4వ స్థానం టీఆర్‌ఎస్‌కు? రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవానికి నేతల వ్యూహం
అన్ని పార్టీల నుంచి ఆరుగురే బరిలో ఉండేలా చర్యలు
ఏడో అభ్యర్థి బరిలో ఉంటే పోలింగ్ తప్పదని, అప్పుడు పార్టీకి ఇబ్బందులని ఆందోళన
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కాంగ్రెస్ తరఫున నలుగురిని ఎంపిక చేసే అవకాశమున్నప్పటికీ, మూడు స్థానాలకే పరిమితమవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది. నాలుగో స్థానాన్ని టీఆర్‌ఎస్‌కు వదిలేయాలన్న ఆలోచనల్లో ఆ పార్టీ నేతలు ఉన్నారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్రకు చెందిన నేతలు అధిష్టానంపై వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యేలు ఓటు వేస్తారో లేదోనన్న ఆందోళన నేతల్లో నెలకొంది. దీంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యేలా వ్యూహ రచన చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలతోనూ వుంతనాలు జరుపుతున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో పాటు టీఆర్‌ఎస్, ఎంఐఎం తదితర పార్టీల నేతలతో చర్చిస్తున్నారు. ఏడో నామినేషన్ పడితే పోలింగ్ తప్పదని, అప్పుడు పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని సీనియర్ నేతలు అభిప్రాయుపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలకు పోటీ చేస్తే మిగిలిన ఒక స్థానంలో ఏ పార్టీ అభ్యర్థిని నిలపాలన్న విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. టీఆర్‌ఎస్ నుంచి ఒకరిని పోటీకి దింపే అవకాశాలు కనిపిస్తుండటంతో 4వ స్థానాన్ని ఆ పార్టీకే వదిలేస్తే ఎలా ఉంటుందన్న అంశంపైనా చర్చిస్తున్నారు. టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ వూజీ నేత కె.కేశవరావు పేరు వినిపిస్తుండటంతో ఆయునకు వుద్దతివ్వడానికి టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు వుుందుకొస్తున్నారు. దీంతో నాలుగో స్థానాన్ని టీఆర్‌ఎస్‌కు వదిలేస్తేనే మంచిదని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా కాంగ్రెస్ సీనియుర్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.
నామినేషన్లపై సంతకాలు సేకరిస్తున్న సీఎల్పీ: వచ్చే నెల 7న జరిగే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు ఈ నెల 28తో ముగుస్తుంది. ఇప్పటివరకు పార్టీ అభ్యర్థుల ఎంపిక జరగలేదు. దీంతో కాంగ్రెస్ శాసన సభాపక్ష సిబ్బంది ముందస్తుగా నామినేషన్ల పత్రాలపై పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల సంతకాల సేకరణ ప్రారంభించారు. అభ్యర్థులకు మద్దతుగా ప్రతి నామినేషన్‌పై పది మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాలి. కాంగ్రెస్ తరఫున నాలుగో అభ్యర్థి గెలుపుపై అనుమానాలు ఉండటంతో ప్రస్తుతానికి మూడు స్థానాలకే నామినేషన్ పత్రాలను తయారు చేస్తున్నారు. అరుుతే మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, మరికొందరు నేతలు సంతకాలు చేసేందుకు నిరాకరించారని సవూచారం. హైకమాండ్ ఆదేశాల మేరకు అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు సీఎం కిరణ్‌కువూర్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలు ఈనెల 24న ఢిల్లీ వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి.
రాజుకు ఖాయమంటున్న డిప్యూటీ సీఎం
పార్టీ అభ్యర్థులపై పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజుకు ఈసారి రాజ్యసభ పదవి దక్కవచ్చని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అంటున్నారు. రాహుల్‌కు సన్నిహితంగా ఉన్న రాజుకు ఇక్కడి నుంచే అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు.
మూడు స్థానాలకే కాంగ్రెస్ పోటీ?
Published Thu, Jan 23 2014 3:04 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement