ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన లగచర్ల బాధితులు
న్యూఢిల్లీ, సాక్షి: లగచర్ల ఫార్మా బాధితులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరికి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఆ పార్టీ నేతలు.. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. అయితే..
ఇప్పటికే లగచర్ల లో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్ట్ లపై ఎస్సి,ఎస్టీ,మహిళ, మానవహక్కుల కమిషన్ లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై భాదితులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. లగచర్ల లో గిరిజనులపై జరిగిన అణిచివేత తాలుకు సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరింది. దీంతో బలవంతపు భూ సేకరణ ఘటన, పోలీసులు చేసిన దుర్మార్గపు దాడులను, లైంగిక దాడి వంటి అంశాలతో కూడిన పత్రాలను బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్రపతి కార్యాలయానికి అందజేసినట్లు సమాచారం. అలాగే..
రాష్ట్రపతి ని కలసి తమ గోడు వినిపించాలని.. అప్పటిదాకా హస్తినలోనే ఉండాలని గిరిజన మహిళలు నిర్ణయించుకున్నారు. దీంతో బాధితులను రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.
ఇదీ చదవండి: మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు
Comments
Please login to add a commentAdd a comment