
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ఎంపీ, సీనియర్ నేత కేశవరావు కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతగా, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కే కేశవరావు ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు.
కాగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన కేశవరావు గతంలో అనేక పదవులు కూడా పొందారు. అయితే మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్(బీఆర్‌ఎస్)లోకి చేరారు. కేసీఆర్‌తో కలిసి పని చేసిన ఆయనకు రెండుసార్లు ఎంపీగా(రాజ్యసభ) అవకాశం దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment