సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్షాలకు 50% సమయాన్ని కేటాయించాలని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కేశవరావు అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నడుచుకోవట్లేదని..17 రోజుల్లో 25 బిల్లులు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వాలు లేని చోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలోకి వచ్చిన వారు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ దుర్వినియోగంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు సంస్థలు చేస్తున్న దాడులపై అందరినీ కలుపుకుని పార్లమెంటులో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment