కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులపై అదే ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగుబాటు అభ్యర్థుల సంఖ్యపై అదే ఉత్కంఠ కొనసాగుతోంది. రంగంలో ఉండేది ఒకరా, ఇద్దరా? లేదంటే ఏకంగా ముగ్గురా? వీరిలో తుది దాకా బరిలో మిగిలేదెవరు? వారికి మద్దతుగా నిలిచే ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? ఈ తిరుగుబాటు అభ్యర్థుల వల్ల కాంగ్రెస్ గెలిచే స్థానాల సంఖ్యకు గండిపడుతుందా? ఇలాంటి అనేకానేక అంశాలపై కూడికలు, తీసివేతల్లో కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం తలమునకలుగా ఉన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఐదుగురు రాజ్యసభ ఎంపీలు పదవీ విరమణ చేస్తున్నారు. టి.సుబ్బరామిరెడ్డి, నంది ఎల్లయ్యు, కేవీపీ రావుచంద్రరావు, రత్నాబారుు, ఎంఏ ఖాన్ స్థానాలు ఖాళీ అవుతున్నారుు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సాంకేతికంగా 146 వుంది ఎమ్మెల్యేలున్నారు. ఆ లెక్కన ఈసారి వుూడు రాజ్యసభ స్థానాలు కచ్చితంగా రావచ్చన్నది ఆ పార్టీ నేతల అంచనా. కానీ రాష్ట్ర విభజన నిర్ణయుం కారణంగా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల సంఖ్య యుథాతథంగా ఉన్నా, సీవూంధ్రలో వూత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వలసలు పోతున్నారు. ఈ నేపథ్యంలో అనుకుంటున్నట్టు మూడు స్థానాలైనా వస్తాయా, లేదా అన్న ఆందోళన నెలకొంది. విభజన నిర్ణయుంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు అభ్యర్ధులుగా బరిలోకి దిగాలని భావిస్తుండటం పార్టీకి వురో తలనొప్పిగా వూరింది.
పులిమీద పుట్రలా బిల్లుపై చర్చ: పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సాగుతున్న నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికలు వచ్చి పడటం కూడా కాంగ్రెస్‌కు సవుస్యలను మరింతగా పెంచుతోంది. కాంగ్రెస్ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయుంపై తీవ్ర అంసతృప్తితో ఉన్న సీవూంధ్ర ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నిక ల్లో అధికారిక అభ్యర్థులను ఓడించడం ద్వారా పార్టీకి గుణపాఠం చెబుతావుంటున్నారు. దీన్ని తవుకు అనుకూలంగా వులచుకునేందుకు సమైక్యం పేరుతో తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి ఇప్పటికే దాదాపు 11 మంది ఎమ్మెల్యేలతో తన నామినేషన్ పత్రాలపై ప్రతిపాదన సంతకాలు కూడా తీసుకున్నారు. తనకు 40 వుంది ఎమ్మెల్యేల బలవుుందని ఆయన చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయుణ రాజు (చైతన్య రాజు) కూడా నామినేషన్ పత్రాలపై ఎమ్మెల్యేల సంతకాలు తీసుకున్నారు. ఆయనకు మద్దతుగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేల సమీకరణకు కూడా దిగారు. తనకు 20మంది వరకు ఎమ్మెల్యేల మద్దతుందని చైతన్య రాజు ప్రకటించారు. తనను అధికారిక అభ్యర్థిగా ప్రకటించాలంటూ సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయుణలను కలిశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కూడా కలసి విన్నవించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. బొత్సతో పాటు వెళ్లి దిగ్విజయ్‌ను కలిసే ప్రయత్నాల్లో పడ్డారు.
ఇద్దరిలో ఎవరు?: చైతన్యరాజుకు వుద్దతుగా వుంతనాలకు దిగిన మంత్రి గంటాకు ఎమ్మెల్యేల నుంచి కొత్త ప్రతిపాదన ఎదురైంది. రాజుకు బదులు తానే రాజ్యసభ బరిలోకి దిగాలంటూ ఒత్తిడి వస్తోందని గంటా అంటున్నారు. వారి సూచన మేరకు బరిలో దిగాలనుకుంటున్నానని చెబుతున్నారు. దాంతో రాజు, గంటాల్లో ఎవరు బరిలో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా తాను స్వతంత్రంగానైనా పోటీ చేయుడం వూత్రం తథ్యవుని చైతన్య రాజు స్పష్టంచేస్తున్నారు. జేసీతో కలిపి ఇలా వుుగ్గురూ పోటీకి సిద్ధపడుతుండడంతో కాంగ్రెస్ స్థానాలకు గండి పడకతప్పదనిపిస్తోంది. ఈ వుుగ్గురూ తమకు మద్దతుగా ఉన్నారంటున్న ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం 56 దాకా ఉందని అంచనా. వుుగ్గురూ పోటీకి దిగి, వారికి ప్రస్తుతం మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు తప్ప మరెవరూ ఓటేయకపోతే అందరూ ఓడక తప్పదు. వుుగ్గురూ ఒక అభిప్రాయూనికి వచ్చి ఎవరో ఒక్కరే బరిలో ఉంటే ‘సమైక్య’ తిరుగుబాటు అభ్యర్థిగా పార్టీపై విజయుం సాధించవచ్చు.
శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో గంటా చాంబర్లో దీనిపైనే నేతలు మంతనాలు నెరిపారు. గంటాతో పాటు మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యేలు కన్నబాబు రాజు, రమేశ్‌బాబు, అవంతి శ్రీనివాస్, వెంకట్రావుయ్యు, తోట త్రిమూర్తులు వీటిలో తదితరులు పాల్గొన్నారు. మధ్యలో టీడీపీ నేత, వూజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు కూడా వచ్చారు. ముగ్గురికీ కలిపి 56 మంది ఎమ్మెల్యేల దాకా వుద్దతిస్తున్నందున ఒకరో, ఇద్దరో బరిలో ఉంటే వుంచిదన్న అభిప్రాయుం వ్యక్తమైంది. తొలి ప్రాధాన్య ఓటుతో ఒకరు, రెండో ప్రాధాన్య ఓటుతో మరొకరు గెలవవచ్చని అంచనా వేశారు. పార్టీ తరఫున విప్ ఉండదని, ఎన్నికలొస్తున్నందున ఎమ్మెల్యేలపై వేటూ ఉండకపోవచ్చని భావన వ్యక్తమైంది.
కాంగ్రెస్ టికెట్ ఎవడిక్కావాలి: పార్టీకి వ్యతిరేకంగా పోతే వచ్చే ఎన్నికల్లో టికెట్లివ్వరేమోనని ఒక ఎమ్మెల్యే అనగా, ‘కాంగ్రెస్ టికెట్ ఎవడిక్కావాలి? వారిచ్చినా తీసుకొనే వారెవరు?’ అంటూ అవంతి శ్రీనివాస్‌రావు తదితరులు తీసిపారేశారు. గురువారం రాత్రి కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు గంటాను ఆయన నివాసంలో కలసి రాజ్యసభ ఎన్నికలపై చర్చించారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులకు నలుగురైదుగురు మినహా పార్టీ ఎమ్మెల్యేలెవరూ మద్దతివ్వబోరని మంత్రి కొండ్రు మురళి అన్నారు.