Keshav Rao
-
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కేశవరావు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నేత కేశవరావు కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతగా, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కే కేశవరావు ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు.కాగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన కేశవరావు గతంలో అనేక పదవులు కూడా పొందారు. అయితే మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్(బీఆర్ఎస్)లోకి చేరారు. కేసీఆర్‌తో కలిసి పని చేసిన ఆయనకు రెండుసార్లు ఎంపీగా(రాజ్యసభ) అవకాశం దక్కింది. -
కాంగ్రెస్ లోకి కేశవరావు...ఖంగుతిన్న కేసీఆర్
-
దమ్మూ ధైర్యముంటే నిరూపించండి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎంపీలు ఖండించారు. దమ్మూ ధైర్యముంటే కేంద్రం ఈ విషయాన్ని నిరూపించాలని వారు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు వేల కోట్ల రూపాయలు కాదు.. ఒక్క రూపాయి, కనీసం ఒక్క పైసా ఇచ్చినట్లు బీజేపీ నిరూపిస్తే రాజీనామాలు సహా దేనికైనా రెడీ అని సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించారన్న బీఆర్ఎస్ ఎంపీలు, ఆయనపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చామన్నారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని వారు ఆరోపించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గురువారం మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు మీడియాతో మాట్లాడుతూ, గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండానే తెలంగాణ అభివృద్ధి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు అడిగినా ఎలాంటి లాభం లేకపోయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధాని, హోంమంత్రిని కలిసి విన్నవించారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో నిర్మించిందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో అడిగిన ప్రశ్నోత్తరాల్లోనే ఒప్పుకుందన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాలయాల మంజూరు విషయంలోనూ జరిగిన నష్టాన్ని అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో దేశం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అంతేగాక కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పును మాఫీ చేయాలన్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయంగా పోరాడాలే తప్ప లిక్కర్, నిక్కర్ అంటూ పిచ్చి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ల గురించి మాట్లాడేటప్పుడు రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. -
ప్రతిపక్షాలకు సమయం కేటాయించాలి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్షాలకు 50% సమయాన్ని కేటాయించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కేశవరావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నడుచుకోవట్లేదని..17 రోజుల్లో 25 బిల్లులు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వాలు లేని చోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలోకి వచ్చిన వారు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ దుర్వినియోగంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు సంస్థలు చేస్తున్న దాడులపై అందరినీ కలుపుకుని పార్లమెంటులో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
రాజ్యసభకు కేకే, సురేశ్‌రెడ్డి నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. టీఆర్ఎస్ పక్షాన రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన డాక్టర్ కె.కేశవరావు, కె.ఆర్.సురేశ్‌రెడ్డి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మె ల్యేలు వెంటరాగా అసెంబ్లీ ఆవరణలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. టీఆర్ఎస్ అభ్యర్థుల పక్షాన 4 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు కాగా.. కేకే, సురేశ్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పలువురు మంత్రులు, టీఆర్ ఎస్, ఏఐఎంఐఎం పార్టీల ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఒక్కో సెట్‌పై 10 మంది సంతకాలు చేయాల్సి ఉండగా, ఒక్కో సెట్‌పై నలుగురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కవిత, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి, కుమారులు వెంకట్, విప్లవ్.. సురేశ్‌రెడ్డి సతీమణి పద్మజారెడ్డి అసెంబ్లీకి వచ్చిన వారిలో ఉన్నారు. కేసీఆర్‌తో రాజ్యసభ సభ్యుల భేటీ.. నామినేషన్ల కార్యక్రమం పూర్తయిన తర్వాత పార్టీ రాజ్యసభ సభ్యులతో కలిసి పార్టీ అభ్యర్థులు కేకే, సురేశ్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలోని సీఎం చాంబర్లో పార్టీ అధినేత కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్ ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక అసెంబ్లీ లాబీల్లో ఎంపీలు సంతోష్, బండా ప్రకా శ్, లింగయ్య యాదవ్ ఇప్పుడు మనం సీనియర్లం అయ్యాం అంటూ సరదాగా అన్నారు. కాగా, నామినేషన్ దాఖలుకు ముందు కేకే, సురేశ్‌రెడ్డి గన్ పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళుల ర్పించారు. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, విప్ బాల్క సుమన్, గువ్వ ల బాలరాజు తదితరులతో అసెంబ్లీకి చేరుకుని నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు అభ్యర్థి సురేశ్‌రెడ్డితో పాటు నామినేషన్ పత్రాలు అందజేస్తున్న హరీశ్‌రావు తదితరులు ఎన్నిక కావడం లాంఛనమే... టీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరితో పాటు శ్రమజీవి పార్టీ తరఫున జాజుల భాస్కర్, భోజరాజ్ కోయల్కర్ ఒక్కో సెట్టు దాఖలు చేశారు. ఇలా మొత్తం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లయింది. 16న నామినేషన్ల పరిశీలన, 18న ఉపసంహరణ అనంతరం బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. అసెంబ్లీలో సంఖ్యాబలం పరంగా టీఆర్ఎస్కు 104, ఎంఐఎంకు ఏడుగురు సభ్యుల బలం ఉండటంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనమే కానున్నది. -
