుంచి తప్పుకునేది లేదని తెగేసి చెబుతోన్న చైతన్యరాజు మాట చెల్లుబాటు అవుతుందో చూడాలి. -
రెబల్స్ ఉన్నారా.. నాకు తెలియదే
రాజ్యసభ బరిలో స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా పోటీ చేసిన విషయం తనకు తెలియదని కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ఒకవేళ రెబెల్స్ ఎవరైనా ఉంటే ఆ విషయాన్ని పార్టీ అధిష్ఠానం, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చూసుకుంటారని ఆయన అన్నారు. వాస్తవానికి నాలుగో అభ్యర్థిని గెలిపించుకునే బలం కాంగ్రెస్ పార్టీకి లేదని, అందుకే అధిష్ఠానం కేవలం ముగ్గురు అభ్యర్థులను మాత్రమే బరిలోకి దింపిందని టీఎస్సార్ చెప్పారు. అయితే, గోదావరి జిల్లాల నుంచి చైతన్య రాజు, నెల్లూరు జిల్లాకు చెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తం ఆరు స్థానాలకు గాను ఎనిమిది మంది బరిలో ఉన్నట్లయింది. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఇద్దరు, టీఆర్ఎస్ నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు రాజ్యసభ సీట్ల కోసం పోటీ పడనున్నారు. -
'సమైక్యంపై హామీ ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటా'
హైదరాబాద్ : సమైక్యవాదం కోసమే తాను రాజ్యసభకు పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి చైతన్య రాజు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇస్తే పోటీనుంచి తప్పుకుంటానని కూడా ఆయన ప్రకటించారు. అయితే సమైక్యవాద తీవ్రతను అధిష్టానానికి తెలియజెప్పేందుకు చైతన్యరాజుకు మద్దతిస్తున్నట్టు చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. చైతన్య రాజు అభ్యర్థిత్వాన్ని సీమాంధ్ర మంత్రులు కాసు వెంకట కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టీజీ వెంకటేష్, గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి బలపరిచారు. విశాఖ ఎంఎల్ఏలు..రమణమూర్తి రాజు, వెంకటరామయ్య, అవంతి శ్రీనివాస్, రమేష్, ముత్యాలపాప బలపరిచారు. చైతన్యరాజు అభ్యర్థిత్వాన్ని బలపరిచినంత మాత్రాన తాము కాంగ్రెస్ పార్టీకి.. ఆపార్టీ అభ్యర్థులకు వ్యతిరేకం కాదని ఆయన వివరించారు. మరోవైపు.. రాజ్యసభకు రెబెల్‌గా పోటీచేసే యోచనలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. పోటీలోకి దిగద్దని.. చైతన్యరాజు మద్దతుదారులు ..ఆదాలను వారిస్తున్నా.. నామినేషన్లు వేయడానికే ఆదాల సిద్ధమవుతున్నారు. రెబెల్ అభ్యర్థిగా ఒకరు మాత్రమే రంగంలో ఉంటే గెలుపుకు ఆస్కారం ఉన్నందున ఆఖరి నిమిషంలో జేసీ పోటీనుంచి వెనక్కు తగ్గారు. -
చివరి నిమిషంలో జేసీ విత్ డ్రా
హైదరాబాద్ : అధిష్టానాన్ని ధిక్కరించి అయినా రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధపడ్డ మాజీమంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అధిష్టానం తనను ఎంపిక చేయకపోయినా పోటీ చేసి తీరాతానంటూ హంగామా చేసిన జేసీ హఠాత్తుగా తన నిర్ణయం మార్చుకున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని తనకు రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించిన టి సుబ్బరామిరెడ్డి, కెవిపి రామచంద్రరావు ఫోన్ చేసినట్లు జేసీ పేర్కొనటం విశేషం. కాగా కోస్తా ఆంధ్రా ప్రాంతం నుంచి ఎమ్మెల్సీ చైతన్యరాజు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన మంగళవారం ఉదయం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. చైతన్యరాజుకు జేసీ దివాకర్ రెడ్డి మద్దతు పలికారు. కాగా రెబల్‌గా పోటీలోకి దిగేందుకు చైతన్యరాజు, విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే రాయలసీమ నుంచి జేసీ దివాకరరెడ్డి పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ సీమాంధ్ర నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు చైతన్యరాజు వైపు మొగ్గు చూపారు. మరోవైపు టీఆర్ఎస్ తరపున కేశవరావు నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్కు సీపీఐ మద్దతు ఇచ్చింది. కాగా కేవీపీ రామచంద్రరావు, టీ సుబ్బరామిరెడ్డి, ఎంఏ ఖాన్లకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈరోజు గాంధీభవన్‌లో బీఫారమ్‌లు అందించారు. పార్టీకి చేసిన సేవకు గుర్తింపుగానే సోనియా ముగ్గురికి టిక్కెట్లు ఇచ్చిందని బొత్స తెలిపారు. ఇక టీడీపీ తరపున పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట సీతామహాలక్ష్మి, గరికపాటి మోహన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు వారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. -
సోలోగానైనా సై
సాక్షి ప్రతినిధి, కాకినాడ :నామినేషన్ల ఘట్టం దగ్గర పడటంతో రాజ్య(పెద్దల)సభకు పార్టీల అభ్యర్థులెవరన్న దానిపై సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్సీ చైతన్యరాజు పార్టీ అవకాశం ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి చైతన్యరాజుతో పాటు మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి జె.సి.దివాకరరెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ల పేర్లు నాలుగైదు రోజులుగా నలుగుతున్నాయి. నామినేషన్ల అనంతరం బరిలో మిగిలే వారెవరనే విషయం ప్రస్తుతానికి పక్కనబెడితే సీమాంధ్ర జిల్లాల్లో ఎవరు బరిలో నిలిస్తే ఎంతమంది మద్దతు లభిస్తుందని నేతలు లెక్కలు తీస్తున్నారు. ఈ క్రమంలో తొలుత సొంత జిల్లాల్లో మద్దతు సాధించే దిశగా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బరిలో నిలుస్తానంటున్న ఎమ్మెల్సీ చైతన్యరాజు ఆదివారం హైదరాబాద్‌లో రెండు విడతలుగా జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. జేసీ, గంటా, ఉండవల్లి, చైతన్యరాజుల్లో చివరకు బరిలో ఒకరే నిలుస్తారా లేక ఒకరికి మించే పోటీ పడతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. చైతన్యరాజు అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారు సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. ఆ ముగ్గురితో కూడా ఆయన మాట్లాడుతున్నారని సమాచారం. విశాఖ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు తొలుత చైతన్యరాజుకు మద్దతు ఇవ్వడం, అనంతరం బరిలోకి వచ్చిన గంటా వైపు మొగ్గు చూపడం, విభజన పరిణామాల్లో జేసీ, గంటా టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్వతంత్రంగా బరిలోకి దిగితే చైతన్యరాజు పేరు పరిశీలించాలనే ప్రతిపాదన కాంగ్రెస్ వర్గాల్లో వచ్చిందని సమాచారం. ఉండవల్లి పేరును ఎంపీ హర్షకుమార్ శనివారమే తెరపైకి తీసుకురాగా మిగిలిన నాయకులెవరూ సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నామినేషన్ వేయనున్నట్టు చైతన్యరాజు హైదరాబాద్ నుంచి ‘సాక్షి ప్రతినిధి’కి ధ్రువీకరించారు. ధనబలమే ‘దేశాని’కి గీటురాయి..! తెలుగుదేశం విషయానికి వస్తే సమర్థత కంటే ఆర్థిక అంశాలే ప్రామాణికమవుతున్నాయి. పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా రికార్డు స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించిన నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రులు చిక్కాల రామచంద్రరావు, మెట్ల సత్యనారాయణరావు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం రాజ్యసభకు వెళ్లాలని ఆశిస్తున్నా వారిని పక్కనబెట్టే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లా ల పార్టీ అధ్యక్షులు చినరాజప్ప, సీతామహాలక్ష్మి అవకాశం కోసం పోటీపడుతుం డగా మహిళా కోటాలో సీతామహలక్ష్మికే అవకాశం ఉండవచ్చన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం వీరందరినీ కాదని ఆర్థిక దన్ను కలిగిన నారాయణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ పి.