
డీకే శివ కుమార్‌తో కాంగ్రెస్ అభ్యర్థులు (ఫైల్ ఫొటో)
బెంగళూరు: కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థులు అజయ్ మాకెన్, నాజీర్ హుస్సేన్, పీ. చంద్రశేఖర్ రాజ్యసభ్యులుగా గెలుపొందారు. బీజేపీ నుంచి నారాయణ్ భాండగే.. రాజ్యసభ ఎంపీగా విజయం సాధించారు. ఇక.. జేడీ(ఎస్) అభ్యర్థి బరిలోకి దిగిన కుపేంద్రరెడ్డి 36 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
బీజేపీ ఎదురుదెబ్బ..
బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఎస్‌టీ సోమశేఖర్ కాంగ్రస్ అభ్యర్థి అజయ్ మాకెన్ క్రాస్ ఓట్ వేశారు. మరో ఎమ్మెల్యే అర్బైల్ శివరామ్ ఓటింగ్ దూరంగా ఉండటంతో అజయ్ మాకెన్ సునాయాసం అయింది. తమ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందని అభ్యర్థికి ఓటు వేయటం బీజేపీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
Comments
Please login to add a commentAdd a comment