దేశంలో సీఏఏ వ్యతిరేకోద్యమం
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని, స్వాతంత్రోద్యమం తరహాలో దేశంలో సీఏఏ వ్యతిరేకోద్యమం జరుగుతోందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం వీరు మాట్లాడారు. కేశవరావు మాట్లాడుతూ.. ‘అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ గురించి మా వైఖరిని మా సీఎం ఇప్పటికే వెల్లడించారు. రాష్ట్రం తరఫున సీఏఏను వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేయాలనుకున్నాం. కేంద్ర చట్టం కాబట్టి ఎలా తీర్మానం చేస్తారని కొందరు అంటున్నారు. రాష్ట్రానికి ఆ హక్కు ఉంది. అఖిలపక్ష సమావేశంలోనూ ఇదే చెప్పాం. పార్లమెంటు తెచ్చిన ఈ బిల్లును కోట్లాది మంది ప్రజలతోపాటు రాష్ట్రాలు కూడా చట్టసభల ద్వారా వ్యతిరేకిస్తున్నాయి. సీఏఏపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిని పలువురు ఇతర రాష్ట్రాల మంత్రులు ప్రశంసించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో సీఏఏ, దేశ ఆర్థిక స్థితిగతులు, ఏపీ పునర్ వ్యవస్థీకరణ అంశాలపై చర్చకు అవకాశం కల్పించాలి’అని పేర్కొన్నారు. సీఏఏను రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.. టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘సీఏఏ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడే మా నేత కేసీఆర్ నన్నూ, కేశవరావును పిలిచి సమగ్రంగా చర్చించారు. స్పష్టమైన మార్గదర్శనం చేశారు. దానికి అనుగుణంగానే మేం ఈ బిల్లును వ్యతిరేకించాం. దేశంలో ప్రజలు, రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయంటే దీనిని పున: సమీక్షించుకోవాలి. స్వాత్రంత్య్రోద్యమం తరహాలో ఇప్పుడు సీఏఏకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతోంది’అని వివరించారు. -
సీఎం ఆదేశిస్తే మధ్యవర్తిత్వానికి సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పరిస్థితులు చేజారకముందే సమ్మె విరమించాలంటూ ఆర్టీసీ ఉద్యోగులను ఉద్దేశించి సోమవారం లేఖ విడుదల చేసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఆ పార్టీ సెక్రటరీ జనరల్ డాక్టర్ కె. కేశవరావు మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాను కార్మికుల పక్షపాతి అని చెప్పుకున్న కేశవరావు.. ఆర్టీసీ సమ్మెతో పరిస్థితులు చేజారుతున్నాయనే అనుమానంతో లేఖ విడుదల చేశానన్నారు. ‘‘నేను సోషలిస్టును. రాజ్యం వైపు ఎప్పుడూ ఉండను. కార్మికుల వైపే ఉంటాను. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయి. ప్రభుత్వం, ఆర్టీసీ నడుమ చర్చలు జరగాలి. ప్రస్తుతం సీఎంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఇంకా సీఎం అందుబాటులోకి రాలేదు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతానని నేను అనలేదు. మంచి జరుగుతుందనుకుంటే మధ్యవర్తిత్వానికి నేను సిద్ధం. సీఎం ఆదేశిస్తే కచ్చితంగా చర్చలకు దిగుతా. నాతో చర్చలకు కార్మికులు సానుకూలంగా ఉండటం మంచి పరిణామం. అయితే చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి నాకు అనుమతి రాలేదు’’అని కేశవరావు తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. -
పెద్దల సభ ఫలితాలు విడుదల
-
వీరే మన 'పెద్దలు'
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఊహించినట్టే వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థులు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, ఎం.ఎ. ఖాన్.. టీడీపీ తరపున గరికపాటి మోహనరావు, సీతామహాలక్ష్మి, టీఆర్ఎస్ తరఫున కె.కేశవరావు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురు, టీడీపీ అభ్యర్థులు ఇద్దరు తొలి ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు. కాగా 26 ఓట్లు సాధించిన కేశవ రావు ఎలిమినేషన్ ప్రక్రియలో విజయం సాధించడం లాంఛనమే. వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సివుంది. రాష్ట్రం నుంచి ఆరు స్థానాలకు ఎన్నికలు జరగగా ఏడుగురు బరిలో నిలిచారు. చిట్టచివరి నిమిషంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి తప్పుకోవడంతో ఆరుగురి ఎన్నిక కావడం ఖాయమని ముందుగానే తేలిపోయింది. నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగియడంతో సాంకేతికంగా ఆదాల పోటీలో ఉన్నా.. మిగిలిన అభ్యర్థులే ఓట్లు పంచుకున్నారు. దీంతో వీరి ఎన్నిక లాంఛనమైంది. ఓటింగ్ లో మొత్తం 248 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా మంగళగిరి ఎమ్మెల్యే కాండ్రు కమల ఖాళీ బ్యాలెట్ పేపర్‌ను బాక్సులో వేయగా, మరో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా తిరస్కార హక్కును వినియోగించుకున్నారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ వారే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సీపీఎం సభ్యులు ఓటింగులో పాల్గొనలేదు. కాంగ్రెస్ తరపున ముగ్గురూ సిట్టింగ్ అభ్యర్థులే ఎన్నికయ్యారు. వీరికి మరోసారి రాజ్యసభ అవకాశం దక్కింది. ఇక టీఆర్ఎస్ నేత కేశవరావు కూడా రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గతంలో కాంగ్రెస్ తరపున అవకాశం వచ్చింది. అయితే కాంగ్రెస్ తో విభేదించి రాజీనామా చేసిన కేకే టీఆర్ఎస్ లో చేరారు. ఇక టీడీపీ తరపున గెలిచిన గరికపాటి, సీతామహాలక్ష్మి ఇద్దరూ కొత్తవారు.