నారాయణ వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే అంతకంటే అన్యాయం మరొకటి ఉండబోదని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. -
'పోటీలో ముగ్గురం... బరిలో ఇద్దరం'
-
'పోటీలో ముగ్గురం... బరిలో ఇద్దరం'
హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగుబాటు అభ్యర్థుల సంఖ్యపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రంగంలో ఉండేది ఒకరా, ఇద్దరా? లేదంటే ఏకంగా ముగ్గురా? వీరిలో తుది దాకా బరిలో మిగిలేదెవరు? వారికి మద్దతుగా నిలిచే ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయుణ రాజు (చైతన్య రాజు) పెద్దల సభకు వెళ్లేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రాజ్యసభకు గంటా శ్రీనివాసరావు, జేసీ దివాకర్ రెడ్డి, తాను పోటీ చేయాలనుకుంటున్నామని.... తమలో ఇద్దరమైనా కచ్చితంగా బరిలో ఉంటామని చైతన్యరాజు స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ అవసరం లేదని... ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తానన్నారు. కాంగ్రెస్ అధికారిక అభ్యర్థులకు ఓటేసేందుకు ...పార్టీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలెవరూ సిద్ధంగా లేరన్నారు. కాంగ్రెస్ సభ్యత్వం లేకపోయినా అయిదేళ్లు ఎమ్మెల్సీగా పార్టీకి సేవ చేశానని చైతన్యరాజు అన్నారు. కేవీపీ రామచంద్రావుకు కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ టికెట్ వస్తే సంతోషిస్తామన్నారు. కాగా రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపై ఆదివారం మధ్యాహ్నం సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు....సుమారు 60మంది వరకూ సమావేశం అవుతామని చైతన్యరాజు తెలిపారు. మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి ఇప్పటికే దాదాపు 11 మంది ఎమ్మెల్యేలతో తన నామినేషన్ పత్రాలపై ప్రతిపాదన సంతకాలు కూడా తీసుకున్నారు. చైతన్య రాజు కూడా నామినేషన్ పత్రాలపై ఎమ్మెల్యేల సంతకాలు తీసుకున్నారు. ఆయనకు మద్దతుగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేల సమీకరణకు కూడా దిగారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి అయిదుగురు రాజ్యసభ ఎంపీలు పదవీ విరమణ చేస్తున్నారు. టి.సుబ్బరామిరెడ్డి, నంది ఎల్లయ్యు, కేవీపీ రావుచంద్రరావు, రత్నాబాయి, ఎంఏ ఖాన్ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సాంకేతికంగా 146 మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ లెక్కన ఈసారి మూడు రాజ్యసభ స్థానాలు కచ్చితంగా రావచ్చన్నది ఆ పార్టీ నేతల అంచనా. అయితే రాష్ట్ర విభజన నిర్ణయుం కారణంగా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల సంఖ్య యుథాతథంగా ఉన్నా, సీమాంధ్రలో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వలసలు పోతున్నారు. ఈ నేపథ్యంలో అనుకుంటున్నట్టు మూడు స్థానాలైనా వస్తాయా, లేదా అన్న ఆందోళన నెలకొంది. విభజన నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగాలని భావిస్తుండటం పార్టీకి మరో తలనొప్పిగా మారింది. -
ఒకరా, ఇద్దరా?
కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులపై అదే ఉత్కంఠ సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగుబాటు అభ్యర్థుల సంఖ్యపై అదే ఉత్కంఠ కొనసాగుతోంది. రంగంలో ఉండేది ఒకరా, ఇద్దరా? లేదంటే ఏకంగా ముగ్గురా? వీరిలో తుది దాకా బరిలో మిగిలేదెవరు? వారికి మద్దతుగా నిలిచే ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? ఈ తిరుగుబాటు అభ్యర్థుల వల్ల కాంగ్రెస్ గెలిచే స్థానాల సంఖ్యకు గండిపడుతుందా? ఇలాంటి అనేకానేక అంశాలపై కూడికలు, తీసివేతల్లో కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం తలమునకలుగా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఐదుగురు రాజ్యసభ ఎంపీలు పదవీ విరమణ చేస్తున్నారు. టి.సుబ్బరామిరెడ్డి, నంది ఎల్లయ్యు, కేవీపీ రావుచంద్రరావు, రత్నాబారుు, ఎంఏ ఖాన్ స్థానాలు ఖాళీ అవుతున్నారుు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సాంకేతికంగా 146 వుంది ఎమ్మెల్యేలున్నారు. ఆ లెక్కన ఈసారి వుూడు రాజ్యసభ స్థానాలు కచ్చితంగా రావచ్చన్నది ఆ పార్టీ నేతల అంచనా. కానీ రాష్ట్ర విభజన నిర్ణయుం కారణంగా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల సంఖ్య యుథాతథంగా ఉన్నా, సీవూంధ్రలో వూత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వలసలు పోతున్నారు. ఈ నేపథ్యంలో అనుకుంటున్నట్టు మూడు స్థానాలైనా వస్తాయా, లేదా అన్న ఆందోళన నెలకొంది. విభజన నిర్ణయుంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు అభ్యర్ధులుగా బరిలోకి దిగాలని భావిస్తుండటం పార్టీకి వురో తలనొప్పిగా వూరింది. పులిమీద పుట్రలా బిల్లుపై చర్చ: పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సాగుతున్న నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికలు వచ్చి పడటం కూడా కాంగ్రెస్‌కు సవుస్యలను మరింతగా పెంచుతోంది. కాంగ్రెస్ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయుంపై తీవ్ర అంసతృప్తితో ఉన్న సీవూంధ్ర ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నిక ల్లో అధికారిక అభ్యర్థులను ఓడించడం ద్వారా పార్టీకి గుణపాఠం చెబుతావుంటున్నారు. దీన్ని తవుకు అనుకూలంగా వులచుకునేందుకు సమైక్యం పేరుతో తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి ఇప్పటికే దాదాపు 11 మంది ఎమ్మెల్యేలతో తన నామినేషన్ పత్రాలపై ప్రతిపాదన సంతకాలు కూడా తీసుకున్నారు. తనకు 40 వుంది ఎమ్మెల్యేల బలవుుందని ఆయన చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయుణ రాజు (చైతన్య రాజు) కూడా నామినేషన్ పత్రాలపై ఎమ్మెల్యేల సంతకాలు తీసుకున్నారు. ఆయనకు మద్దతుగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేల సమీకరణకు కూడా దిగారు. తనకు 20మంది వరకు ఎమ్మెల్యేల మద్దతుందని చైతన్య రాజు ప్రకటించారు. తనను అధికారిక అభ్యర్థిగా ప్రకటించాలంటూ సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయుణలను కలిశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కూడా కలసి విన్నవించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. బొత్సతో పాటు వెళ్లి దిగ్విజయ్‌ను కలిసే ప్రయత్నాల్లో పడ్డారు. ఇద్దరిలో ఎవరు?: చైతన్యరాజుకు వుద్దతుగా వుంతనాలకు దిగిన మంత్రి గంటాకు ఎమ్మెల్యేల నుంచి కొత్త ప్రతిపాదన ఎదురైంది. రాజుకు బదులు తానే రాజ్యసభ బరిలోకి దిగాలంటూ ఒత్తిడి వస్తోందని గంటా అంటున్నారు. వారి సూచన మేరకు బరిలో దిగాలనుకుంటున్నానని చెబుతున్నారు. దాంతో రాజు, గంటాల్లో ఎవరు