రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఊహించినట్టే వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థులు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, ఎం.ఎ. ఖాన్.. టీడీపీ తరపున గరికపాటి మోహనరావు, సీతామహాలక్ష్మి, టీఆర్ఎస్ తరఫున కె.కేశవరావు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురు, టీడీపీ అభ్యర్థులు ఇద్దరు తొలి ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు. కాగా 26 ఓట్లు సాధించిన కేశవ రావు ఎలిమినేషన్ ప్రక్రియలో విజయం సాధించడం లాంఛనమే. వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సివుంది.