బరిలో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా తాను స్వతంత్రంగానైనా పోటీ చేయుడం వూత్రం తథ్యవుని చైతన్య రాజు స్పష్టంచేస్తున్నారు. జేసీతో కలిపి ఇలా వుుగ్గురూ పోటీకి సిద్ధపడుతుండడంతో కాంగ్రెస్ స్థానాలకు గండి పడకతప్పదనిపిస్తోంది. ఈ వుుగ్గురూ తమకు మద్దతుగా ఉన్నారంటున్న ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం 56 దాకా ఉందని అంచనా. వుుగ్గురూ పోటీకి దిగి, వారికి ప్రస్తుతం మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు తప్ప మరెవరూ ఓటేయకపోతే అందరూ ఓడక తప్పదు. వుుగ్గురూ ఒక అభిప్రాయూనికి వచ్చి ఎవరో ఒక్కరే బరిలో ఉంటే ‘సమైక్య’ తిరుగుబాటు అభ్యర్థిగా పార్టీపై విజయుం సాధించవచ్చు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో గంటా చాంబర్లో దీనిపైనే నేతలు మంతనాలు నెరిపారు. గంటాతో పాటు మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యేలు కన్నబాబు రాజు, రమేశ్‌బాబు, అవంతి శ్రీనివాస్, వెంకట్రావుయ్యు, తోట త్రిమూర్తులు వీటిలో తదితరులు పాల్గొన్నారు. మధ్యలో టీడీపీ నేత, వూజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు కూడా వచ్చారు. ముగ్గురికీ కలిపి 56 మంది ఎమ్మెల్యేల దాకా వుద్దతిస్తున్నందున ఒకరో, ఇద్దరో బరిలో ఉంటే వుంచిదన్న అభిప్రాయుం వ్యక్తమైంది. తొలి ప్రాధాన్య ఓటుతో ఒకరు, రెండో ప్రాధాన్య ఓటుతో మరొకరు గెలవవచ్చని అంచనా వేశారు. పార్టీ తరఫున విప్ ఉండదని, ఎన్నికలొస్తున్నందున ఎమ్మెల్యేలపై వేటూ ఉండకపోవచ్చని భావన వ్యక్తమైంది. కాంగ్రెస్ టికెట్ ఎవడిక్కావాలి: పార్టీకి వ్యతిరేకంగా పోతే వచ్చే ఎన్నికల్లో టికెట్లివ్వరేమోనని ఒక ఎమ్మెల్యే అనగా, ‘కాంగ్రెస్ టికెట్ ఎవడిక్కావాలి? వారిచ్చినా తీసుకొనే వారెవరు?’ అంటూ అవంతి శ్రీనివాస్‌రావు తదితరులు తీసిపారేశారు. గురువారం రాత్రి కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు గంటాను ఆయన నివాసంలో కలసి రాజ్యసభ ఎన్నికలపై చర్చించారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులకు నలుగురైదుగురు మినహా పార్టీ ఎమ్మెల్యేలెవరూ మద్దతివ్వబోరని మంత్రి కొండ్రు మురళి అన్నారు. -
27న రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేస్తా
రాజ్యసభ అభ్యర్థిగా ఈ నెల 27న నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ చైతన్యరాజు హైదరాబాద్‌లో వెల్లడించారు. గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావును ఆయన ఛాంబర్లో చైతన్య రాజు కలిశారు. స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ బరిలోకి దిగనున్నట్లు చెప్పారు. రెండు జతల నామినేషన్ పత్రాలపై తనకు మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు సంతకాలు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవి కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్నికల కమిషన్ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అయితే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో దూసుకువెళ్తుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ అధిష్టానం నిలిపే అభ్యర్థులకు తమ మద్దతు ఉండదని ఇప్పటికే సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అంతేకాకుండా సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చే పార్టీ నాయకులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలు ప్రకటించారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ మంత్రులు, నాయకులు రాజ్యసభ ఎన్నికల బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.